
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైకాపాకు పట్టుకున్న రంగుల పిచ్చికి కోర్టులో చుక్కెదురైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. బోరు పంపుల నుంచీ స్మశానవాటికలో సమాధులకు కూడా పార్టీ రంగు లేశారని ట్వీట్ చేశారు. చెట్టూపుట్టా దగ్గర మొదలెట్టి, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామసచివాలయలు, వాటర్ ట్యాంకులకు,
చివరకు విజ్ఞత మరిచి జాతీయ జెండా తొలగించి పార్టీ రంగులు వేశారని ఆరోపించారు. మరోవైపు హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగుల తొలగింపు విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి మూడు వారాల గడువు ఇస్తూనే… రంగులు తొలగించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించ వద్దని ఆదేశించింది.
కరోన వైరస్ వ్యాప్తి వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉన్న నేపధ్యంలో ప్రతి వారం కోర్టులో హాజరయ్యేందుకు హైదరాబాద్ విజిట్ కోసం రూ.60 లక్షలు ఖర్చు అయ్యేవాని, ప్రస్తుతం సెలవులు సందర్భంగా మన ప్రముఖులు ఏ1, ఏ2 లు ఆదా చేశారని టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయ సాయిరెడ్డి లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.