‘లూసీఫర్’ మూవీ రీమేక్ హక్కుల్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కుంచుకున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులను చేస్తున్నారు. మెగాస్టార్ ఉన్న క్రేజీని దృష్టిలో ఉంచుకొని రంగస్థలం దర్శకుడు సుమార్ ‘లూసీఫర్’ కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో మెగాస్టార్ ను సంప్రదించి కొన్ని మార్పులకు సుకుమార్ శ్రీకారం చుట్టాడు. ఈ మూవీని చెర్రీ ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొన్న కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్లో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గటుగానే ఈ మూవీలో భారీ తారాగాణం ఉండబోతుంది. ఇప్పటికే ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా త్రిష ఎంపికైంది. తెలుగమ్మాయి ఈషారెబ్బా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా మెగా పవర్ స్టార్ దాదాపు 30నిమిషాల పాటు కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాకుండా చిరంజీవి డ్యుయల్ రోల్స్ చేయనున్నాడు. ఓ పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారిగా చిరంజీవి ఉండబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల మెగాస్టార్-రెజీనాలపై ఓ మాస్ సాంగ్ చిత్రీకరించారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది.
చిరు-152వ మూవీ తర్వాత లూసీఫర్ రీమేక్ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీపై కథ విషయంలో మెగాస్టార్ కు దర్శకుడు సుకుమార్ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో కలిసి ఈ మూవీ చేస్తున్నాడు. చిరంజీవి కూడా కొరటాల కాంబినేషన్లో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి సినిమాలు పూర్తయ్యాకే లూసీఫర్ మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ ఏడాది పట్టాలెక్కించాలని రాంచరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడా లేక కథ వరకే పరిమితం అవుతాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.