Home Blog Page 8584

ప్లాట్‌ఫాం టికెట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఎక్కువ కావడంతో కేంద్ర, రాష్ట్ర ఆధ్వరంలోని వివిధ శాఖలు అప్రమతమౌతున్నాయి. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 250 రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ ఫాం టికెట్‌ ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50లకు పెంచుతున్నట్లు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలోని సికింద్రాబాద్‌ సహా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరను అమలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్లాట్‌ ఫాంపై రద్దీని తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధర రేపటి నుంచి అమల్లోకి రానుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పెంచిన ధర అమల్లో ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

అసత్య ప్రచారాలపై ఉక్కుపాదం

కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు. కరోనాని నియంత్రించడం కోసం ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు, పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసిందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులులందరు తమ కార్యక్రమాలన్నిటిని రద్దు చేసుకున్నారని, అత్యవసర పనుంటే తప్ప ఎవరు కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను కలవడానికి హైదరాబాద్ కు రావొద్దని విజ్ఞప్తి చేస్తూ, ఏమైనా ఇబ్బందులు ఉంటె ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటామని తెలిపారు.

ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

మరణపు అంచుల్లో నిర్భయ దోషులు!

నిర్భయ దోషులకు ఉన్న న్యాయ అవకాశాలన్నీ ముగిసిపోయాయి. క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు పునరుద్ధరించాలన్న ముకేశ్‌ సింగ్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అతడికి న్యాయపరమైన ఏ అవకాశాలు లేవని పేర్కొంది. ప్రభుత్వాలు నేరపూరిత కుట్ర, మోసానికి పాల్పడి తనను తప్పుదోవ పట్టించారంటూ ముకేశ్‌ తన తాజా పిటిషన్‌లో ఆరోపించాడు. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, తన క్యురేటివ్‌, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ ఆదేశాలను రద్దు చేయాలంటూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ ద్వారా కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, ఎంఆర్‌ షా ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. పిటిషన్‌ పరిశీలించదగినది కాదంటూ తిరస్కరించింది.

నిర్భయ దోషులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) సోమవారం ఆశ్రయించారు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరారు. అయితే ఐసీజేలో వారికి ఊరట లభించడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఐసీజే ఇలాంటి కేసుల్లో తలదూర్చదని అంటున్నారు. మరోవైపు ఐసీజే.. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందం (ఐసీసీపీఆర్‌), సార్వత్రిక ఒప్పందం ఆధారంగా పని చేస్తుంది. ఆయా నిబంధనల ప్రకారం మరణ శిక్ష విధింపుపై ఎలాంటి నిషేధం లేదు.కానీ దోషి వయసు 18 ఏండ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు, దోషి గర్భవతిగా ఉన్నప్పుడు మరణ శిక్ష విధించకూడదు. దోషికి ఉన్న న్యాయ విచారణ హక్కును పరిగణలోకి తీసుకోవాలి మొదలైన పరిమితుల మినహా ఐసీజే తలదూర్చదని అంటున్నారు న్యాయ నిపుణులు. అయితే నిర్భయ దోషుల విషయంలో ఈ నిబంధనలన్నింటినీ భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పాటించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి దోషులకున్న అన్ని అవకాశాలు అయిపోయాయి కాబట్టి మరణ శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అపర చాణిక్యుడి సెల్ఫ్ గోల్

పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోమని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. చెప్పిన కారణాలు ఏమంటే ఇప్పటికే 7 రాష్ట్రాలు ఈ తరహా తీర్మానాలు చేశాయంట. అంటే మేమేదో మజ్లీస్ మాటలకు తలూపి చేయటం లేదు, ఇప్పటికే 7 రాష్ట్రాలు చేశాయి కాబట్టి మేమూ అదేబాటన నడుస్తున్నామని చెప్పాలనే తాపత్రయం అందులో కనబడింది. అందుకే మధ్యలో మజ్లీస్ కి మాకూ అన్ని విషయాల్లో సామీప్యత ఏమీలేదనే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే మేము లౌకికతత్వానికి కట్టుబడ్డపార్టీ అనికూడా చెప్పటానికి ప్రయత్నించటం జరిగింది. ఈ బిల్లు లౌకిక తత్వానికి వ్యతిరేకం కాబట్టే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇక ఈ బిల్లు ఎంత ప్రమాదకారో చెప్పటానికి నాకు కూడా పుట్టినతేది ధ్రువపత్రం లేదని, ఇక పేదవాళ్లకు ఎక్కడినుంచి వస్తుందని ప్రశ్నించారు. అదేసమయంలో సరిహద్దుగోడ కట్టండి మద్దతిస్తామని కూడా చెప్పారు. కెసిఆర్ గారి వాదనలో ఎక్కడో కొంత భయం, తప్పుగా ఆలోచిస్తున్నాననే భావన ఉన్నట్లు కనబడుతుంది. అందుకే కేవలం మజ్లీస్ కి వత్తాసుగా మాట్లాడటం లేదని చెప్పటం , అసదుద్దీన్ ఒవైసీ , ఇతర మత పెద్దలకు మాట ఇచ్చినా మున్సిపల్ ఎన్నికలు అయ్యేదాకా నిర్ణయాన్ని వాయిదావేయటం ఇవన్నీ తనకున్న సందేహాలను చెప్పకనే చెప్పుతుంది. అదేమిటంటే ఇప్పటివరకూ ఎదురులేని తన రాజకీయ గుత్తాధిపత్యానికి ఈ చర్యతో దెబ్బతగులుతుందేమోననే భయం లోపల వుంది. బీజేపీ కి తనే చూస్తూ చూస్తూ పరోక్షంగా రాజకీయ బిక్ష పెడుతున్నానేమోననే సందేహం తొలుస్తోంది. అదేసమయంలో ఒవైసీ నుంచి వచ్చే ఒత్తిడిని ఎక్కువకాలం వాయిదావేయలేకపోవటం కూడా చివరకు తప్పని పరిస్థితుల్లో ఈ వైఖరి తీసుకునేటట్లు చేసిందని అనుకోవాలి. ఇక అసలు విషయానికొద్దాం.

పౌరసత్వ సవరణ చట్టంలో ఏముంది?

