spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర? కారుని వెంబడించి రెక్కీ?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర? కారుని వెంబడించి రెక్కీ?

Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో ఒంటరిగా.. దూకుడుగా పోరాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పవన్ విశాఖలో చేపట్టిన పర్యటన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..విశాఖ విమానాశ్రయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీ మంత్రులపై దాడులు చేయడం  దగ్గర నుండి ఈ వివాదం చోటు చేసుకుంది..కావాలని గొడవ కోరుకున్న వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభిమానుల మధ్యలో నుండి వెళ్లడం.. రెచ్చగొట్టడంతో జనసైనికులు రెచ్చిపోయి గొడవ చేశారు.

అనంతరం  పవన్ కళ్యాణ్ భద్రతకు పెనుముప్పు అంటూ ఆయన పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.  భగ్నం కలిగించారు. ఆయనను బయటకు రాకుండా చేశారు.  జనసేన పార్టీ నాయకులను వరుసగా అరెస్ట్ చేశారు. పవన్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేశారు. పవన్ ను హోటల్ లో నిర్బంధించడంతో  అభిమానులు కంగారుపడ్డారు.

పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా రావడంతో పోలీసులు ఇలా చేశామని చెప్పుకొచ్చారు. మరో పక్క జనసేన పార్టీ కార్యకర్తల నుండి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని..వారిపై దాడి ఎప్పుడైనా జరగొచ్చని రిపోర్ట్ అందిందని వైసీపీ అధిష్టానం కూడా చెప్పడం  రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

ఇది ఇలా ఉండగా.. గత కొద్ది రోజుల నుండి పవన్ కళ్యాణ్ కారుని గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారు. ఏపీ రెడ్డి కార్పొరేషన్ కు చెందిన వాహనంలో పవన్ ను వెంబడించినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇంటి నుండి బయటకి వచ్చినప్పుడు.. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ కారుని ఫాలో అవుతుండడం గమనించామని.. అర్థ రాత్రి పూట పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కారు ఆపి కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడుతున్నారని.. ఈ మొత్తం  వీడియో షూట్ చేసి ఈరోజు పోలీసులకు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆ అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారని  నాదెండ్ల మనోహర్ వివరించారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని.. రెక్కీ నిర్వహించినట్టు సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కంగారు రేపుతోంది.. ‘జాగ్రత్తగా ఉండు అన్నా’ అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి అభిమానులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదురుకోలేక ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి శిఖండి వేషాలు వేస్తున్నాడంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈక్రమంలోనే ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న విషయం కలకలం రేపుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper