కేజ్రీవాల్ కు కలసి వస్తున్న ప్రేమికుల రోజు!
మంచు వారి రెడీ మేడ్ కిడ్స్ ఫ్యాషన్ లైన్
ఇప్పుడు ఫ్యాషన్స్ ను ఇష్టపడే పిల్లల తల్లులు ఆనందపడేలా, ఒక రెడీ మేడ్ కిడ్స్ ఫ్యాషన్ లైన్ ను లాంచ్ చెయ్యడానికి విరానికా మంచు రెడీ అవుతున్నారు. 2020 మే నెలలో ప్రారంభమయ్యే ఈ కిడ్స్ వేర్ లైన్ దేశవ్యాప్తంగా లభించనున్నది. మంచు ట్విన్స్ అమ్మానాన్నలు విరానికా మంచు, విష్ణు మంచు త్వరలోనే ఈ లైన్ బ్రాండ్ పేరును రివీల్ చేయనున్నారు.
ఇన్స్టాగ్రాంలో మంచు ట్విన్స్ ఆరియానా, వివియానా లకు 25 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్రెండీ క్లాతింగ్ ధరించిన ఫొటోలను రెగ్యులర్ గా ఆ కవలలు తమ ఇన్స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. వాటికి వేలాది లైక్స్ వస్తున్నాయి. వాళ్ల ఫాలోయర్స్ అంతకంతకూ పెరుగుతుండటం ఎ-లిస్టర్ డిజైనర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాము డిజైన్ చేసే కిడ్స్ లైన్లను మంచు ట్విన్స్ ద్వారా ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి వారితో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆ డిజైనర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ల జాబితాలో మంచు ట్విన్స్ టాప్ లో ఉన్నారు. తమ పిల్లలు కూల్ గా, స్టైల్ గా కనిపించాలని ఆశించే పేరెంట్స్ వాళ్ల ఫాలోయర్స్ లిస్టులో ఉన్నారు.
‘టోటల్లీ ఆసమ్’ అనే ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహించిన ‘ఇండియన్ కిడ్స్ డిజిటల్ ఇన్సైట్స్ 2019’ అనే ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ కంటెంట్ ను ఉపయోగించే 73 శాతం మంది పిల్లలు తమకు ఫలానా వస్తువు కొనివ్వమని పేరెంట్స్ ను అడుగుతున్నారు. ఎందుకంటే, వాటిని చైల్డ్ ఇన్ఫ్లూయెన్సర్ వాడుతుండటం. అందుకు అనుగుణంగా చైల్డ్ ఇన్ఫ్లూయెన్సర్ ప్రచారకర్తగా ఉన్న వస్తువుల్ని 81 శాతమంది పేరెంట్స్ తమ పిల్లల కోసం కొంటున్నారు.
చక్కని ఫ్యాషన్ తో ఉండే డ్రస్సుల్లో తమ పిల్లల్ని చూసుకొని మురిసిపోవాలని చాలామంది యంగ్ పేరెంట్స్ ఆ తరహా డ్రస్సుల కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఫ్యాషన్ లైన్ బ్రాండును వినోదాత్మకంగా, సౌకర్యంగా, స్టైల్ గా, అదే సమయంలో అందుబాటు ధరల్లో ఉండేలా మంచు ట్విన్స్ రూపొందిస్తున్నారు. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ బ్రాండుకు యూనివర్సల్ అప్పీల్ ఇవ్వడానికి న్యూయార్క్, యూరప్, భారత్ లోని పలువురు పేరుపొందిన డిజైనర్లతో విరానికా, మంచు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
తన మానసపుత్రిక అయిన ఈ కిడ్స్ లైన్ గురించి విరానికా మాట్లాడుతూ, “ఇది ఒక అద్భుతమైన అవకాశాన్నిచ్చే ఏర్పాటు. ఇది కేవలం ఒక బిజినెస్ కాదు, కిడ్స్ క్లాతింగ్ లైన్ లో తాజా ఊపిరి లాంటిది. సరైన ధరల పాయింట్లను, మన కలలకు తగ్గ ఉత్పాదక సామర్థ్యాలని క్రియేట్ చెయ్యడం గురించి కూడా మేం ఆలోచించాం. ఇది భారతదేశపు బెస్ట్ చిల్డ్రెన్ క్లాతింగ్ లైన్లలో ఒకటి అవుతుంది” అని చెప్పారు.
అడ్డెడ్డే.. దేశ రాజధానిలో ఉగ్రవాది సీఎం!

2020 ఢిల్లీ ఎన్నికలలో అధికార పీఠం ఎలాగైనా కైవసం చేసుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అందులో భాగంగా ఢిల్లి ఎన్నికల ప్రచార నేపథ్యంలో బీజేపీ వినూత్నమైన పద్దతిలో ఆప్ ని ఎదుర్కునే ప్రయత్నం చేసింది. మరో కొన్ని గంటలలో
పోలింగ్ జరుగుతాయనగా.. బీజేపీ ప్రభుత్వం “ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉగ్రవాది” అని తీవ్ర పదజాలంతో ఆయనపై విమర్శల దాడి చేసింది.

అయితే ఈ మాటలకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. “నేను ఉగ్రవాదిని అయితే మీ ఓటు బీజేపీ కి వేయండి లేకపోతే నన్ను గెలిపించాలని” ఢిల్లీ ప్రజలను కోరాడు. అయితే ప్రస్తుతం ఢిల్లీ రిజల్ట్స్ చూస్తుంటే.. ఆప్ ఘన విజయం దిశగా అడుగులు వేస్తోంది. అది జరిగితే బీజేపీ అన్నట్లుగా ఒక ఉగ్రవాది దేశ రాజధానికి సీఎం అవడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారేమో..!
కేజ్రీవాల్ కి కంగ్రాట్స్ చెప్పిన జగన్!

2020 ఢిల్లి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారం కైవసం చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. దాదాపు 57 స్థానాలలో ఆప్ ముందజలో కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, కేజ్రీవాల్ కి ముందుగానే గెలుపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆప్ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్.. ‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆప్ విజయం సాధించినందుకు అరవింద్ కేజ్రీవాల్ కి మరియు ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను. దేశాన్ని ‘మన్ కి బాత్’ కాకుండా ‘జాన్ కి బాత్’ నడుపుతుందని ప్రజలు చూపించారు. కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అని బిజెపి పిలిచినా అతన్ని ఓడించలేకపోయింది. అని ఆయన ట్వీట్ చేశారు.
Maharashtra Chief Minister Uddhav Thackeray: I congratulate Arvind Kejriwal and the people of Delhi for AAP's victory in #DelhiPolls2020. People have shown that the country will be run by 'Jan Ki Baat', not 'Mann Ki Baat'. BJP called Kejriwal a terrorist but couldn't defeat him. pic.twitter.com/BkBiwaU5Yi
— DY365 (@DY365) February 11, 2020
ఆంధ్ర వాళ్ళు : రాజకీయాలు, సినిమాలు
ఆంధ్ర సమాజంలో రాజకీయాలు, సినిమాలు చేదోడు వాదోడుగా కలిసి మెలిసి ప్రయాణం చేస్తాయని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. మరి ఈ మాత్రం ఇంగితజ్ఞానం లేకుండా రాజకీయాల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే ఎప్పటికీ షైన్ కాలేరు. వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఏమైనా కుదరదేమోగానీ తెలంగాణ విడిపోయాక మిగిలిపోయిన ఆంధ్రాలో ఇది అక్షరాలా సత్యం. దాదాపు శతాబ్దంపైగా తమిళులతో కలిసి సహజీవనం చేసిన చరిత్ర కదా. ఆ మాత్రం అరవ వాసనలు వుండాలికదా . సహతెలుగు వాళ్ళతో మన సహజీవనం 58 ఏళ్ళయితే తమిళులతో అబ్బో దాదాపు రెండు వందల ఏళ్ళు. అందుకే తమిళుల కాఫీ, ఇడ్లి, దోశ మన తెలుగింటి ఆచారంగా మారింది. అదేబాటలో సినిమాలు కూడా . కొత్తవాళ్లకు తెలియదుకానీ సినిమా అంటే మద్రాసే . ఇప్పటి ఆంధ్ర, రాయలసీమ వాళ్లకు ఏ పనికావాలన్నా మద్రాస్ పరిగెత్తేవాళ్లు. విజయ-వాహిని స్టూడియో అలాంటిదే. చందమామ పుస్తకం అక్కడిదే. ఒకటేమిటి , ఇప్పుడు ప్రతి పనికీ హైదరాబాద్ ఎట్లా వస్తున్నారో అలాగా మద్రాస్ వెళ్ళేవాళ్ళు. అంతగా మద్రాస్ తో ఆంధ్ర వాళ్ళ జీవనం పెనవేసుకుపోయింది. అందుకే మద్రాస్ లేని రాజధాని మాకొద్దని చాన్నాళ్లు భీష్మించుకు కూర్చున్నారు. చివరకు ఇష్టంలేకుండానే మద్రాస్ ని వదులుకొని వచ్చారు. అదేంటోగానీ ఆంధ్రులకి , రాజధానికి ఎదో పొసగటం లేదు . మద్రాస్ పోయే కర్నూల్ వచ్చే; కర్నూలు పోయే హైదరాబాద్ వచ్చే; హైదరాబాద్ పోయే అమరావతి వచ్చే; అమరావతి పోయే వైజాగ్ వచ్చే; వైజాగ్ పోయే ….. అసలు మనం ఆంధ్ర అనే పదం మానేస్తే గతిమారిద్దంటారా ! ఆమ్మో అదెట్లా పోతేపోనీ రాజధానీ, ఆంధ్ర పదం మనకు వేల సంవత్సరాల అనుభూతికదా. మరి మన తెలుగు చానళ్ళు ఇప్పటికే జ్యోతిష్యులు, పంచాంగ పండితులు, స్వామీజీలతో దీనిపై చర్చోప చర్చలు పెట్టివుండాలే. వాళ్ళకు ఇంతకన్నా గొప్ప టాపిక్ ఇంకేముంటుంది? మనమైనా సలహా ఇద్దాం . ఓ నెల రోజులు చానళ్లకు పండగే పండగ.
సరే అసలు విషయానికి వద్దాం. రాజకీయాలకి, సినిమాలకి లింక్ ఏందంటారా? ఇటీవలే ఈ లింక్ మరోసారి ముందుకొచ్చిందండోయ్ . జేడీ లక్ష్మీనారాయణ గారు ( ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటా ) పవన్ కళ్యాణ్ మాటతప్పి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని కోపంతో నిరసనగా జనసేన నుంచి బయటికెళ్లిపోయాడంట. దీనితో అందరూ ముక్కున వేలేసుకున్నారు. జేడీ గారు జనసేన నుంచి బయటికెళ్తాడనే రూమర్ చాలా రోజుల్నుంచి చెక్కరు కొడుతోంది. కాబట్టి అందులో ఆశ్చర్యం ఏమీలేదు , ఆశ్చర్యమల్లా ఆయన చెప్పిన కారణం గురించే. పవన్ కళ్యాణ్, జేడీ గారి మధ్య అసలేంజరిగిందనే దానిమీద , యోగ్యతా యోగ్యతల మీద మనం జడ్జిమెంట్ పాస్ చెయ్యటంలేదండోయ్. కేవలం ఈ సినిమా లింక్ గురించే మాట్లాడుకుందాం. ఇందాకనే చెప్పినట్లు అరవ వాసనలు మన సంస్కృతిలో భాగమై పోయాయనేది సత్యం, పాపం జేడీ గారికి ఈ విషయం బోధపడినట్లు లేదు. చిన్నప్పుడు సినిమా రిలీజ్ అవగానే మొదటి షో టికెట్ కొనుక్కొని సినిమా చూసే అలవాటు జేడీ గారికి ఉన్నట్లు లేదు. ఆంధ్ర రాజకీయాల్ని అవపోసన పట్టాలంటే ఈ అలవాట్లు, సంస్కృతులను కూడా స్టడీ చేయాలని జేడీ గారికి తెలిసినట్లు లేదు. ఆయనంతా సిస్టమాటిక్ గా వున్నత చదువులు చదవటం, వృత్తిని దైవంగా భావించి నిర్మొహమాటంగా పాటించటం, డ్యూటీలో సినిమా హీరో లాగా వున్నాడే తప్పించి రియల్ లైఫ్ లో సినిమా జీవితానికి అలవాటుపడినట్లు లేదు. జేడీ గారూ , తమిళనాడులో , ఆంధ్ర లో సినిమా , రాజకీయాలు విడి విడి గా చూడలేమండి.
ఒక్కసారి డీఎంకే చరిత్ర చూడండి. సినిమా రచయితలే నాయకులు. అన్నాదురై కి ఎంత కనెక్షన్ వుందో తెలియదుగానీ కరుణానిధి మాత్రం పూర్తిగా సినిమా నేపధ్యం నుండే వచ్చాడు. ఎంజీఆర్ , జయలలితల సంగతి చెప్పాల్సిన పనిలేదు. అలాగే విజయకాంత్, కమల్ హాసన్ , రజనీకాంత్ లు కూడా. అదే ఒరవడి తెలుగులో కూడా వచ్చేదేకానీ మధ్యలో హైదరాబాద్ తో కలవటంతో కొంత బ్రేక్ వచ్చింది. అయినా ఎన్టీఆర్ అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్ళందరినీ ఒకటిచేయగలిగాడు. అయినా తెలంగాణ లో సినిమా ప్రభావం మొదట్నుంచీ పరిమితంగానే ఉండేది. తిరిగి పాత ఆంధ్ర ఏర్పడటంతో మెల్లిగా తమిళనాడు వాతావరణం ఏర్పడుతుంది సుమా. ఈ ఎన్నికల్లోనే ఆ సూచనలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ తో పాటు వైస్సార్సీపీ కూడా ఎంతోమంది సినిమా వాళ్ళతో ప్రచారం చేయించింది. అలాగే తెలుగుదేశం. అసలు సన్ స్ట్రోక్ లేకపోతే తెలుగుదేశంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నాయకుడిగా ఎదిగేవాడనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే రాజకీయాలు, సినిమాలు ఆంధ్రాలో విడదీయలేమని జేడీ గారికి ఇప్పటికే అర్ధమైవుండాలి. అందుకనే పాపం జేడీ గారు బయటకెళ్తూ చెప్పిన కారణం ఎవ్వరినీ కన్విన్స్ చేయలేకపోయింది.
జేడీ గారూ , మీరు దేన్నయినా టచ్ చేయండి గానీ సినిమా ఫీల్డ్ ని టచ్ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ ఏ కారణం చెప్పినా, జేపీ లాంటి వాళ్ళు సమర్ధించినా అసలు కారణం ఇంకా నాలుగు సంవత్సరాలు పైగా పవన్ కళ్యాణ్ ని ప్రజలు గడ్డంతో చూడటానికి ఇష్టపడటంలేదంట . అది పవన్ కళ్యాణ్ కి అర్ధమయ్యింది. చూడండి ఇప్పుడు గడ్డం తీసిన స్టిల్స్ సోషల్ మీడియా లో కొట్టే చక్కర్లకి జనం ఫిదా అవుతున్నారు. ఆయన అభిమానులూ, సినిమా ప్రియులు పవన్ కళ్యాణ్ ని మరలా సినిమాల్లో చూసుకోవాలని తహ తహ లాడుతున్నారు , మీరెందుకు అడ్డుపడటం. ఈ రాజకీయాలు ఎప్పుడూ వుండేయే . ఆరడుగుల బుల్లెట్టుని సినిమాల్లో చూసి ఆనందించనీయండి. మధ్యలో ఆయనకి వాళ్ళ అన్నయ్య లాగా సినిమా ఫీల్డే హాయిగా అనిపిచ్చిందనుకో అప్పుడు రాజకీయ రంగం మీలాంటి వాళ్లకు పూర్తిగా దొరుకుతుందికదా. పవన్ కళ్యాణ్ సంగతేమోగానీ మీకు నా ఉచిత సలహా . మీరు కూడా సినిమా ఫీల్డ్ ఎందుకు ట్రై చేయకూడదు. ఆంధ్ర రాజకీయాలకు సినిమా రంగం స్టెప్పింగ్ స్టోన్ అంటారు. ఇంకెందుకు ఆలస్యం , మీరూ సినిమా లోకి దూకండి. మీరూ ఆరడుగుల బుల్లెట్టే కదా. సరదాకి , ఎవరినీ నొప్పించటానికి కాదు సుమా.
ఇదీ ఈ వారాంతపు ముచ్చట్లు , వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ….
… మీ రామ్
‘ఆర్ఆర్ఆర్’ పోటీకి నై అంటున్న ‘ఇండియన్-2’
బహుబలి దర్శకుడు రాజమౌళి తెరక్కెకిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారతీయ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘బహుబలి’ లాంటి తెలుగు మూవీని ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు రాజమౌళి. దీంతో ఆయన తదుపరి మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల తేది పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 2021 జనవరి 8న రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ రిలీజ్ తేదికి విడుదల చేసేందుకు సన్నహాలు చేసిన దర్శక, నిర్మాతలు ఇప్పుడు వెనుకడు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర వాళ్ళు : రాజకీయాలు, సినిమాలు
విశ్వనటుడు కమలహాన్ తాజా చిత్రం ‘ఇండియన్-2’. భారతీయుడు మూవీకి సిక్వెల్ గా ఈ మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సంక్రాంతి ముందు వస్తుండటంతో ‘ఇండియన్-2’ తాజా ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ‘ఇండియన్-2’ మూవీ తెరకెక్కుతుంది. కలెక్షన్ల పరంగా ఏమైనా తేడాలొస్తే నష్టపోవాల్సి వస్తుందనే భయంతో చిత్రబృందం ‘ఆర్ఆర్ఆర్’ తో పోటీకి వెనుకడుగు వేస్తుంది.
‘ఆర్ఆర్ఆర్’, ‘ఇండియన్-2’ మూవీలు విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’కు దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ‘ఇండియన్-2’కు తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరు ఇండియన్ సినిమా పరంగా కొత్త రికార్డులను సృష్టించినవారే. అయితే ఈ రెండు చిత్రాలు కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం ఈ మూవీని 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో 2021 సంక్రాంతి రేసులో ఉన్న ‘ఇండియన్-2’ మరో రిలీజ్ డేట్ ప్రకటించాలని భావిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ తో పోటీకి దిగితే రెండు సినిమాలకు కలెక్షన్ల పరంగా దెబ్బతినే అవకాశం ఉంది. ‘ఇండియన్-2’ ఎలాగో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి రావడం ఏమాత్రం మంచిదికాదని గ్రహించినట్లు ఉన్నారు. దీంతో ‘ఇండియన్-2’ మరో తేదిని త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.
వైభవంగా ఆస్కార్ అవార్డుల వేడుక
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో నిర్వహిస్తున్న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. హలీవుడ్ నటుడు, ఇతర దేశాలకు చెందిన అతిరథ మహారథుల మధ్య అస్కార్ అవార్డులు గెలుపొందిన చిత్రాలను ప్రకటించారు. అయితే ‘పారాసైట్’ మూవీ ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. 92వ ఆస్కార్ వేడుకల్లో ‘పారాసైట్’ మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషన్ ఫిలీం విభాగాల్లో అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.
‘పారాసైట్’ మూవీతోపాటు జోకర్, 1917, జోజో రాబిట్, లిటిల్ ఉమెన్, మ్యారేజ్ స్టోరీ ది ఐరీష్ మ్యాన్, పోర్డ్ వర్సెస్ ఫెరారి, ఒన్స్ ఏపాన్ ఏ టైమ్ ఇన్ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులను గెలుచుకొన్నాయి. ఈ కార్యక్రమంలో నటీనటులు రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది.
*ఆస్కార్ విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం-పారాసైట్
ఉత్తమ డైరెక్టర్ -బోన్ జోన్ హో(పారాసైట్)
ఉత్తమ నటుడు-జాక్సిన్ ఫొనిక్స్(జోకర్)
ఉత్తమ నటి-రెనీ జెలెగ్వర్(జూడి)
ఉత్తమ సహాయ నటుడు-బ్రాడ్ పిట్(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ సహాయ నటి-లారా డెర్న్(మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ ఒరిజినల్ స్రీన్ ప్లే-బాంగ్ జూన్ హో, హన్ జిన్ వోస్(పారాసైట్)
బెస్ట్ అడాప్టెడ్ స్ర్కీన్ ప్లే-టైకా వైటిటీ(జోగో ర్యాబిట్)
బెస్ట్ యానిమేనేడ్ ఫీచర్-టాప్ స్టోరీ 4
బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిలీం-పారాసైట్(కొరియస్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్-అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్ సినిమాటోగ్రఫీ-రోజర్ డికెన్(1917)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్-బాంబ్ షెల్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్-ది నైబర్స్ విండో
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్-హెయిర్ లవ్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్-లెర్నింగ్ టూ స్కేట్ బోర్డ్ ఇన్ ఏ వార్ జోర్(ఇఫ్ యుఆర్ ఏ గర్ల్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్-(ఐయామ్ గొన్నా) లవ్ మీ ఎగైన్.. రాకెట్ మ్యాన్
అబ్దుల్ కలాంగా అలీ..
హాలీవుడ్ దిగ్గజాలను భారత గడ్డపై దింపి, తన కథలతో ఇండో- అమెరికన్ సినిమా ఒప్పందాలను కుదుర్చుకున్న భారతీయ హాలీవుడ్ యువ దర్శకుడు జగదీష్ దానేటిపై కేంద్ర ప్రసార, సమాచార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్ లో ప్రత్యక్షంగా కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని ఆయన కొనియాడారు. లాస్ ఏంజిల్స్, అమెరికాకు చెందిన పింక్ జాగ్వర్స్ ఎంటర్ టైన్ మెంట్, ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత జానీ మార్టిన్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో జగదీష్ దానేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న అబ్దుల్ కలాం బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంత్రి జవదేకర్ నిన్న ఢిల్లీలో ఆవిష్కరించారు. పీపుల్స్ ప్రెసిడెంట్ గా భారతీయుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కలాం బయోపిక్ ఆవిష్కరణలో పాలు పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కలాం ప్రాజెక్టుకూ, భారత దేశంలో వారు తలపెట్టిన ఇండో హాలీవుడ్ ఫిల్మ్ వెంచర్స్ కూ భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు.
తెలుగులో బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించి 41 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటులు మహమ్మద్ అలీ 1111 చిత్రంగా అబ్దుల్ కలాం బయోపిక్ తో హాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ కలాం గారి పాత్ర పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హాలీవుడ్ లో నటుడిగా అడుగు పెట్టే అవకాశమిచ్చిన దర్శకుడు జగదీష్ కు రుణపడి ఉంటానన్నారు.
హాలీవుడ్ దిగ్గజం జానీ మార్టిన్ మాట్లాడుతూ జగదీష్ దానేటిని కథల గనిగా అభివర్ణించారు. జగదీష్ చెప్పిన ఐదు కథలు తనను ఎంతగానో ఆకర్షించాయని, ఈ ఇండో అమెరికన్ చిత్రాల నిర్మాణంలో భాగస్వామి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పింక్ జాగ్వర్స్ ఎంటర్ టైన్ మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సువర్ణ పప్పు మాట్లాడుతూ ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల ఫిల్మ్ ఫండ్ తో ఈ ఇండో అమెరికన్ చిత్రాల నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. జగదీష్ దానేటి రచన, దర్శకత్వంలో రాబోతున్న చిత్రాలను భారత దేశంలోని ఐదు ప్రముఖ నగరాలలో ప్రకటించనున్నట్లు తెలిపారు. భారత దేశంలో ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ టెక్నాలజీ, మీడియా పవర్ హౌసెస్,
తద్వారా ఆగ్ మెంటెడ్ రియాలిటీ , వర్ట్యువల్ రియాలిటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
జగదీష్ దానేటి మాట్లాడుతూ ఈ నెల 16 వరకు జరుపుతున్న భారత పర్యటనలో హాలీవుడ్, ఇండో అమెరికన్ ఫిల్మ్ ప్రాజెక్టులుగా నిర్మితమవుతున్న ఐదు చిత్రాల వివరాలను ప్రకటిస్తామన్నారు. అబ్దుల్ కలాం గారి బయోపిక్ కి దర్శకత్వం వహించటం భారత కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియజేసే బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాలీవుడ్ నటి లిలియన్ రేవ్, బాలీవుడ్ దర్శక నిర్మాత మధుర్ భండార్కర్, బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రామచంద్రరావు, శ్రీమతి కళ్యాణి (జాయింట్ సెక్రటరీ, ఫిల్మ్స్, ఐ అండ్ బి మినిస్ట్రీ), పింక్ జాగ్వర్స్ భారత ప్రతినిధులు అల్లం సైదా రెడ్డి, ఎస్. నాగాచారి పాల్గొన్నారు.









మూడుతరాలుగా ‘అక్కినేని’ ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు సినిమా హైదరాబాద్ రావడానికి అక్కినేని నాగేశ్వర్ రావు ప్రధాన కారణమని అందరికీ తెల్సిందే. నాగేశ్వర్ రావు ప్రేమ కథలు, పౌరణిక, జానపద తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ‘దేవదాసు2, ప్రేమనగర్ వంటి ప్రేమకథలతో అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత నాగార్జున ఆయన వారసత్వం కొనసాగించారు. ప్రస్తుతం నాగేశ్వర్ రావు మనువడు నాగచైతన్య వరుస ప్రేమకథలు చేస్తూ తాతకు తగ్గ మనువడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తాజాగా నాగచైతన్య ‘నాగేశ్వర్ రావు’ అనే సినిమాలో నటించున్నారని ప్రచారం జరుగుతుంది. ‘నాగేశ్వర్ రావు’ టైటిల్ ఇప్పటికే ఫిల్మ్ చాంబర్లో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని 14రీల్స్ సంస్థ నిర్మించనుంది.







యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ లతో కూడిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 10 ఉదయం 10:10 లకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కింగ్ నాగార్జున ఉగాది పండుగ రోజున ‘బంగార్రాజు’గా పలుకరించబోతున్నాడు. నాగార్జున ‘సొగ్గాడే చిన్నినయనా’ మూవీలో బంగార్రాజుగా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెల్సిందే. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో నాగార్జున నటన ఆకట్టుకుంది. ఈ మూవీ హిట్టయిన తర్వాత దర్శకుడు కల్యాణ్ కృష్ణ సీక్వెల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలోని బంగార్రాజు క్యారెక్టర్ ను ఇన్పిరేషన్ గా తీసుకొని ఓ కథను దర్శకుడు సిద్ధం చేశాడు. ఈ కథకు నాగార్జున గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం మేరకు ‘బంగార్రాజు’ మూవీ ఉగాది రోజున ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
సిక్స్ కొట్టాలనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చేశాను: విజయ్ దేవరకొండ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, “అప్పట్లో చిరంజీవితో ఎన్ని సూపర్ హిట్స్ నాన్-స్టాప్ గా ఇచ్చారో మళ్లీ అంతకు మించిన హిట్స్ ఈ సినిమా నుంచి రామారావు గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతోమంది లవర్స్ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ ఫేమస్ లవర్. ఈ సినిమాతో నిజంగానే అతను వరల్డ్ ఫేమస్ లవర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలోని హీరోయిన్లందరూ అతనితో, మిగతా హీరోలతో మరిన్ని సినిమాలు చెయ్యాలని ఆశిస్తున్నా. క్రియేటివ్ డైరెక్టర్ అయిన క్రాంతిమాధవ్ ఈ సినిమా నుంచి వండర్ఫుల్ సక్సెస్ లు చూడాలని కోరుకుంటున్నా” అన్నారు.
అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ, “వరల్డ్ వైడ్ గా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సూపర్ హిట్ కావాలనీ, కేఎస్ రామారావు గారి బ్యానర్ కు ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ రావాలనీ కోరుకుంటున్నా” అన్నారు.
సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్ మాట్లాడుతూ, “నేనూ, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఈ 46 సంవత్సరాల జర్నీలో రామారావు ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించారు. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాడ్ని. విజయ్ దేవరకొండ మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం. ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, “విజయ్ తో నావి రెండు సినిమాలు అయ్యాయి. మూడో సినిమాకి సిద్ధంగా ఉన్నాం. రాత్రే నాకు మూడో సినిమా చెయ్యవా? అనడిగాను. మీరు ఎప్పుడు చెయ్యమంటే అప్పుడు వచ్చి చేస్తానని చెప్పాడు. ఇంతదాకా విజయ్ జర్నీ ఎలా సాగిందో చూస్తూ వచ్చాను. చాలామంది దగ్గర తెలివితేటలు, టాలెంట్ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన టాలెంట్, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న అరుదైన మనిషి విజయ్. అతను నిగర్వి. అతని జర్నీ ప్రారంభ దశలోనే ఉంది. ఫ్యూచర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా. కేఎస్ రామారావు ఒకనాడు నేను ఈర్ష్యపడేంత ప్రొడ్యూసర్. ఈ మనిషికి ఇంత తపనేంటి అని అప్పుడు ఆశ్చర్యపోయేవాడ్ని. ఎన్ని సినిమాలైనా ఇప్పటికీ ఆయనలో అదే ప్యాషన్ కనిపిస్తోంది. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది. సినిమాని అంతగా ప్రేమించేవాళ్లకి తప్పకుండా విజయం వరిస్తుంది. ట్రైలర్ చూస్తే డైరెక్టర్లో చాలా విషయం ఉందనే ఫీలింగ్ కలిగింది. సినిమా కూడా అంత బాగుంటుందని ఆశిస్తున్నా. రౌడీ బాయ్స్ ఈ సినిమాని పెద్ద హిట్ చేయిస్తారని అనుకుంటున్నా” అని చెప్పారు.
హీరోయిన్ ఇజాబెల్లా మాట్లాడుతూ, “ఈ సినిమాలో విజయ్ సరసన నటించడం గౌరవంగా భావిస్తున్నా. క్రాంతిమాధవ్ చాలా బాగా సినిమా తీశారు” అన్నారు.
హీరోఇన్ క్యాథరిన్ ట్రెసా మాట్లాడుతూ, “ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన క్రాంతికి థాంక్స్. తెలుగులో చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. విజయ్ ఈ సినిమాకు వెన్నెముకగా నిల్చున్నారు. అతనితో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్. ఆయనెప్పుడూ క్యారెక్టర్లోనే ఉండటం నాకు చాలా నచ్చింది. ఆ మంచి గుణం ఉండటం వల్లే ఆయన రోరోజుకూ ఎదుగుతున్నారు” అని చెప్పారు.
రాశీ ఖన్నా మాట్లాడుతూ, “ఇప్పుడు నన్ను చాలామంది యామినీ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది ప్రేమలో ఉన్నవాళ్ల కోసమూ, ప్రేమొలో లేనివాళ్ల కోసమూ కూడా. ప్రేమ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. కథల్లో, సినిమాల్లో, పద్యాల్లో ఈ ఎమోషన్ గురించి వర్ణించారు. ఎన్నిసార్లు వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. నాకు లవ్ స్టోరీస్ చాలా చాలా ఇష్టం. మన తరానికి చాలా ఇష్టం. ఈ సినిమా మిమ్మల్ని అసంతృప్తికి గురిచెయ్యదు. గౌతమ్ తో, యామినితో రిలేట్ అవుతారు. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని విజయ్ చెప్పినప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను. అతన్ని లవ్ స్టోరీల్లో చూడ్డం నాకిష్టం. అతను లవర్ పోస్టర్ బాయ్. తన ఫ్యాన్స్ ను అతను హర్ట్ చేశాడు. నాకు అవకాశం వస్తే మళ్లీ మళ్లీ లవ్ స్టోరీస్ చేస్తాను. విజయ్ ను ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో చూస్తారు. ఈ తరానికి అతను ఇన్స్పిరేషన్. అతనితో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నా. క్రాంతిమాధవ్ మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్ రాశారు. ఈ సినిమాతో ఆయన మంచి పేరు తెచ్చుకుంటారు. కేఎస్ రామారావు గారు మమ్మల్ని అందరినీ తన కుటుంబంలా చూసుకున్నారు” అని చెప్పారు.
ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ, “ఇది తెలుగులో నేను సంతకం చేసిన మొదటి సినిమా. నేను మొదట్ చూసిన విజయ్ సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’. ఆయన్ను చూడగానే చార్మింగ్ గా, స్పార్క్ గా ఉన్నాడనుకున్నా. పెద్ద స్టార్ అవుతాడనీ, జనం అతని గురించి మాట్లాడుకుంటారనీ అనుకున్నా. ఆయన గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయనతో కలిసి పనిచెయ్యడం గొప్ప అనుభవం. కేఎస్ రామారావు గారితో ఇది నాకు రెండో సినిమా. క్రాంతిమాధవ్ నాకు సువర్ణ అనే ఫెంటాస్టిక్ రోల్ ఇచ్చారు. నాది డీగ్లామర్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది చాలామంది చెప్పారు. కానీ సువర్ణతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ఈ సినిమాలోని అన్ని పాత్రల్నీ ప్రేమిస్తారు” అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, “నువ్వు లక్కియెస్ట్ బ్రదర్ ఇన్ ద వరల్డ్ అని నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతుంటా. ఇప్పటికే సినిమా చూసినా. ఫుల్ గా ఎంజాయ్ చేశా. మనోడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అయితుండు. అందరూ ఫిబ్రవరి 14న థియేటర్లలోకు వెళ్లి ఎంజాయ్ చెయ్యాల్ని కోరుకుంటున్నా” అన్నారు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ, “కేఎస్ రామారావు గారు కాలానికి తగ్గట్లుగా కథలను ఎంచుకొని తీయడం చాలా బాగుంది. నేను చూసిన కొన్ని సన్నివేశాల్లో రాశీ, ఐశ్వర్య, క్యాథరిన్, ఇజాబెల్లా గొప్ప నటన చూసి అమేజింగ్ అనిపించింది” అన్నారు.
‘పెళ్ళిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, “అందరికీ విజయ్ ఒక ఇన్ స్పిరేషన్ అయ్యాడు. అతను ఒక్కొక్క మెట్టే ఎక్కుతుంటే హ్యాపీగా ఉంది. అతనొక విప్లవం సృష్టించాడు. విజయ్ ఇప్పుడొక సూపర్ స్టార్. ట్రైలర్ చాలా బాగుంది. నలుగురు హీరోయిన్లతో అతను ఎలా చేశాడో చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అన్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు మాట్లాడుతూ, “వేలంటైన్స్ డేకి ఎవరైనా ఒక అమ్మాయినే తీసుకెళతారు. ఇక్కడ విజయ్ నలుగురు అమ్మాయిల్ని తీసుకెళ్తున్నాడు. ఒక్క విజయ్ మాత్రమే నలుగురు అమ్మాయిల్ని హ్యాండిల్ చెయ్యగలుగుతాడనుకుంటున్నా. ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా. కేఎస్ రామారావు గారికి బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నా” అన్నారు.
దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ, “విజయ్ దేవరకొండ ఎనిమిది సినిమాలు చేసిండు. నాది తొమ్మిదోది. ఎనిమిది సినిమాలు ఒకదానికొకటి పోలిక ఉండదు. విజయ్ ని తరుణ్ భాస్కర్ ‘పెళ్ళిచూపులు’తో హీరోగా పరిచయం చేసిండు. తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిండు. దాంతో ‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేవిధంగా విజయ్ కెరీర్ నడుస్తోంది. అతనెప్పుడూ ఓ కొత్తదనాన్ని ఎంచుకుంటూ ఉంటాడు. తన ఫ్యాన్స్, ఆడిటోరియంకు వచ్చిన వాళ్లకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని మైండ్ లో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాసినం. వేలంటైన్స్ డేకి రిలీజ్ అవుతోంది. నలుగురు హీరోయిన్లున్నారు, ఈ కథ ఏం రాసినవ్? అని నన్ను అడుగుతూ ఉన్నారు. ఒక్క అమ్మాయితో చేయడానికే కష్టపడతారు, నలుగురు అమ్మాయిలతో చెయ్యడం మజాక్ కాదు. విజయ్ చాలా కష్టపడ్డాడు. ఈ ప్రపంచంలో ఒక శిశువు జన్మించింది అంటే నేను ఒక కొత్త ప్రపంచం పుట్టింది అంటాను. ఆ ప్రపంచం ఎదిగి ఒక పెద్ద ప్రపంచం అయ్యాక, తనలాంటి ఇంకో ప్రపంచం కొరకు వెతుకుతుంది. ఆ ప్రపంచం ఎదురైనప్పుడు అందులో ఏకమవ్వాలనీ, మమేకమవ్వాలనీ శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. రెండు వేర్వేరు ప్రపంచాలు ఏకమవ్వాలనుకున్నప్పుడు అలజడి సృష్టింపబడుతుంది. ఈ అలజడినే నేను ప్రేమ అంటాను. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఆ ప్రేమను ఎలా చూపించామో ఫిబ్రవరి 14న మీరు చూస్తారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో ఇది నా రెండో సినిమా”అని చెప్పారు.
చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, “ఈ సినిమా నేను మొదలుపెట్టానికి ప్రేరణ ఇచ్చింది క్రాంతిమాధవ్ చెప్పిన కథ. విజయ్ కూడా కథ విన్నాక ఇది చాలా గొప్ప సినిమా అవుతుందని చెయ్యడానికి ముందుకు వచ్చాడు. దానినే నమ్మి మాకు ఆద్యంతం సపోర్ట్ చేసిన వ్యక్తి గోవర్ధన్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అంత గొప్ప సినిమా అవుతుందని ఆయన అన్నారు. అయితే మా అందరి కంటే ఈ సినిమాలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యింది విజయ్. ఎడిటింగ్ రూములో ఉండి ఈ సినిమా 100 శాతం పర్ఫెక్టుగా వచ్చిందా, లేదా అని చూసుకున్న వ్యక్తి విజయ్. ప్రతి సీన్ అసాధారణంగా ఉండేలా ఆయన నటించి, నలుగురు హీరోయిన్ల పాత్రలూ బాగా వచ్చేలా చూసుకొన్నారు. ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఎంత పోటాపోటీగా నటించారో చూసి అంతా ఆశ్చర్యపోతారు. నేను చూసిన అన్ని భాషల సినిమాల్లో ఒక హీరో, ఒక హీరోయిన్ ఇంత పోటాపోటీగా నటించిన గొప్ప సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. చూస్తున్నంతసేపూ ఎమోషనల్ గా ఫీలవుతారు. చూశాక కూడా వెంటాడే సినిమా. ఈ సినిమాని ఒక మంచి నవల లాగా తయారుచేసిన క్రాంతిమాధవ్ కు థాంక్స్. తనలోని భావుకతను సినిమాల్లో చూపించగలుగుతాడు” అన్నారు.
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “నాలుగేళ్ల క్రితం 2016లో ‘పెళ్ళిచూపులు’ అనే సినిమాతో తొలిసారి ఒక లీడ్ యాక్టర్ గా మీ ముందుకు వచ్చా. ఇప్పటికి ఏడు సినిమాలు రిలీజయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం. చేతి నుంచి జారిపోయి మిస్సయిన సినిమాలున్నాయి. ఈ జర్నీలో రెండే రెండు స్థిరమైనవి ఉన్నాయ్. ఒకటి – మీరు (ఫ్యాన్స్). విజయ్ అంటే ఎవ్వడికీ తెల్వదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు నాతోడు వస్తూనే ఉన్నారు. మనం కలిసి ఇంకా చాలా చాలా చెయ్యబోతున్నాం. ఇది జస్ట్ ప్రారంభమే. ఈ సంవత్సరం నుంచి కొత్త దశలోకి ఎంటరవుతున్నాం. రెండోది – నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ అనేది నాకు ఓపిక లేదు. కొడితే స్టేడియం బయటకు కొట్టాలని బ్యాట్ ఊపుతా. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చేసిన. తమిళ్ రాకున్నా నేర్చుకొని, ‘నోటా’ చేసిన. ‘డియర్ కామ్రేడ్’ సినిమాను ఐదు రాష్ట్రాల్లో రిలీజ్ చెయ్యాలని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ, నేర్చుకున్నాం. ఊరూరూ తిరిగి మ్యూజిక్ కాన్సర్ట్స్ చేశాం. కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ లు పడ్డాయి. కానీ భయమైతే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా. ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని మొన్న చెప్పిన. ఎందుకంటే నాకట్లా అనిపిస్తోంది. అంటే మనిషిలా మారుతున్నా. టేస్టులు మారుతున్నయి. సినిమాల్లో ఇంకో దశలోకి వెళ్తున్నా. లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు అన్నీ కవర్ చెయ్యాలని మూడు రకాల మనుషుల్ని ఇందులో ప్లే చేసిన. మూడు రకాల ఆర్థిక స్థోమతలు, మూడు రకాల సిటీలు, నాలుగు రకాల ప్రేయసులు.. ఒక ఊరిలో ఉంటూ పెద్దగా చదువులేని బొగ్గుగనిలో పనిచేస్తూ భార్యాభర్తల ప్రేమకథ ఒకటైతే, దానికి పూర్తి విరుద్ధంగా వరల్డ్ బిగ్గెస్ట్ సిటీ ప్యారిస్ లో ఒక తెల్లపిల్లతో పైలెట్ గా ఇంకో ప్రేమకథ. హైదరాబాద్ లో కాలేజిలో ఒక అమ్మాయితో మరో ప్రేమకథ.. ఇన్ని విచిత్రమైన క్యారెక్టర్లు ఈ సినిమాలో చేసే స్క్రిప్టుతో క్రాంతిమాధవ్ నా దగ్గరకు వచ్చాడు. స్క్రిప్ట్ వినగానే ఇది నా ఫైనల్ లవ్ స్టోరీ అని ఫిక్సయి చేశా. ఇలాంటి క్యారెక్టర్ చేసే ఛాన్స్ నాకు మళ్లీ దొరకదు. ఎందుకంటే, బొగ్గుగనిలో శీనయ్య లాగా నేను ఉండను, అలా మాట్లాడలేను. అందుకే శీనయ్య రోల్ ను మస్తు ఎంజాయ్ చేశా. అలాగే ఒక ఫారిన్ పైలెట్ తో మనం రిలేషన్షిప్ లో ఉండం. అందుకే ప్యారిస్ ఎపిసోడ్ ను పూర్తిగా ఎంజాయ్ చేసిన. గౌతమ్ రోల్ మన లైఫ్ లో కొంచెం చూసినం. కానీ ఈ మూడు రోల్స్ ను ప్లే చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఫిబ్రవరి 14న ఈ సినిమాకొచ్చి మీరందరూ ప్రేమలో పడతారనుకుంటున్నా. ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా. ఇది క్రాంతిమాధవ్ సినిమా. మేమందరం యాక్టర్స్ అంతే. ఈ స్క్రిప్ట్, ఈ ఆత్మ, మొత్తం క్రాంతిది. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. ఆయనకు అతిపెద్ద సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నా. గోపీసుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ గుమ్మడి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇకనుంచీ సిక్సులు కొట్టడానికే చూస్తా. ఫ్యాన్స్ అందరికీ థాంక్స్” అని చెప్పారు.