
కరోనా ఎఫెక్ట్ తో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సెలబెట్రీలు తమ సోషల్ మీడియాలో తమ క్వారంటైన్ అనుభవాలను అభిమానులతో పంచుకుంటారు. మెగా డాటార్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులతో తన ముచ్చట్లను పంచుకుంటోంది. తాజాగా యాంకర్ రవితో కలిసి ఇన్ స్ట్రాగ్రామ్ లైవ్లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. తన సినిమా ముచ్చట్లతో పెళ్లి విషయాలపై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
పెళ్లాయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా? అని అడిగిన ఓ నెటిజన్ ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. ‘నేనేమీ సమంతను కాదు.. పెళ్లి తర్వాత నటిస్తానో.. నటించలేనో ముందుగానే చెప్పలేనంటూ సమాధానం ఇచ్చింది. అక్కినేని కోడలిపై మెగాడాటర్ కామెంట్ చేయడంతో నిహారిక చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా తన వద్దకు వచ్చే మంచి కథలను ఓకే చేస్తానని.. గ్లామర్ పాత్రల్లో నటించేందుకు వెనుకడబోయేది లేదని స్పష్టం చేసింది.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పని తీరు పై సంచలన వార్త!
‘ఒక మనస్సు’ మూవీతో నిహారిక ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించిన ఆమె స్థాయికి తగిన విజయం మాత్రం దక్కలేదు. ఇటీవల మెగాస్టార్ నటించిన ‘సైరా’లో నిహారిక కన్పించిప్పటికీ అది ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఖాళీ సమయంలో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి దృష్టి తనవైపు తిప్పుకుంటోంది. ఇక తాను ఓ తమిళ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పింది. గోవాలోని అందమైన లోకేషన్లలో ఈ మూవీ షూటింగ్ చిత్రీకరించినట్లు తెలిపింది. గోవా బీచ్లో మంచి రోమాంటిక్స్ సీన్ ఉంటాయని చెప్పింది.
కెరీర్ తొలినాళ్లలో సంప్రదాయక పద్ధతిలో కన్పించిన నిహారిక సినిమా ఆఫర్లు తగ్గడంతో గ్లామర్ రూట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిహారిక గ్లామర్ ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే..!