Home Blog Page 8501

మెగా మేనల్లుడు పెళ్లి చేసుకోబోతున్నాడు


తెలుగు యువ హీరోల్లో పెళ్ళి ధ్యాస ఎక్కువై నట్టుంది. రీసెంట్ గా పెళ్ళికి సిద్దమై కరోనా కారణంగా ఆగిపోయిన వాళ్ళ లిస్టులో నితిన్ , నిఖిల్ ఉండగా తాజాగా మరో యువ హీరో వారితో జత కలవబోతున్నాడు. వన్ ఆఫ్ ది టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకడైన మెగా మేనల్లుడు సాయి( ధరమ్ )తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాయితేజా మాటలు వింటుంటే త్వరలో పెళ్లి పీటలు ఎక్కే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

అష్ట దిగ్బంధనంలో నరసరావుపేట

కెరీర్ లో వరుస ప్లాప్ చిత్రాల్ని చవి చూసి ” చిత్రలహరి , ప్రతిరోజూ పండగే ” చిత్రాలతో మల్లి ఫార్మ్ లోకి వచ్చిన సాయితేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ `తనకు 33 ఏళ్లు వచ్చేశాయని… పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం ఇక కష్టమే నని ` నవ్వుతూ తెలిపాడు. `ఈ ఏడాదే తన పెళ్లి ఉండొచ్చని, ఇంట్లో వాళ్లు అదే పనిలో ఉన్నారని చెప్పాడు. ఏమో.. అదృష్టం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమో` అని సరదా వ్యాఖ్యలు కూడా చేశాడట… ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్ గురించి ప్రస్తావిస్తూ .”. స్కూల్ డేస్ తర్వాత ఇన్ని రోజులు ఇంటి వద్ద ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ ” అని “ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ ” అని ముగించాడట.

అష్ట దిగ్బంధనంలో నరసరావుపేట


ఒకప్పుడు ముఠా కక్షలకు పేరొందిన నరసరావుపేట పట్టణం ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారికి వణికి పోతున్నది. ఒకప్పుడు చిన్న చిన్న పిల్లలు సహితం వీధులలో బాంబులతో చిందులేసిన పట్టణం ఇప్పుడు మరో మనిషిని చూస్తేనే పలకరించడానికి భయపడే పరిష్టితి నెలకొంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఒక చిన్న పట్టణంలో భారీగా కరోనా వైరస్ కేసులు విజృభించడంతో అధికారులు సహితం అవాక్కవుతున్నారు. ఇప్పటికే 148 కేసులు నమోదయ్యాయి. దానితో వరుసగా మూడు రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ప్రకటించారు. పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేశారు.

నెలాఖరే… కేసీఆర్ గురి?

ప్రతి రోజు రెండంకెల స్థాయిలో వైరస్ కేసులు వస్తూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ పట్టణం నుండి పరిసర మండలంలోని గ్రామాలకు సహితం వైరస్ వ్యాప్తి చెందింది. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐకి కూడా వైరస్‌ సోకింది.

ఈ నేపథ్యంలో నరసరావుపేటను మేజర్‌ హాట్‌స్పాట్‌గా గుర్తించినట్టు సబ్‌ కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ వెల్లడించారు. రానున్న మూడు రోజులు పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు.

ఘనంగా ‘జగనన్న బీరు పండుగ’..

ఈ నెల 15 కల్లా జీరో పాజిటివ్‌ కేసులు నమోదే లక్ష్యంగా ‘మిషన్‌ మే 15’ అమలు చేస్తున్నామని దినేష్ కుమార్ వెల్లడించారు. నరసరావుపేటలో సామాజిక వ్యాప్తిలో వైరస్‌ ఉందా? లేదా? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, దీనికోసం ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ


అల వైకుంఠపురంలో చిత్రం తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని ఎన్. టి. ఆర్ తో చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆయన లెక్క ప్రకారం “ఆర్ . ఆర్ . ఆర్ ” సినిమా షూటింగ్ పూర్తి కాగానే తారక్ ఫ్రీ అవుతాడు గనుక వెంటనే సెట్స్ పైకి వెళ్లేలా షూటింగ్ ప్లాన్ చేసుకొంటున్నాడు. అయితే ఉహించని విధంగా కరోనా ఎఫెక్ట్ పడటంతో లాక్ డౌన్ కారణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ షెడ్యూల్స్ మారిపోయాయి. ఆ ప్రభావం ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమాపై పడింది. త్రివిక్రమ్ అనుకున్న సమయానికి ఎన్టీఆర్ తో ప్రాజెక్టును ప్రారంభించే వెసులుబాటు లేదిప్పుడు.

నెలాఖరే… కేసీఆర్ గురి?

దాంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగును పూర్తి చేసి ఎన్టీఆర్ వచ్చేలోగా మరో హీరో తో సినిమా చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో రకరకాల పేర్లు బయటికి వచ్చాయి. చివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో వెంకటేశ్ తో సినిమా చేస్తున్నాడని తేలింది. నిజానికి వెంకటేశ్ తో సినిమా చేయాలని గతంలోనే త్రివిక్రమ్ అనుకున్నాడు. కథ కూడా ఓకే అయ్యింది. కానీ అనుకోని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. చివరకు ఆ కథను ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో త్రివిక్రమ్ వున్నాడని తెలుస్తోంది.

నెలాఖరే… కేసీఆర్ గురి?

తెలంగాణలో లాక్‌‌ డౌన్ పొడిగింపు మే 7తో ముగియనుంది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మంత్రులు మూడోసారి భేటీ కానున్న నేపథ్యంలో.. లాక్‌ డౌన్ కొనసాగింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ జరుగనుంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను ప్రకటించిన కేంద్రం.. రెడ్ జోన్ మినహా మిగతా జోన్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది. సీఎం కేసీఆర్ గ్రీన్, ఆరెంజ్ జోన్లకు సడలింపులు పై చర్చ నడుస్తోంది. కేసీఆర్ కూడా మే 17 వరకు లాక్‌ డౌన్ పొడిగిస్తారా? లేక మే నెల ముగింపు వరకు పొడిగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే, పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడం రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉన్న తెలంగాణ వాసులు.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం కొనుక్కుంటున్న పరిస్థితి నెలకొంది. దీనిపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల, గ్రీన్ జోన్ల పరిధిలో పరిశ్రమలు అనుమతులతో సహా ఇతర అంశాలు చర్చించనున్నారు.

మరోవైపు వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదికను బట్టి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్లు సహా వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్‌ లో చర్చించనున్నారు. ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్‌ లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేందుకు రైతులను అవసరమైన సూచనలు, సలహాలపైనా చర్చించనుంది. కాగా, టెన్త్‌, ఎంసెట్‌, సెట్‌ పరీక్షల నిర్వహణపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

మొత్తం అయిదు సినిమాలు ఒకే చేసిన పవన్ కళ్యాణ్


రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత పవన్ కళ్యాణ్ ఊహించని రీతిలో వెనక్కి వచ్చి సినిమాలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ క్రమంలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ముందుగా దిల్ రాజు , ఏ .ఎం . రత్నం లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు వాటిని ఐదుకి పెంచాడు. మొదటగా ఒప్పుకొన్న ” వకీల్ సాబ్ ” , క్రిష్ డైరెక్షన్ లో ఏ. ఎం. రత్నం చిత్రం తో పాటు ఇపుడు మరో మూడు చిత్రాలకు ఒకే చెప్పాడని తెలుస్తోంది. గతం లో 25 సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇపుడు వాటిని 30 దగ్గర ఆపనున్నాడు. ఆ క్రమంలో 26 వ చిత్రం `వకీల్ సాబ్ `, 27వ చిత్రం క్రిష్ చిత్రం అవుతాయి. ఇపుడు 28 వ చిత్రం గా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ చిత్రం ఉంటుంది. ఇక 29వ చిత్రం గా గోపాల గోపాల , కాటమ రాయుడు ఫేమ్ కిశోర్ కుమార్ పార్ధసాని ( డాలి ) తో చిత్రం చేయనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని నేల టిక్కెట్ , డిస్కో రాజా ఫేమ్ రామ్ తాళ్లూరి నిర్మించనున్నాడు. ఇక 30వ చిత్రం మరియు ఆఖరి చిత్రం గా తన మిత్రుడు దర్శక , రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నట్టు రూఢీగా తెలుస్తోంది.

ఘనంగా ‘జగనన్న బీరు పండుగ’..

ఇక ఈ సినిమాలను నిర్మిస్తున్న దర్శక , నిర్మాతలకు పవన్ కళ్యాణ్ కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. ఆయన విధించిన షరతుల ప్రకారం సినిమాల్లో తన ఆలోచనా విధానం మాత్రమే ఉండాలి గాని , అనవసర రాజకీయ ప్రస్తావన వద్దు అని ఖరాఖండి గా చెప్పాడట ….సినిమా వేరు , రాజకీయం వేరు, అయినా సినిమాఎపుడూ ఆనంద పెట్టేదిగానే ఉండాలి . అని తేల్చి చెప్పాడట.

నిమ్మగడ్డ విచారణకు సిఐడి మొగ్గు!


కేంద్ర హోంశాఖకు ఎపి మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇటీవల రాసిన లేఖపై విచారణ జరుపుతున్న సిఐడి ఈ విషయంలో నేరుగా రమేష్ కుమార్ ను విచారించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

ఘనంగా ‘జగనన్న బీరు పండుగ’..

ఈ లేఖను తానే వ్రాసానని స్వయంగా రమేష్ కుమార్ ప్రకటన చేసినా, ఆ మేరకు రాష్ట్ర హై కోర్ట్ లో అఫిడవిట్ ను సమర్పించినా, కాదు దానిని టిడిపి కార్యాలయంలో తయారు చేసారని నిరూపించడం కోసం సిఐడి తంటాలు పడుతున్నట్లు కనిపిస్తున్నది.

అంతే కాదు ఆ లేఖపై సంతకం చేసినది రమేష్ కుమార్ కాదని అంటూ వైసిపి ఎంపీ వి విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సిఐడి ఆ దిశలో పెద్దగా పురోగతి సాధించున్నట్లు కనబడటం లేదు.

వారం రోజుల వ్యవధిలో ఈ లేఖ విషయమై గతంలో నిమ్మగడ్డ వద్ద సహాయ పిఎగా పనిచేసిన సాంబమూర్తిని రెండు సార్లు సిఐడి బృందం విచారించడం గమనార్హం. ఆ లేఖ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మెయిల్‌ ద్వారా కేంద్ర హోంశాఖకు పంపినట్లు గుర్తించారు.

మహిళకి 9నెలల గర్భం మాయం!

అయితే ఆ లేఖను ఎవరు ప్రిపేర్‌ చేశారు?, ఆ వ్యక్తి ఐపి అడ్రస్‌ ఏంటి? అనే కోణంలో అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. మొయిల్‌ నుంచి లేఖను నిమ్మగడ్డ డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు పిఎ సాంబమూర్తి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. లేఖను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక హార్డ్‌డిస్క్‌ను క్లియర్‌ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే అనేకసార్లు విచారణ జరిపిన సిఐడి అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఏదో విధంగా నిమ్మగడ్డను, టిడిపికి మధ్య సంబంధాన్ని వెల్లడి చేయడం ద్వారా తాము ఆయనను పదవి నుండి అర్ధాంతరంగా తొలగించడంను సమర్ధించుకొనే ప్రయత్నం వైసిపి నేతలు చేస్తున్నారు. అందుకు సిఐడి ని సాధనంగా ఉపయోగించుకొంటున్నారు.

మహిళకి 9నెలల గర్భం మాయం!

ఆమె 9నెలలు నిండిన నిండు గర్భిణీ, ఆ రోజు రాత్రి ఏమి జరిగిందో తెలియదు. తెల్లవారేసరికి గర్భం మాయమైంది. విషయం తెలుసుకున్న డాక్టర్లు, నర్సులు, గ్రామస్థులు ఆశ్చర్యానికి గురువుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే..జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడ్ మండలంలో పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన మానస మంజుల (25)కు ఆరేళ్ల క్రితం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేష్‌ తో వివాహం జరిగింది. కానీ అప్పటి నుండి ఆమె గర్భం దాల్చలేదు. గత ఏడాది గర్భం నిలబడడంతో ప్రతి నెల ఆశా వర్కర్ల సహాయముతో మానోపాడు పిహెచ్‌సిలో పరీక్షలు చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమె 9 నెలల నిండు గర్భిణి. ఈ క్రమంలో శనివారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి PHCకి వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో తనను ఇంటికే తీసుకెళ్ళలని కోరింది. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికే తీసుకెళ్లారు. ఆ రాత్రి ఆమె పడుకొని ఆదివారం ఉదయం లేచే సరికి ఆమె గర్భం మాయమైంది. ఇదే విషయాన్ని ఆమెను అడగగా దేవుడొచ్చి తీసుకెళ్లాడని చెబుతుంది.

మంజులను చూసి డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్ తిన్నారు. ముందు రోజు రాత్రి ఆమెకు గర్భం ఉన్నదని.. కానీ ఇప్పుడు కనబడడం లేదని ఏఎన్ఎం, ఆశా వర్కలు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలియడంతో డాక్టర్ దివ్య ఆస్పత్రికి చేరుకొని ఆమెను పరిశీలించారు. ఆమె కడుపుతో ఉన్నప్పుడు పరీక్షలను తాను చేశానని.. కానీ ఇప్పుడు కడుపు కనిపించడం లేదని చెప్పారు. ఆమె డెలివరీ అయ్యినట్లు, అబార్షన్ చేయించుకున్నట్లు కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని తెలిపారు.

స్కానింగ్ చేస్తే తప్ప అసలు ఏం జరిగిందో తెలియదని డాక్టర్ చెప్పారు. ఐతే దేవుడు ఆవహించాడనే విషయం అవాస్తవమని.. స్కానింగ్ రిపోర్టును బట్టి నిజాలు తెలుస్తాయని తెలిపారు. మరోవైపు ఆమె నిండు కడుపుతో ఉన్న మాట వాస్తమని.. మా కళ్లతో మేము చూశామని ఆశా వర్కర్లు చెబుతున్నారు. అసలు గర్భం ఎలా మాయమైందో అర్ధం కావడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు, భర్త కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఘనంగా ‘జగనన్న బీరు పండుగ’..


రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిపై మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో జగనన్న ”బీరు పండుగ” ఘనంగా ప్రారంభమయ్యిందని పేర్కొన్నారు. మద్యనిషేదం మాటున చీకటి దందా యథేచ్ఛగా సాగుతుందని, మద్యనిషేధం అంటే రేట్లు పెంచడం అని వైసీపీ కొత్త అర్థం చెప్పిందని ట్వీట్ చేశారు.

లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు

వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ అమ్మి జనాల ఆరోగ్యంతో చెల‌గాట‌మాడ‌ట‌మ‌ని సీఎం జగన్ స‌రికొత్త అర్థం చెప్పారని, లాక్‌డౌన్ టైములో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల‌క‌లు తాగిన కోట్ల రూపాయ‌ల‌ మ‌ద్యం లెక్క‌లు స‌రిచేసేందుకే వైన్ సేల్స్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారని విమర్శించారు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధించి పడేస్తాను అని ఎన్నికల ముందు జగనన్న చెప్పిన మాటలను గుర్తు చేశారు.

మాజీ ఎస్ఈసీ కేసు విచారణను రేపటికి వాయిదా..!


రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణను రేపటికి వాయుదా వేసిన హైకోర్టు సీజే మహేశ్వరి ప్రకటించారు. పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉదయం 11గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల పాటు కొనసాగిన వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు బండారుపల్లి ఆదినారాయణ, వేదుల నారాయణలు నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడం రాజ్యాంగ విరుద్దమని వాధించారు. ధర్మాసనం ముందు తమ అభ్యంతరాలను పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలియజేశారు.

కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?

ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ శాసనసభను అపహాస్యం చేసే విధంగా ఉందని, ఇది రాజ్యాంగాన్ని మోసం అని వేదుల వెంకట రమణ న్యాయవాది వాదించారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చినా అది రమేష్ కుమార్ పదవీకాలం తరువాత ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్చాయుతంగా, నిస్పాక్షికంగా నిర్వహించేందుకు హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్ సహాయపడుతుందనేది ప్రభుత్వం స్పష్టం చేయలేకపోయిందని ఆయన వాదించారు. కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఆయన ఉదహరించారు. తరువాత సుప్రీంకోర్టుకు చెందిన మరో సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రేపు మరికొంతమంది పిటిషనర్ల వాదనలు విననున్న హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

ప్రతి కోడికి ఒకరోజు వస్తదంటే ఇదేనేమో!

“ప్రతి కుక్కకి ఒకరోజు వస్తదనేది” సాధారణ నానుడి కానీ ఇప్పుడు అలాకాదు “ప్రతి కోడికి ఒకరోజు వస్తది” అనాలేమో.. ఎందుకంటే కరోనా పుణ్యమా అని ఒకప్పుడు చికెన్ ని పట్టించుకున్న వారు లేరు. వ్యాపారులు కొంద‌రు స‌గం ధ‌ర‌కు, ఇంకోంద‌రు ఉచితంగా కోళ్ల‌ను పంపిని చేసి పెట్టిన పెట్టుబ‌డిని సైతం న‌ష్టపోయారు.కానీ ఇప్పుడు సీను మారింది. తాజాగా చికెన్ తింటే క‌రోనా రాద‌ని తేల‌డంతో జ‌నాలు చికెన్ సెంట‌ర్ల ముందు క్యూ క‌డుతున్నారు..

నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో పౌల్ట్రీ రంగం ఒడిదుడుకుల మ‌ద్య ఊగిస‌లాడుతుంది. గ‌త మార్చి నెల‌లో క‌రోనా ప్ర‌భావంతో పౌల్ట్రీ రైతులు న‌ష్టాల‌ను చ‌విచూసారు.. జనాల ఎవరూ కూడా చికెన్ సెంటర్లకు రాలేదు. చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కొందరు పౌల్ట్రీ వ్యాపారులు కోళ్లను ఫ్రీగా అడవిలో వదిలేశారు.. మరికొందరు ప్రజలకు పంపిణీ చేశారు. మరికొందరు కిలో యాభై రూపాయలకు అమ్ముకున్నారు. కొంద‌రు పూర్తిగా వారు పెట్టిన పెట్టుబడిరాకపోగా.. వారి శ్రమ‌కూడా వృధా అయింద‌ని వాపోయారు. తాజాగా ప‌రిస్థితి భిన్నంగా ఉంది.. చికెన్ ద్వారా కరోనా వస్తుందనేది పుకార్లేనని నమ్మిన జనాలు ఇప్పుడు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు అదే చికెన్ కిలో రెండు వందలు పలుకుతోంది. చికెన్ సెంటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు తొందరపడి ఒక నెల రోజులు ఆగితే మంచి లాభాలు గడించే వారిమని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆప్పుడు క‌రోనాతో.. ఇప్పుడు ఎండ‌ల‌తో పౌల్ట్రీ వ్యాపంరం న‌ష్టాల్లో కురుకుపోయింది.. అయితే చికెన్ సెంటర్ వ్యాపారులు మాత్రం పెద్దగా నష్టపోలేదు. కానీ పౌల్ట్రీ వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టాన్ని చవిచూశారు.. కిలోకు రెండు వందలు పలికిన మాకు ఎలాంటి లాభం లేదని మా వద్ద నుంచి వంద రూపాయలకు కిలో చికెన్ తీసుకెళ్తున్నారని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు… ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ సహాయం అందించి పౌల్ట్రీ రంగాన్ని కాపాడాలని కోరుతుంది… మ‌ట‌న్ ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో చికెన్ తిందామంటే చికెన్ ధ‌ర 250 దాటడంతో చికెన్ కూడా కొనలేక పోతున్నామ‌ని పలువురు వాపోతున్నారు.

కరోనా భాదితులకు సాయం చేసిన అందరి హీరోల ఫాన్స్


కరోనా విపత్తు వల్ల సినిమా రంగానికి సంబందించిన అన్ని విభాగాలు ఇబ్బందుల్లో పడ్డాయి. షూటింగులు లేక సినిమాలు ఆగిపోయాయి. ఇక రెడీ అయిన సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు..సినిమాలు ప్రదర్శించడం ఆగిపోయి థియేటర్ లు మూతబడ్డాయి దాంతో థియేటర్ల మీద ఆధారపడి బతికే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయం బాగా తెలిసిన సినీ హీరోల ఫాన్స్ ఒక గొప్ప పనిచేశారు .

కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?

ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం పట్టణం లో ఉన్న మెగా హీరోల ఫాన్స్ ,అక్కినేని ఫాన్స్ , ఘట్టమనేని ఫాన్స్ , ప్రభాస్ ఫాన్స్ అందరూ కల్సి ఒకే త్రాటి పైకి వచ్చి తమకు తోచిన రీతిలో విజయనగరం థియేటర్లలో పనిచేసే సిబ్బందికి నిత్యావసరాలు సరఫరా చేశారు. మెగా హీరోల ఫాన్స్ 500 కిలోల బియ్యం ఇవ్వగా , ప్రభాస్ ఫాన్స్ 120 కిలోల గోధుమ పిండి ,గోధుమ రవ్వ ఇవ్వడం జరిగింది ఇక ఘట్టమనేని ఫాన్స్ 60 కందిపప్పు , శనగ పప్పు ఇవ్వగా , అక్కినేని ఫాన్స్ 110 కిలోల ఆయిల్ పాకెట్స్ ఇవ్వడం జరిగింది. తమ హీరోలను దేవుళ్లుగా , సినిమా థియేటర్ లను దేవాలయాలుగా భావించే సినీ అభిమానులు ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టి అందరిచేత శభాష్ అనిపించు కున్నారు .

ఆ మద్యం షాపు దగ్గర ఒక్కరు లేరు..!


రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజుల లాక్ డౌన్ అనంతరం తిరిగి ప్రభుత్వ ఆదేశాలతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా మద్యం ప్రియులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి. మద్యం షాపుల వద్ద పోలీసులు కాపలా ఉన్నా ఫలితం లేదు. వీటన్నిటికీ విరుద్ధంగా ఒక గ్రామంలో మాత్రం మద్యం షాపు తెరిచి ఉన్నా ఒక్కరు మద్యం కొనేందుకు రాలేదు. ఆ షాపు వద్ద పోలీసుల కాపలా లేరు. అక్కడ క్యూ లైను లేదు. తోపులాటలు లేవు. ఏంటి ఈ ఆశ్చర్యం అనుకుంటున్నారా. అక్కడ ఆ గ్రామ మహిళలు ఉన్నారు.

కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?

ఈ సంఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఈ రోజు అన్ని మద్యం షాపుల్లాగానే ఉదయం 11 గంటలకు తెరుచుకుంది. స్థానికంగా ఉండే మహిళలు దుకాణం వద్దకు చేరుకొవడంతో మద్యం కొనేందుకు ఎవరు దైర్యం చేయలేదు. కరోనా తీవ్రత దృష్ట్య మద్యం దుకాణాన్ని తెరవడానికి వీల్లేదని, దుకాణం తెరవడం వల్ల చుట్టూ ప్రక్కల గ్రామాల వారు ఇక్కడకు వస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన దుకాణాన్ని మూసేయాలని కోరారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు కొద్దిసేపటికి దుకాణం సర్దేశారు.

లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు

మరోవైపు జిల్లాలోని మచిలీపట్నం రెడ్ జోన్లో ఉంది. సమీపాన గ్రీన్ జోన్ లో ఉన్న గూడూరు కి చేరుకున్న మచిలీపట్నం, చిలకలపూడి ప్రాంతాలకు చెందిన వేలాది మంది మద్యం ప్రియులతో అక్కడి షాపుల వద్ద రద్దీ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ జోన్ లకు సమీపంలో ఉన్న గ్రీన్ , ఆరెంజ్ జోన్ల లోకి మద్యం బాబుల చొరబాటు యత్నాలు జోరుగా సాగుతున్నాయి. రెడ్ జోన్ వారిని రానివ్వమని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తీరు కొనసాగితే రెడ్, గ్రీన్ జోన్ లు ఏకం పాకం కానున్నాయి. మద్యం అమ్మకాల పుణ్యమా అని, “కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్” కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గంగాజలం కరోనాకు చెక్ పెట్టనుందా..!


ఇతిహాసాల్లో గంగ పవిత్రత గురించి ఎన్నో కథలు ఉన్నాయి. శివుడి తలపై కొలుదీరిన గంగ భారతీయ సంస్కృతిలో భాగమై పోయింది. గంగానదిలో స్నానమచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని అనేది భారతీయుల నమ్మకం. అయితే గత కొన్నేళ్లుగా మానవుడు చేస్తున్న తప్పిదాల వల్ల గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ నదిలోని నీరు అసలు తాగడానికి కూడా పనికి రాకుండా మారాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘నామామీ గంగా’ పేరిట గంగానదిని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టింది. వేల కోట్ల రూపాయాలు ఖర్చుపెట్టినప్పటికీ గంగానదిలోని కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయారు.

కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?

అయితే కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచమంతా లాక్డౌన్ చేయబడింది. ఈనేపథ్యంలో వాయు, జల, భూ కాలుష్యం తగ్గాయి. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మరి ప్రకృతికి మాత్రం మంచినే చేసింది. జల కాలుష్యం తగ్గడంతో గంగనది కాలుష్యం పూర్తిగా తగ్గిపోయిందని కాలుష్య నియంత్రణ బోర్డ్ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం గంగానదిలోని నీటిని నేరుగా తాగొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కట్టడికి గంగాజలం ఔషధంగా పని చేస్తుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!

గంగానది నీటిపై నింజా వైరస్ జీవిస్తోంది. దీనినే మనదేశంలో గంగత్వ అని పిలుస్తున్నారు. నిజానికి అది వైరస్ కాదు.. ఒక రకమైన బ్యాక్టరియా. ఇందులో కరోనా వైరస్ ను తరిమికొట్టే శక్తివంతమైన స్ట్రెయిన్ ఉందని అతుల్య గంగా వ్యవస్థాపకుడు మేజర్ మనోజ్ కేశ్వర్ (రిటైర్డ్) చెబుతున్నారు. ఆయన కోరిక మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖలోని గంగా శుద్ధి జాతీయ మిషన్ భారత వైద్య పరిశోధనా మండలికి ప్రతిపాదన చేసింది. ఊహాకల్పితంగా ఈ ప్రతిపాదన తీసుకురాలేద‌ని.. ఇందుకు బలమైన కారణం కూడా ఉంద‌ని మనోజ్ కేశ్వర్ తెలిపారు. గంగా జలంలోని నింజా వైరస్.. కరోనా వైరస్‌ను చంపుతుందో లేదో పరిశీలించడంలో తప్పు లేదు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇది విజయవంతమైతే మానవాళికి మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?


అవును.. మీరు అనుకుంటున్నది నిజమే.. కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందే.. లేకపోతే లాక్ డౌన్ 1, 2.0, 3.0ల తర్వాత లాక్ డౌన్ 4.0, 5.0 ఇలా వస్తూనే ఉంటుంది. ఆ కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. కరోనాను లాక్ డౌన్ తో కొంతవరకు ఆపగలం కానీ.. స్వీయ నియంత్రణతోనే దాన్ని నివారింగలమని అందరికీ అర్థమైంది. ఇప్పుడు కోట్ల మంది ఇంట్లో ఉన్నా కరోనా ప్రబలుతోంది. వారు బయటకొస్తే అప్రమత్తంగా ఉంటే అంతే స్థాయిలో ఉంటుంది. అసలు కరోనా అన్న భయాన్ని వీడి.. దాన్ని ఒక రోగంగా జనాలు భావించి చికిత్సకు రెడీ అయితేనే బెటర్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. లేదంటే ఎన్నాళ్లు ఇలా లోకానికి దూరంగా నాలుగు గోడల మధ్య జనం బతుకుతారు. పిచ్చోళ్లు అయిపోతారు. పనిలేక.. ఉపాధి కరువై.. డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో చస్తారు. కరోనాతో పోయిన చావులు కంటే ఈ ఆఫ్టర్ కరోనా ఆర్థిక ఇబ్బందులతో చనిపోయే వారి సంఖ్య బాగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

*సీఎం జగన్ మాట అక్షరసత్యమేనా?
సీఎం జగన్ ఈ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇటీవలే ఓ మాట అన్నారు. కరోనా కూడా ఒక వ్యాధిలా భావించాలని.. జ్వరంతో పోల్చారు. మానసికంగా దీనికి సిద్ధపడి జనాలంతా బయటకు రావాలని.. లాక్ డౌన్ ను ఎంతో కాలం కొనసాగించి ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!

*జగన్ అన్నట్టే సాగుతోందిగా..
సీఎం జగన్ ఇటీవల ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లోనూ లాక్ డౌన్ ఎత్తివేయాలని.. సడలింపులు ఇవ్వాలని.. దిగజారిన ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదాలని.. కరోనా ఓన్ చేసుకొని అందరికీ స్వేచ్ఛ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సీఎం జగన్ చెప్పినట్టే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 48 గంటల్లోనే 5వేల కేసులు పెరిగాయి. దీన్ని లాక్ డౌన్ తో కంట్రోల్ చేయడం కష్టమని తేలింది.

*స్వీయ నియంత్రణతో ఎవరి పనులు వారు చేస్తే బెటర్
కరోనాను లాక్ డౌన్ తో కంట్రోల్ చేయలేం. అందుకే ప్రజలు కరోనాకు భయపడకుండా వారిని మానసికంగా ప్రభుత్వాలు సిద్దం చేయాలి. అది సాధారణ జలుబు, జ్వరంగా భావించి చికిత్సకు రెడీ అయ్యి అందరూ పనులకు రావాలి చేసుకోవాలి. లేదంటే నెలలకు నెలలు కూర్చొని తిన్నా తరగిపోకపోవడానికి మనకు తాతలు సంపాదించిన ఆస్తులు లేవు. చేసుకుంటేనే పని. అందుకే లాక్ డౌన్ ను దేశంలో ఎత్తివేసి స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు తీసుకొని సామూహికంగా ఉండే థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, బార్స్, రెస్టారెంట్లను మినహాయించి అన్ని పనులు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలి. లేదంటా ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుదేలయ్యే అవకాశాలు లేకపోలేదు.. సో ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

–నరేశ్ ఎన్నం

కరోనా మరణాల వెనుక అసలు రహస్యం అదేనంట..!


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీఒక్కరిని కబలించేందుకు సిద్ధమవుతోంది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడుతున్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా సైతం కరోనాకు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం చెందింది. కరోనాలు మరణాలు అమెరికాలో ఎక్కువగా ఉండటం శోచనీయంగా మారింది. ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, యూకే లాంటి అగ్ర దేశాలు కరోనాపై పోరులో సాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే కరోనా మరణాలు అధికంగా నమోదు కావడానికి గల కారణాలను తాజాగా బ్రిటన్ కు చెందిన ప్రవాసీ భారతీయ వైద్యుడు వెల్లడించారు.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!

బ్రిటన్‌లోని జాతీయ వైద్యసేవా విభాగంలో ముఖ్యమైన వారిలో డాక్టర్ అసీమ్ మల్హోత్రా ఒకరు. భారత సంతతికి చెందిన మల్హోత్రా కరోనా మరణాలకు గల కారణాలను వివరించారు. కరోనాపై పోరాటంలో ప్రతీ ఒక్కరి జీవన విధానంలో మార్పులు అవసరమని ఆయన అన్నారు. కరోనాపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువగా ఊబకాయం, అధిక బరువు కలిగినవారే ఉంటున్నారని తెలిపారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక కరోనా మరణాలకు వారి ఆహారపు అలవాట్లేనని కారణమని ఆయన స్పష్టంచేశారు.

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

ముఖ్యంగా టైప్-2 మధుమేహం, బీపీ, గుండెజబ్బులు కరోనా మరణాలకు ముఖ్య కారణం అవుతున్నాయన్నారు. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకపోవడం అనేది ప్ర‌ధాన స‌మస్యగా మారిందన్నారు. అమెరికా, బ్రిటన్లో 60శాతం పైగా ప్ర‌జ‌లు స్థూలకాయులేనని ఆయన గుర్తు చేశారు. ఇండియాలోనూ ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనాకు మందులేకపోవడంతో మరణాలను ఎలా అరికట్టాలో తెలియక చాలా దేశాలు సతమతమవుతున్నాయని తెలిపారు. సరైన వాక్సిన్ అందుబాటులో లేకపోవడం, ఆయా దేశాల్లోని ఆహార అలవాట్లు కరోనా మరణాల రేటు పెరగడానికి కారణమని ఆయన వివరించారు. సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవన విధానాన్ని కొన్నిరోజుల్లో సాధించవచ్చన్నారు.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!

దేశంలో రోజు రోజుకి కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,074 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం వరకు మొత్తం 11,706 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ స్థాయిలో కోవిడ్‌-19 నుంచి బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.  ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 27.52 శాతంగా ఉన్నట్లు  ప్రకటించింది.

గత 24 గంటల్లో  కొత్తగా 2,553 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 42,533కు పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 29,453 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల 1389 మంది మరణించారు.  మహారాష్ట్ర(12974), గుజరాత్‌(5428), ఢిల్లీ(4549), తమిళనాడు(3023) రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

పిన్ని కొడుక్కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్న చిరంజీవి


2004 లో ” వీర కన్నడిగ ” ( తెలుగులో ఎన్ టి ఆర్ ఆంధ్రావాలా ) చిత్రం తో దర్శకుడిగా మారిన మెహెర్ రమేష్ మెగా స్టార్ చిరంజీవికి పిన్ని(అమ్మ చెల్లి ) కొడుకు. కాగా మెహెర్ రమేష్ కెరీర్ లో చేసింది ఆరంటే ఆరు సినిమాలు. వాటిలో రెండు కన్నడ చిత్రాలు ” వీర కన్నడిగ ” , ” అజయ్ “( తెలుగులో ఒక్కడు ) , ఎన్ టి ఆర్ `కంత్రి `, ప్రభాస్ `బిల్లా` వంటి రెండు తెలుగు చిత్రాలు జస్ట్ హిట్ అనిపించు కొన్నాయి. చివరగా తీసిన ఎన్ టి ఆర్ `శక్తి ` , వెంకటేష్ ” షాడో ” చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో మెహెర్ రమేష్ కి సినిమాలు ఇవ్వాలంటే నిర్మాతలు వెనుకంజ వేశారు. అలా మెహెర్ రమేష్ కి ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. కాగా ఇపుడు మెగా స్టార్ చిరంజీవి అతనికి ఒక సినిమా ఛాన్స్ ఇవ్వడం జరుగుతోంది .

లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు

గతంలో రీమేక్ సినిమాలు తీసి పర్వాలేదు మంచి డైరెక్టరే అనిపించుకొన్న మెహెర్ రమేష్ కి ఇపుడు చిరంజీవి కూడా రీమేక్ సినిమా చేయమని చెప్పడం జరిగింది. దరిమిలా మెహెర్ రమేష్ ఇపుడు చిరంజీవి కోసం ఒక తమిళ బ్లాక్ బస్టర్ సినిమాని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2015 లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించగా బ్లాక్ బస్టర్ అయిన ” వేదాళం ” సినిమాని ఇపుడు తెలుగులో రీమేక్ చేసేందుకు మెహెర్ రమేష్ పూను కొన్నాడు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి అనుగుణం గా ఆయన సలహాతో మార్పులు చేర్పులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ .వి . ప్రసాద్ తెలుగులో తీయబోతున్నాడు గతంలో చిరంజీవి చేసిన రీమేక్ చిత్రాలైన ” పున్నమి నాగు, విజేత , పసివాడి ప్రాణం , చట్టానికి కళ్లులేవు , ప్రతిబంద్ , హిట్లర్ , ఘరానా మొగుడు, ఠాగూర్ , శంకర్ దాదా M B B స్ , ఖైదీ నెం.150 ” వంటి రీమేక్ లు అన్నీ బ్లాక్ బస్టర్స్ కావడం విశేషం . అందువల్లనే చిరంజీవి రీమేక్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది .