Bigg Boss 6 Telugu Revanth -Srihan: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో సీజన్ 6 వరస్ట్ సీజన్ గా రికార్డులకు ఎక్కింది. మొదటి నుండి బిగ్ బాస్ 6కి ఏదీ కలిసిరాలేదు. ప్రారంభ ఎపిసోడ్ నుండి ఫినాలే వరకు ప్లాప్ షో కొనసాగింది. ఎన్నడూ లేని విధంగా లాంచింగ్ ఎపిసోడ్ దారుణమైన టీఆర్పీ తెచ్చుకుంది. గత సీజన్స్ కి వచ్చిన రేటింగ్ లో సగం కూడా రాలేదు. ఇక ఎపిసోడ్స్ సంగతి సరే సరి. 3 ఆర్పీ రావడం గగనమైపోయింది. ఒక సక్సెస్ ఫుల్ సీరియల్ తో కూడా క్రేజీ బిగ్ బాస్ షో పోటీపడలేక పోయింది. వీకెండ్ కూడా అదే తీరు. శని, ఆదివారాల్లో హోస్ట్ వస్తున్నప్పటికీ టీఆర్పీ కేవలం 3-4 మధ్య ఉండేది.

ఎలిమినేషన్స్, టాస్క్, నాగార్జున హోస్టింగ్… షోపై ఆసక్తి సన్నగిల్లేలా చేశాయి. టీఆర్పీ తేలేకపోతున్నామనే ఒత్తిడి మేనేజర్స్, హోస్ట్ పై స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు మరింత డామేజ్ చేశాయి. బిగ్ బాస్ డై హార్డ్ ఫ్యాన్స్ సైతం పెదవి విరిచే పరిస్థితి వచ్చింది. కనీసం ఫైనల్ అయినా రంజుగా ఉంటుంది అనుకుంటే… అది కూడా తేలిపోయింది. వరస్ట్ అనుభవాన్ని మిగిల్చింది. టాప్ టు కంటెస్టెంట్స్ కి నాగార్జున ఇచ్చిన ఆఫర్స్ దారుణంగా ఉన్నాయి.
విన్నర్ ఎవరైనా కావచ్చు… టాప్ టు కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రైజ్ మనీలో 80% తీసుకొని వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇవ్వడం దారుణం. కచ్చితంగా అది టెంప్ట్ చేసి విన్నింగ్ స్పిరిట్ దెబ్బతీయడమే. శ్రీహాన్, రేవంత్ లలో రేవంత్ విన్నర్ అవుతాడని తోటి కంటెస్టెంట్స్ భావించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారు అది ఫిక్స్ అయ్యారు. రన్నర్ కి ఏమీ దక్కదు కాబట్టి డబ్బులు తీసుకోవడమే మంచి నిర్ణయం అని శ్రీహాన్ ని ఉసిగొల్పారు.

వారు కూడా ఫస్ట్ వద్దన్నారు. రూ. 40 లక్షలు అంటే దాదాపు ప్రైజ్ మనీతో సమానం. కాబట్టి శ్రీహాన్ ని తీసుకోమని సలహా ఇచ్చారు. శ్రీహాన్ పూర్ పేరెంట్స్ సైతం టెంప్ట్ అయ్యారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది పెద్ద మొత్తం. రిస్క్ ఎందుకని సేఫ్ గేమ్ ఆడేందుకు మొగ్గు చూపారు. ఫైనల్ గా శ్రీహాన్ రూ. 40 లక్షలు అంగీకరించాడు. ఇది రేవంత్ కి నచ్చని పరిణామం. కారణం విన్నర్ నేనే అని ఫిక్స్ అయిన రేవంత్ అంత పెద్ద అమౌంట్ కోల్పోవడాన్ని జీర్ణించుకోలేదు. చేసేది లేక నవ్వుతూ అభినందించాడు. అయితే అసలు విన్నర్ ని ప్రకటించడంతో ఇద్దరికీ ఏడుపు వచ్చింది. నలభై లక్షలు పోయినా టైటిల్ విన్నర్ అనే పేరొచ్చిందని రేవంత్ సంతోషించే లోపు ప్రేక్షకుల ఓట్లతో గెలిచింది శ్రీహాన్ అని నాగార్జున చెప్పాడు. దీంతో అనవసరంగా టెంప్ట్ అయి మొత్తం ప్రైజ్ మనీ కోల్పోయానని శ్రీహాన్ బాధపడుతుంటే, టైటిల్ గెలుచుకున్నప్పటికీ… ప్రేక్షకుల అభిప్రాయంలో తాను విన్నర్ కాదని తెలిసి రేవంత్ బాధపడ్డాడు. మొత్తంగా విన్నర్, రన్నర్ లకు ఏడుపే మిగిలింది.