Home Blog Page 8524

మనసు మార్చుకున్న ‘కామ్రేడ్’

కెరీర్ ఆరంభంలో `ఎవడే సుబ్రహ్మణ్యం , పెళ్లి చూపులు `వంటి సున్నిత మైన కథలతో హీరోగా పేరు తెచ్చుకొన్న విజయ్ దేవరకొండ తరవాత ఎందుకో మాస్ చిత్రాల వెంట పడ్డాడు. అర్జున్ రెడ్డి ఇచ్చిన కిక్ తో తనని తాను మాస్ హీరోగా మార్చు కోవాలనుకొన్నాడు. ఆ క్రమం లో ` టాక్సీ వాలా , నోటా , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ ` వంటి మాస్ అప్పీల్ ఉన్న చిత్రాలను చేయడం జరిగింది. కానీ ప్రేక్షకులు వాటిని ఆదరించి కుండా తిరస్కరించారు. ఇక్కడ ఇంకో విషయం విజయ్ దేవరకొండ మర్చి పోయాడు.

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

` పెళ్లి చూపులు చిత్రం తో పాటు విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి 100 కోట్ల గ్రాస్ రాబట్టిన `గీత గోవిందం ` చిత్రం సున్నిత మైన లవ్ నేపధ్యం లోనే రూపొంది ఘన విజయం సాధించాయి. దరిమిలా కొంతకాలం పాటు లవ్ జానర్ లోనే చిత్రాలు చేస్తే అది కెరీర్ కి గట్టి పునాది అయ్యేది. ఆ విషయం మర్చి పోయి తనని తాను ఎక్కువ ఊహించు కొని మాస్ చిత్రాలు చేస్తున్నాడు. ఇపుడు మళ్ళీ ఎవరు సలహా ఇచ్చారో ఏమో సున్నితమైన లవ్ స్టోరీ లను చక్కగా చిత్రీకరించే ఒక యువ దర్శకుడి చిత్రం లో నటించేందుకు సిద్దమౌతున్నాడు.

కరోనా టెస్ట్ ల వివాదంలో జగన్ ప్రభుత్వం!

` డియర్ కామ్రేడ్ ,, వరల్డ్ ఫేమస్ లవర్ `వంటి వరుస పరాజయాలతో ఖంగుతిన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ గా నటిస్తున్నాడు. ఫుల్ మాస్ అప్పీల్ ఉన్న పాత్రలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నాడు. కాగా ఈ చిత్రం తరవాత తనకు అచ్చివచ్చిన సాఫ్ట్ లవ్ జానర్లో మరో చిత్రం చేయబోతున్నాడు. ఆ క్రమంలో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో చేయనున్నాడు.` నిన్ను కోరి `, ` మజిలీ `వంటి సాఫ్ట్ లవ్ స్టోరీస్ తీసి సూపర్ హిట్ విజయాలను అందుకొన్న దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు……అని తెలిసింది. ప్రస్తుతం నాని తో ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని రూపొందిస్తున్న శివ నిర్వాణ తన తదుపరి ప్రాజెక్ట్ గా విజయ్ దేవరకొండ చిత్రాన్ని ఎన్నిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

అనువాద చిత్రాలకు అడ్డుకట్ట వేస్తున్నారు

ప్రస్తుతం కోవిడ్ 19 కార‌ణంగా సినీ ప్ర‌పంచ‌మంతా గందర గోళంగా తయారైంది. విడుదల కావాల్సిన ప‌లు చిత్రాలు ఆగిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ ఉంటే.. మే 7 వ‌ర‌కు తెలంగాణ లో లాక్‌డౌన్‌ కొన‌సాగనుంది.. అలాంటి సమయం లో సినీ పరిశ్రమ పలు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంది .ఇప్ప‌టికే మార్చి మూడో వారం నుండి విడుద‌ల కావాల్సిన పలు సినిమాలు ఆగిపోయాయి. ]అవి ఎప్ప‌టికి విడుద‌ల‌వుతాయో అంతుపట్టకుండా వుంది .

ఒక‌వేళ లాక్‌డౌన్‌ను ఎత్తేసిన తరవాత థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌డానికి ప్ర‌భుత్వాలు వెంటనే అనుమ‌తినిస్తాయా అనేది సందేహమే ఇదే విషయం ఫై సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ .సినిమా థియేటర్లు పూర్వ స్థితికి వచ్చి ప్రేక్షకులతో కళ కళ లాడాలంటే డిసెంబర్ దాకా ఆగాల్సి వస్తుంది అన్నారు . దరిమిలా ఈ ప‌రిస్థితిని అధిగ‌మించాలంటే ఏం చేయాల‌ని సినీ ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు ఆలోచ‌న లో పడ్డారు .. ఇప్పుడు ఆగిపోయిన సినిమాల‌కు భ‌విష్య‌త్తులో థియేట‌ర్స్ ప్రాబ్లమ్ రాకుండా ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో డ‌బ్బింగ్ సినిమాల‌ను ఇప్ప‌ట్లో విడుద‌ల చేయ‌కుండా ఆపాలని అనుకుంటున్నారట .. దీంతో కొంత మేర థియేట‌ర్స్ స‌మ‌స్య తగ్గే అవ‌కాశం ఉంటుంద‌ని నమ్ముతున్నారు . ఆ దిశగా పావులు కదుపు తున్నారు. ఒక‌వేళ ఇది నిజ‌మైతే అనువాద చిత్రాలకు అనూహ్యంగా అడ్డుకట్ట పడబోతోంది. సదరు డ‌బ్బింగ్ సినిమాల‌ నిర్మాత‌ల‌కు ఈ నిర్ణయం ఆశనిపాతం కాబోతుంది .

స్థానిక ఎన్నికలకు ముందే జగన్ ఆ పని చేయాలి:హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ,వార్డు సచివాలయాలకు వేసిన రంగులు మార్చడం పై హైకోర్టు సీరియస్ అయింది. వైసీపీ జెండా రంగులను వెంటనే తొలగించాలని ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు రంగులను మార్చాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. రంగులను మార్చేందుకు 3 వారాల గడువు కావాలని ప్రభుత్వం పేర్కొంది.

మూడు వారాలలోపు రంగులను తొలగించి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఏపీలోని గ్రామ,వార్డు సచివాలయాలకు వైసీపీ జెండా రంగులను వేసింది. అయితే దీని పై టీడీపీ వారితో పాటు పలువురు హైకోర్టు మరియు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ రంగులను తొలగించాలని సుప్రీం కోర్టు మరియు హైకోర్టులు తీర్పునిచ్చాయి. రంగుల మార్పుకు సమయాన్ని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని పై విచారించిన హైకోర్టు 3 వారాల్లో రంగులు తొలగించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశిచ్చింది.

భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం: రాం మాధవ్

హంగేరి దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ కరోనా వైరస్ వ్యాధి (కోవిద్-19)పై తన పోరాటానికి పార్లమెంట్ ఆటంక పరుస్తున్నదని భావించారు. పార్లమెంట్ లో తనకున్న ఆధిక్యతను ఆసరాగా తీసుకోని అత్యవసర అధికారాలను సొంతంచేసుకొన్నాడు. ఇప్పుడు ఆయన న్యాయవ్యవస్థ సమీక్షకు అవకాశంలేని ఉత్తర్వుల ద్వారా హంగేరీని పాలించవచ్చు. ఆయన ఉత్తర్వులను విమర్శిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరం. అందులో కొన్ని సమర్ధనీయమే. కానీ ప్రజారోగ్య అత్యవస పరిస్థితిని అనువుగా తీసుకోని కొందరు నాయకులు సర్వాధికారాలు చేజిక్కించుకొని నియంతలుగా మారుతున్నారని విమర్శకులుపేర్కొంటున్నారు. మనం రష్యా లేక చైనా గురించి మాట్లాడటం లేదు. సాంప్రదాయక ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్, ఇజ్రాయెల్ లకు కూడా విశ్వ మహమ్మారిపై పోరులో అత్యవసర అధికారాలు వాడుకోవటం తప్పలేదు.

ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయస్థానాలను మూసివేయవలసిందిగా ఆదేశించారు. అవినీతి కేసులో నేర విచారణనుండి స్వయంగా తప్పించుకోవటానికే ఈ చర్య తీసుకొన్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. నెతన్యాహు దేశ అంతర్గత భద్రతా సంస్థలను పౌరులపై విస్తృత నిఘా విధించేందుకు అనుమతించారు. ఇజ్రాయెల్ లో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి ఆరునెలల కారాగార శిక్ష విధిస్తున్నారు.

స్థిరమైన ప్రజాస్వామ్య సంస్థలు, పద్ధతులు కలిగిఉన్న యునైటెడ్ కింగ్డమ్ లో సైతం మహమ్మారి సంబంధిత బిల్లును వేగిరంగా ఆమోదింపచేసుకోవటం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు విశేషాధికారాలు కల్పించారు. ఈ చట్టం వ్యక్తులను కాలపరిమితి లేకుండా నిర్బంధించే అధికారాన్ని కల్పిస్తుంది. బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాంకాక్ సాధారణంగా బ్రిటన్ వ్యవహరించే తీరుకు ఇది భిన్నమైనదేనని అంగీకరించారు.

ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటీర్ట్, థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓచ్ లు విశేష అధికారాలు కల్పించుకొన్నారు. ఇటలీ, స్పెయిన్ దేశాలు వేలాది ప్రజలను వేరువేరుగా ఉంచటానికి (క్వారంటైన్ చేయటానికి) సైన్యం పై ఆధారపడవలసి వచ్చింది. హంగేరి, లెబానాన్, మలేషియా, పెరూ మొదలగు దేశాలు ఆంక్షలను అమలు చేయటంకోసం సైన్యాన్ని వీధుల్లోకి తీసుకొని రావలసి వచ్చింది.

జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ లు కూడా సాయం కోసం సైన్యం వైపు చూడవలసివచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ ఇరవై వేల మంది సైనికులతో ‘కోవిద్ స్పందన సమూహాన్ని’ ఏర్పరచింది.

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదటి దశలో వ్యక్తులను విచారణ లేకుండా నిరవధికంగా నిర్బందించే విశేషాధికారం కల్పించచుకోవటానికి, దేశంలో ఆశ్రయం కోరే విదేశీయులకు చట్ట బద్ధంగా ఉన్న హక్కులను రద్దు చేయటానికి ప్రయత్నం చేసినా, అమెరికన్ కాంగ్రెస్ జోక్యంతో న్యాయ మంత్రిత్వ శాఖ కోరికల చిట్టా నీరుకారింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడి రాష్ట్రాల గవర్నర్లకు లాక్ డౌన్ విషయంలో సర్వాధికారాలు ఉండటం వలన దేశాధ్యకుడు ట్రంప్ అధికారాలు కాస్తంత పరిమితమైనవిగానే ఉన్నాయి.

అలా వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను భారత దేశంలో జరుగుతున్న దానితో పోల్చి చుస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అత్యవసర అధికారాలకోసమో, విశేషాధికారరలకోసమో అడుగలేదు. సెన్సార్షిప్ విధించటమో లేక విచారణ లేకుండా నిర్బందించే చర్యలకో దిగలేదు.

ప్రచార మాధ్యమాల గొంతునొక్కుతున్నారంటూ వినపడుతున్న అపస్వరాలన్నీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నవే. సుప్రీంకోర్టు కేవలం తప్పుడు వార్తల పట్ల జాగ్రత్త వహించమని, అధికార గణాంకాలకు చోటివ్వమని మాత్రమే మీడియాను కోరింది.

మోదీ సైన్యాన్ని విధుల్లోకి రమ్మని పిలువలేదు. ప్రజల ప్రాధమిక మానవ హక్కులను కొట్టిపారేయలేదు. చాలావరకు లాక్ డౌన్ సూచనలన్నీ ప్రజాహితం కోరి చేస్తున్నవే. ప్రజలు స్వచ్చందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలని మోదీ కి ఎవరూ సలహా ఇవ్వకపోలేదు. మోదీ నిరంకుశ అధికారాల మీద కాకుండా, ప్రజాస్వామ్య మాధ్యమాల మీదే ఆధారపడ్డారు. తాను స్వయంగా ‘ప్రపంచ యుద్ధం తరహా పరిస్థితి’ గా వర్ణించిన పరిస్థితులలో కూడా మోదీ మౌలిక మానవ హక్కులను ఆదరిస్తూ ప్రజాస్వామ్యవాదిగా నిలబడ గలిగారు.

కోవిద్ పై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. ఇటీవల మోదీ జాతికి ఇచ్చిన సందేశంలో శాసనం (రాజకీయ నాయకత్వం), ప్రశాసనం (ప్రభుత్వోద్యోగులు), జనతా జనార్దన్ (దైవాంశ సంభూతులైన ప్రజలు) కోవిద్ పై తన పోరాట సమూహమని పేర్కొన్నారు.

దేశంలో సగం రాష్ట్రాలలో బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నా మోదీ ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కోలేదు. ఇది మోదీ విశ్వనీయత స్థాయి ఉన్నతంగా ఉందని తెలియజేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూ యార్క్ గవర్నర్ ఆండ్రూ సుయోమో ల మధ్య ఇటీవల కాలంలో వాగ్వివాదం చోటుచేసుకోవటం గమనార్హం.

‘ప్రజల ద్వారా, ప్రజలకొరకు, ప్రజలచే” ప్రభుత్వం ఉండటమే ప్రజాస్వామ్యమని గంభీర ప్రకటనలు వింటుంటాం. కానీ చాల దేశాల్లో ప్రజలచే విషయాలు నడపబడటం అనేది అరుదు. కానీ మోదీ దానిని మర్చి వేశారు. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు, పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేసాడు. ఇది మోదీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్షణం.

స్వచ్ఛ భారత్ పేరున పారిశుధ్యం కొరకు చేసిన మొట్టమొదటి భారీ ప్రచారోద్యమం నుండి నేటి మహమ్మారితో పోరాటం వరకు ప్రజలను ఎక్కువ క్రియాశీల పాత్రధారులను చేసే ప్రత్యేకమైన నేర్పును మోదీ కనపరిచాడు.

ఫ్రాన్సిస్ ఫుకుయామా అనే రాజకీయ శాస్త్రవేత్త చట్టబద్ధమైన పాలన, చట్టంచే పాలనల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పరిచిన నియమాలు శిరోధార్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధ పాలన సాగుతుంది. నియంతలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి కి పూర్తి విరుద్ధంగా చట్టం అదనుగా పాలన చేయాలని చూస్తారు.

మోదీ చట్టబద్ధమైన పాలన పట్ల నిబద్ధతను స్పష్ఠంగా కనపరిచారు. తబ్లిగీ జమాత్ మర్కజ్ అనే మత వర్గంచే లాక్ డౌన్ నిభందనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించటం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వెనుకను తరలిపోవటం వంటి రెచ్చగొట్టటానికి ఆస్కారం ఉన్న సంఘటలు జరిగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించిన సంఘటనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ మోదీ తన కార్య పద్దతి నమూనాను మార్చుకోలేదు.

మోదీ ప్రజలలో సహజసిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహా శక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాటయోధుల్ని అభినందిస్తూ కరతాళ ధ్వనులను చేయమన్నప్పుడు, వారి కొరకు దీపలు వెలిగించమని పిలుపు యిచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజా స్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది.

మోదీ కరోనా విశ్వ మహమ్మారిపై పోరును మరో స్థాయికి తీసుకొనివెళ్ళారు. శాస్త్రీయ పద్దతులను అవలంభిస్తూ, సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తూ, కరోనా వ్యతిరేక పోరులో 130 కోట్ల మంది ప్రజలను పాత్రధారులను చేసారు. దూరదృష్టితో, తనదైన విలక్షణ పద్దతిని అవలంభిస్తూ “మానవ కేంద్రిత అభివృద్ధి సహకారం” అనే నమూనాను మోదీ ప్రపంచం ముందు ఆవిష్కరించారు.

(రాం మాధవ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ గోవేర్నర్స్ సభ్యులు. వ్యాసంలో అభిప్రాయాలు వ్యక్తిగతం.)

కేంద్ర బృందాలపై ప్రతిపక్ష సీఎంల గగ్గోలు

కరోనా వైరస్ కట్టడిలో కేంద్రంకు సహకరిస్తూ క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్షాపూర్వకంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు చెలరేగుతున్నాయి.

ముఖ్యంగా కరోనా కట్టడిలో ముందుంటున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్న ప్రాంతాలకు అనే పేరుతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలనే ప్రయత్నాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది.

రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు, వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఆరు కేంద్ర బృందాలను కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్రాలకు పంపేందుకు రంగం సిద్ధం చేయడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.

