ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన ఆప్ అధినేత ఇప్పుడు ప్రధాని పదవిపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు మరో ఎనిమిది నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆశారా చేసుకొనే ప్రయత్నాలు జరుపుతున్నది.
వాస్తవానికి 2013లోనే అటువంటి ప్రయత్నాలు చేసినా ఫలవంతం కాలేదు.అక్కడ తన ఫలాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కూడా దాదాపు తిరిగి అవే ఫలితాలు పొందడం, పైగా సుపరిపాలన ఆధారంగా ఓట్లు పొందడంతో జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్న్యాయంగా ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి.
ఇంతకు ముందు హర్యానా, పంజాబ్, గోవా తదితర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు బీహార్ మీదికి దృష్టి సారిస్తున్నారు. బీహార్‌లో జేడీయూ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన పవన్ వర్మ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు బలంగా మద్దతు పలుకుతున్నారు.
భూటాన్ దౌత్యాధికారిగా పనిచేసిన పవన్ వర్మను సీఎం నితీశ్ కుమార్ జేడీయూలోకి తీసుకున్నారు. 2014లో నితీశ్ ఆయనను రెండేళ్ల పాటు రాజ్యసభకు కూడా పంపించారు. అనంతరం ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ, జాతీయ ప్రతినిధిగానూ నియమించారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)ను జేడీయూలోకి తీసుకొచ్చింది పవన్ వర్మే. ఇటీవల పవన్ వర్మతో పాటు పీకేను కూడా జేడీయూ నుంచి బహిష్కరించడంతో… కొత్త గూటి కోసం ఆయన అన్వేషిస్తున్నారు.