పొరసత్వ సవరణ చట్టం లో ఈ దేశ పౌరుల గురించి, లోకికతత్వాన్ని గురించి ఏమీ లేకపోవటం అందరికీ తెలిసిందే. దాన్నే రాజా సింగ్ తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఈ చట్టం వలన ఏ ఒక్క భారతీయ పౌరుడికి నష్టం జరిగినా నేను రాజకీయాలనుంచి తప్పుకొని తెలంగాణ నుంచి వెళ్లిపోతానని చెప్పాడు. తను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికీ సమాధానం చెప్పకుండానే కెసిఆర్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదింపచేసుకున్నాడు. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు పౌరసత్వ చట్టాన్ని సమర్థిస్తూనే ఎన్ ఆర్ సి ని వ్యతిరేకించారు. అలాగే ఎన్ పి ఆర్ ని పాత పద్ధతుల్లో అయితేనే ఒప్పుకుంటానన్నాడు. అంటే ప్రతిఅంశాన్ని కూలంకషంగా పరిశీలించి సి ఎ ఎ ని పూర్తిగా సమర్ధిస్తూ , ఎన్ పి ఆర్ ని షరతులతో ఆమోదిస్తూ ఎన్ ఆర్ సి ని పూర్తిగా వ్యతిరేకించాడు. కెసిఆర్ మాట్లాడినదాంట్లో స్పష్టత కరువయ్యింది. ఆయన పుట్టిన తేదీ ధ్రువపత్రం ఈ పౌరసత్వ సవరణ చట్టం అమలు అయితే ఇవ్వాల్సివుంటుందా? ఇది ప్రజల్ని తప్పుదోవపట్టించటం కాదా? అసలు ఈ చట్టం తెలంగాణా ప్రజలకి ఏ విధంగా నష్టం? బంగ్లాదేశ్, పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ నుంచి మత వేధింపులకు గురయి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పొందవచ్చు. మిగతావాళ్ల గురించి ఈచట్టం మాట్లాడలేదు. ఈ చట్టం కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని అటువంటివాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి కెసిఆర్ పనిగట్టుకొని పుట్టినతేది ధ్రువపత్రం కోసం టెన్షన్ పడాల్సిన పనిలేదు. చట్టం ఇంత స్పష్టంగా ఉంటే దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్, మజ్లీస్ కూడా పోటీపడి వాళ్ళ లౌకికతత్వం కెసిఆర్ కన్నా ఏమీ తక్కువతినలేదని చెప్పుకోవటానికి ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ లో మాట్లాడింది వింటే పౌరసత్వ సవరణ చట్టంలో వున్న ఏ క్లాజు భారతదేశ పౌరులకు నష్టం చేస్తుందో ఎక్కడా ఈ మూడుపార్టీల నాయకుల మాటల్లో విడమరిచి చెప్పలేదు, ఎప్పుడూ మాట్లాడే పడికట్టు పదజాలం ఒకరిమీద ఒకరు పోటీగా మాట్లాడటం తప్ప. రెండోది ఎన్ పి ఆర్ ( జాతీయ జనాభా రిజిస్టర్ ) లో ఎక్కడా ఎటువంటి ధ్రువపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. వివరాలు చెప్పటం మన బాధ్యత. అది మన ప్రభుత్వ పధకాల అమలుకు ఉపయోగపడుతుంది. అదనంగా ఇవ్వాల్సిన సమాచారం లో తప్పేంటో అర్ధంకావటంలేదు. మీరు కానీ, మీ తల్లిదండ్రులు కానీ ఎక్కడినుంచి వచ్చారో వివరాలు ఇవ్వటం వలన మీకొచ్చిన నష్టమేమిటో వివరిస్తారా? అంటే మీ కుటుంబ వివరాలు అడిగితే లౌకికతత్వం దెబ్బతింటుందా? ఇంత మూర్ఖంగా ఆలోచించే మేధావులు కూడా వుంటారా? ప్రతిసంవత్సరం ప్రభుత్వం విడుదలచేసే లెక్కల్లో వలస కుటుంబాలు, కార్మికులు ఎంతమందో వివరాలు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో అసంఘటిత రంగం లో ఎంతోమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర భాషల వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళందరి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే పధకాల అమలులో , ప్రణాళిక రచనలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో పేదలకు అన్యాయం ఎక్కడో చెప్పాలి. వాస్తవానికి పేదలకు న్యాయం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించి పేదలకు అన్యాయం చేసినవాళ్లు అవుతున్నారు. అయినా ఇందులో మీరు ఎటువంటి ధ్రువపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మూడోది ఎన్ సి ఆర్ ( జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ). దీనిపై వున్నదీ లేనిది కల్పించి అసత్యాలు, అపోహలు ప్రచారం చేస్తున్నారు. అసలు ఇది ఎలావుంటుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం ఇంతవరకు దీనిపై విధివిధానాలు కానీ , కనీసపు అవగాహనా సదస్సులు గానీ, కనీసం బేస్ వర్క్ కానీ మొదలుపెట్టలేదు. కేవలం అమిత్ షా వెలిబుచ్చిన అభిప్రాయం తప్ప. ఈ విషయం స్వయంగా ప్రధానే చెప్పాడు. ఎలావుంటుందో తెలియనిదాన్ని గురించి చిలవలు పలవలు అల్లి పుట్టినతేది ధ్రువపత్రం లేకపోతే పౌరులు కాకుండా పోతారని ప్రజల్లో భయాందోళనలు రెచ్చగొట్టటం కెసిఆర్ లాంటి రాజ్యాంగ పదవుల్లో వున్న వ్యక్తులకు తప్పుగా అనిపించటం లేదా? ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టటం బాధ్యతారాహిత్యం కాదా? అస్సాం లో కొన్ని చారిత్రక కారణాల వలన జరిగిన ఒప్పందాన్ని ఆధారం చేసుకొని తయారుచేసిన జాతీయ పౌరసత్వ పట్టిక కు ఈ ప్రక్రియకు సంబంధం లేదని ప్రభుత్వం పదే పదే వివరణ ఇచ్చినా ఆ పట్టిక తయారీలో లోపాలనే ఎత్తిచూపి లబ్దిపొందాలనుకోవటం ఉద్దేశపూర్వక అబద్ద ప్రచారం కాదా? ఎన్ సి ఆర్ పై వైఖరిని ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో అంశాల్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి నోట్లో శని లాగా వుంది ఈ వ్యవహారం.

దీనివెనుక అసలు ఉద్దేశం ఏమిటి?

పౌరసత్వ సవరణ చట్టం భారతీయులకు వర్తించకపోయినా ఎందుకింత ఆందోళన జరుగుతుంది? ఒక్కసారి పరిస్థితుల్ని లోతుగా పరిశీలిస్తే గానీ సమస్య అర్ధం కాదు. ఈ మూడు ఇస్లామిక్ దేశాలనుంచి వచ్చినవాళ్లలో మైనారిటీలు కానివాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించాలనేది ఇక్కడున్న ముస్లిం మత పెద్దల మనోభావం. చారిత్రక పరిస్థితులతో ముడిపెట్టకుండా అందరికీ ఇస్తే తోటి ముస్లిం సోదరులకు కూడా మేలుజరుగుతుందనేది వీళ్ళ భావన. ఇది దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వున్నముస్లిం బ్రదర్ హుడ్ సంఘీభావం. ఇకపోతే రెండో వర్గం విద్యార్థులు, ఉదారవాదులు. వీళ్ళ ఉద్దేశాన్ని శంకించాల్సిన అవసరం లేదు. కాకపోతే చరిత్ర లో తప్పులు జరిగినా ప్రస్తుతం అందరినీ సమభావం తో చూడాలనే వాదన. వామపక్ష తీవ్రవాదం వీళ్లపై ప్రభావం చూపుతుంది. ఇక మూడో వర్గం రాజకీయవర్గం. వీళ్ళు అవకాశవాదులు. ఏ ఎండకా గొడుగు పట్టగలరు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒకమాట, అధికారం లో వున్నప్పుడు ఇంకోమాట మాట్లాడగల మాటకారులు. బెంగాల్ లోని ఈ బంగ్లాదేశ్ శరణార్ధులకు పౌరసత్వం కల్పించాలని ఒకనాడు పార్లమెంటు లో బయటా మాట్లాడినవాళ్ళే ఇప్పుడు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముమ్మూరు తలాక్ చట్టం విషయం లో కుంటిసాకులు చెప్పి వ్యతిరేకించినట్లే ఇప్పుడూ లౌకికతత్వం పేరుతో ముస్లింలను రెచ్చగొడుతున్నారు. ఈ వర్గం మాటల్ని పట్టించుకోవాల్సిన పనిలేదు. రెండోవర్గం లోని విద్యార్థులకు చారిత్రక నేపధ్యాన్ని వివరించి దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఇక మొదటివర్గం అసలు లౌకిక వాదాన్ని నమ్మని వర్గం. ఏ మాత్రం అవకాశం దొరికితే షరియత్ చట్టాన్ని అమలుచేయాలనే వర్గం. ముస్లిం ప్రజానీకంలో ఆధునిక భావాలు వ్యాప్తిచెందకుండా మత మౌఢ్యం వైపు నడిపించాలని తాపత్రయం పడుతున్న , ఇప్పటికీ ముస్లిం ప్రజల్లో పట్టున్న వర్గం. భారత ఉపఖండం లో ప్రఢవిల్లిన సూఫీ విశ్వాసాన్ని దెబ్బతీస్తూ గత రెండు, మూడు దశాబ్దాల్లో వ్యాప్తిచెందుతున్నవహాబీజం ప్రభావం వీరిపై ఎక్కువగా వుంది. ఈవర్గం ముస్లిం ప్రజానీకాన్ని ఇంకా వెనక్కు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. ముస్లింలలో వున్న అభ్యుదయ , ఉదారవాదులు ( ఎంత తక్కువమంది వున్నా ) ఈ మారుతున్న పరిణామాలను గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. షహీన్ బాగ్ నిరసనల వెనక ఈ మూడువర్గాల ప్రజలు వున్నారు. పౌరసత్వ సవరణ చట్టం లో భారతీయ ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని వీళ్ళందరికీ తెలుసు. అయినా ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే దీన్ని అడ్డంపెట్టుకొని ముస్లిం లలో ‘ చైతన్యం, సంఘటితం ‘ తీసుకురావాలనే వాళ్ళు, నిజంగానే వివక్ష ఉండకూడదనే వాళ్ళు, దీన్ని అవకాశంగా తీసుకొని మోడీకి వ్యతిరేకంగా రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వాళ్ళు ఎవరి ప్రయోజనాలు వారివి. చివరకిది రెండువైపులా ఉద్రిక్తతలు పెరిగి ఢిల్లీ అల్లర్లకు దారితీయటం మనందరికీ తెలిసిందే.

