
2004 లో ” వీర కన్నడిగ ” ( తెలుగులో ఎన్ టి ఆర్ ఆంధ్రావాలా ) చిత్రం తో దర్శకుడిగా మారిన మెహెర్ రమేష్ మెగా స్టార్ చిరంజీవికి పిన్ని(అమ్మ చెల్లి ) కొడుకు. కాగా మెహెర్ రమేష్ కెరీర్ లో చేసింది ఆరంటే ఆరు సినిమాలు. వాటిలో రెండు కన్నడ చిత్రాలు ” వీర కన్నడిగ ” , ” అజయ్ “( తెలుగులో ఒక్కడు ) , ఎన్ టి ఆర్ `కంత్రి `, ప్రభాస్ `బిల్లా` వంటి రెండు తెలుగు చిత్రాలు జస్ట్ హిట్ అనిపించు కొన్నాయి. చివరగా తీసిన ఎన్ టి ఆర్ `శక్తి ` , వెంకటేష్ ” షాడో ” చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో మెహెర్ రమేష్ కి సినిమాలు ఇవ్వాలంటే నిర్మాతలు వెనుకంజ వేశారు. అలా మెహెర్ రమేష్ కి ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. కాగా ఇపుడు మెగా స్టార్ చిరంజీవి అతనికి ఒక సినిమా ఛాన్స్ ఇవ్వడం జరుగుతోంది .
లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు
గతంలో రీమేక్ సినిమాలు తీసి పర్వాలేదు మంచి డైరెక్టరే అనిపించుకొన్న మెహెర్ రమేష్ కి ఇపుడు చిరంజీవి కూడా రీమేక్ సినిమా చేయమని చెప్పడం జరిగింది. దరిమిలా మెహెర్ రమేష్ ఇపుడు చిరంజీవి కోసం ఒక తమిళ బ్లాక్ బస్టర్ సినిమాని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2015 లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించగా బ్లాక్ బస్టర్ అయిన ” వేదాళం ” సినిమాని ఇపుడు తెలుగులో రీమేక్ చేసేందుకు మెహెర్ రమేష్ పూను కొన్నాడు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి అనుగుణం గా ఆయన సలహాతో మార్పులు చేర్పులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ .వి . ప్రసాద్ తెలుగులో తీయబోతున్నాడు గతంలో చిరంజీవి చేసిన రీమేక్ చిత్రాలైన ” పున్నమి నాగు, విజేత , పసివాడి ప్రాణం , చట్టానికి కళ్లులేవు , ప్రతిబంద్ , హిట్లర్ , ఘరానా మొగుడు, ఠాగూర్ , శంకర్ దాదా M B B స్ , ఖైదీ నెం.150 ” వంటి రీమేక్ లు అన్నీ బ్లాక్ బస్టర్స్ కావడం విశేషం . అందువల్లనే చిరంజీవి రీమేక్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది .