
ప్రపంచాన్ని వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు ఐటీ శాఖా ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే విధంగా ఆయా కంపెనీలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే, అలా ఇంటి దగ్గర నుంచి పనిచేసే వారికి వేతనాలతో పాటు బోనస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కొన్ని ఐటీ కంపెనీలు.
తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన ఉద్యోగులకు వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది. కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. వారి శ్రమను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ బోనస్ ఇస్తున్నట్లు ఫేస్ బుక్ పేర్కొంది. ఉద్యోగులకు బోనస్ అందజేయనున్నట్లు మొదట తెలియజేసిన ఫేస్ బుక్.. ఆ విషయాన్ని సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేరుతో ఉద్యోగులకు రాసిన అంతర్గత నోట్ లో పూర్తి వివరాలు వెల్లడించింది.పేస్ బుక్ దాదాపు 44 వేల 900 మంది ఉద్యోగస్తులు ఉన్నారు.వారందరికీ వెయ్యి డాలర్లు బోనస్ ప్రకటించింది ఫేస్ బుక్ యాజమాన్యం.
మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ వంటి సంస్థలు కూడా ఫేస్ బుక్ వలె ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు సమాచారం.