Home Blog Page 8523

రాజమౌళి ఛాలెంజ్ పూర్తిచేసిన రాంచరణ్


టాలీవుడ్ ఇండస్ట్రీలో Be The Real Man Challenge వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్ వంగా మొదలెట్టిన ఈ ఛాలెంజ్ ను సెలబ్రెటీలు హుషారుగా కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన సినీతారలకు ఈ ఛాలెంజ్ మంచి ఉత్సాహాన్నిస్తోంది. ఇంటి పనుల్లో మగవాళ్లు భాగస్వాములు కావాలనేది ఈ కాన్సెప్ట్ ఉద్దేశ్యం. తొలుత సందీప్ వంగా దర్శక దిగ్గజం రాజమౌళికి ఛాలెంజ్ విసిరి మరికొందరిని నామినేషన్ చేయాలని కోరాడు. దీనికి స్పందించిన రాజమౌళి ఇంటి పనులు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీనిలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్లను నామినేట్ చేశాడు.

ఏపీలో వారికి రూ. 5 వేలు సాయం!

రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం చీపురు పట్టి ఇల్లు క్లీన్ చేశాడు. వంట గిన్నెలు క్లీన్ చేస్తూ.. బయట చెత్తను తుడిచి శుభ్రం చేస్తున్న వీడియోను ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందాం..’ అంటూ అద్భుతమైన సందేశాన్ని పోస్టు చేశాడు. అలాగే ఈ ఛాలెంజ్ కు తన బాబాయ్ బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, దర్శకుడు కొరటాల శివలను నామినేట్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా రాంచరణ్ కూడా రాజమౌళి ఛాలెంజ్ పూర్తి చేశాడు.

కొత్త పనిష్మెంట్ ఇస్తున్న బెజవాడ పోలీసులు!

రామ్ చరణ్ ఇంట్లో బట్టలు సర్దడంతోపాటు మాప్‌తో ఫ్లోర్ క్లీన్ చేశాడు. మొక్కలకు నీళ్లు పోసి అనంతరం భార్య ఉపాసనకు కాఫీ పెట్టిచ్చాడు. ఈ వీడియో తన ట్వీటర్లో పోస్టు చేసి అభిమానులో పంచుకున్నాడు. తన తరుఫున దర్శకుడు త్రివిక్రమ్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, రానా దగ్గుబాటి, శర్వానంద్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నేను సమంతలా కాదంటున్న మెగా డాటర్!


కరోనా ఎఫెక్ట్ తో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సెలబెట్రీలు తమ సోషల్ మీడియాలో తమ క్వారంటైన్ అనుభవాలను అభిమానులతో పంచుకుంటారు. మెగా డాటార్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులతో తన ముచ్చట్లను పంచుకుంటోంది. తాజాగా యాంకర్ రవితో కలిసి ఇన్ స్ట్రాగ్రామ్ లైవ్లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. తన సినిమా ముచ్చట్లతో పెళ్లి విషయాలపై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఏపీలో వారికి రూ. 5 వేలు సాయం!

పెళ్లాయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా? అని అడిగిన ఓ నెటిజన్ ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. ‘నేనేమీ సమంతను కాదు.. పెళ్లి తర్వాత నటిస్తానో.. నటించలేనో ముందుగానే చెప్పలేనంటూ సమాధానం ఇచ్చింది. అక్కినేని కోడలిపై మెగాడాటర్ కామెంట్ చేయడంతో నిహారిక చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా తన వద్దకు వచ్చే మంచి కథలను ఓకే చేస్తానని.. గ్లామర్ పాత్రల్లో నటించేందుకు వెనుకడబోయేది లేదని స్పష్టం చేసింది.

ర్యాపిడ్ టెస్టింగ్‌ కిట్స్‌ పని తీరు పై సంచలన వార్త!

‘ఒక మనస్సు’ మూవీతో నిహారిక ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించిన ఆమె స్థాయికి తగిన విజయం మాత్రం దక్కలేదు. ఇటీవల మెగాస్టార్ నటించిన ‘సైరా’లో నిహారిక కన్పించిప్పటికీ అది ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఖాళీ సమయంలో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి దృష్టి తనవైపు తిప్పుకుంటోంది. ఇక తాను ఓ తమిళ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పింది. గోవాలోని అందమైన లోకేషన్లలో ఈ మూవీ షూటింగ్ చిత్రీకరించినట్లు తెలిపింది. గోవా బీచ్లో మంచి రోమాంటిక్స్ సీన్ ఉంటాయని చెప్పింది.

కెరీర్ తొలినాళ్లలో సంప్రదాయక పద్ధతిలో కన్పించిన నిహారిక సినిమా ఆఫర్లు తగ్గడంతో గ్లామర్ రూట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిహారిక గ్లామర్ ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

ర్యాపిడ్ టెస్టింగ్‌ కిట్స్‌ పని తీరుపై సంచలన వార్త!

దేశం వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తక్కువ సమయంలోనే కరోనా ఫలితాలు వస్తాయని..వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించుకుంటున్నాయి. తద్వారా ఎక్కువ మందికి పరీక్షలు చేసే అవకాశముంటుందని భావిస్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఏపీతో పాటు పలు ప్రభుత్వాలు ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకొని పరీక్షలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం సౌత్ కొరియా నుంచి 5 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్ల దిగుమతికి ఆర్డర్ ఇచ్చింది.

కరోనా వైరస్‌ ను నిర్ధారించడానికి ర్యాపిడ్ టెస్టింగ్‌ కిట్స్‌ తో చేస్తున్న పరీక్ష ఫలితాల్లో కచ్చితత్వం లోపిస్తోందని రాజస్థాన్‌ ప్రభుత్వం
సంచలన వార్తను వెలువరించింది. ఈ సమస్యను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. ఫలితాల్లో 90 శాతం కచ్చితత్వం వస్తుందని అంచనా వేస్తే.. కేవలం 5.4 శాతం వస్తోందని, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రఘు శర్మ అన్నారు.

‘‘సలహా కమిటీ సూచనల మేరకు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను వినియోగించడాన్ని నిలిపివేశాం. ఐసీఎంఆర్‌కు ఈ సమస్య గురించి తెలియజేశాం. వారి నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని శర్మ తెలిపారు. పీసీఆర్‌తో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకిందని తేలిన వారికి ర్యాపిడ్‌ కిట్స్‌ తో పరీక్షలు నిర్వహించామని, కానీ ఫలితాల్లో నెగిటివ్‌ అని వస్తోందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌ నుంచి స్పందన సానుకూలంగా వస్తే, కిట్స్‌ను తిరిగి వెనక్కి పంపిస్తామని వెల్లడించారు. రాజస్థాన్‌లోని హాట్‌ స్పాట్స్‌ లో శుక్రవారం నుంచి ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్స్‌‌ కిట్స్‌ తో పరీక్షలు నిర్వహిస్తోంది.

రాజస్థాన్‌ లో ఇప్పటి వరకు 1628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 97 మంది కోలుకోగా.. 25 మంది మరణించారు. ప్రస్తుతం రాజస్థాన్‌ లో 1505 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

తరలింపును ఆపే శక్తి ఎవ్వరికీ లేదు!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కీలకనేత విజయసాయిరెడ్డి నవ్యాంధ్ర రాజధానులపై మరోసారి కీలక ప్రకటన చేశారు. అమరావతి నుంచి రాజధాని మార్చొద్దని రైతులు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు వారు 125 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఇళ్లకే పరిమితమై రాజధాని ప్రాంత రైతులు, కూలీలు వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో నేత ఒకరు కరోనా నేపథ్యంలో రాజధాని తరలింపు విషయంలో ముందుకు వెళ్లవద్దని సీఎంకు సూచనలు చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో నేపధ్యంలో రాజధాని తరలింపు ఉండదని రాజధాని వాసులు భావిస్తున్న సమయంలో వైసీపీ కీలక నేత విజయసాయి విశాఖపట్నంలో రాజధాని తరలింపుపై ప్రకటన చేశారు.

విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుందని, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని స్పష్టం చేశారు. అది ఎప్పుడు అన్నది త్వరలో నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. మంగళవారం విశాఖలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ సుజనా వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. కన్నా వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. కాణిపాకమే కాదు.. వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానాని చెప్పారు. అవినీతికి పాల్పడలేదని కన్నా, సుజనా చౌదరి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.

సుజనాచౌదరి బోగస్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ ఓ అవినీతిపరుడని, రూ.20 కోట్లకు అమ్ముడుపోయారనే విషయాన్నీ తాను మరోమారు స్పష్టం చేస్తున్నానని చెప్పారు. కన్నా లాంటివాళ్లు.. ప్రశ్నించేందుకు అనర్హులు అని చెప్పారు.

లాక్ డౌన్లోనూ.. ఆ ఎమ్మెల్యే ప్రచారార్భాటం!

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించి నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న 8 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఈ వ్యవహారంతో అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టారు. ఈ విషయంపై సీఎం సమాధానం చెప్పాలని విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే, పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమెపై పూలు చల్లుతుండగా, ఆమె ముందుకు కదిలారు. ఆమెతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు కలిసి వెళ్లారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నడిచే దారిలో పూలు జల్లించుకోవడం ఆమె పిచ్చికి పరాకాష్టగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.

దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విపక్ష నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబడుతున్నారు. రోజా తీరుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు. అధికార పక్షానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇదే తీరుతో వ్యవహరించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది.

తెలంగాణలో మృతుల సంఖ్య కుదించే ప్రయత్నం!


కరోనా వైరస్ లేని రాష్ట్రంగా తెలంగాణ మారడానికి కేసీఆర్ స్వయంగా ఇస్తున్న పలు డెడ్ లైన్ లు దాటి పోతున్నా వైరస్ కట్టడి కనిపించక పోవడంతో వైరస్ తీవ్రతను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తాజాగా, దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా లక్షణాలతో మరణించిన వారికి వైరస్ టెస్టులు చేయించొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

ఈ మేరకు అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు, దవాఖానాల సూపరింటెండెంట్లకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాల నుంచి కరోనా టెస్టుల కోసం శాంపిల్స్ సేకరించవద్దని అందులో స్పష్టం చేశారు.

కరోనా లక్షణాలతో చనిపోతే ‘కరోనా పాజిటివ్‌ (డీమ్డ్ టు బీ పాజిటివ్‌)’గానే భావించాలని సూచించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు పాటించిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌నే వాళ్లకూ వర్తింపజేయనున్నారు. అయితే వెంటనే కరోనా మృతుల జాబితాలో మాత్రం కలపవద్దని స్పష్టం చేశారు.

ఆ తర్వాత సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు, సన్నిహితులను క్వారంటైన్‌‌‌‌చేసి టెస్టులు చేయాలని నిర్ణయించారు. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే మాత్రమే ఆ మరణాన్ని కరోనా మృతుల జాబితాలో కలపాలని నిర్ణయించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది చనిపోయారు. అందులో సుమారు పది మందికి మరణించాక చేసిన టెస్టుల్లోనే పాజిటివ్‌గా తేరినవారు కావడం గమనార్హం. తర్వాత వారి కుటుంబ సభ్యులకు టెస్టులు చేస్తే.. పాజిటివ్ గా బయటపడింది.

హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళ మరణించాక చేసిన టెస్టుల్లో కరోనా ఉన్నట్టు తేలింది. ఆమె కుటుంబ సభ్యుల్లో ఏకంగా 13 మందికి వైరస్ పాజిటివ్‌ వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. చనిపోయినవాళ్లకు టెస్టులు చేయొద్దన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు.

కొత్త పనిష్మెంట్ ఇస్తున్న బెజవాడ పోలీసులు!

విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షలను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. 9 గంటల తరువాత సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వారిని గుర్తించి వినూత్న రీతిలో శిక్షిస్తున్నారు. ‘మరో మారు తప్పు చేయను. ఇంకెప్పుడు అవసరం లేకుండా బయటకు రాను’ అని 500 సార్లు రాయించుతున్నారు. ఇందుకు అవసరమైన పేపర్లు, పెన్నులు పోలీసులే అందిస్తున్నారు.

నిన్న సత్తెనపల్లిలో జరిగిన ఘటనతో పోలీసులు కాస్త కఠిన్యాన్ని తాగించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండానే వారిలో అవగాహన కలిగించేందుకు ఎటువంటి శిక్షలు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కృష్ణ జిల్లాలో 83 మంది వైరస్ బారిన పడగా అందులో మెజారిటీ కేసుల వరకు విజయవాడ నగరంలో ఉన్నాయి. పాయకపురం, రాణిగారితోట, మాచవరం, సీతారమపురం, విద్యాధరపురం, కుద్దుస్ నగర్, బందరు రోడ్డు తదితర ప్రాంతాలను రెడ్ జోన్ లుగా అధికారులు ప్రకటించారు. కాలనీల్లో స్థానికులు అంతర్గతంగా తిరగటంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని సిపి ద్వారాక తిరుమల రావు తెలిపారు.

ఏపీలో వారికి రూ. 5 వేలు సాయం!

దేవాలయాలు, మసీదులు, చర్చిలో మత పరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీఓను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్ లకు ఈ సాయం అందజేయనున్నారు. గుర్తింపు పొందిన మసీదులకే కాకుండా… గుర్తింపు పొందని మసీదులో ఇమామ్, మౌజమ్ లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అర్చకులకు రూ. 5 వేలు అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతం లో నే ఉత్తర్వులు ఇచ్చారు. అర్హులను గుర్తించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఉన్నతాధికారులు సూచించారు. ప్రభుత్వ వేతనం పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా నెల రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతూ ఉండటంతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులు మూతబడ్డాయి. దీంతో వీటిపై ఆధారపడి జీవిస్తున్న అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్ ల కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేరళ పై మోడీ సర్కార్ ఆగ్రహం అనవసరం!

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొదటి దశలో 21రోజుల లాక్ డౌన్, రెండవ దశలో 19 రోజుల లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా లాక్ డౌన్ 2.0 లో మోడీ సర్కార్ కొన్ని నిబంధనలు సడలిస్తూ.. మరో నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వం ఈ రెండు లాక్ డౌన్ లను ఎంతో కొంత అమలు చేస్తూ.. తాజాగా ప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిబంధనలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. లాక్‌ డౌన్‌ కు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఉల్లంఘించి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విజృంభన కారణంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు అన్ని రాష్ట్రాలు పాటించాలని, సొంత నిర్ణయాలు పనికిరావని కేరళ ప్రభుత్వానికి హిత బోధచేస్తున్నారు. లాక్‌ డౌన్‌ నిబంధనలను పక్కాగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వీర్యం చేయవద్దని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా  సూచించారు. కేరళకు ప్రత్యేకంగా లేఖ రాశారు. కానీ కేరళ ప్రభుత్వంపై మోడీ సర్కార్ ఆగ్రహం వ్యర్థమని అనేకమంది నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలోనే తొలి కరోనా కేసు కేరళలో జనవరిలొనే నమోదయ్యింది. అప్పటినుండి కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి అలుపెరుగని పోరాటం చేస్తుంది. కేంద్రం మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుపరిచింది కానీ కేరళ సర్కార్ జనవరి చివరి వారం నుంచే అనధికార లాక్ డౌన్ అమలుపరుస్తూ వచ్చింది.ఆ తర్వాత మార్చి 11న ముఖ్యమంత్రి పి. విజయన్‌ అధికారిక లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సంబంధించిన జాగ్రత్తలు దేశం మొత్తం మార్చి చివరి వారంలో ప్రారంభిస్తే కేరళ ప్రజలు జనవరి నుంచే ప్రారంభించి కరోనాని నియంత్రించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంటే కేరళ రాష్ట్రంలో కరోనా కేసులను తగ్గించుకుంటూ వచ్చింది. ఒక్కప్పుడు కరోనా కేసుల జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉంటే ఇప్పుడు 10వ స్థానానికి చేరుకుంది.అన్నిటికంటే ముఖ్యంగా కేరళలో కరోనా మరణాల సంఖ్య 3కే పరిమితం చేయడం దేశంలోనే రికార్డ్.

130కోట్ల ప్రజలకు కేంద్రం 1.7కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే 3.3కోట్ల జనాభాకు కేరళ ప్రభుత్వం 20వేల కోట్ల ప్యాకేజి ప్రకటించి అందులో ఇప్పటికే 12,500 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. కరోనా కిట్ల సమస్య దేశంలో అనేక రాష్ట్రాలలో ఉంది కానీ కేరళలో ఆ మాస్కుల కొరత అనే మాటే లేకుండా చేయడం ప్రభుత్వ ముందు చూపుకు నిదర్శనం. పీపీఈ కిట్స్, మందులు పెద్ద మొత్తంలో తెప్పించింది. మాస్క్‌ లు, శానిటైజర్లు భారీగా తయారు చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఒక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయడంతో సగం విజయం సాధించినట్టయింది. తొలి కేసు నమోదైన వెంటనే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న అయిదు విమానాశ్రయాల్లో అంబులెన్స్‌లు, అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా ఆసుపత్రులను సిద్ధం చేసింది. కరోనా అనుమానితుల్ని అన్ని రాష్ట్రాల్లోనూ 14 రోజుల క్వారంటైన్‌ లో ఉంచితే కేరళ ముందుజాగ్రత్తగా 28 రోజులు క్వారంటైన్‌ లో ఉంచింది. అదే సరైన చర్యని ఇప్పుడు రుజువు అవుతోంది.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ఎవరికైనా సోకితే వెంటనే వాళ్లంతా ఎవరెవరిని కలిశారో గూగుల్‌ మ్యాప్‌ సహకారంతో వెతికి పట్టుకొని మరీ పోలీసులు క్వారంటైన్‌ చేసేవారు. విపత్తుల సమయంలో ప్రజల్ని తరలించడానికి ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ఈ సంక్షోభ సమయంలో కేరళని ఆదుకున్నాయి. ప్రతీ గ్రామాల్లోనూ వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. దీనివల్ల సమాచారం అందించుకోవడం సులభమైపోయింది. కేరళ ఆరోగ్య మంత్రి శైలజ స్వయంగా కరోనా రోగులతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విధంగా కేరళ ప్రభుత్వం కరోనా పై పెద్ద యుద్ధమే చేసింది. దింతో విజయన్ సర్కార్ నేడు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆరోగ్యం, విద్యా రంగం మీద అత్యధికంగా ఖర్చు చేసింది. అందరికీ ఆరోగ్యం కోసం మూడు అంచెల విధానం అమల్లో ఉంది. ఆ వ్యవస్థ కరోనాపై అపారమైన పోరాట పటిమ ప్రదర్శించి కరోనాపై విజయం సాధించింది. ఆలాంటి రాష్ట్రం కి కేంద్రం హిత బోధ చేయడం అనేది ” పిల్ల వచ్చి గుడ్డి ని ఎక్కిరించినట్లే ఉంది”

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. దేశంలోని పలుచోట్ల వైద్యులపై కొందరు దుండగులు దాడులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. కరోనా మహమ్మరిపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న వైద్యులకు ప్రతీఒక్కరు అండగా నిలువాల్సిన సమయమిదని అన్నారు. అలాంటి వారిపై దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైద్యులకు జనసైనికులు అండగా నిలువాలని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.

కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే వాళ్లు తమ విధులను ఎలా నిర్వర్తించగలుగుతారని ప్రశ్నించారు? ప్రజల ప్రాణాల కోసం వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని కోరారు. కాగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వైద్యులపై చోటుచేసుకుంటున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరింది. లేనట్లయితే ఏప్రిల్ 23న తేదిన బ్లాక్ డేగా ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈక్రమంలోనే వైద్య సిబ్బందికి జనసేన పార్టీ తరపున అండగా ఉంటామని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

కరోనా తీవ్రతను కప్పిపుచ్చుతున్న మమతా!

భారత దేశ చరిత్రలో బహుశా మొదటిసారిగా ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విబేధాలు విస్మరించి ఉమ్మడిగా కరొనపై పోరాటం చేస్తుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ మాత్రం ఎందుకనో అసహనానికి గురవుతున్నారు.

కరొనపై పోరుకు ఉధృతంగా పనిచేయవలసింది పోయి ఈ వైరస్ తీవ్రతను రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు చూపేందుకు విఫల ప్రయత్నం చేయడం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది.

ఈ విషయమై ఆ రాష్త్రానికి చెందిన వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే కొలకత్తాతో పాటు మరో కొన్ని జిల్లాలు సహితం పరిస్థితులు అదుపుతప్పి పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు కేంద్రం పంపిన అంతర్ మంత్రివర్గ బృందం సోమవారం కోలకత్తాకు చేరుకొంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీబ్ సిన్హా కలసి బృందం పర్యటన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర బృందం పర్యటిస్తే తన ప్రభుత్వ వైఫల్యాలు వెల్లడి అవుతాయని మమతా భయపడుతున్నట్లున్నది. కోవిద్ 19 వంటి తీవ్రమైన సవాల్ ఎదుర్కొనే సమయంలో కూడా మరోసారి రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్రంతో మమతా ఘర్షణ పూర్వక ధోరణికి తలపడడం విస్మయం కలిగిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం నిర్ధారణ చేసేవరకు కరొనతో చనిపోయిన వారి వివరాలు ప్రకటింపవద్దని రాష్ట్ర ప్రభుతం నిషేధం విధించినట్లు వైద్యులు వాపోతున్నారు. గత వారం కొలకత్తాతో పాటు మరో కొన్ని జిల్లాలను కేంద్రం హాట్ స్పాట్ లుగా ప్రకటించినా ఆ జిల్లాల్లో తగు చర్యలు తీసుకోవడం గురించి మమతా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మరోవంక కేంద్రం అవసరమైనన్ని కిట్ లను సరఫరా చేయడం లేదని అంటూ కేంద్రంపై మమతా నిందలు వేశారు. మొత్తం కొలకత్తా నగరానికి 40 కిట్ లు మాత్రమే పంపారని అంటూ వాపోయారు.

అయితే ఆమె ప్రకటన పట్ల కలరా, రాష్ట్రంలో కరోనా పరీక్షలకు మూలకేంద్రమైన అంటువ్యాధుల జాతీయ సంస్థ డైరెక్టర్ డా. శాంతా దత్తా విస్మయం వ్యక్తం చేసారు. మొత్తం తూర్పు ప్రాంతానికి సరిపడిన 27,000 కిట్లు సిద్ధంగా ఉన్నాయని ఆమె చెప్పారు. అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ఉపయోగించుకోవడం లేదని కూడా తెలిపారు.

ఈ మధ్య న్యూస్ ఛానల్స్ లో ప్రసారమైన ఒక వీడియో రాష్ట్రంలోని పరిస్థితుల పట్ల తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు కలిసి కరొనతో చనిపోయిన వారి వృతదేహాలను రహస్యంగా పారవేస్తున్నట్లు ఈ వీడియోలో చూపడం పెద్ద సంచలనం కలిగించింది.

ఈ సందర్భంగా ఈడెన్ హాస్పిటల్ లో జరిగిన దిగ్బ్రాంతి కలిగించే సంఘటనను వైద్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేస్తున్నారు. ఉత్తర కొలకత్తా లోని వైద్య కళాశాలలో గల ఈ హాస్పిటల్ లో చేరిన ఒక గర్భిణీ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమెకు లేబర్ గదిలో శస్త్రచికిత్స చేశారు.

అక్కడ ఆమెను సుమారు 50 మంది నర్సులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కలిశారు. లేబర్ గది క్రిక్కిరిసి ఉంది. ఒకొక్క మంచంపై ముగ్గురు రోగులు ఉన్నారు. అక్కడ ఆమెను కలసిన మరి అనేక మందికి కూడా వైరస్ సోకి ఉండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

ఈ సంఘటన గురించి తెలియగాని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మొదట ఆమెను కలిసిన 50 మంది సిబ్బందిని ఐసొలేషన్ కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కాదు 25 మందిని పంపిస్తున్నామన్నారు. చివరికి అందరిని విధులలో చేరమన్నారు.

ఈ సంఘటన ప్రమాదకరమైన కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న `నేరమయ నిర్లక్ష్యం’కు నిదర్శనమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నేడు ఈ రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి.

వైరస్ గురించిన వాస్తవాలను కప్పిపుచ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రమాదంనైనా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలను సేకరించడం పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ద వహించడం లేదు.

కరోనా సోకిన్నట్లు నిర్ధారించిన తర్వాత చనిపోయిన ఏడుగురిని మృతుల జాబితాలో కలపలేదని అంటూ స్వయంగా శాస్త్రవేత్త అయినా సిపిఎం శాసనసభ్యురాలు డా. సుజన్ చక్రబోర్తి ఆరోపించారు.

ఒక కధనం ప్రకారం పశ్చిమ బెంగాల్ లో 10 లక్షల మందిలో 33.7 మందికి మాత్రమే కరోనా పరీక్షలు జరుపుతున్నారు. జాతీయ సగటు 156.9 గా ఉంది. రాజస్థాన్ లో అయితే 442 మందికి పరీక్షలు జరుపుతున్నారు.

ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని వదలని పక్షంలో కొలకత్తాతో పాటు మిడ్నపూర్, ఉత్తర – దక్షిణ 24 పరాగణాలు, ముర్షిదాబాద్, మాల్డా, దీనజపూర్ జిల్లాలలో కరోనా భీకరంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా టెస్ట్ ల వివాదంలో జగన్ ప్రభుత్వం!

మొదటి నుండి కరోనా వైరస్ కట్టడి పట్ల కాకుండా, రాజకీయ ఎజెండాలను ముందుకు తీసుకు వెళ్లడం పట్ల శ్రద్ద వహిస్తూ విమర్శలకు గురవుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కరోనా టెస్ట్ ల వివాదంలో చిక్కుకొంది. ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన రాజకీయ దుమారం ప్రజలలో భయాందోళనలను గురిచేస్తున్నది.

తగు విధంగా కరోనా టెస్టులు చేయక పోవడంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోయే అవకాశం ఉన్నదని ప్రతిపక్ష టిడిపి నేతలు ఆరోపిస్తుండగా, అధికార పక్షం మాత్రం దేశంలో చాలా రాష్ట్రాలలోకన్నా ఎక్కువగా టెస్టులు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో రోజుకు ఐదువేల టెస్టులు చేస్తున్నామని, ఈ సంఖ్యను 11,000 వరకు పెంచే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అధికారులు ఈ విధంగా చెబుతుంటే సిఎం సొంత ఎజెండాను అమలు చేయడం కోసం కోవిడ్‌ తక్కువగా ఉందని చూపించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. దీంతో అసలు ఏం జరుగుతోందనేది అర్థంగాక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మరోవంక కరోనా మహమ్మారితో సంబంధం లేకుండా విశాఖకు రాజధానిని మార్చే ప్రయత్నంలో ఉన్న అధికార పక్షం రాష్ట్ర మంతటా కరోనా కేసులు పెరుగుతున్నా విశాఖ నగరంలో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నట్లు టిడిపి ఆరోపిస్తున్నది. ఒక్క కేసునైనా దాచామని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్‌ చేశారు.

విశాఖ నగరంలో దాదాపు 25లక్షల మంది జనాభా ఉన్నారు. మొత్తం జనాభాలో కేవలం 2,530 మందికే ఇంతవరకూ పరీక్షలు జరిగాయి. విశాఖ కేంద్రంగా సీపోర్టు, ఎయిర్‌ పోర్టు ఉన్నందున విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా 3,117 మంది వచ్చినట్లు గుర్తించారు. వీరిలో చాలా వరకూ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. వీరికి కేవలం థర్మల్‌ స్క్రీనింగ్‌ మాత్రమే జరిపారు.

వాస్తవ కరోనా పరీక్షలు జరిపింది 0.1శాతం మంది (2,530)కి మాత్రమే! వీరిలో 2150 మందికి నెగెటివ్‌ వచ్చింది. ఇంత తక్కువ మందికి పరీక్షలు జరపడమే విమర్శలకు కారణమవుతున్నది.

ఈ లోగా కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలుపై దుమారం చెలరేగింది. కొరియా నుండి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పింఛాయామని అంటూ తొలి టెస్ట్ ను ముఖ్యమంత్రి జగన్ చేయించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. వాటి ధరను ప్రభుత్వం అధికారికంగా చెప్పక పోవడంతో వివాదం చెలరేగింది.

ఛత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి వేరే సందర్భంలో మాట్లాడుతూ తాము రాపిడ్ టెస్టు కిట్లను రూ.335కు కొనుగోలు చేశామని చెప్పడంతో రాపిడ్ టెస్టు కిట్ల రేటు ఎంతో చెప్పగలరా అని కోరుతూ కన్నా లక్ష్మీనారాయణ మర్యాదగా ట్విట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ 730కు కొనుగోలు చేసిన్నట్లు అప్పటికే ప్రచారంలో ఉంది.

దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నుండి రూ 20 కోట్లు బేరం ఆడుకొని, కన్నా ప్రభుత్వంపై దాడి చేస్తున్నాడని అంటూ విజయసాయిరెడ్డి అనుచిత వాఖ్యలు చేయడంతో ఈ వివాదం దారితప్పింది. అప్పటి వరకు కేంద్రంలో బీజేపీ నేతలతో సఖ్యతతో ఉంటున్న విజయసాయిరెడ్డి పట్ల బిజెపి కేంద్ర నాయకులలో సహితం ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తున్నది.

దానికి కన్నా ఘాటుగా స్పందించారు. ‘కరోనా టెస్టింగ్‌ కిట్లపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారు. హైదరాబాద్‌లోని శాండర్‌ ఏజెన్సీకి ఒక్కో కిట్‌కు రూ.730 పర్చేజ్ ఆర్డర్‌ ఇచ్చారు. ఒక్కో కిట్‌ రూ.640 అని జవహర్‌ రెడ్డి చెబుతున్నారు. విశాఖ మెడ్‌టెక్‌లో రూ.1200కే కరోనా టెస్టింగ్‌ కిట్‌ అని సాక్షిలో రాశారు” అని ప్రభుత్వంలో ఈ విషయమై నెలకొన్న గందరగోళాన్ని బహిర్గతం చేశారు.

దానీతో ఏ ధరకు కొన్నామో చెప్పలేక ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. నేరుగా సమాధానం ఇవ్వకుండా మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లించామని, ఏ రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చెల్లిస్తుందో అదే ధర చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నామని అంటూ జగన్ డొంకతిరుగుడుగా సమాధానం ఇచ్చారు.

ఒక్కో ర్యాపిడ్‌ కిట్‌ను రూ.730కి కొనుగోలు చేశామని, ర్యాపిడ్‌ కిట్లను కేంద్రం రూ.790కి కొనుగోలు చేసిందని అంటూ మంత్రి ఆళ్ళ నాని కన్నాపై ఎదురు దాడి చేశారు.

బీజేపీ ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేస్తోందా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్కసారిగా తన గ్రాఫ్ ను పెంచుకుంది. కరోనా వైరస్ సమస్య ప్రారంభమైన నాటినుంచి ఆ పార్టీ నాయకులు పలు ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతీ రోజు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి లేఖలు రాస్తూ వస్తున్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర, లాక్ డౌన్ సమయంలో రైతుల సమస్యలపై, నమోదు పాజిటివ్ కేసులపై శ్వేతపత్రం విడుదల చేయడం, అన్నవారంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు వంటి తదితర అంశాలపై లేఖలు రాశారు. ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల కొనుగోలు అంశంపై కన్నా ట్విట్, ఆపై విజయసాయి రెడ్డి కన్నాపై అమ్ముడుపోయాయని విమర్శలు చేయడంతో ఈ అంశాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది.

కిట్ ల వ్యవహారం పై తొలుత టీడీపీ బయటకు తీసుకురావడంలో, క్యాష్ చేసుకోవడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ వెనుకబడింది. బిజెపి అధ్యక్షుడు కన్నాపై విజయసాయి రెడ్డి ఆరోపణలపై కన్నా మీడియా సమావేశం నిర్వహించడం, అనంతరం ఆ పార్టీ నాయకులు సుజనా చౌదరి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, అనుబంధ సంఘాల నాయకులు సైతం విజయసాయి వ్యాఖ్యలను ఖండించారు. కన్నా ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయి రెడ్డిని ఉతికేశారు. ఎంపీ మాత్రం స్పందించలేదు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ చాలా తీవ్రంగా స్పందించింది. అధికార వైసీపీ మాత్రం ఏ విషయంలో బీజేపీ నాయకులు లేవనెత్తిన అంశాలపై స్పందించలేదు. కిట్ ల కొనుగోలు విషయంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ మీడియా కు వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఈ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గడంపై ఆ పార్టీ నాయకులు సైతం తప్పు బడుతున్నారు.

సమాధులకు పార్టీ రంగు!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైకాపాకు పట్టుకున్న రంగుల పిచ్చికి కోర్టులో చుక్కెదురైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. బోరు పంపుల నుంచీ స్మశానవాటికలో సమాధులకు కూడా పార్టీ రంగు లేశారని ట్వీట్ చేశారు. చెట్టూపుట్టా దగ్గర మొదలెట్టి, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామసచివాలయలు, వాటర్ ట్యాంకులకు,

చివరకు విజ్ఞత మరిచి జాతీయ జెండా తొలగించి పార్టీ రంగులు వేశారని ఆరోపించారు. మరోవైపు హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగుల తొలగింపు విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి మూడు వారాల గడువు ఇస్తూనే… రంగులు తొలగించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించ వద్దని ఆదేశించింది.

కరోన వైరస్ వ్యాప్తి వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉన్న నేపధ్యంలో ప్రతి వారం కోర్టులో హాజరయ్యేందుకు హైదరాబాద్ విజిట్ కోసం రూ.60 లక్షలు ఖర్చు అయ్యేవాని, ప్రస్తుతం సెలవులు సందర్భంగా మన ప్రముఖులు ఏ1, ఏ2 లు ఆదా చేశారని టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయ సాయిరెడ్డి లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

లాక్ డౌన్ ముందు గొయ్యి తర్వాత నుయ్యి?

కరోనా మహమ్మారి ఆగడాలకు దేశంలో పలు సేవల పోకడలు నిలిచిపోయాయి. రోజురోజుకు కోవిద్ 19 కేసులు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ విధించగా, తెలంగాణ సర్కార్ మే 7 వరకు సడలింపులు లేని లాక్ డౌన్ విధించింది. అయితే మే మొదటి వారం తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే జరిగే పరిణామాల పై ఇప్పటి నుంచే ఆందోళన మొదలవుతుంది. లాక్ డౌన్ ఎత్తివేసినా ప్రజా రవాణాకు మరో నెల రోజుల పాటు అనుమతించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రజా రవాణా అయిన బస్సులు, రైళ్లు, విమానాలు ప్రారంభమైతే వైరస్ విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిందని కాదు. ఈ వ్యాధి ప్రభావం మరో 6 నెలల వరకు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ లతోపాటు తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ రాష్ట్రాలలో వలస కూలీలు, ఉపాధి నిమిత్తం వచ్చిన వారు లక్షల మంది ఉన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వీరంతా స్వరాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది. వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అది అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైళ్ల ప్రయాణాల ద్వారా వేల మందికి సోకే అవకాశం లేకపోలేదు. కరోనాకు మందు వస్తే తప్పా పూర్తి స్థాయిలో వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించలేం. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేస్తే రాష్ట్రాల మధ్య రాకపోకలు ప్రారంభమవుతాయి. దింతో కరోనా వ్యాప్తి మరింత సులువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఎవరైనా ప్రయాణిస్తే వారికి కరోనా ఉంటే అది అందరికి సోకే ప్రమాదం ఉంది. అందుకే లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజా రవాణాను ప్రారంభించవద్దని కేంద్ర ప్రభుత్వానికి పలువురు సిఫార్సు చేస్తున్నారు.

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, భువనగిరి లాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులున్నాయి. వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో అసలు కేసులే లేవు. లాక్ డౌన్ తర్వాత బస్సులు ప్రారంభమైతే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కరోనా ఎక్కువ ఉన్న జిల్లాలలో నుంచి ఎవరైనా ఈ ప్రాంతాలకు వస్తే కరోనా విస్తరించే అవకాశం ఉంది. కావున లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజా రవాణాను కొంత కాలం పాటు ప్రారంభించకపోవడం ఉత్తమం. లేకపోతే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అప్పు చేసైనా సేవ చేస్తానంటున్న ప్రకాశ్ రాజ్

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పలువురు సెలబ్రెటీలు తమవంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తమకు తోచినట్లుగా పేదలకు సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన మనస్సులోని మాటను బయటపెట్టారు. కరోనా ఎఫెక్ట్ తో పేదలు ఇబ్బందులు పడుతున్నారని తన శక్తిమేర సాయం అందిస్తానని చెప్పారు. అవసరమైతే అప్పు తెచ్చైనా సరే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

తన ఆర్థిక వనరులు క్షీణించినా సరే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. అవసరమైతే బ్యాంకులో రుణం తీసుకుంటానని.. కష్టకాలంలో పేదలకు అండగా ఉంటానని చెప్పారు. భవిష్యత్‌లో తాను సంపాదించుకోగలుగుతానని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు. ‘మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం.. జీవితాలను నిలబెడదాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పేదలకు సహాయం చేస్తానని ఆయన చెప్పిన మాటలు ప్రతీఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చెప్పినట్లుగానే తమవంతు పేదలకు సాయం చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.

భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం

టాలీవుడ్ అగ్రనటులకు ఛాలెంజ్ విసిరిన యంగ్ టైగర్

కరోనా ఎఫెక్ట్ తో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. దీంతో పలువురు సెలబెట్రీలు కొత్తకొత్త ఛాలెంజ్ లతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే హీరోయిన్లంతా టీషర్ట్ ఛాలెంజ్, పిల్లో ఛాలెంజ్ లతో అలరిస్తుండగా టాలీవుడ్లో కొత్త ఛాలెంజ్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు సందీప్ వంగా ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ పేరిట ఇంటిపనులు చేస్తున్న వీడియోను దర్శక దిగ్గజం రాజమౌళికి ఛాలెంజ్ చేసి మరికొంత మందిని నామినేట్ చేయాలని కోరాడు. సందీప్ వంగా ఛాలెంజ్ ను రాజమౌళి స్వీకరించాడు. తన భార్యకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ చీపురు పట్టి ఇల్లు ఊడుస్తూ, డోర్స్ క్లీన్ చేసిన వీడియోను సోషల్ మీడియాల షేర్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, కీరవాణి, నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్లకు ఈ ఛాలెంజ్ విసిరాడు.

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం చీపురు పట్టి ఇల్లు క్లీన్ చేశాడు. వంట గిన్నెలు క్లీన్ చేస్తూ.. బయట చెత్తను తుడిచి శుభ్రం చేస్తున్న వీడియోను ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందాం..’ అంటూ అద్భుతమైన సందేశాన్ని పోస్టు చేశాడు. అలాగే ఈ ఛాలెంజ్ కు తన బాబాయ్ బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, దర్శకుడు కొరటాల శివలను నామినేట్ చేశాడు. టాలీవుడ్ అగ్రనటులకు అదిరిపోయే ఛాలెంజ్ ఎన్టీఆర్ విసిరాడు. వీరి ఛాలెంజ్ ఎప్పుడు స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే.. తమ అభిమాన హీరో చీపురుపట్టిన వీడియో చూడాలని అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం