Home Blog Page 8583

మెగాస్టార్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్

‘సైరా’ వంటి భారీ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిష ఫిక్స్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో కాజల్ అగర్వాల్ ను ఫిక్స్ చేశారట. గతంలో మెగాస్టార్- కాజల్ కలసి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా భయంతో సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. తిరిగి ప్రారంభం అయ్యాక కాజల్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వచ్చే కీలక సన్నివేశాలలో చరణ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణలు, ఆక్రమణదారులపై కధానాయకుడు తిరుగుబాటు నేపథ్యంలో సినిమా సాగుతుందట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మాగ్నా ఎంటర్టైమెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మెగా అభిమానులకు రామ్ చరణ్ రిక్వెస్ట్….!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇతర దేశాల నుంచి భారత్ కు ఎవరైనా వస్తున్నారంటేనే వారిని అనుమానపు చూపులతో చూడవలసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఇప్పటికే విదేశాల నుంచి భారత్ కు వచ్చిన చాలా మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పుడు భారత్ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్కూల్స్, కాలేజీలు, మాల్స్, థియేటర్లు మూసివేయడం జరిగింది.

ఈనెల 27న రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు ఉండటంతో ఇప్పటి నుంచే అభిమానులు అతడి పుట్టినరోజు కోసం ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకుంటున్నట్లు అభిమానులకు ఒక లేఖ ద్వారా తెలియచేసాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలను ప్రజలకు అర్ధమయ్యేలా తెలియచేయండని, సామజిక బాధ్యతను నెరవేర్చితే అదే నాకు మీరిచ్చే అద్భుతమైన గిఫ్ట్ అని లేఖలో పేర్కొన్నాడు. దయచేసి అభిమానులెవరు తన పుట్టినరోజు వేడుకలను జరపవద్దని తెలియచేసాడు. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ తో కలసి రామ్

మిర్చి కంపెనీ లో మూడోసారి అడుగు పెడుతున్న స్వీటీ

టాలీవుడ్ లో జేజమ్మ అనుష్క క్రేజ్ అపారం. మరెవ్వరు చేరుకోలేని స్థాయి ఆమెది. గత పదిహేనేళ్లుగా తెలుగు పరిశ్రమలో చాల కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అరుంధతి చిత్రం అఖండ విజయం తరవాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇక ఇపుడు అనుష్క నటించిన హార్రర్ థ్రిల్లర్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ” నిశ్శబ్దం” త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి

అనుష్క త్వరలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే సందీప్ కిషన్ తో ” రా రా కృష్ణయ్య” చిత్రం తీసిన దర్శకుడు మహేష్ తో కూడా మరో మూవీ చేయడానికి సుముఖత చూపినట్లు తెలుస్తోంది.

ఇక అనుష్క ప్రస్తుతం..చేస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తుంది. ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో అన్ని భాషల్లోనూ విడుదల చెయ్యాలనేది నిర్మాతల ప్లాన్. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ రెండవ తారీఖున విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా విపత్తు కారణం గా వాయిదా పడింది. అదలావుంటే అనుష్క తన తరవాతి చిత్రం ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో చేయబోతుందని తెలుస్తోంది.ఇక ఈ చిత్రాన్ని.. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ‘యూవీ క్రియేషన్స్’ లో అనుష్కకు ఇది మూడవ చిత్రం అవుతుంది. గతంలో యువీ బ్యానర్ లోఅనుష్క అలియాస్ స్వీటీ ‘మిర్చి’ ‘భాగమతి’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది.
We always need proper planning

సామాజిక చైతన్యం దిశగా చిత్ర సీమ..

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించు కోవాలో అన్న విషయం లో టాలీవుడ్ తారలు చాలా రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తున్నారు. తమ వంతుగా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పై జనాలకు మెసేజ్ లు ఇస్తున్నారు. సినీ ఇండస్ట్రీ అనేది జనాకర్షణ కలిగిన పరిశ్రమ. సినీ తారలు ఏమి చెప్పినా ఇట్టే జనాల్లోకి వెళ్లిపోతుంటుంది. అందుకే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పై ఎన్టీఆర్, రాంచరణ్ లు స్పెషల్ గా ఓ వీడియోను చేసి పోస్ట్ చేశారు. తాజాగా రామ్ చరణ్ ఈ నెల 27 వ తారీఖున జరగాల్సిన తన బర్త్ డే వేడుకల్ని రద్దు చేసుకోవాలంటూ అభిమానులకు ఒక సందేశం పంపడం జరిగింది.

అలాగే టాలీవుడ్లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు లు కూడా తమదైన శైలిలో ప్రజలకు హెచ్చరికలు చేశారు.

ప్రభాస్ .. ” ఇది చాలా కష్టమైన పరిస్థితి.. అయినప్పటికీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కరోనా వైరస్ నుండీ అందరం జాగ్రత్తగా ఉందాం. దానిని ఎదుకోవడానికి కావాల్సిన పద్ధతుల్ని పాటిద్దాం” అంటూ తన ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నాడు.

ఇక ప్రిన్స్ మహేష్ బాబు.. “కరోనా వైరస్ నుండీ మనల్ని మనం కాపాడుకోవడానికి.. అందరూ సామాజికంగా దూరం పాటించాల్సిన టైం వచ్చింది. అందరం మన ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కష్టమే కానీ పాటించక తప్పదు” అంటూ సునిశితంగా హెచ్చరించాడు.

ప్రముఖ యువ హాస్య నటుడు ప్రియదర్శి ఇటీవలే ప్రభాస్ చిత్రం షూటింగ్ కోసం కొన్ని రోజుల క్రితం యూనిట్ తో కలిసి జార్జియా వెళ్ళాడు .అక్కడి షెడ్యూల్ పూర్తికావడంతో టీమ్ మొత్తం ఇండియా తిరిగి వచ్చారు..కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాల నుండి ఇండియాకు వచ్చే ప్రయాణీకులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అనంతరం వారంతా ఇళ్లకు చేరుకున్నాక 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా ప్రభుత్వ వైద్యుల సూచన మేరకే ప్రియదర్శి 14 రోజుల వరకు ఇంటికే పరిమితమవ్వాలని నిర్ణయం తీసుకుని తన సామాజిక భాద్యత నిర్వర్తిస్తున్నాడు. ఇతరుల ఆరోగ్యం దృష్ట్యా ఈ డెసిషన్ తీసుకున్నట్టు ప్రియదర్శి తెలిపారు.

హీరో మంచు మనోజ్ అయితే తన నివాసం ఇంటి చుట్టుపక్కల ఉండేవారికి తన భాద్యతగా శానిటైజర్స్, మాస్కులను పంచుతున్నారు ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు ఈనెల 19న ఘనంగా జరగాల్సిన తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. తిరుపతి వేదికగా ఆయన నెలకొల్పిన శ్రీ విద్యా నికేతన్ వార్షికోత్సవాన్ని తన జన్మదినం నాడు ఘనంగా నిర్వహిస్తారు. కానీ కరోనా వైరస్ విపత్తు కారణం గా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇస్మార్ట్ హీరో తో రాజ‌మౌళి చిత్రం..?

‘రాజమౌళి’ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 11 చిత్రాలను డైరెక్ట్ చేయ‌గా… ప్ర‌తీ సినిమా విజ‌య‌ఢంకా మ్రోగించింది. ప్ర‌స్తుతం ఈ స్టార్ డైరెక్ట‌ర్.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో `ఆర్ ఆర్ ఆర్`ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2021
సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

`ఆర్ ఆర్ ఆర్` త‌రువాత రాజ‌మౌళి చేయ‌బోయే చిత్రంపై ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. `ఇస్మార్ట్` హీరో రామ్ తో జ‌క్క‌న్న నెక్స్ట్ వెంచ‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి 2021లోనే రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడ‌ట రాజ‌మౌళి. ఏదేమైనా, రామ్ – రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

సుప్రీంకోర్టు లో జగన్ కి చుక్కెదురు!


ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల వాయిదా పై జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది.

అయితే కరోనావైరస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కు 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది.

కరోనావైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.. ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం జగన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా సాకుతో ఎన్నిక‌లు వాయిదా వేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సరిగ్గా ఇక్కడే ఆంధ్రప్రదేశ్‌ లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది.

మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఈ ప‌రిణామాల‌ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిచి గవర్నర్ వివరణ తీసుకున్నారు.

Gayathri Reddy Glamorous Photos

సారూ.. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఏందిది?


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిసున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కెసిఆర్) అనేక బహిరంగ సభలలో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, కాబట్టి మన రాష్ట్రాన్ని తెచ్చుకుందాం అని ప్రగల్భాలు పలికారు.తాజా పరిస్థితులు చూస్తుంటే ఇంటికో ఉద్యోగం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలైనా ఊడిపోకుండా ఉంటె చాలు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.

