Rohit Sharma Injury: టీమిండియా విజయాల యాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్ లు దక్కించుకున్న ఊపులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా వన్డే సిరీస్ కైవసం చేసుకుని టీ20లో కూడా 2-1 స్కోరుతో ముందంజలో నిలిచింది. ఐదు టీ20ల సిరీస్ లో ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మన సొంతమే. దీనికి గాను టీమిండియా కసరత్తులు చేస్తోంది. ప్రత్యర్థి జట్టును పడగొట్టడానికి పావులు కదుపుతోంది. వ్యూహాలు రచిస్తోంది. కరేబియన్ జట్టును దెబ్బ కొట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది.

మరోవైపు గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో వన్డేకు అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. కానీ అతడు మాత్రం గాయం తగ్గి నాలుగో వన్డేకు జట్టులో ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మూడో వన్డేలో మనవారి ఆట తీరుకు ముగ్దుడవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో మేలు చేశాయి. మన బౌలర్లు కూడా సత్తా చాటారు. అందుకే సునాయాసంగా విజయం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మకు నడుం కండరాలు పట్టేయడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నాలుగో వన్డే ఆరో తేదీన ఉండటంతో సమయం ఉంది. దీంతో అప్పటి వరకు కోలుకుంటానని చెబుతున్నాడు. వెస్టిండీస్ ను కట్టడి చేసి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందుకు గాను టీమిండియా అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. కరేబియన్ జట్టును కంగారు పెట్టాలని భావిస్తోంది. ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మన ఆటగాళ్లు మంచి ఊపు మీద ఉండటంతో సిరీస్ గెలవడం ఖాయంగానే కనిపిస్తోంది.

టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడో లేదో అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. అతడు జట్టులో ఉంటే విజయం దక్కడం ఖాయమే. అప్పటి వరకు గాయం నుంచి కోలుకుంటానని చెబుతున్నా వైద్యులు ఏం తేల్చుతారో తెలియడం లేదు. అందుకే విండీస్ తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. వన్డేలో రోహిత్ లేకపోయినా విజయాలు సాధించినా ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. సో రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదో ఎవరికి తెలియదు.