జగన్ ఢిల్లీ పర్యటనపై పలురకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు ఏకరువు పెట్టినా అది కేవలం పైకి చెప్పేది మాత్రమేనని అందరూ అనుకుంటున్నారు. మరి అసలు విషయమేంటి? ఇదే అందరికీ ఊహాగానాలకు తావిచ్చింది. ఏమయ్యుంటుందో తర్కంతో ఆలోచిస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
ఎవరెన్నిచెప్పినా తనముందు సిబిఐ కేసులు పెట్టుకొని వాటిని ప్రస్తావించకుండా జగన్ ఉంటాడని ఎవరూ అనుకోవడంలేదు. తనేకాదు ఇప్పుడున్న రాజకీయనాయకులెవరూ అంత పవిత్రంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా ఉంటారని వూహించలేము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోత్కుపల్లి నరసింహులు కి గవర్నర్ పదవి కోసం లాబీ చేసిన సంగతి పత్రికల్లో చూసాం. దానితోపాటు ఎన్నో వ్యక్తిగత ఫేవర్లకోసం మోడీ దగ్గర లాబీ చేయటం తోటే వాళ్ళిద్దరిమధ్య దూరం మరింతపెరిగిందని చెబుతారు. మరి ఇప్పుడు జగన్ తన కేసుల గురించి ప్రస్తావించకుండా ఉంటాడని ఎలా అనుకుంటాము. రాజకీయనాయకులందరూ ఆ తాను ముక్కలే.
రెండోది, మోడీ త్వరలో కాబినెట్ విస్తరణ చేబడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న రాజకీయపరిస్థితుల్లో వైస్సార్సీపీ ని ఎలాగైనా ఎన్ డి ఎ లోకి లాగాలని మోడీ ప్రయత్నంచేస్తున్నాడు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇంతకుముందు ఆఫర్ చేయటం జరిగింది. అందుకు అప్పట్లో జగన్ సుముఖంగా లేడు. ఇప్పటివరకూ ఆ పదవి ఖాళీగానే వుంది. కాబట్టి అటు క్యాబినెట్ లోకి, ఇటు డిప్యూటీ స్పీకర్ పదవికి జగన్ ని ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే జగన్ కి బీజేపీ తో చేరటంపై కొన్ని సందేహాలున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తో కలిస్తే మైనారిటీలు దూరం అవటం ఖాయం. అలాగే ప్రత్యేక హోదా పై హామీ ఇవ్వకుండా కేంద్రంలో చేరితే చంద్రబాబు నాయుడుకి , తనని వ్యతిరేకించే మీడియా కి అస్త్రం అందించినట్లవుతుందని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. కానీ అదేసమయంలో మోడీతో సఖ్యతగా లేకపోతే తన కేసులేమవుతాయోననే భయం వెన్నాడుతుంది. అందుకనే మోడీ కి ఖచ్చితంగా నో చెప్పలేని పరిస్థితి.తన అనుయాయుల్లో ముఖ్యంగా విజయసాయి రెడ్డి , మిదున్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వంలో చేరితేనే మంచిదని సలహా ఇస్తున్నట్లు తెలుస్తుంది.
తెరవెనుక ఏదో జరగకపోతే మరలా అమిత్ షా ని కలవటానికి ఎందుకు వెళుతున్నట్లు? ఈ లోపల తెలుగుదేశం కూడా కేంద్రం లో లాబీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ భయమల్లా వైస్సార్సీపీ మోడీకి దగ్గరైతే చంద్రబాబు నాయుడు వారి అనుచరులపై కక్ష సాధింపుచర్యలు ముమ్మరమవుతాయని భయం పట్టుకుంది. పైకిచెప్పే మండలి తగాదా జనానికి పూలు పెట్టటానికే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి గా పనిచేసిన వ్యక్తిని 5 రోజులు సిబిఐ విచారణ జరపటం తెలిసిందే. జగన్ కి చంద్రబాబు నాయుడు ని ఎలాగైనా బుక్ చేయాలనే కక్ష చాలా బలంగా వుంది. అదే చివరకి మోడీ కేబినెట్ లోకి చేరటానికి పుసిగొల్పచ్చని అనుకుంటున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వీటిపై మరింత క్లారిటీ రావచ్చనేది అభిజ్ఞుల అంచనా.








నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. నందమూరి ఫ్యామిలీ నుంచి త్వరలోనే మరో హీరో తెరపై కనిపించబోతున్నాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ అమెరికాలో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. న్యూయర్క్ లోని స్టార్స్ బర్గ్ ఫీలిం ఇన్టిట్యూట్లో యాక్టింగ్ కు సంబంధించి ఒక కోర్సు చేస్తున్నాడని తెల్సింది. ఈ శిక్షణ పూర్తవగానే మోక్షజ్ఞ సిమాల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.
‘ఆర్ఎక్స్-100’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన హీరో కార్తీకేయ. పక్కంటి కుర్రోడిలా కన్పించే కార్తీకేయ ‘ఆర్ఎక్స్-100’ విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మూవీ హిట్టుతో కార్తీకేయ సినిమా ఆఫర్లు భారీ వచ్చాయి. ఇటీవల కార్తీకేయ చేసిన సినిమాలు ‘గుణ-369’, ‘90ఎంఎల్’ సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. దీంతో కథల ఎంపికలో ఆచితుచి వ్యహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘చావుకబురు చల్లగా’ అనే మూవీకి కార్తీకేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారిపై గోస్సిప్స్ రావడం సర్వసాదారణం. తాజాగా పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ కోసం హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నారని ఓ వార్త ఫిలిం సర్కిల్ లో చేకార్లు కొడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంటున్నారు. చివరకు అప్పులు కూడా చేయలేని దుస్థితికి చేరుకున్నారు.



ఇతర దేశాల నుంచి ఆశ్రమంగా భారతదేశంలోకి బంగారం తీసుకొనిరాటానికి కేటుగాళ్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే దుబాయ్ నుంచి 931 గ్రామూల బంగారాన్ని సుత్తిలో పెట్టి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులని హైదరాబాద్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.






అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ (జోష్ దర్శకుడు) కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ మూవీ అనుకున్నంత విజయం సాధించాలేకపోయింది. అఖిల్ చాల రోజుల గ్యాప్ తరువాత ఈ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మద్య 
మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను రూ 3 లక్షల కోట్ల అప్పుల్లొకి ముఖ్యమంత్రి కేసీఆర్ నెట్టివేశారని అంటున్నారు నిజామాబాదు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రం నుండి సుమారు రూ 2 లక్షల కోట్లు లభించాయని చెబుతూ కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పక పోతే, తప్పు తేలితే ఫామ్‌హౌజ్ నుంచి శ్రీకృష్ణుడి జన్మస్థలానికి పంపించే కార్యక్రమాలు ఉంటాయని కూడా హెచ్చరించారు.
విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ, చిత్ర యూనిట్ బీజీగా ఉంది. విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్లలో తనపై పెళ్లిపై వచ్చిన ప్రశ్నపై ఆయన స్పందించారు. పెళ్లిపై తనకు నమ్మకం ఉందని.. అయితే ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపై ఉందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. మరిన్ని సినిమాలు చేసే అభిమానులను అలరించడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతానికి ఐయమ్ సింగిల్ అంటూ చెబుతున్నాడు.