Homeఅంతర్జాతీయంAmerica- al Qaeda Leader Zawahiri: అమెరికా అన్నంత పని చేసింది

America- al Qaeda Leader Zawahiri: అమెరికా అన్నంత పని చేసింది

America- al Qaeda Leader Zawahiri: ఆఫ్ఘనిస్తాన్ ను అమెరికా దళాలు వదిలి వెళ్ళేటప్పుడు తాలిబన్లు పండగ చేసుకున్నారు. వారికి మున్ముందు మొసళ్ళ పండుగ చూపిస్తుందని ఆ క్షణంలో అనుకోలేదు కాబోలు. కొరివితో తల ఎప్పుడూ గోక్కోవద్దు. అన్నింటి కన్నా ముఖ్యంగా అమెరికాతో అసలు గోక్కోవద్దు. తన అవసరాల కోసం అమెరికా ఏమైనా చేయగలదు. ఎవరినైనా చేర తీయగలదు. అవసరం తీరాక మట్టు పెట్టనూ గలదు. అది లాడెన్ కావొచ్చు. ఇంకెవరైనా కావొచ్చు. తాజాగా అల్ _ ఖాయిదా చీఫ్ అల్ జవహరీ. వ్యక్తులు మాత్రమే తేడా. అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచం మీద పెత్తనం చెలాయించడం. జవహరీ ఆపరేషన్ ద్వారా చైనా నుంచి ఉత్తర కొరియా దాకా అన్ని దేశాలకు అమెరికా హెచ్చరికలు పంపింది. అణ్వాయుధాలు తయారుచేస్తున్న రష్యాకు షాక్ ఇచ్చింది. అంతేకాకుండా 20 ఏళ్ల నాటి ట్విన్ టవర్స్ పై దాడికి ప్రతీకారం తీర్చుకుంది.

America- al Qaeda Leader Zawahiri
joe biden – al Qaeda Leader Zawahiri

డ్రోన్ ద్వారా మట్టుపెట్టింది అమెరికా

ఆదివారం జులై 31,2022 ఉదయం 8 గంటల సమయం. కాబూల్ లోని తాలిబన్ నాయకులు ఉండే కాలనీలో ఒక ఇంట్లో జవహరి పై అంతస్తులోని బాల్కనీ లో సూర్యోదయం అయిన గంట తరువాత ఎండ తగిలేందుకు నిలబడి ఉండగా అమెరికా కి చెందిన MQ9-Reaper డ్రోన్ ద్వారా మిసైల్ తో దాడి చేసి మట్టుపెట్టింది. జవహరి ఈజిప్ట్ లోని కైరో నగరం లో పుట్టి పెరిగాడు. కంటి శస్త్ర చికిత్స నిపుణుడిగా వైద్య సేవలు అందించాడు. అయితే15 ఏట నే రాడికల్ ఇస్లాం సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవాడ. స్వంత ఇస్లామిక్ రాడికల్ సంస్థని నెలకొల్పి దానికి అల్ – జిహాద్ అనే పేరు పెట్టాడు. జవహరి లక్ష్యం ఈజిప్ట్ లో ఇస్లామిక్ రాజ్యస్థాపన.. అలాగే స్వంతంగా కొంతమందిని చేరదీసి వాళ్ళతో కలిసి ఈజిప్ట్ అధ్యక్షుడిని పదవి నుంచి దించడమో, హత్య చేయాలనే ఆలోచనలో ఉండేవాడు. 1981 అక్టోబర్ లో అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ ని మిలటరీ పరేడ్ లో కొంత మంది మిల్ట్రీ ఆఫీసర్లు హత్య చేశారు. ఆ కుట్రలో భాగంగా ఇస్లామిక్ గ్రూప్ సభ్యులతో సహా ఈజిప్ట్ సైన్యానికి జవహరి దొరికిపోయాడు. ఈజిప్ట్ సైన్యానికి దొరికిపోగానే జబహరిని జైల్లో పెట్టారు. జైల్లో చిత్ర హింసలు పెట్టారు. జైల్లో ఉండగానే తోటి మిలిటంట్స్ గురుంచి ఈజిప్ట్ సైన్యాని సమాచారం ఇచ్చేవాడు అంటే ఈజిప్ట్ సైన్యానికి ఇన్ఫార్మర్ గా పనిచేసేవాడు. చివరికి 1984 లో వదిలేశారు. జైల్లో చిత్రహింసలు పెట్టినా జవహరి తన ఆలోచనని మార్చుకోలేదు సరికదా మరింత కసిగా ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం ఒక పక్క వైద్య విద్యను అభ్యసిస్తూనే మరో వైపు తన లక్ష్య సాధన కోసం తన లాంటి వాళ్లకోసం మొత్తం అరబ్ దేశాలతో పాటు పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పర్యటించాడు.

Also Read: Congress Focus on Munugodu: మునుగోడు సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్.. డిఫెన్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి

లాడెన్ తో పరిచయం

1988 లో ఒసామా బిన్ లాడెన్ తో పరిచయం ఏర్పడింది. తరువాత ఒసామా కి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశాడు. ఈజిప్ట్ లోని పర్యాటక ప్రదేశాలలో కాల్పులు జరిపించి విదేశీ యాత్రికులతో పాటు తన స్వంత ప్రజలు దాదాపుగా 300 మందికి పైగా మరణానికి కారకుడయ్యాడు. పాకిస్థాన్ లోని ఈజిప్ట్ రాయబార కార్యాలయం మీద బాంబు దాడి చేయించి 20 మంది మరణానికి కారకుడు అయ్యాడు. టాంజానియా,కెన్యా లలో అమెరికన్ రాయబార కార్యాలయాల మీద బాంబు దాడులు చేయించి 200 మంది మరణానికి 400 మంది తీవ్ర గాయాలపాలు అవడానికి కారకుడు. అక్టోబర్ 2000 లో యెమెన్ సముద్ర తీరంలో ఇంధనం నింపుకోవడానికి ఆగి ఉన్న అమెరికన్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ ఎస్ కొల్ మీద పేలుడు పదార్ధాలని నింపిన ఒక చిన్న పడవతో ఢీ కొట్టించి ధ్వంసం చేయించాడు. ఆ ఘటనలో డిస్ట్రాయర్ మీద విధుల్లో ఉన్న 17 మంది నావికులు చనిపోయారు. 37 మంది గాయపడ్డారు. ఆ తరువాత అమెరికాలోని జంట టవర్ల ని ప్రయాణీకుల విమానాలతో కూల్చివేసిన ఘటనలో జవహర్ మాస్టర్ మైండ్ ఉంది. ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకొని చంపడానికి అమెరికాకి 11ఏళ్లు పట్టగా, సరిగ్గా ఒసామా చనిపోయిన 11 ఏళ్లకి అల్ జవహిరి చనిపోయాడు.

సీఐఏ పసిగట్టింది

రెండు నెలల క్రితమే సీఐఏ అల్ జవహిరి ని పసిగట్టింది. చాలా కాలం నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ ల సరిహద్దుల్లో ఉండే గిరిజన ప్రాంతంలో అల్ జవహిరి దాక్కుని ఉన్నాడని సీఐఏ భావించేది. జవహరి గురుంచి సమాచారం ఇచ్చే వాళ్ళకి భారీ మొత్తంలో బహుమతి ఇస్తానని ఆశ పెట్టినా ఎవరూ ముందుకురాలేదు. నేరుగా గిరిజన ప్రాంతాల మీద మిసైల్ దాడి చేస్తే అక్కడి పౌరుల ప్రాణాలు పోతాయని అమెరికా ఆ పని చేయలేదు. 11 నెలల క్రితం అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లిపోయినా ఖతార్ లోని దోహా డ్రోన్ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మరింత ఆధునీకరించింది. దోహా మేదుగా నిత్యం ఆకాశం నుంచి నిఘా పెంచింది. జూన్ నెలలో జవహరి భార్య, పిల్లలు సరిహద్దుల నుంచి కాబూల్ చేరుకోవడాన్ని డ్రోన్ పసిగట్టింది.

అయితే అల్ జవహరి వాళ్ళతో రాలేదు. కానీ భార్య, పిల్లలు ఉన్న ఇంటిని మాత్రం చాలా దూరం నుంచి రోజూ డ్రోన్ తో నిఘా వేసింది. జులై 25 న అల్ జవహరి కాబూల్ లోని తన భార్య, పిల్లలు ఉన్న ఇంటి బాల్కనీలో కాసేపు నిలబడి ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రాగానే అప్పటి నుంచి అదే ఇంటి మీద నిఘా పెట్టింది. రోజూ ఒకే సమయంలో కాసేపు ఎండ తగిలేందుకు బాల్కనీలో నుంచోవడాన్ని డ్రోన్ పసిగట్టింది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు అధికారులు విషయం తెలిపారు. దాడి చేయడానికి పర్మిషన్ అడగడం, సమాచారం పక్కాగా ఉండడంతో దాడి బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఎప్పటి లాగానే ఆదివారం ఉదయం సూర్యోదయం అయిన గంటకి బాల్కనీ లోకి వచ్చి నిలబడగానే అప్పటికే సిద్ధంగా ఉన్న “ఎం క్యూ నైన్ రీపర్” డ్రోన్ ద్వారా మిసైల్ తో దాడి చేసింది. సీక్రెట్ వెపన్ ఆర్ నైన్ ఎక్స్ హెల్ ఫైర్ మిసైల్ పని పూర్తి చేసింది. ఆర్ నైన్ ఎక్స్ వార్ హెడ్ లెస్ మిసైల్ లో పేలుడు పదార్ధం ఉండదు. దీనినే ‘’నింజా బాంబ్ ‘’ అని కూడా పిలుస్తారు.

