
ఆప్ డిల్లీ విజయంపై బిజెపి యేతర పక్షాలుచాలా సంతోషంగా వున్నాయి. వాటి సంతోషమల్లా బిజెపి ఓడిందని. మీడియా కూడా అదే వైఖరిని వెల్లబుచ్చాయి. ముందుగా ఒక్క విషయం మరిచిపోతున్నాము. డిల్లీ లో అధికారంలో వుంది బిజెపి కాదనేది. ఆప్ అధికారాన్ని నిలుపుకోవటమే కాకుండా చరిత్ర సృష్టించిందనేది అందరూ ఒప్పుకోనేవిషయం. అంతవరకూ బాగానేవున్నా మిగతా పక్షాల విషయంలో విశ్లేషణ సరిగ్గాలేదనే చెప్పాలి. బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డినా ప్రజలు ఆప్ అనుసరించిన పేద , మహిళా అనుకూల విధానాలకే ఓటు వేసారు. ఇకపోతే మిగతా పార్టీలను చూస్తే అంతకుముందు మూడుసార్లు అధికారంలో వున్న కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవటం ఆ పార్టీ భవిష్యత్తును సూచిస్తుంది.
ఆప్ విజయాన్నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? ప్రజల మధ్యవుండి పనిచేస్తే ప్రజలు పార్టీలను ఆదరిస్తారని అర్ధమవుతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలదిశగా ఆప్ అడుగులువేయటం హర్షించదగ్గ పరిణామం. అరవింద్ కేజ్రివాల్ 2015 కి ఇప్పటికి ఎంతో పరిణితి చెందిన నాయకుడిగా మారాడని పరిశీలకులు భావిస్తున్నారు. డిల్లీ లో తను చేసిన పనులే తనను గెలిపిస్తాయని నమ్మాడు. అలాగే సిఎఏ పై తనదైన శైలిలో ప్రతిస్పందించాడు. షహీన్ బాగ్ శిబిరాన్ని దర్శించకుండా జాగ్రత్తపడ్డాడు. అంటే బిజెపి గేమ్ ప్లాన్ లో పడకుండా జగ్రత్తపడ్డాడని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం పక్కదారిపట్టకుండా తన పనివిదానంపైనే తీర్పు చెప్పేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాడు.
మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, పార్టీలు ఆప్ విజయాన్నుంచి తీసుకోవాల్సిన గుణ పాఠాలేంటి? ముఖ్యంగా పేద ప్రజల్లో ఎప్పట్నుంచో పనిచేసిన చరిత్ర వున్న వామపక్షాలు ఏమి గుణపాఠాలు నేర్చుకోవాలి. చూడబోతే నేను ఓడినా పర్వాలేదు అవతలి వాడు మట్టికరిస్తే చాలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్న వామపక్షాలు ఆత్మపరిశోధన చేసుకోవాల్సిన అవసరం లేదా? తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల గుండెల్లో నిలిచిన చరిత్రగలిగిన ఈ పార్టీలు పూర్తిగా కనుమరుగై పోవటానికి కారణమేమిటి? డిల్లీ లో ఆప్ చేసిన పని ఈ పార్టీలు చేయలేకపోవటానికి కారణమేంటి? నేను ఇంతకుముందు అనేకసార్లు చెప్పినట్లు పార్టీ నిర్మాణ స్వరూపం సమూల మార్పులకు గురికావల్సివుంది. ఇంకా పాత కాలపు రహస్య పనివిధానాన్ని వదిలి పారదర్శకత , జవాబుదారీతనం కలిగిన నిర్మాణ వ్యవస్థని రూపొందించుకోవాలి. అతిముఖ్యమైనది శ్రామిక నియంతృత్వం అనే నిరంకుశ వ్యవస్థని ఆదర్శంగా తీసుకోకుండా ప్రజాస్వామ్య సోషలిజం ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటికీ భారత దేశంలో బిజెపి, మధ్యేవాద కాంగ్రెస్ లాంటి పార్టీలతో పాటు , వామపక్ష పార్టీలకు భవిష్యత్తు వుంది. కాకపోతే సిద్ధాంతం స్పష్టంగా ప్రజాస్వామ్య వైఖరి కలిగివుండాలి. ఆప్ దాదాపు ఈ వైఖరి తీసుకోబట్టే ప్రజలు ఆదరించారు.
ఓ విధంగా చెప్పాలంటే ఆప్ రావటం బిజెపి కన్నా కాంగ్రెస్, వామపక్ష సంప్రదాయ పార్టీలకు సవాలు. ఎందుకంటే ఈ ఎన్నిక తర్వాత ఆప్ మిగతా రాష్ట్రాల్లో వ్యాప్తి చెందటానికి మునపటికన్నా చురుకుగా పనిచేయటం ఖాయం. సంప్రదాయ కాంగ్రెస్, వామపక్ష ఓటర్లు ఆప్ వైపు మొగ్గే అవకాశాలు మెండుగా వున్నాయి. అదేజరిగితే సమీప భవిష్యత్తులో ఈ రెండు వర్గాల ఓటర్లు ఆప్ వైపు మొగ్గటం ఖాయం. ఈ లోపలే ఈ పార్టీలు ఆత్మపరిశోధన చేసుకొని మార్పులు చేసుకోకపోతే ముందుగా నష్టపోయేది ఈ పార్టీలే. డిల్లీ లో జరిగింది ఇదే. కాంగ్రెస్ ఓటర్లు మొత్తం ఆప్ వైపు మొగ్గు చూపారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో భారత రాజకీయ పటంలో ఎన్నో మార్పులు జరిగే అవకాశముంది. బిజెపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి అవకాశాలు మృగ్యం. ప్రాంతీయ పార్టీలు జాతీయ ఎన్నికల్లో ఎప్పటికీ బిజెపి కి ప్రత్యామ్నాయం కాలేవు. కాబట్టి ముందు ముందు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దాన్నిబట్టే 2024 ఎన్నికలని అంచనా వేయాల్సి వుంటుంది.


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతీకి జరిగిన అన్యాయంపై స్పందించటానికి ఈ రోజు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ప్రీతీ తల్లి మాట్లుడుతూ..న్యాయం కోసం ఆశ్రయిస్తే మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ తమను చీప్ పీపుల్ అన్నాడనే విషయం చెపుతూ..బోరున విలపించారు. న్యాయం కోసం అందరి నాయకులని ఆశ్రయించామని..కానీ ఎవరు స్పందించలేదని ప్రీతీ తల్లి దుఃఖంతో వెల్లడించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల దెగ్గరికి వెళ్లిన తమకి న్యాయం జరగలేదని..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా న్యాయం జరుగుతుందని ఆమె విశ్వసించారు. కొందరు పోలీసు అధికారులు డబ్బుకి ఆమూడు పోయి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారనే నిజాన్ని బట్టబయలు చేసారు.
ఏపీ సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రధాని మోడీని కలవటానికి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవటం..ఆ తరువాత వెంటనే జగన్ కి ఢిల్లీ నుంచి పిలుపు రావటంపై చాల మందిలో అనుమానాలు రేకితించాయి. ఇప్పటిదాకా జగన్ మోడీల సంబంధాలు బాగానే ఉన్నాయి. జగన్ మోడీ ప్రభుత్వానికి పార్లమెంటులో అన్ని విధాలా సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఈ సహాయానికి కృతజ్ఞతగా జగన్ తీసుకునే నిర్ణయాలకు మోడీ సహాయం చేస్తాడనే వాదన గట్టిగ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ ఎన్డీయే కూటమితో కలుస్తుందనే వార్త జనాలలో విస్తృతంగా ప్రచారం అవుతుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన ఆప్ అధినేత ఇప్పుడు ప్రధాని పదవిపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు మరో ఎనిమిది నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆశారా చేసుకొనే ప్రయత్నాలు జరుపుతున్నది.
మహారాష్ట్రలో సుదీర్ఘకాలం మితపక్షాలుగా వ్యవహరించి, తాజాగా రాజకీయ ప్రత్యర్థులుగా మారిన శివసేన, బీజేపీలు పోటీ పడి ప్రజలకు చౌక ధరకు భోజనం అందిస్తున్నాయి. తద్వారా పేదలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
సుగాలి ప్రీతీకి న్యాయం చేయాలనీ ఎప్పటినుంచో తన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి తమ బాధ వెళ్లబుచ్చుకున్నారు. పవన్ దీని విషయమై స్పందిస్తూ…ఈ రోజు కర్నూలులో బహిరంగ ర్యాలీ చేయటానికి నిర్ణయించారు. అయితే పవన్ ర్యాలీకి రాయలసీమ విద్యార్థి జేఏసీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.


ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దగ్గరకు తీయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక విధంగా కట్టడి చేసే సంకేతాలు ఇచ్చిన బిజెపి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వైసిపి ముందు సాష్టాంగ పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులకు పైగా ప్రయత్నం చేస్తున్న ఇవ్వని ఇంటర్వ్యూ ను ఎన్నికల ఫలితాలు ఒక వాంస్తుండగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు జగన్ కు ఇవ్వడమే ఇదే అంశాన్ని వెల్లడి చేస్తున్నది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. కొన్నేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల పింక్ రీమేక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. తొలుత ఈ మూవీకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీ టైటిల్ ‘వకీల్ సాబ్’ అని ఫిల్మ్ చాంబర్లో రిజిష్టర్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
‘లూసీఫర్’ మూవీ రీమేక్ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కుంచుకున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులను చేస్తున్నారు. మెగాస్టార్ ఉన్న క్రేజీని దృష్టిలో ఉంచుకొని రంగస్థలం దర్శకుడు సుమార్ ‘లూసీఫర్’ కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో మెగాస్టార్ ను సంప్రదించి కొన్ని మార్పులకు సుకుమార్ శ్రీకారం చుట్టాడు. ఈ మూవీని చెర్రీ ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని చూస్తున్నాడు.
సోషల్ మీడియాలో తనపై వర్గల్ కామెంట్ చేసే వారిని వదిలేదని రంగమ్మత్త వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల తనపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న వర్గల్ కామెంట్లపై అనసూయ మాట్లాడారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలపై తనపై ఇష్టమొచ్చిన రీతిలో కామెంట్లు పెడుతున్న వారిని చూసిచూడనట్లుగా వదిలేశానని, అయితే ఈ కామెంట్లో రోజురోజుకు శృతిమించడం వల్లనే వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వల్గర్ కామెంట్లు చేసేవారు ఎవరైనా సామూహిక అరెస్టులుకాక తప్పదని స్పష్టం చేశారు.










భారతీయ జనతా పార్టీ ఉత్తరాన ఉన్న అన్ని రాష్ట్రాలలో తన ప్రభావం చూపగలుగుతున్నా..ఢిల్లీ పరిస్థితి మాత్రం అందని ద్రాక్షలా మారింది. 2014 నుంచి దేశంలో ఉన్న సగానికి పైన రాష్ట్రాలలో అధికారం చేజికుంచుకున్న.. కొన్ని రాష్ట్రాలు మాత్రం బీజేపీకి పెద్ద సవాలుగానే మిగిలిపోయాయి.