spot_img
Homeక్రీడలుFIFA World Cup 2022 : గెలిచిన తర్వాత అర్జెంటీనా ప్లేయర్స్ ఏం చేశారో తెలుసా?...

FIFA World Cup 2022 : గెలిచిన తర్వాత అర్జెంటీనా ప్లేయర్స్ ఏం చేశారో తెలుసా? వైరల్ వీడియో

FIFA World Cup 2022 : ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫిఫా ఫుట్ బాల్ కప్ కలను అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ లియోనెల్ మెస్సీ నెరవేర్చుకున్నాడు. ఫైనల్ లో దుమ్మురేపే ఆటతో తన జట్టుకు గోల్స్ అందించాడు. విజయంలో కీలక పాత్ర పోషించి తన జట్టును స్వప్నాన్ని.. తన కలను నెరవేర్చుకున్నాడు. గత ఫిఫా చాంపియన్ అయిన ఫ్రాన్స్ ఎక్కడా తగ్గకుండా ఆడింది. దీంతో ఫైనల్ రెండు కొదమ సింహాలు లాంటి జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగింది.

అనేక మలుపులు.. చివరి నిమిషాల్లో గోల్స్ తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ చివరకు స్కోర్లు సమం అయ్యి పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఇందో 4-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ ను ఓడించి అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

అభిమానులను ఉర్రూతలూగించేలా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ అందరినీ మునివేళ్లపై నిలుచునేలా చేసింది. అర్జెంటీనా తరుఫున మెస్సీ రెండు గోల్స్ కొట్టగా.. డిమారియా ఓ గోల్ సాధించాడు. ఫ్రాన్స్ తరుఫున స్టార్ ఆటగాడు ఎంబాపె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫ్రాన్స్ తరుఫున మొత్తం మూడు గోల్స్ అతడే కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు.

ఫ్రాన్స్ పై ఫైనల్ లో గెలిచి అర్జెంటీనా మూడున్నర దశాబ్ధాల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఎన్నో క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గెలవడంతో అర్జెంటీనా కెప్టెన్ మెస్సి కల కూడా సాకారమైంది.

https://www.youtube.com/watch?v=4ryUZ3VvlzM

ఈ విజయం అనంతరం అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ లో ఆ జట్టు సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ కూడా ట్రెండింగ్ మారాయి.

 

https://www.youtube.com/watch?v=J3jB4CS0x34

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper