కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించు కోవాలో అన్న విషయం లో టాలీవుడ్ తారలు చాలా రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తున్నారు. తమ వంతుగా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పై జనాలకు మెసేజ్ లు ఇస్తున్నారు. సినీ ఇండస్ట్రీ అనేది జనాకర్షణ కలిగిన పరిశ్రమ. సినీ తారలు ఏమి చెప్పినా ఇట్టే జనాల్లోకి వెళ్లిపోతుంటుంది. అందుకే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పై ఎన్టీఆర్, రాంచరణ్ లు స్పెషల్ గా ఓ వీడియోను చేసి పోస్ట్ చేశారు. తాజాగా రామ్ చరణ్ ఈ నెల 27 వ తారీఖున జరగాల్సిన తన బర్త్ డే వేడుకల్ని రద్దు చేసుకోవాలంటూ అభిమానులకు ఒక సందేశం పంపడం జరిగింది.
అలాగే టాలీవుడ్లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు లు కూడా తమదైన శైలిలో ప్రజలకు హెచ్చరికలు చేశారు.
ప్రభాస్ .. ” ఇది చాలా కష్టమైన పరిస్థితి.. అయినప్పటికీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కరోనా వైరస్ నుండీ అందరం జాగ్రత్తగా ఉందాం. దానిని ఎదుకోవడానికి కావాల్సిన పద్ధతుల్ని పాటిద్దాం” అంటూ తన ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నాడు.
ఇక ప్రిన్స్ మహేష్ బాబు.. “కరోనా వైరస్ నుండీ మనల్ని మనం కాపాడుకోవడానికి.. అందరూ సామాజికంగా దూరం పాటించాల్సిన టైం వచ్చింది. అందరం మన ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కష్టమే కానీ పాటించక తప్పదు” అంటూ సునిశితంగా హెచ్చరించాడు.
ప్రముఖ యువ హాస్య నటుడు ప్రియదర్శి ఇటీవలే ప్రభాస్ చిత్రం షూటింగ్ కోసం కొన్ని రోజుల క్రితం యూనిట్ తో కలిసి జార్జియా వెళ్ళాడు .అక్కడి షెడ్యూల్ పూర్తికావడంతో టీమ్ మొత్తం ఇండియా తిరిగి వచ్చారు..కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాల నుండి ఇండియాకు వచ్చే ప్రయాణీకులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అనంతరం వారంతా ఇళ్లకు చేరుకున్నాక 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా ప్రభుత్వ వైద్యుల సూచన మేరకే ప్రియదర్శి 14 రోజుల వరకు ఇంటికే పరిమితమవ్వాలని నిర్ణయం తీసుకుని తన సామాజిక భాద్యత నిర్వర్తిస్తున్నాడు. ఇతరుల ఆరోగ్యం దృష్ట్యా ఈ డెసిషన్ తీసుకున్నట్టు ప్రియదర్శి తెలిపారు.
హీరో మంచు మనోజ్ అయితే తన నివాసం ఇంటి చుట్టుపక్కల ఉండేవారికి తన భాద్యతగా శానిటైజర్స్, మాస్కులను పంచుతున్నారు ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు ఈనెల 19న ఘనంగా జరగాల్సిన తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. తిరుపతి వేదికగా ఆయన నెలకొల్పిన శ్రీ విద్యా నికేతన్ వార్షికోత్సవాన్ని తన జన్మదినం నాడు ఘనంగా నిర్వహిస్తారు. కానీ కరోనా వైరస్ విపత్తు కారణం గా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.