కేవలం ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఎంపిక చేశారని, బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గురించి పట్టించుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర బృందాలను పంపాలన్న హోం శాఖ నిర్ణయంపై సీఎం మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతును, సలహాలను స్వాగతిస్తున్నామని.. అయితే కేంద్ర బృందాలను ఎందుకు పంపాలని కేంద్రం భావిస్తుందో సరైన కారణాలు తెలియజేయాలని ఆమె నిలదీశారు.

సరైన కారణాలు లేకుండా తాను రాష్ట్రంలోకి కేంద్ర బృందాలను అనుమతించినట్లయితే సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లవుతుందని స్పష్టం చేస్తూ మమత ట్వీట్ చేశారు.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఉన్న ఢిల్లీలోనే తబ్లీఘి జమాత్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందితే ఏమి చర్య తీసుకున్నారని ఈ సందర్భంగా ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.

విధినిర్వహణలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరిపినవారిపై జైలు శిక్షతో సహా కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక బిల్ ను తయారు చేస్తే అది అవసరం లేదని అంటూ అమిత్ షా పక్కన పడవేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

ఆ బిల్లుకు ఇప్పుడైనా చట్ట రూపం కల్పించమని కోరుతూ ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం ఒక లేఖలో అమిత్ షా ను కోరడం గమనార్హం.

బీజేపీలో అధికారంలో ఉన్న కర్ణాటక, ఆ పార్టీ మిత్రపక్షం అధికారంలో ఉన్న తమిళనాడుతో పాటు బిజెపికి సహకారం అందిస్తున్న ప్రభుత్వం ఉన్న తెలంగాణలో సహితం ఇటువంటి దాడులు జరగడం గమనార్హం.

కరోనా కట్టడికి కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలలోని బిజెపి నేతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.

కరొనపై పోరాటంలో ముందుండి, మానవ వనరులను, ఆర్ధిక వనరులను పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న రాష్ట్రాలకు ఎటువంటి సహాయం చేయకుండా కేంద్రం పెత్తనం చేస్తూ, రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా విమర్శలు చెలరేగుతున్నాయి.

ఏపీలో గ్రీన్ జోన్ లలో ఆంక్షల సడలింపు లేదా?

కేంద్రం ప్రకటించిన రెండవ విడత లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగనున్న నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవ్వని ప్రాంతాల్లో, కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చే విషయంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 671 మండలాలకు 97 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. దాదాపు నెల రోజుల అనంతరం గ్రీన్ జోన్ లో పరిశ్రమలకు, వ్యవసాయ అనుబంధ రంగ సంస్థలకు నిర్వహణకు అనుమతి అనుమతి ఇచ్చారు.

అయితే ఆ ప్రభావం తొలిరోజు పెద్దగా కనిపించలేదు. పంట పొలాల్లో కూలీ పనులు చేసే వారు తప్ప మిగిన సంస్థలు పనులు పెద్దగా ప్రారంభంకాలేదు. దీనికి కారణం ప్రజలు కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందనే ఆందోళనతో పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కొద్ది రోజులు సమయం పడుతుందని అధికారి ఒకరు చెప్పారు. రైస్, పప్పుల మిల్లులు కొన్ని అక్కడక్కడా పనులు ప్రారంభించాయి. అదేవిధంగా డ్వాక్రా సంఘాలు, ప్రవేటు సంస్థలు కొన్ని బాడీ సూట్లు, మాస్కులు తయారు చేస్తున్నాయి. ఏవి కొద్దీ రోజుల కిందట ప్రభుత్వ అనుమతితో పనులు ప్రారంభించాయి.

ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు. ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్‌ కంపెనీలు పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. కొన్ని నిబంధనలు తప్పని సరిగా ఏవి పాటించాలి. ప్రతి మండలంలో స్థానిక తహశీల్దార్ ప్రత్యేక అధికారిగా ఉంటూ ఆయా సంస్థలు నిబంధనలు పాటిస్తుంది లేనిది పరిశీలిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్ లు గ్రీన్ జోన్ లో పాటించాల్సిన నిబంధనలు రూపొందించి తహశీల్దార్ కార్యాలయాలకు పంపారు.

మరోవైపు రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయంలో పనిచేసున్న ఆర్ధిక శాఖ అధికారులు విధులకు హాజరు కావాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశించారు. ప్రభుత్వ వాహన సదుపాయం కలిగిన అధికారులు అందరూ కార్యలయాలకు రావాలని కోరారు. సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వీలుగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణాలకు ప్రతికంగా బస్సులు నడిపారు. విధులకు హాజరు కాని ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేసి ఆన్ లైన్ లో ఫైళ్లను క్లియర్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

అంతుబట్టని వైరస్ లక్షణాలు… యధేచ్చగా వ్యాప్తి

సుమారు నెలరోజులుగా దేశంలో లాక్ డౌన్ అమలు జరుపుతున్నా కరోనా వైరస్ కట్టడి కాకపోవడం, పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడానికి కారణం వైరస్ సోకినా వారిలో ఆసుపత్రులలోకన్నా అంతకు నాలుగు రేట్లు బైట యధేశ్చగా తిరుగుతూ ఉండడమే అని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్ లో వ్యాపించిన వైరస్ ప్రత్యేకత కారణంగా సుమారు 80 శాతం మందిలో ఆ వ్యాధి లక్షణాలు బయటపడటం లేదని, దానితో మాములుగా వారు తిరుగుతూ, వైరస్ ను మరింతగా వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.

దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు.

వ్యాధి లక్షణాలతో తమ వద్దకు వచ్చినవారికి, వారిని కలిసిన వారికి మాత్రమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తూ, క్వారంటైన్‌కు పంపుతున్నది. కానీ వ్యాధి లక్షణాలు లేకుండానే వైరస్‌ను మోసుకొని తిరుగుతున్నవారు భారీ సంఖ్యలో ఉంటారని, వీరిని గుర్తించడం సవాలుతో కూడుకున్నదని డాక్టర్‌ గంగాఖేడ్కర్‌ హెచ్చరించారు.

తాము పరీక్షలు నిర్వహించిన కరోనా రోగులలో నూటికి 20 మందిలో మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపించాయని, మిగిలిన 80మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడలేదని ఆయన తెలిపారు. వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంవల్ల వీరు తాము ఆరోగ్యంగా ఉన్నామన్న భావనతో బయట తిరుగుతూ ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ మరిన్ని రోజులు కొనసాగటం ఎంతో ప్రమాదకరమని, వీరివల్ల రోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నదని హెచ్చరించారు. నిజానికి వైరస్‌లోనే ఆ వైవిధ్యమున్నదని చెబుతూ రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారిలో మాత్రమే దగ్గు, జ్వరం, జలుబు వంటి వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయని ఐసీఎంఆర్‌ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నిర్మల్‌కుమార్‌ గంగూలీ చెప్పారు.

వీరిలో కూడా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 14 రోజుల మధ్య లక్షణాలు బయటకొస్తున్నాయని, ఈలోగా వీరు కూడా ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో వైరస్‌ ఏ స్థాయిలో విజృంభిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

వైరస్‌ బాధితులను గుర్తించేందుకు మరింత మెరుగైన విధానాన్ని అనుసరించాలని రమన్‌ సూచించారు. అయితే లక్షణాలు కనిపించని వారిని గుర్తించడానికి కొత్త విధానమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్‌ కేసులు నమోదైన ప్రాంతాలు, హాట్‌స్పాట్లలో ఇన్‌ఫ్లూయెంజా తరహా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

వైరస్‌ శరీర కణజాలంలోకి ప్రవేశించగానే తన సంఖ్యను పెంచుకుంటూ వేగంగా విస్తరిస్తున్నదని ప్రొఫెసర్‌ గంగూలీ చెప్పారు. రోగిలోని కణజాలమంతా విషపూరితం కాగానే రోగి మరణిస్తాడని తెలిపారు. ఈ వైరస్‌ గాలిలో 3 నుంచి 4 గంటలపాటు క్రియాశీలంగా ఉంటుందని పేర్కొన్నారు.

తగినని వైరస్‌ పరీక్షలు నిర్వహించకపోవడం, పరీక్షల్లో నాణ్యత లేకపోవడం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోతే కరోనా నియంత్రణకు మరో రెండేండ్లు పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టింగ్‌ కిట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రోగ లక్షణాలు కనిపించని వారిని వేగంగా గుర్తించే అవకాశం ఏర్పడందని భావిస్తున్నారు. మరోవైపు, హాట్‌స్పాట్లను గుర్తించడం ద్వారా వైరస్‌ లక్షణాలు కనిపించని పాజిటివ్‌ కేసుల వ్యాప్తిని నియంత్రించవచ్చని ఉత్తరప్రదేశ్‌ వైద్యశాఖ కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ భావిస్తున్నారు.

కేసులను త్వరగా గుర్తించడం, ఐసొలేషన్‌ ప్రక్రియ ద్వారా ఇలాంటి కేసులను తగ్గించవచ్చని ఎయిమ్స్‌ (రాయ్‌పూర్‌) మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కరన్‌ పీప్రే తెలిపారు. కరోనా మునుపు వచ్చిన పలు వైరస్‌లకంటే భిన్నమైనదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది సార్స్‌ వైరస్‌కన్నా ఎన్నోరెట్లు ప్రమాదకరమైనదని తెలిపారు.

‘కరోనా నిశ్శబ్దంగా మనిషిలోకి చేరుతుంది.. అతని ఎగువ శ్వాసకోశ ప్రాంతంపై దాడి చేస్తుంది’ అని ప్రముఖ వైరాలజిస్ట్‌ పీటర్‌ కోల్‌చిన్‌స్కీ చెప్పారు. సార్స్‌ వ్యాధికి కారణమైన కొవిడ్‌-1వైరస్‌ కూడా గాలిలోని తుంపరుల ద్వారానే శరీరంలోకి ప్రవేశించి నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసింది.

అది వేగంగా మనిషిని అనారోగ్యం పాలుచేసింది. అతిత్వరగా దాని వ్యాధి లక్షణాలు బయటపడటంతో ఆ రోగిని వెంటనే ఇతరులకు దూరంగా క్వారంటైన్‌ చేయడానికి అవకాశం కలిగింది. కానీ 2019లో వచ్చిన కొవిడ్‌-2 (ప్రస్తుత కరోనా) ఎంతో గడసరిది. ఇది శరీరంలోకి చేరి మనిషి గొంతులోని కణాలలో నివాసమేర్పరచుకుంటుంది. దీనివల్ల ఆ వ్యక్తిలో వెంటనే లక్షణాలు బయటపడవు.

బెజవాడకు దడ పుట్టిస్తున్న కరోనా!!

కరోనా మహమ్మారి దెబ్బకు బెజవాడ బెంబేలెత్తుతుంది.రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య పెరగడంతో కృష్ణా జిల్లా విలవిలలాడుతోంది.‌ మహమ్మారి కట్టడికి జిల్లాలో 25 మండలాలను రెడ్ ‌జోన్ ‌లుగా అధికారులు ప్రకటించారు.ఈ రెడ్ జోన్ మండలాల్లో పటిష్టంగా లాక్ ‌డౌన్‌ నిబంధనల్ని అమలు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు గుర్తించిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల పరిధితోపాటు అలాగే దానికి బఫర్‌ జోన్ ‌ను కూడా కలుపుకొని మొత్తం 5 కిలోమీటర్ల పరిధిని రెడ్ ‌జోన్ ‌గా గుర్తించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో 7 కిలోమీటర్ల పరిధిని రెడ్ ‌జోన్ ‌గా పరిగణిస్తారు.

కృష్ణ జిల్లాలో సోమవారం మరో ఐదు కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 80కి చేరింది. కొత్తగా వచ్చిన ఐదు కేసులు విజయవాడ, రూరల్‌ ప్రాంతాల్లో నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్నవారు. గొల్లపూడి, ఆటోనగర్, ఖుద్దూస్‌ నగర్, కానూరు, అయోధ్యనగర్‌లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అధికారులు ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గ్రీన్‌ జోన్‌ పరిధిలోకి వచ్చే 37 మండలాల్లో లాక్‌ డౌన్‌ సడలింపులు వర్తిస్తాయని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు.

విజయవాడ పరిధిలోని ఐదు మండలాలతో పాటు మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, పెనమలూరు, కంకిపాడు, చందర్లపాడు మండలాలను కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు.

రాష్ట్రంలో సోమవారం కొత్తగా 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖ పేర్కొంది. అలాగే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,336 కరోనా కేసులు నమోదు కాగా, 47 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,601కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని, 590 మంది మృతిచెందారని తెలిపింది.

మహానటికే ఓటేసిన మహేష్ బాబు

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో సినీ నటుల కాల్ షీట్స్ చాలా వేస్టవడం జరిగింది. దానికి తగ్గట్టు చాలా సినిమాల్లో తారాగణం విషయం లో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వేళ్ళ బోయే పవన్ కళ్యాణ్ చిత్రం లో హీరోయిన్ సెలక్షన్ విషయం లో కూడా అదే జరిగింది. అలాగే బన్నీ , సుకుమార్ చిత్రం లో కూడా కీలక పాత్రల విషయం లో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగు తున్నాయి. ఇక తాజాగా మహేష్ బాబు సినిమాకి కూడా మార్పులు చేర్పులు తప్పలేదు.

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

`సరిలేరు నీకెవ్వరు ` చిత్రం తో 2020 సంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా ఆరంభించిన మహేష్ బాబు తన తరువాత చిత్రానికి తారాగణం ఎంపిక విషయం లో దర్శకుడితో కల్సి చాలా కష్టపడు తున్నాడు. గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వం లో రూపొంద బోయే తన కొత్త చిత్రానికి కథానాయిక ఎంపికలో ఇంకా స్థిర నిర్ణయానికి రాలేక పోతున్నాడు. మొదట కీర్తి సురేష్ ని అనుకోని ఆ తర్వాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన సారా అలీ ఖాన్ ని హీరోయిన్ గా అనుకొన్నారు. కానీ ఏమైందో తెలియదు గాని ఆ తరవాత `సాహో` ఫేమ్ శ్రద్దా కపూర్ పేరు పరిశీలన లోకి వచ్చింది. ఇపుడు శ్రద్దా కపూర్ ని కూడా కాదనుకొని మొదట అనుకున్నట్టుగా అందాలభామ, మహానటి కీర్తి సురేష్ నే కన్ఫర్మ్ చేశారని రూఢీగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ అటు తమిళంలో రజనీకాంత్ తో ఓ చిత్రం.. ఇటు తెలుగులో `తొలి ప్రేమ ` ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో `రంగ్ దే ` చిత్రం లో నితిన్ తో కలిసి నటిస్తోంది .

కొత్తగా కనిపించాలి అనుకుంటున్న చిరంజీవి

పదేళ్ల విరామం తరవాత హీరో గా వెనక్కి వచ్చినప్పటికీ తన నంబర్ వన్ స్థానం చెక్కు చెదరలేదని నిరూపించు కొన్న చిరంజీవి తన సినీ జర్నీలో జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఆ క్రమంలో తనని తాను కొత్తగా ఆవిష్కరించు కొంటున్నాడు . పాత దర్శకులను పక్కన పెట్టి యువ దర్శకులకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన `సైరా`చిత్రం తో యువ దర్శకుడు సురేందర్ రెడ్డి కి అద్భుత అవకాశం ఇచ్చిన చిరంజీవి తను నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’ద్వారా దర్శకుడు కొరటాల శివ కి మంచి అవకాశం కల్పించాడు. అంతేకాదు ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించ బోయే చిత్రాలన్నీ యువ దర్శకులతోనే ఉంటాయంటూ స్వయంగా తెలపడం జరిగింది .

వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

ఆ క్రమంలో ‘సాహో’ ఫేమ్ సుజిత్ తో మళయాళ రీమేక్ ‘లూసిఫర్’ చేసే ఆలోచన లో వున్నాడు. ఇక ఆ తరవాత సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ తో , కజిన్ బ్రదర్ మెహర్ రమేశ్ లతో ఒక్కో సినిమా చేయాలనుకుంటున్నా అని తెలిపారు .ఇంకా యువ దర్శకుల్లో గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్, రంగస్థలం ఫేమ్ సుకుమార్, గీత గోవిందం ఫేమ్ పరశురామ్ లను తన ఇంట్లోనే ఇటీవల కలిస్ సినిమా చేసే విషయం లో చర్చలు కూడా జరిగాయి అని చెప్పారు. కొరటాల చిత్రం పూర్తయిన తర్వాత తన కొత్త ప్రాజెక్టు ఎవరితో చేస్తానని విషయం గురించి వివరాలు చెబుతానని చిరంజీవి అన్నారు.

సమాధులకు పార్టీ రంగు!

యువ దర్శకులతో పని చేస్తే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని తెలిపారు . ‘నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి , డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్ కు నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది’ అని తెలిపారు .. అలాగే ` తనకు కూడా కొత్త దర్శకులతో , వాళ్ల కొత్త ఆలోచనలతో పని చేయడం స్ఫూర్తి దాయకంగా ఉంటుంది `అని చిరంజీవి చెప్పారు.

Nikki Tamboli Latest Glamorous Pics

Sakshi Dwivedi New Pictures

మరో యువ దర్శకుడికి ఒకే చెప్పిన నాగ చైతన్య

మజిలీ , వెంకీ మామ తరవాత సినిమాల విషయం లో ఆచి తూచి అడుగు లేస్తున్నాడు . అక్కినేని నాగ‌చైత‌న్య…. ఆ క్రమంలో ఇపుడు సెన్సిటివ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఫిదా ఫేమ్ సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. కరోనా లేక పొతే ఈ సినిమా ఏప్రిల్ లేదా మే నెల‌లో విడుద‌ల అయ్యేది

`లవ్ స్టోరీ `త‌ర్వాత నాగ‌చైత‌న్య హీరోగా ప‌రుశురామ్ ఓ సినిమాను లాంఛ‌నంగా ప్రారంబించడం జరిగింది. అయితే అనూహ్యంగా పరుశురామ్‌కు మ‌హేశ్ బాబు సినిమా ఛాన్స్ రావడం తో నాగ చైతన్య సినిమాను ప‌క్క‌న పడేసి వెళ్లిపోయాడు. దాంతో నాగ చైత‌న్య ఇప్పుడు మ‌రో రెండు సినిమాలను లైన్లోకి తెచ్చుకొన్నాడు అందులో ఒకటి ” మనం ” ఫేమ్ విక్రమ్ కుమార్ తో కాగా రెండోది ఒక సక్సెసఫుల్ యువ దర్శకుడు తో వుండబోతోంది .

తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ” V ” మూవీ డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి నాగ చైత‌న్య చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌.. ప్ర‌స్తుతం నాని 25వ చిత్రం ‘వి’ ని డైరెక్ట్ చేస్తున్న మోహనకృష్ణ ఇంద్ర‌గంటి తన తదుపరి చిత్రాన్ని నాగ చైతన్య తో చేయాలని అనుకొంటున్నాడు. కాగా ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత దర్శక ,నిర్మాతలు అనౌన్స్ చేయాలని అనుకొంటున్నారు .

నాలుగు వారాలుగా గుహలోనే ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి!

ముంబై కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ఒక గుహలో తలదాచుకున్నాడు. తాజాగా అతనిని గుర్తించి తన వాళ్ళ దగ్గరకు పంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… ముంబై కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వీరేంద్ర సింగ్‌ డోగ్రా అమర్‌ కంటక్‌ నుంచి గుజరాత్‌ వరకూ నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో (దేశంలోనే ప్రసిద్ధమైన ‘నర్మదా పరిక్రమణ’) పర్యటన చేస్తూ చేస్తూ…. మధ్యప్రదేశ్ చేరుకున్నారు. అనుకోకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అతను ఎటూ వెళ్లలేకపోయాడు ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ లోని రైసెన్‌ జిల్లాలోని ఒక గుహలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మార్చి 24 నుంచి అతను ఆ గుహలోనే ఉన్నాడు.

గత ఆదివారం పశువుల కాపర్లు ఆ దారిలో వెళ్తుండగా… ఆ యువకుడ్ని చూసి… వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆయన్ని ప్రశ్నించగా… తాను ముంబైకి చెందినవాడినని చెప్పి, హైదరాబాదులో ఉంటున్న తన సోదరికి పోలీసులతో ఫోన్ చేయించాడు. ఆ తర్వాత అతనిని కందర్వి గ్రామంలోని బంధువు ఇంటికి తరలించారు.

పవన్ కి 20, మహేష్ కి 2

ఈ మధ్య హిట్ సినిమాలకి వార్షికోత్సవాలు చేయడం మామూలై పోయింది. అలాంటి తరుణం లో ఇవాళ ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలకు వార్షికోత్సవ దినం కావడం విశేషం

తండ్రి కడసారి వీడ్కోలుకు సీఎం దూరం!

పవన్ కళ్యాణ్ నటించిన `బద్రి `సినిమాకి ఇరవై ఏళ్ళు వచ్చాయి. సరిగ్గా 20 ఏళ్ళ క్రితం మిల్లీనియమ్ ప్రారంభం లో ఏప్రిల్ 20 వ తారీఖున బద్రి సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది . కాగా ఈ చిత్రం తోనే పూరీ జగన్నాధ్ దర్శకుడిగా వెండితెరకు పరిచయ మయ్యాడు అలాగే రేణు దేశాయ్ కి కూడా ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం పూర్తి అయ్యాకే రేణు దేశాయ్ , పవన్ కళ్యాణ్ ల వివాహం జరిగింది అలా ఈ సినిమా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ , పూరీ జగన్నాధ్ లకు .ఒక మెమొరబుల్ మూవీ గా నిలిచి పోయింది.

లోకేష్ కు సైకిల్ ఎక్కాలని ఆశ!

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే ఏప్రిల్ 20 న మహేష్ బాబు నటించిన `భరత్ అనే నేను ` చిత్రం విడుదలై ఘన విజయం అందుకొంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా ఈ భరత్ అనే నేను చిత్రం ద్వారా కియారా అద్వానీ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే మహేష్ బాబు , కొరటాల శివ కాంబో లో ఇది రెండో చిత్రం. శ్రీమంతుడు చిత్రం తరవాత వాళ్లిద్దరూ కలిసి చేసిన ఈ చిత్రానికి ఆర్ధిక విజయం తో పాటు , విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి ఆ విధంగా భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు కి మెమొరబుల్ మూవీ అయ్యింది …

లోకేష్ కు సైకిల్ ఎక్కాలని ఆశ!


అధికారం పోయినప్పటికి కూడా తనే ముఖ్యమంత్రిని అని చంద్రబాబు భావిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి అన్నారు. ఒక భ్రాంతికి లోనవుతూ తనే సీఎం ని అనుకుని వీడియోకాన్ఫరెన్స్ లు, జూమ్ కాన్ఫరెన్స్ లు పెడుతున్నట్లు చెప్పారు. తాను సలహాలు ఇవ్వబట్టే కేంద్రంలో నరేంద్రమోదిగారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చూపుతాడన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ విలువలు, మానవతా విలువలు, కుటుంబ విలువలు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి బాబు అని చెప్పారు.

విపత్కర పరిస్థితిలోను రాజకీయ విమర్శలు చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ మానవజాతికే కీడు తెస్తున్న వ్యక్తి, రాక్షస ప్రవర్తన కలిగిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రోజుకు ఒక లెటర్ రాస్తాడని, తను నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్ లలో కొంతమంది తనకు కావాల్సిన వారిని పిలిపించుకుంటాడని తెలిపారు. ఎక్కడో హైదరబాద్ లో కూర్చుని ప్రజలకు ద్రోహం చేస్తున్నాడనే విషయం మరిచిపోవడం శోచనీయమన్నారు.

చంద్రబాబు అనే వ్యక్తి చంద్రముఖిగా ఎందుకు మారిపోయాడనే అనుమానం వచ్చి డాక్టర్లను, సైకియాటిస్ట్ లను, మేధావులను సంప్రదించానని చెప్పారు. ముత్యాలముగ్గు సినిమా ప్రతినాయకుడు రావు గోపాలరావు పరిస్థితి లాగా చంద్రబాబు పరిస్థితి మారిందని చెప్పారు.

బాబు నిజంగా లాక్ డౌన్ లో ఉన్నాడా లేక లాకప్ లో ఉన్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. కొడుకు లోకేష్ నిక్కరు వేసుకుని సైకిల్ తొక్కుతున్న అపురూప దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్లో బయట పడ్డాయన్నారు. చిన్నబాబు సైకిల్ తొక్కాలని ఆశ ఉందని, పెద్దబాబు సైకిల్ దిగడం లేదన్నారు. దిగాలనే ఉద్దేశ్యం లేదని చెప్పారు. చంద్రబాబు కూర్చుంటే సైకిల్ కదలదని, చిన్నబాబు కూర్చుంటే సైకిల్ బతకదని ఎద్దేవా చేశారు.

మహారాష్ట్ర గవర్నర్ వ్యవహారంపై మరో దుమారం!

గతంలో రాజ్ భవన్ లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్నారంటూ విమర్శలు గుప్పించిన బీజేపీ ప్రస్తుతం అదే వరవడిన అనుసరిస్తుంది. తమ పార్టీకి చెందిన వారిని గవర్నర్లుగా చేసి, వారితో బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరం కావించడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.

గత నెలలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర వహించిన రాజ్ భవన్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని అస్థిరం కావించడం కోసం ప్రయత్నం చేస్తున్నదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

థాకరే ను శాసన మండలికి నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై 10 రోజులు దాటినా గవర్నర్ మౌనం వహిస్తూ ఉండడం, తాను ఎంపిక చేసుకున్న వారితో న్యాయ సలహాలు తీసుకొంటూ జాప్యం చేస్తుండడంతో శివసేన నేతలలో అసహనం వ్యక్తం అవుతున్నది.

గత నవంబర్ 27న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన థాకరే ఏ సభలోను సభ్యుడు కారు. ఆరు నెలల లోపుగా ఏదో ఒక సభకు ఎన్నిక కావలసి ఉన్నది. అయితే కరోనా కారణంగా శాసనమండలి ఎన్నికలు వాయిదా పడడంతో మండలికి ఎన్నిక కావడం సాధ్యం కాలేదు. దానితో ఈ నెల 27 లోగా ఆయన మండలి సభ్యుడు కావలసి ఉంది.

అందుకనే నామినేషన్ కోటా నుండి ఆయనను నామినేట్ చేయించాలని మంత్రివర్గం గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కి ఈ నెల 9న సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు గవర్నర్ ఈ విషయంలో చర్య తీసుకోవడంలో జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

గత నవంబర్ లో తెల్లవారు జామున రాష్త్రపతి పాలన రద్దు కాగానే మెజారిటీ విషయం పరిగణలోకి తీసుకోకుండా ఉదయాన్నే దేవేంద్ర ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం హడావుడిగా చేయించిన గవర్నర్ ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది.

గతంలో ఉత్తరాఖండ్ లో బీజేపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గవర్నర్ బీజేపీ నేతల వత్తిడుల మేరకే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. పైగా, గతంలో ఈ విధంగా నామినేషన్ కాబడిన ముఖ్యమంత్రులు, మంత్రుల జాబితాను అడ్వకేట్ జనరల్ ద్వారా రాజ్ భవన్ కు పంపారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకుండా గవర్నర్‌ను ఆపుతోంది ఎవరు? అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సోమవారం సూటిగా ప్రశ్నించారు. కోషియారీ బీజేపీకి చెందిన వ్యక్తి అన్నది అందరికీ తెలిసిన విషయమే అని, కానీ రాజకీయాల్లో మునిగిపోయే సమయం మాత్రం ఇది కాదని రౌత్ చురకలంటించారు.

థాకరే ప్రముఖ రాజకీయ నాయకుడుగానే కాకుండా ప్రజాసేవలో పేరొందిన వారని, ప్రముఖ వన్యజీవుల ఫోటోగ్రాఫర్ అని, ఆయన నామినెట్ కావడానికి అన్ని హర్హలు గలవారని శివసేన నేతలు గుర్తు చేస్తున్నారు.