Homeజాతీయ వార్తలుModi- KCR And Kejriwal: కేసీఆర్‌–కేజ్రీవాల్‌ కలిసి మోదీని ఓడించగలరా? 

Modi- KCR And Kejriwal: కేసీఆర్‌–కేజ్రీవాల్‌ కలిసి మోదీని ఓడించగలరా? 

Modi- KCR And Kejriwal: ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టుకొస్తావా నాగన్న.. అన్నట్టుగా ఉంది.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితి. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌.. ఎన్నో∙ఆశలతో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. తనతో కలిసి వస్తారన్న ఆశతో ఆహ్వానితుల కోసం ప్రత్యేక ఫ్లైట్‌లు బుక్‌చేశారు. కానీ.. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మినహా ఎవరూ కనిపించలేదు. మూడు రోజులు ఢిల్లీలో వేచిచూసినా.. ఆమ్‌ ఆద్మీ చీఫ్‌ కేజ్రీవాల్‌ కూడా కేసీఆర్‌ను కలువలేదు. దీంతో మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌ తిరిగి వచ్చారు కేసీఆర్‌.

Modi- KCR And Kejriwal
Modi- KCR And Kejriwal

స్కాం కలుపుతుందా ఇద్దరినీ..
ఢిల్లీ లిక్కర్‌ స్కాం బీఆర్‌ఎస్‌ను, ఆప్‌ను దగ్గర చేస్తాయని కేసీఆర్‌ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని మరీ మాట్లాడారు కేసీఆర్‌. రాజకీయాలపై చర్చించామని సీఎంవో నుంచి ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ పంజాబ్‌ వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ మాత్రం తాము రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. ‘నీది తెనాలే… నాది తెనాలే’ అన్నట్లుగా నీ పార్టీ లిక్కర్‌ స్కాంలో ఉంది.. నా పార్టీ లిక్కర్‌ స్కాంలో ఉంది. ఇద్దరం కలిసి మోదీని ఎదుర్కొదాం అన్న ఆలోచన కేసీఆర్‌ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పొత్తులకు ఆప్‌ దూరం..
వాస్తవంగా పొత్తులు ఆప్‌ సిద్ధాంతానికి విరుద్ధం. పార్టీ స్థాపించిన నాటి నుంచి కేజ్రీవాల్‌ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఢిల్లీ, పంజాబ్, గోదా, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఇలా అనేక రాష్ట్రాల్లో ఆప్‌ పోటీ చేసింది. కానీ ఎన్నడూ ఏ పార్టీతో కలిసి పనిచేయలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. లిక్కర్‌ స్కాం కేసీఆర్‌ను కేజ్రీవాల్‌ను దగ్గర చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా జరుగుతోంది. రెండేళ్ల క్రితం తెలంగాణలో ఆప్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్‌.. రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించారు. కానీ.. తాజా రాజకీయ పరిణామాలతో ఆయన తెలంగాణపై ఫోకస్‌ పెట్టకపోవచ్చని తెలుస్తోంది.

Modi- KCR And Kejriwal
Modi- KCR And Kejriwal

ఇద్దరు కలిసినా కష్టమే..
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఇబ్బంది పడుతున్న కేసీఆర్, కేజ్రీవాల్‌ కేంద్రంలో మోదీని ఓడించేందుకు ఒకవేళ కలిసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయమే రాజకీయాల్లో వినిపిస్తోంది. అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారని ఇప్పటికే మోదీ ప్రకటించారు.. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిచ సందర్భంగాను పునరుద్ఘాటించారు. ఆప్, బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు కుదిరితే మోదీ చేసిన ప్రకటన నిజమే అవుతుంది. ఇది బీజేపీకి ఆయుధంగా మారుతోంది. దీంతో వారి పొత్తు లాభం చేకూర్చకపోగా.. నష్టం కలిగే అవకాశమే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితిలో పొత్తులకు వ్యతిరేకమైన కేజ్రీవాల్‌.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌తో కలుస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper