
‘సైరా’ వంటి భారీ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిష ఫిక్స్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో కాజల్ అగర్వాల్ ను ఫిక్స్ చేశారట. గతంలో మెగాస్టార్- కాజల్ కలసి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా భయంతో సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. తిరిగి ప్రారంభం అయ్యాక కాజల్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వచ్చే కీలక సన్నివేశాలలో చరణ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణలు, ఆక్రమణదారులపై కధానాయకుడు తిరుగుబాటు నేపథ్యంలో సినిమా సాగుతుందట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మాగ్నా ఎంటర్టైమెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.