ఏపీ సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రధాని మోడీని కలవటానికి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవటం..ఆ తరువాత వెంటనే జగన్ కి ఢిల్లీ నుంచి పిలుపు రావటంపై చాల మందిలో అనుమానాలు రేకితించాయి. ఇప్పటిదాకా జగన్ మోడీల సంబంధాలు బాగానే ఉన్నాయి. జగన్ మోడీ ప్రభుత్వానికి పార్లమెంటులో అన్ని విధాలా సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఈ సహాయానికి కృతజ్ఞతగా జగన్ తీసుకునే నిర్ణయాలకు మోడీ సహాయం చేస్తాడనే వాదన గట్టిగ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ ఎన్డీయే కూటమితో కలుస్తుందనే వార్త జనాలలో విస్తృతంగా ప్రచారం అవుతుంది.
ఇది ఇలా ఉండగా..ఇంకో పక్క ఏపీలో ఉన్న ప్రత్యర్థి పార్టీలకు జగన్ మోడీల స్నేహం మింగుడుపడటం లేదు. బీజేపీతో విభేదించి తప్పు చేసాము అని చంద్రబాబు బాధపడుతుంటే..బీజేపీతో పొత్తు పెట్టుకున్నా..కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని పవన్ నిరుత్సాహ పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీలో ఉన్న కొందరు ముఖ్య నాయకులకి కూడా కేంద్రం జగన్ పై సానుకూలంగా వ్యవహరించటం అసలు నచ్చటంలేదట. ఇలా ప్రతి ఒక్కరు వీరి స్నేహం చూసి రగిలిపోతున్నారు. ఒకవేళ జగన్ మోడీతో చెయ్యి కలిపితే మాత్రం వీళ్ళ పని అయిపోయినట్లే అని జనాల్లో గుసగుసలు ఎక్కువ అయ్యాయట..ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.