కెసిఆర్ పప్పులో కాలేశాడా?

మరి ఇందులో కెసిఆర్ లాంటి రాజకీయ చాణుక్యుల ఉద్దేశాలేంటి? నిజం చెప్పాలంటే తను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లయింది. ఓట్లకోసం మజ్లీస్ తో అంటకాగి ఇన్నాళ్లు నడిచినతర్వాత వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. నిజానికి కెసిఆర్ కి ఇప్పుడు మజ్లీస్ మద్దత్తు లేకపోయినా తనకొచ్చిన ముప్పేమీలేదు. అధికారం లోకి వచ్చిన కొత్తలో ఆ అవసరం ఉందికాని ఇప్పుడు ఆ బంధమే గుదిబండ అయ్యింది. ఒవైసీ సోదరులను పక్కన పెట్టుకొని లౌకికవాదం గురించి మాట్లాడుతుంటే వినేవాళ్లకు వెగటుగా వుంది. ఇదే అక్బరుద్దీన్ ఒవైసీ ఒకనాడు నిర్మల్ సభలో మాట్లాడింది ప్రజలు మర్చిపోలేదు. అలాగే నిన్నటికి నిన్న ఇంకో మజ్లీస్ నాయకుడు వారిస్ పఠాన్ కలబుర్గిలో మాట్లాడింది ప్రజలకు గుర్తే వుంది. కెసిఆర్ గారు ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కపిల్ మిశ్ర , అనురాగ్ ఠాకూర్ గురించి ఉటంకించాడు కాని వారిస్ పఠాన్ గురించి మాట్లాడలేదు. కపిల్ మిశ్రా , అనురాగ్ ఠాకూర్లది ఎంత తప్పో అమానుతుల్లా ఖాన్, వారిస్ పఠాన్లు మాట్లాడింది కూడా అంతే తప్పు. లౌకికవాదమంటే ఒకర్ని విమర్శించి రెండోవాళ్ళను వెనకేసుకోవటం కాదు. సభలోనే అక్బరుద్దీన్ ని మీ పార్టీ కూడా పద్ధతులు మార్చుకోమని చెప్పుంటే ప్రజలు కెసిఆర్ లౌకిక వాదాన్ని హర్షించేవాళ్ళు. ఇందులో కెసిఆర్ పప్పులో కాలేసాడనే అనిపిస్తుంది. కుహనా లౌకికవాదం పేరుతో బీజేపీ ప్రచారం చేయటానికి కెసిఆర్ ఈ తీర్మానంతో పెద్ద అస్త్రమే ఇచ్చాడనిపిస్తుంది. ఎంతపెద్దవాళ్లయినా ఎక్కడో అక్కడ పప్పులో కాలేస్తారంటే ఇదేమరి. ఇప్పటికైనా సమయం మించిపోయిందిలేదు. ఇప్పటికైనా ఎంతతొందరగా మజ్లిస్ తో తెగతెంపులు చేసుకుంటే అంత మంచిది. లేకపోతే మొదటికే మోసమొస్తుంది కెసిఆర్ గారూ , తస్మాత్ జాగ్రత్త.

జూనియర్ ఆర్టిస్ట్ పై లావణ్య కేసు.. కారణం ఇదే..

సోషల్ మీడియా లో పాపులర్ అవ్వడానికి కొంతమంది పిచ్చిపిచ్చి పనులు చేస్తుండటం మనం చూస్తున్నదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్ లో సునిశిత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ తెగ ట్రెండ్ అవుతున్నాడు. ప్రతి విషయంలో తనకు అవగాహన ఉందని, బాహుబలి సినిమాలో పాటలు పాడానని, తనకు అన్ని విషయాలు తెలుసు చెప్తూ పాపులర్ కావడానికి ఒకదానితో మరొకటి సంబంధం లేని విషయాలను గురించి మాట్లాడుతూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాడు. పాపులర్ కావాలి అనుకోవడం మంచిదే. కానీ, అవసరం లేని విషయాలను గురించి కూడా ఏదో కావాలి అనుకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.

ఇటీవలే కొన్ని యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ, లావణ్య త్రిపాఠికి వివాహం జరిగిందని మాట్లాడాడు. అంతేకాదు, లావణ్యతో ఎఫైర్ ఉందని, తమన్నాతో కూడా ఎఫైర్ ఉందని సునిశిత్ మాట్లాడాడని చెప్పి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. నటి లావణ్య ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. గతంలో ఈ జూనియర్ ఆర్టిస్ట్ నటుడు, యాంకర్ ప్రదీప్ పై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సరిహద్దుల్లో కూడా మూత బడ్డ థియేటర్లు

ఒక పక్క కరోనా దెబ్బకి దేశంలోని పలు రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేస్తుండగా తమిళనాడు మాత్రం ఇంకా బింకంగా తెరిచే ఉంచింది. అయినా దానివల్ల ఉపయోగం ఏమి కనపడటం లేదు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమ కుదేలవ్వగా మన పొరుగున ఉన్న కోలీవుడ్ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దానికి ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు.. తమిళనాడులో ఈ శని, ఆదివారాలలో థియేటర్స్ జనం లేక వెల వెల పోయాయి. మిగతా రోజులలో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు కనిపించనప్పటికీ వీకెండ్ లో అధికంగా కనిపిస్తారు. అలాంటిది కరోనా కారణంగా అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సరిహద్దులను ఆనుకొని ఉన్న 16 జిల్లాలోని థియేటర్స్ మూసివేశారు. తేనీ, కన్యాకుమారి, తిరుప్పూరు, కోయంబత్తూరు, నీలగిరి, కృష్ణగిరి, తిరునెల్వేలి, తెన్కాశి, తిరువళ్ళూరు, వేలూర్‌, తిరుపత్తూరు, రాణిపేట, ఈరోడ్‌, దిండుక్కల్‌, ధర్మపురి, విరుదునగర్‌ జిల్లాల్లోని అన్ని థియేటర్లలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో సగం తమిళ నాడులో సినిమా పరిశ్రమ కుంటువడింది. ఇక ఇలాంటి టైం లో తమ చిత్రాలకు కలెక్షన్ రాదని తెలుసుకొన్నతమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, ఆవారా ఫేమ్ కార్తీ లు నటించిన భారీ చిత్రాలు కోబ్రా, సుల్తాన్ వాయిదా వేయక తప్పలేదు.
Think before you leap

బీ అలెర్ట్:బ్యాంకులకు కూడా సెలవులు!

ప్రతిరోజు ఏదో ఒకపనిమీద బ్యాంకు కి వెళ్లేవారు అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది.నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేవారం మొదటి రెండ రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనుండగా.. ఆ తర్వాత పండుగ.. ఆ తర్వాత బ్యాంకుల సమ్మె, నాల్గో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు.. అంటే మొత్తంగా ఒకే వారంలో నాలుగు రోజులు బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి.

వచ్చేవారంలో సోమవారం, మంగళవారం బ్యాంకులు యథావిథిగా పనిచేయనుండగా.. ఇక, బుధవారం రోజు ఉగాది సందర్భంగా సెలువు.. మరుసటి రోజు గురువారం బ్యాంకులు పనిచేసినా… బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో శుక్రవారం, నాల్గో శనివారం కావడంతో అది సెలవు, ఆ తర్వాత ఆదివారం ఇలా.. వచ్చేవారం 25వ తేదీ, 27, 28, 29 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు లావాదీలపై ఎక్కువగా ఆధారపడేవాళ్లు ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది.

నో కరోనా అంటున్న హీరో

ఎల్విస్ ప్రీస్లీ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న హాలీవుడ్ చిత్రం కోసం ఆస్ట్రేలియా వెళ్లి కరోనా బారిన పడ్డ టామ్ హాంక్స్ అతని భార్య ఇపుడు క్షేమంగా ఉన్నారన్నవార్తలొస్తున్నాయి.

హాలీవుడ్ సీనియర్ హీరో టామ్ హాంక్స్ అతని భార్య రీటా విల్సన్ పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవల టామ్ హాంక్స్ తన భార్యతో కలిసి షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సంధర్భంలో వీరికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.. వైద్య పరీక్షల అనంతరం వీరిని ఐసొలేషన్ వార్డుకి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. కాగా టామ్ హాంక్స్ దంపతులు కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

టామ్ హాంక్స్ అనేక గొప్ప హాలీవుడ్ చిత్రాలలో నటించారు. టామ్ హాంక్స్ నటించిన చిత్రాల్లో ఫారెస్ట్ గంప్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, కాస్ట్ అవే వంటి చిత్రాలు ఆయనకు యెనలేని పేరు తెచ్చాయి. ఆయన నటించిన బెస్ట్ మూవీస్ లో ఒకటైన ఫారెస్ట్ గంప్ ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
Brave people never die

జగన్ కు షాక్ ఇచ్చిన రమేష్ కుమార్

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు కులం, ఇతర అపవాదులను ఎండగడుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ `చెంపపెట్టు’ వంటి సమాధానం చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను ప్రబలకుండా ప్రభుత్వం కట్టడి చేస్తున్న దృష్ట్యా ఎన్నికల వాయిదాను ఉపసంహరించు కోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
వ్రాసిన లేఖకు ఘాటుగా స్పందించారు.

ముఖ్యమంత్రి తనపై చేసిన తీవ్రమైన ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్ తోపాటు తనపై వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూన్నట్లు స్పష్టం చేశారు. మూడు పేజీలతో కూడిన లేఖలో జగన్ చేసిన ప్రతి ఆరోపణకు ధీటైన సమాధానం చెప్పారు.

తాను ఎవ్వరిని సంప్రదించకుండా కరోనా వైరస్ ప్రభావం చూపానని చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ కార్యదర్శితో తాను తరచూ సంప్రదిస్తూ ఉన్నానని, ప్రభుత్వ ప్రధాన కారాదర్శిని కూడా సంప్రదింపమని సూచించానని స్పష్టం చేశారు.

ఎన్నికల వాయిదాను కేంద్ర టాస్క్ ఫోర్స్ కు నివేదించి, ఎన్నికలు నిర్వహించవచ్చని వారు చెబితే తాను తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తానని అంటూ ఒక విధంగా సవాల్ చేసే ధోరణిలో పేర్కొన్నారు. పైగా, తాను ఈ నిర్మాణమే తీసుకున్న తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేశారని గుర్తు చేశారు.

మార్చ్ చివరిలోగా ఎన్నికలు జరపని పక్షంలో 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం నుండి రావలసిన రూ 5,000 కోట్ల నిధులు కోల్పోతామని జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా తిప్పికొట్టారు. ఎన్నికలు వాయిదా వేయడం ద్వారా కేంద్ర నిధులు ఆగిపోతాయన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎన్నికలు ఆలస్యం అయిన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెండింగ్ నిధులు తెచ్చుకోవచ్చని సూచించారు.

గతంలో రాజ్ భవన్‌లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని, ఆర్థిక వ్యవహారాలపై తనకు పృథి అవగాహన ఉందని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ నిధులను పొందడంలో తాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించ గలనని భరోసా ఇచ్చారు. ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదని చెబుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

భీష్మా డైరెక్టర్ కు మహేష్ బంపర్ ఆఫర్

‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన దర్శకుడు వెంకీ కుడుముల.. మొదటిసినిమాతోనే మంచి విజయం సాధించాడు, చాలా గ్యాప్ తరువాత ‘భీష్మ’ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ దర్శకుడికి స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ వచ్చింది. అందులో భాగంగానే చాలా మంది హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ దర్శకుడికి సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