ఇటీవల ఉపాధి హామీ పథకం క్రింద ఫీల్డ్​ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్న 4వేల మందిని సస్పెండ్​ చేసింది కెసిఆర్ సర్కార్. వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోంది. వారిని ఆందోళనకు గురిచేసే విధంగా సస్పెన్షన్లు మొదలుపెట్టింది. ఫీల్డ్​ అసిస్టెంట్ల కాంట్రాక్ట్​ రెన్యువల్​ కు గతంలో జారీ చేసిన సర్క్యులర్​ నంబర్​ 4779 ని రద్దు చేయాలని, హెచ్ఆర్​ పాలసీని అమలు చేయాలనే డిమాండ్లతో ఫీల్డ్​అసిస్టెంట్లు ఈ నెల 12 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వీరి సమ్మెకు రెండు రోజుల ముందే విధులకు హాజరు కాని వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలని గ్రామీణ అభివృద్ధి కమిషనర్ రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమ్మె చేస్తున్న ఫీల్ట్ అసిస్టెంట్లను ఒక్కొక్కరిగా సస్పెండ్ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే ఒక్కో జిల్లాలో 150 నుంచి 200 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.

“మా హక్కులను మేము అడగటంతో కెసిఆర్ ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేసిందని ఫీల్డ్​ అసిస్టెంట్ ఉద్యోగులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు ఏళ్ళు అయినా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కెసిఆర్ చెప్పిన మాటనే ఇంకా నిలబెట్టుకోలేదు కానీ ఉన్న ఉద్యోగులనే తొలగించడంపై కొంతమంది ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. 4779 సర్క్యులర్​ను రద్దు చేసేవరకు తమ సమ్మె కొనసాగుతుందని ఫీల్డ్​అసిస్టెంట్ల జేఏసీ నాయకుడు శ్యామలయ్య తెలిపారు.

సుప్రీం కోర్టులో జగన్ కు షాక్

సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదాను సమర్థించింది.

ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఈసీదే నిర్ణయాధికారం అని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది.

అయితే ఎన్నికల కోడ్‌ను తక్షణమే ఎత్తివేయాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు, పథకాలు చేపట్టాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.

అయితే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటించాక 4 వారాల ముందు నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.

బాహుబలి 2 క్యూలైన్ లను బీట్ చేసిన కరోనా

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ట్రేండింగ్ ను ఫాలో అవుతూ దానికి తగట్లు ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అలాంటి వర్మ ఇప్పుడు కరోనా వైరస్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా ట్వీట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు వర్మ పోస్ట్ చేసిన ఒక వీడియో పెద్ద ట్రెండీగా మారింది.

అమెరికాలో ఒక షాపింగ్ మాల్ బయట వినియోగదారులు కిలోమీటర్ల పొడవునా నిల్చొని ఉన్నారు.కరోనా వైరస్ దెబ్బతో ఎప్పుడు షాపింగ్ మాల్స్ మూసివేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారికి కావలసిన నిత్యావసరాలతో పాటు మరికొన్ని ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి ఇలా నిలబడి ఉన్నారు. దీనిపై వర్మ పోస్ట్ పెడుతూ బాహుబలి 2 సినిమా క్యూలైన్ లను కరోనా వైరస్ బీట్ చేసిందని సెటైర్స్ వేస్తూ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు.

 

ప్రధాని మోదీతో కోమటి రెడ్డి సమావేశంపై కలకలం!

తెలంగాణ కాంగ్రెస్ లో ఒక విధంగా `తిరుగుబాటు నేత’గా పేరున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలసి, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదు చేయడం ఒక వంక కాంగ్రెస్, మరోవంక బిజెపి వర్గాలలో కలకలం రేపుతున్నది. ఆయన జరిపిన సమావేశంపై గల రాజకీయ ప్రాధాన్యతపై అంచనా వేస్తున్నారు.

పిసిసి అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్న వెంకటరెడ్డి గత వారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిశారు. ఈ పదవి ఇవ్వని పక్షంలో తాను మరో మార్గం చూసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే పార్టీ నాయకత్వానికి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. బీజేపీలో చేరడమా లేదా తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నించారు. విశేషమైన ప్రజాబలం, పుష్కలంగా వనరులు గల అటువంటి వారు పార్టీలో చేరితే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భయపడిన ప్రస్తుత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అందుకు మోకాలడ్డారని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పుడు తెలంగాణలోని పార్టీ నాయకత్వంపై బిజెపి అధిష్టానానికి సహితం విసుగు వచ్చిన్నట్లున్నది. అందుకనే అందరికి ఆశ్చర్యం కలిగించే రీతిలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను రాష్ట్ర అద్యక్షకుడిగా చేశారు. అయినా రాష్ట్రంలో పార్టీ బలం పుంజుకోవాలి అంటే జనాబలం గల నాయకులు అవసరం. అందుకనే కోమటిరెడ్డి సోదరులు వస్తే బీజేపీ పుంజుకొని అవకాశం ఉంటుంది.

ఒక వంక కాంగ్రెస్ నాయకత్వానికి హెచ్చరిక సందేశం ఇస్తున్నట్లు, మరోవంక బీజేపీలో చేరడానికి మార్గం ఏర్పాటు చేసుకొనేటట్లు కోసమే వెంకటరెడ్డి ప్రధానిని కలసినన్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి నాయకులలో అనేకమంది తెరచాటున టీఆర్ఎస్ నాయకత్వంతో సంబంధాలు ఏర్పాటు చేసుకొంటూ ఉన్న సమయంలో ఆయన ప్రధానిని కలవడం ఆసక్తి కలిగిస్తున్నది. రాష్ట్రంలోని కొందరు బీజేపీ నేతల తీరుతెన్నులపై కూడా ఫిర్యాదు చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా ప్రాజెక్టుల పేరుతో బ్యాంకులు, కేంద్ర సంస్థల నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సిండికేట్ విధానంలో టీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటున్నదని ప్రధానికి ఫిర్యాదు చేయడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ తో పోరాడగల సత్తా తమకు మాత్రమే ఉన్నదనే సంకేతాన్ని సహితం రెండు పార్టీల అధినేతలకు ఇచ్చిన్నట్లు స్పష్టం అవుతున్నది.

అమరజీవి…

( పొట్టి శ్రీ రాములు గారి 120 వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం )

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడీయన.

పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది అప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా పడమటి పల్లె. ఇప్పుడు కనిగిరి తాలూకా పడమటి పల్లె ప్రకాశం జిల్లా లో ఉంది. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. అనంతరం బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివి “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే” లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసారు.అప్పటిలో అతని జీతం వెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయారు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించారు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు – మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. –

“సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు”.

1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించారు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసారు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త భయం కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు.

1946 నవంబరు 25న గాంధీ శిష్యుడు అయిన వీరు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాల లోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ ప్రకాశం గారిద్వారా శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశారు – “హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపారు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)”. –

1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేరు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవారు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యారు.

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవారు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం… పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు.

అది డిసెంబర్ 15
పొట్టి శ్రీ రాములు గారి ఆత్మార్పణ రోజు!!

ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, వారి సతీమణితో మాట్లాడలేకపోయినా… చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొని అమరజీవి అయ్యారు.

ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధాని నెహ్రూ ప్రకటన చేసారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పారు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని రాయల సీమ లోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు.

గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 నవంబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. శ్రీరాములు మరణానంతరం ఆయన కలలుకన్న మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది..,

ఈ మహనీయుని జ్ఞాపకార్థం మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడు తున్నది. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
Great men never die

ఇంటి దగ్గర నుంచి పనిచేస్తే బోనస్ కూడా!

Google fb twitter

ప్రపంచాన్ని వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు ఐటీ శాఖా ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే విధంగా ఆయా కంపెనీలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే, అలా ఇంటి దగ్గర నుంచి పనిచేసే వారికి వేతనాలతో పాటు బోనస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కొన్ని ఐటీ కంపెనీలు.

తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ బోనస్‌ ఇస్తున్నట్లు ఫేస్‌ బుక్‌ పేర్కొంది. ఉద్యోగులకు బోనస్‌ అందజేయనున్నట్లు మొదట తెలియజేసిన ఫేస్‌ బుక్‌.. ఆ విషయాన్ని సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేరుతో ఉద్యోగులకు రాసిన అంతర్గత నోట్‌ లో పూర్తి వివరాలు వెల్లడించింది.పేస్ బుక్ దాదాపు 44 వేల 900 మంది ఉద్యోగస్తులు ఉన్నారు.వారందరికీ వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది ఫేస్ బుక్ యాజమాన్యం.

మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ వంటి సంస్థలు కూడా ఫేస్ బుక్ వలె ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు సమాచారం.

జగన్ పాలనా యంత్రాంగంలో నలిగిపోతున్న అధికారులు


స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకొని, కులం పేరుతో నిందిస్తూ దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుగుబాటు ధోరణి ఆవలంభించడంతో పాలనాయంత్రాంగంలో అధికారులు నలిగి పోతున్నారు.

మరో మూడు, నాలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ కారణంగా అన్ని పక్షాలు కలిసి ఎన్నికలను వాయిదా వేసుకోగా ఇక్కడ దానిని రాజకీయ వివాదంగా మార్చి, కరోనా నివారణ చర్యల పట్ల ఉదాసీనత ప్రదర్శించడం అధికారులకు మింగుడు పడటం లేదు.

కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం ఉండగా ప్రభుత్వమే ధిక్కార ధోరణి ప్రదర్శించడం ఎటు దారితీస్తుందో అనే భయం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇద్దరు ఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు వేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిరచినప్పటికీ చివరకు అమలు చేయకతప్పలేదని వారు గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ అమలు చేయకతప్పదన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలే అధికారుల్లో గుబులుకు కారణమవుతున్నాయి. నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి కోపం, లేదంటే ఎన్నికల కమిషన్‌ చర్యలు… ఇలా మధ్యలో తాము ఇరుక్కుపోవాల్సి వస్తోరదన్న ఆందోళన వారిలో కనిపిస్తోరది.గతంలో కూడా ఎన్నికల వేళ అధికారులు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.

ప్రతి ఎన్నికల్లో ఎంతో కొంతమందిపై వేటు పడడం కనిపిస్తూనే ఉన్నదని, బాగా పనిచేసినా, చేయకపోయినా తమపై ఫిర్యాదులు రావడం ఆనవాయితీగా మారిపోయిందని, తాజా ఎన్నికల్లో ఈ పరిస్థితి మరిరత జఠిలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేయాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇప్పటివరకు అమలులోకి రాలేదు.

అమలు చేయాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా నిర్ణయాన్ని పునస్సమీక్షించు కోవాలంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖరాయడం చూస్తే బదిలీలకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న భావన వ్యక్తమవుతోరది. ఇలా ప్రభుత్వం మొండికేస్తే ఎస్‌ఇసి, ప్రభుత్వం మధ్య వివాదం మరింతగా పెరుగుతుందని, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుందని సీనియర్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

పాఠశాలలు మూసారు … బార్లు మూయరా!

కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు బంద్ పాటిస్తున్నది. పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు మూసివేశారు. సినిమాహాళ్లు, పబ్బులు, బార్లు బంద్ చేశారు. చివరకు అసెంబ్లీ సమావేశాలను సహితం కుదించివేసారు.

అనేక ఐటి కంపెనీలు సహితం ఉద్యోగులను ఆఫీస్ లకు రావద్దని అంటూ ఇంటి నుండే పనిచేయమని కోరుతున్నాయి. కానీ మద్యం షాపులు, బార్లు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. మద్యం షాపులు ప్రభుత్వ ప్రధాన ఆదాయ మార్గాలే కావడం కాకుండా, వీటిల్లో చాలావాటి యజమానులు రాజకీయంగా పలుకుబడి గలవారు, అధికార పార్టీ నేతలకు సన్నిహితులు కావడంతో ప్రభుత్వం వాటి జోలికి రావడం లేదని చెబుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్య సంస్థలు అన్నిన్నిట్నీ మూసివేయిస్తున్న ప్రభుత్వం నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం విస్మయం కలిగిస్తున్నది. ఈ సంస్థల నుండి ప్రభుత్వంలోని పెద్దలకు భారీ ముడుపులు అందుతూ ఉండడంతో వాటి విద్య వ్యాపారానికి ప్రభుత్వం అడ్డం రాదలచుకోవడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి.

ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ శాఖల ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వారి వారి ఉద్యోగులకు ఈ నెల 31 వరకు సెలవులను మంజూరు చేశాయి. కరోనా వ్యాప్తిని అరికటేందుకు ఐటీ ఉద్యోగస్థులందరు ఇంటి దగ్గర నుండే వర్క్ చేసే విధంగా తగిన ఉత్తరువులు జారీ చేశాయి. భారత్ లోని దాదాపు 10వేల ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేయవల్సిందిగా వాహన దిగ్గజ సంస్థ ఫోర్డ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ విద్యా సంస్ధ ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ఐఎస్బి) విద్యార్థులకు క్లాసులు రద్దు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను మిగిలిన క్లాసులను ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అంతే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం బ్యాంకులపై కూడా పడింది. ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకుల బోర్డు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వివిధ సంస్థలు స్వచ్చందంగా సెలవులు తీసుకోవాలని సిబ్బందిని కోరడంతో పాటు ఉద్యోగ కాంట్రాక్టులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాయి. కొత్త నియమాలు, నిబంధనలతో పనిగంటలు సాధ్యమైనంత తగ్గిస్తున్నాయి. మరోవైపు కరోనాని నియంత్రించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారులను అప్రమతం చేసింది. అదే సమయంలో పాఠశాలలు, పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఉద్యోగులకు, ఇటు విద్యార్థులకు బలవంతపు సెలవులు మంజూరు చేయడంతో జంట నగరాలలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి పోయాయి. కరోనా భయంతో ప్రజలందరు వారి వారి ఇండ్లకే పరిమితం కావడంతో పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు బోసి కొడుతున్నాయి.

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 137కరోనా కేసులు నమోదు కాగా అందులో నాలుగురు మరణించినట్లు వైద్య శాఖా వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఎవరికి వారు బాధ్యతో, నిబద్దతతో కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖా ఒక ప్రకటనలో తెలిపింది.

పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పు

ఇటీవల కాలంలో ఎన్నడూ ఎరుగని రీతిలో దేశ ఆర్ధిక వ్యవస్థ చతికలబడుతున్నది. ఏ రంగంలో కూడా చెప్పుకోదగిన ఆశాజనక వాతావరణం కనబడటం లేదు. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మొక్కుబడి చర్యలు తప్పా తగు విధంగా దృష్టి కేంద్రీకరించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రముఖ ఆర్ధిక వేత్త సుబ్రమణియన్ స్వామి మాటలలో చెప్పాలి అంటే ఆర్ధిక వయ్వహారాల గురించి తగు అవగాహన ఉన్నవారెవ్వరు ఈ ప్రభుత్వంలో ఉన్నట్లు కనిపించడం లేదు.

ఈ పరిస్థితికి తోడు కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లడిల్లిపోతున్నది. దానిహతో అసలే మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థల్ని ఈ ప్రాణాంతక మహమ్మారి మరింత కుంగదీస్తున్నది. దీంతో మాంద్యం ముప్పు పొంచి ఉందని భారత్ ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్దీపనలకు వేళైందని సూచిస్తున్నారు.

ద్రవ్యోల్బణం కట్టడి.. తయారీ రంగ వృద్ధి.. సులభతర వ్యాపార నిర్వహణ.. వినియోగ సామర్థ్యం పెంపులపై దృష్టి సారించి ఆర్థిక, ద్రవ్యపరమైన ఉద్దీపనలు అందించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెంటనే రంగంలోకి దిగాలని హెచ్చరిస్తున్నారు.

స్తంభించిన పెట్టుబడులు, మందగించిన తయారీ, నీరసించిన వ్యాపారం, పడిపోయిన వినిమయ సామర్థ్యం, తరిగిన ఆదాయం, పెరిగిన నష్టాలు… ఇదీ నేటి భారతీయ ఆర్థిక ముఖచిత్రం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కరోనా వైరస్‌.. దేశానికి ముచ్చెమటల్నే పట్టిస్తున్నది. ప్రజలు బయటకు రాలేని దుస్థితి నెలకొంటున్నది. ఫలితంగా కొనుగోళ్లు లేక అన్ని వ్యాపారాలు దిగాలుపడ్డాయి. దీంతో జీడీపీ మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏడేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో జీడీపీ 4.7 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. అందుకే పడకేసిన పారిశ్రామికోత్పత్తిని పరుగులు పెట్టించేలా నిర్ణయాలుండాలి. కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ సంబంధాలన్నీ దాదాపుగా తెగిపోయాయి. దీంతో ఇతర దేశాల నుంచి ముడి సరుకు దిగుమతులు నిలిచిపోయాయి. అందుకే దేశీయ వనరులను బలోపేతం చేసుకోవాలని ఆర్థిక, పారిశ్రామిక నిపుణులు సూచిస్తున్నారు.

ఆగిపోయిన దిగుమతులతో ఏయే రంగాలు ప్రభావితమైయ్యాయో.. ఆయా రంగాల్లో ఉత్పత్తి పుంజుకునే మార్గాలను తొలుత అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే దిగుమతులపై సుంకాల భారం తగ్గించాలని, అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులకు స్వేచ్ఛనివ్వాలని సూచిస్తున్నారు.