Homeఆంధ్రప్రదేశ్‌ఢిల్లీ ఫలితాలతో జగన్ ముందు బిజెపి సాష్టాంగం!

ఢిల్లీ ఫలితాలతో జగన్ ముందు బిజెపి సాష్టాంగం!

ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దగ్గరకు తీయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక విధంగా కట్టడి చేసే సంకేతాలు ఇచ్చిన బిజెపి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వైసిపి ముందు సాష్టాంగ పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులకు పైగా ప్రయత్నం చేస్తున్న ఇవ్వని ఇంటర్వ్యూ ను ఎన్నికల ఫలితాలు ఒక వాంస్తుండగానే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు జగన్ కు ఇవ్వడమే ఇదే అంశాన్ని వెల్లడి చేస్తున్నది.
 
జగన్ కనీసం రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోమ్ మంత్రి అమిత్ షా లను కలవడం కోసం విఫల యత్నం చేయడం తెలిసిందే. అటువంటిది అకస్మాత్తుగా ప్రధాని బుధవారం సాయంత్రం కలవడానికి సుముఖత వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు రాస్త్రాలలో పార్టీకి ఎదురు దెబ్బలు తగలడంతో ఇక ప్రాంతీయ పార్టీలను కట్టడి చేసే తమ ఎత్తుగడలు సాగే అవకాశాలు లేవని బిజెపి గ్రహించవలసిన పరిస్థితి నెలకొంది. 
 
శివసేన దూరంగా వెళ్లిన తర్వాత రాజ్యసభలో బిజెపికి ఒకేసారి 11 మంది సభ్యుల మద్దతో పోయింది. లోక్ సభలో 22 మంది సభ్యులు గల వైసిపి నాల్గవ అతి పెద్ద పార్టీ. రాజ్యసభలో సహితం త్వరలో నలుగురు సభ్యులు చేరడంతో ఆ పార్టీ బలం ఆరుకు పెరగనుంది. మరో రెండేళ్లలో ఈ బలం 10కు చేరుకొంటుంది. అందుచేత జగన్ తో స్నేహం చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రాజధాని మార్పుకు వ్యతిరేకంగా సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఆందోళన జరుపుతామని ప్రకటించిన బిజెపి ఇప్పుడా మాటలే మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ తో కలసి ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్ జరుపుతామని ప్రకటించి వెనుకకు తీసుకున్నారు.రాజధాని వ్యవహారంతో కేంద్రానికి సంబంధం లేదని పార్లమెంట్ లోనే స్పష్టం చేయడం ద్వారా ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమని సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 
 
అదే విధంగా శాసన మండలి రద్దు విషయంలో సహితం జగన్ కు సహకరించడం మినహా కేంద్రం చేయగలిగింది మరేమి లేదని తేటతెల్లం అవుతున్నది. ఒక వంక కేంద్రంతో తమకు అవసరమైన పనులు చేసుకొంటూ మరోవంక ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జగన్ పావులు కదిపే అవకాశాలు కూడా లేకపోలేదని అర్ధం అవుతున్నది. 
 
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు రోజే రాజ్యసభలో ఎల్ ఐ సి లో వాటాల అమ్మే ప్రతిపాదనను విజయసాయిరెడ్డి నిశితంగా విమర్శించడం గమనార్హం. అదే విధంగా వార్షిక బడ్జెట్ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంతో వైపున, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వస్తున్న పలు ఆరోపణలపై కూడా కేంద్రాన్ని సత్వరం చర్యలు తీసుకోమని జగన్ వత్తిడి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 
 
టిడిపికి చెందిన పలువురిపై ఈ మధ్య ఐటి దాడులు జరగడం తెలిసిందే. అయితే సిబిఐ, ఈడీ కేసుల దర్యాప్తును ఎదుర్కొంటున్న జగన్ ఏ మేరకు కేంద్రంపై వత్తిడులు తీసుకు రాగలరో  చూడవలసి ఉంది. 
 
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular