సోషల్ మీడియాలో తనపై వర్గల్ కామెంట్ చేసే వారిని వదిలేదని రంగమ్మత్త వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల తనపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న వర్గల్ కామెంట్లపై అనసూయ మాట్లాడారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలపై తనపై ఇష్టమొచ్చిన రీతిలో కామెంట్లు పెడుతున్న వారిని చూసిచూడనట్లుగా వదిలేశానని, అయితే ఈ కామెంట్లో రోజురోజుకు శృతిమించడం వల్లనే వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వల్గర్ కామెంట్లు చేసేవారు ఎవరైనా సామూహిక అరెస్టులుకాక తప్పదని స్పష్టం చేశారు.
అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారంతా అనసూయతో తమ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అయితే కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబెట్రీలపై ట్రోలింగ్ చేయడం కొందరికి అలవాటుగా మారింది. అయితే అనసూయ ఫొటోలను మార్ఫింగ్, బూతు, వర్గల్ పదజాలంతో అనసూయను టార్గెట్ చేస్తున్నారు. దీంతో చిర్రుత్తుకొచ్చిన అనసూయ లైవ్లో లోకి వచ్చి వీరిపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తనపై వర్గల్ కామెంట్లు చేసేవారిని వదిలేదని స్పష్టం చేసింది. అలాగే తనకు మద్దతు ఇచ్చేవారికి కృతజ్ఞతలు తెలిపింది.
అయితే ఇలాంటివి అనసూయ ఒక్కరికే జరగడం లేదు. హీరోహీరోయిన్లందరూ వీటికేం అతీతంగా కాదు. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో నిత్యం వారు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు. వారికి నచ్చిన అభిప్రాయాన్ని తమ అభిమాన నటీనటులతో పంచుకుంటున్నారు. అయితే కొంతమంది శృతిమించి కామెంట్లు చేస్తున్నారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా వారు కూడా వాళ్ల లిమిట్స్ లో ఉండాల్సి ఉంటుంది. యువతను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పెడతూ తమను కామెంట్లు చేయద్దని కోరడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. అతిచేయడం ఎవరైకైనా ప్రమాదకరమే కాబట్టి సోషల్ మీడియాలో సెలబెట్రీలతోపాటు నెటిజన్లు కూడా హద్దుల్లో ఉంటే ఇరువురికి మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.