వరుస విజయాలతో పరుసవేదిలా దూసుకు పోతున్న నటి సమంత . అక్కినేని వారి కోడలయ్యాక ప్రస్తుతం మహిళా ప్రధాన చిత్రాలకు అధిక ప్రాధాన్యత నిస్తున్న హీరోయిన్ ఆమె. సమంత అక్కినేని గత ఏడాది ఓ బేబి చిత్రంతో సూపర్ హిట్ అందుకోవడం జరిగింది . అటు తరవాత కాన్సెప్ట్ నచ్చడంతో ది ఫ్యామిలీ మేన్ టీవీ సిరీస్ లో టెర్రరిస్ట్ పాత్రలో కనపడటమే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లోనూ కస్టపడి నటించి మెప్పించింది.
కాగా.. ఇప్పుడు సమంత నటించే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రంగం సిద్ధమైంది. గతంలో నయనతారతో “మయూరి” , ” తాప్సితో “గేమ్ ఓవర్” సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ తన తదుపరి సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కించబోతున్నాడు.కాగా ఈ సినిమాలో సమంత పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. హీరో పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అందుకే ఒకనాటి తమిళ హీరో త్యాగరాజన్ కొడుకు ,అలనాటి నటుడు పేకేటి శివరాం మనవడు అయిన హీరో ప్రశాంత్ ని ఈ చిత్రంలో హీరోగా ఎన్నిక చేశారట …
తమిళం లో ” వైకాసి పొరందాచి ” వంటి హిట్ చిత్రం తో కెరీర్ ఆరంభించి ఆ తరవాత చామంతి, సిటిజెన్ , తిరుడా తిరుడా (దొంగ దొంగ), జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ ఘన విజయాలు అందుకొన్నాడు. అయితే ఈ మధ్య కాలం లో ప్రశాంత్ కి సరైన హిట్స్ లేవు. అయితే ఇప్పుడు బాలీవుడ్ చిత్రం “అంధాదున్” రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే ఇప్పుడు సమంతతో నటించడానికి ఓకే చెప్పాడట. గత ఏడాది తెలుగు చిత్రం వినయ విధేయ రామ చిత్రం లో రామ్ చరణ్ అన్నగా నటించిన ప్రశాంత్ మరలా తెలుగు ప్రేక్షకులకు హీరోగా కనిపించ బోతున్నాడు .try and try until success






రాష్ట్రంలోనే టిడిపికి బలమైన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. మొత్తం రాయలసీమలో కుప్పం నుండి చంద్రబాబునాయుడు కాకుండా టిడిపి గెలుపొందింది ఈ జిల్లా నుండే. చంద్రబాబునాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణతో పాటు ఈ జిల్లా నుండి కేశవ శాసనసభకు గత ఎన్నికలలో ఎన్నికయ్యారు.
విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ 19 పై నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అప్రమత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా.. మంత్రులు, అధికారులు ,ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిల్లో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ స్కానర్ లు ఏర్పాటు చేయాలని చెప్పింది. తప్పనిసరిగా శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని సూచించింది.
మధ్య ప్రదేశ్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించిన్నట్లు వస్తున్న కధనాల పట్ల సుప్రీం కోర్ట్ అభ్యంతరం తెలిపింది. రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరుకావచ్చునని, అయితే వారిని నిర్బంధించరాదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.




హితులు , రాజకీయ పెద్దలు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. వాటిలో మొదటిగా వచ్చేది “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ 75 శాతం పైగానే పూర్తయ్యిందట.ఇక ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వం లో మరో చిత్రానికి ఒకే చెప్పడం జరిగింది. ఖుషి ఫేమ్ ఏ ఎం రత్నం నిర్మాతగా వస్తున్నా క్రిష్ సినిమా ఫినిషింగ్ దశకు చేరుకోగానే గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.




ఒక్కోసారి సినిమా బాగోక పోయినా ఆ చిత్రంలో నటించిన హీరో , హీరోయిన్ లకు మంచి జోడీ అని పేరు వస్తుంది. వినయ విధేయ రామ చిత్ర విషయం లో కూడా అదే జరిగింది . ఆ సినిమాలో జోడీగా నటించిన రామ్ చరణ్ , కియారా అద్వానీ డాన్సులో, నటనలో సమ ఉజ్జీలుగా చేసారు. ఇపుడు ఆ జంట మరోసారి మన్ననలు పొందారు. అందుకే ఆ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకున్నా గాని మంచి వసూళ్లు రాబట్టింది.






అకస్మాత్తుగా కుమార్తె కవితను శాసన మండలి ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులను సూచిస్తున్నది. కుమారుడు కె టి రామారావుకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పి, తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాలని చూస్తున్న కేసీఆర్ అందుకు సమయం ఆసన్నమైనది భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.
జగన్ గారూ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి
ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల వాయిదా ప్రహసనం ఇంకో ఎత్తు. ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ప్రకటన విడుదలచేయటం రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం తెప్పించింది. మరుసటిరోజు అసలు నేనా ముఖ్యమంత్రి తనా అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. ఆయన ఆవేదనకు కొంత అర్థముంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి నో , ప్రధాన కార్యదర్శి నో సంప్రదించి రాష్ట్రం లో కరోనా వైరస్ పై వివరణ తీసుకుంటే బాగుండేది. ఇలా పారదర్శకంగా వ్యవహరించకపోవటం అనుమానాలకు దారితీయటం సహజం. అసలు రాష్ట్రం లో ఏ దశలో ఈ మహమ్మారి ఉందనేది ఎంక్వయిరీ కూడా చేయకుండా కేవలం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడానని చెప్పటం ఆ రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా వుంది. మనం చేసేపని నిజాయితీగా చేయటమేకాదు అలాచేసినట్లు ప్రజలు అర్ధంచేసుకొనేలా ప్రవర్తించటం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. కోర్టులు , ఎన్నికల కమిషనర్లు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలు. వాటిపై విశ్వాసం సన్నగిల్లితే ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో ఆ పదవుల్లో వున్నవారికి చాలా పెద్ద బాధ్యత ఉందని మరిచిపోకూడదు.
ఇక జగన్ మోహన రెడ్డి ప్రవర్తన ఏ మాత్రం క్షంతవ్యం కాదు. తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అధికారంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని మరిచిపోవద్దు. ఇప్పటికే సమాజం కులాలు, వర్గాలతో కొట్టుకుచస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో వుండి కులంపేరుతో రాజ్యాంగపదవిలో వున్న వ్యక్తిపై ఆరోపణలు చేయటం దారుణం. నిజంగా తనకు అనుమానమున్నా మాట్లాడకూడదు. అప్పుడే ఆ పోస్టుకి వన్నె. అయినా ఒకవేలు అవతలివైపు చూపిస్తే తనవైపు నాలుగువేళ్ళు చూపిస్తాయని మరిచిపోవద్దు. జగన్ మోహన రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత కీలక పోస్టుల్లో ఒకే సామాజికవర్గం వాళ్ళు వున్నారని పేర్లతో సహా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టటం చూస్తున్నాము. అదే పని చంద్రబాబు నాయుడు హయం లో కూడా జరిగింది. ఇందులో ఎవరూ పత్తిత్తులు కాదు. కాకపోతే మరీ బరితెగించి ఊళ్లలో అరుచుకున్నట్లు కులాన్ని పెట్టి దూషించటం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి చేయకూడదు. తన నిర్ణయంపై కోర్టు కెళ్ళటం మీకున్న అవకాశం. దాన్ని వినియోగించుకోవటం వరకు మీ కున్న హక్కు. అంతేగాని మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాలి.
సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు సహేతుకంగా వున్నాయి. ఒకవైపు ఎన్నికల కమిషన్ ని మందలిస్తూనే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్ధించింది. ఎందుకంటే ఇది అన్ని కేసుల్లో పరిష్కృతమైన తీర్పు. ఎన్నికల కమిషన్ నిర్ణయం లో కోర్టులు జోక్యం చేసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది. అదేసమయంలో ఎన్నికల కమిషన్ హుందాగా, పారదర్శకంగా ప్రవర్తించాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకపోవటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పింది. ముఖ్యమంత్రి గారూ , మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికి పరిపాలకులు. ఇప్పటికే మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాదరణ పొందాయి. స్థానిక ఎన్నికల్లో ప్రజలు మీకే బ్రహ్మరధం పడతారనేది కూడా వాస్తవం. అటువంటప్పుడు మీరు హుందాగా ఉండటానికి ప్రయత్నించండి. అంతేగాని హోదామరచి ప్రవర్తిస్తే ఇప్పుడు మీకు మద్దత్తు తెలిపే ప్రజలే వేలెత్తిచూపుతారు. మీ కేబినెట్ లో కూడా మీరు వేలెత్తి చూపే సామాజిక వర్గ మంత్రులు వున్నారు, మీకు ఓట్లు వేసిన వాళ్లలో కూడా ఆ సామాజిక వర్గ ప్రజలున్నారు. కుల సామరస్యం నెలకొల్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై వుంది. సుప్రీం కోర్టు తీర్పు సమతుల్యంగా వుంది. దేశం మొత్తం కరోనా మహమ్మారి భయంతో వుంది. దానికి సంబందించిన పనులపై పూర్తి దృష్టి పెట్టండి. సంక్షేమ పధకాల అమలుపై సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది కాబట్టి వాటిపై దృష్టి సారించండి. ఆంధ్ర సమాజం కుల, మత , ప్రాంత బేధాలనుంచి బయటపడి అందరూ ఒక్కటేనని నినదించే రోజుకు అందరం కృషిచేద్దాం.