తాజాగా మహేష్ బాబు భీష్మ సినిమాని వీక్షించారు. ఈ సినిమా బాగా నచ్చడంతో మహేష్ బాబు వెంకీ టేకింగ్ తో తనకు సెట్ అయ్యేలా ఓ మంచి కథను కూడా సిద్ధం చెయ్యమన్నాడు అని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వెంకీ అదే పనిలో ఉన్నాడట! ఇదే నిజమైతే మహేష్ ని డైరెక్ట్ చేసే రోజు వెంకీకి దగ్గరలోనే ఉందన్నమాట!

ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలో సినిమా పట్టలేక్కనుంది.

కరోనా పై మహేష్ బాబు స్పందన

కరోనా వైరస్ సరి వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. కరోనా పేరు చెప్తే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే దేశంలో 123 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అటు ప్రభుత్వాలు, ఇటు సెలబ్రెటీలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కరోనా పై అపోహలు వద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి ఒక వీడియో ద్వారా జాగ్రత్తలను వివరించారు. తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది కష్టకాలం అని, ప్రజారోగ్యం దృష్ట్యా మనం సామజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం అని, రద్దీ గా ఉండే ప్రాంతాలలో గుంపులుగా ఉండే ప్రజలపై కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుందని , కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు బయటకు వెళ్ళకుండా తమఇంట్లో నే ఉండాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

 

https://www.instagram.com/p/B90tz6unroJ/?utm_source=ig_web_copy_link

Sonam Kapoor Hot Photos

జగన్ దెబ్బతో ఉన్నతాధికారులు విలవిల!

ఏపీ సీఎం జగన్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లో మూడు ఉన్నతమైన పదవులలో ఉన్న వ్యక్తులపై వేటు పడింది. 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఆ మరుసటి నెల(ఫిబ్రవరి)లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రతిపాదనలో ఏపీ శాసనమండలి అడ్డుపడటంతో దానిని రద్దు చేయడానికి బిల్లు ప్రవేశపెట్టగా..133 మంది సభ్యులు మండలి రద్దు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. 2020 స్థానిక ఎన్నికల ఎన్నికలను వాయిదా వేయడంతో ఎస్ఈసి రమేష్ కుమార్ పై వేటు వేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది.

దేశ రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన శాసనమండలి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ల పై వేటు వేయడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవర్గం ప్రజలు జగన్ నిర్ణయానికి మద్దతిస్తుంది, మరోవర్గం ప్రజలు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

Aahana Kumra Poses for FHM India Cover

ప్రభాస్20 మూవీ లేటెస్ట్ అప్ డేట్

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రభాస్ 20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ సెట్స్ లో రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జార్జియా లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో ఒక ఛేజ్ సీన్ ను, ప్రభ, పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.

ప్రభాస్ 20 మూవీ జార్జియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని, ఈ షూటింగ్ షెడ్యూల్ తొందరగా కంప్లీట్ చేసేందుకు సహకరించిన జార్జియా టీమ్ కు థ్యాంక్స్ అని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ప్రభాస్ 20 మూవీ మరొక షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ దసరా పండగ కు రిలీజ్ కానుందని సమాచారం. మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ఉగాది పండగకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

కరోనా పై న్టీఆర్, రామ్ చరణ్ సూచనలు

చాలా కాలం తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి మీడియా ముందుకు వచ్చారు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహనా పెంచేందుకు… కరోనా బారీన పడకుండా ఉండేందుకు ఈ వీడియో ద్వారా చరణ్, ఎన్టీఆర్ ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు పాటిస్తే కోవిడ్ 19 వైరస్ బారీన పడకుండా ఉండొచ్చు అని తెలిపారు. చేతులు మోచేతివరకు సబ్బుతో కడగడం, కరోనా వైరస్ తగ్గేవరకు తెలిసిన వారిని కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలని.. చెప్పారు. అంతేకాదు వేడి సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని నమ్మొద్దని. తెలిపారు.

 

https://www.youtube.com/watch?v=is6R2CMThyc