America- al Qaeda Leader Zawahiri
al Qaeda Leader Zawahiri

మిగతా హెల్ ఫైర్ మిసైల్స్ లో లాగా అన్ని ఉంటాయి. కానీ దీనిలో ఎలాంటి పేలుడు పదార్ధం ఉండదు. మిసైల్ ముందు భాగం లో లేజర్ సెన్సర్స్ ఉంటాయి [సీకర్ ] దాని వెనుక 5 పదునైన బ్లేడ్లు ఉంటాయి. ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ ద్వారా టార్గెట్ ఎలా ఉంటుంది అన్నది మిసైల్ మెమరీ లో ఫీడ్ చేస్తారు. ఒక సారి టార్గెట్ ని లాక్ చేసి ప్రయోగించగానే వేగంగా వెళ్ళి టెర్మినల్ ఫేజ్ లో [టార్గెట్ దగ్గరకి రాగానే ] మిసైల్ లో ఉన్న అయిదు బ్లేడ్లు బయటికి వచ్చేసి నేరుగా టార్గెట్ ని ధ్వంసం చేస్తుంది. పేలుడు పదారథం ఉండదు కాబట్టి శబ్దం పెద్దగా రాదు అదే సమయంలో టార్గెట్ మాత్రం ముక్కలు ముక్కలు అయిపోతుంది. అదే మనిషి అయితే నేరుగా ముఖ భాగాన్ని ఢీ కొడుతుంది కాబట్టి మనిషి అరిచేలోపలే అయిదు భాగాలుగా ముక్కలు చేస్తుంది మిసైల్. అందుకే అల్ జవహిరి ఉన్న బాల్కనీ లోని కిటికీ అద్దాలు మాత్రం పగిలిపోయాయి తప్పితే ఆ ఇల్లు ఎప్పటిలాగానే అలానే ఉంది.

2011 లో డ్రోన్ దాడులలో సంబంధం లేని ప్రజలు చనిపోతున్నారు అని ఈ ఆర్ నైన్ వార్ హెడ్ లెస్ మిసైల్ కి రూపకల్పన చేసింది అమెరికా కానీ అప్పటికే ఆర్ అండ్ డీ లో ఉంది ఈ మిసైల్. తరువాతి కాలంలో దానిని అభివృద్ధి చేసి ట్రయల్స్ లో నూరు శాతం ఫలితాలని ఇచ్చింది అని నిర్ధారించుకున్నాక సైన్యానికి ఇచ్చింది.

జపాన్ స్ఫూర్తి

ఆర్ నైన్ వార్ హెడ్ లెస్ మిసైల్ కి స్పూర్తి జపాన్ లోని వంటగదిలో వాడే నింజా కత్తి. ఈ నింజా నైఫ్ కి అయిదు పదునైన బ్లేడ్లు ఉంటాయి. అవి ఎంత పదునుగా ఉంటాయంటే ఒక అల్యూమినియం పెప్సీ కాన్ మీద నింజా నైఫ్ ని పెట్టి గట్టిగా ఒత్తితే ఆ అల్యూమినియం కాన్ ని చీల్చుకుంటూ వెళ్ళి అయిదు ముక్కలు చేస్తుంది. నింజా నైఫ్ కానీ ఆ బ్లేడ్ల్ పదును ఏ మాత్రం చెడిపోదు. అందుకే ఆర్ నైన్ వార్ లెస్ మిసైల్ కి మరో పేరు నింజా బాంబ్. నిజానికి ఈ మిసైల్ లో బాంబ్ ఏమీ ఉండదు. అలా అల్ జవహరి చనిపోయాడు కానీ అతని జీవిత ఆశయం ఈజిప్ట్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపన మాత్రం నెరవేరలేదు. పేదరికం వల్ల ముస్లిం యువత ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారని చాలా మంది అంటుంటారు. కానీ ధనవంతుల కుటుంబం నుండి వచ్చిన బిన్ లాడెన్ కావచ్చు. అతని ముఖ్య అనుచరుడు అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి కావొచ్చు ఇద్దరూ బాగా డబ్బు ఉన్న ఇంట్లో నుంచే వచ్చారు ఉగ్రవాదులు అయ్యారు. ఇక్కడ మత ఉగ్రవాదమే ప్రధాన పాత్ర పోషిస్తున్నది తప్పితే డబ్బు కాదు.

Also Read:BJP Politics: టీఆర్ఎస్ వాళ్లు కష్టం.. కాంగ్రెస్ వాళ్లు జాప్యం.. బీజేపీ బలోపేతమెప్పుడు?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular