
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణను రేపటికి వాయుదా వేసిన హైకోర్టు సీజే మహేశ్వరి ప్రకటించారు. పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉదయం 11గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల పాటు కొనసాగిన వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు బండారుపల్లి ఆదినారాయణ, వేదుల నారాయణలు నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడం రాజ్యాంగ విరుద్దమని వాధించారు. ధర్మాసనం ముందు తమ అభ్యంతరాలను పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలియజేశారు.
కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?
ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ శాసనసభను అపహాస్యం చేసే విధంగా ఉందని, ఇది రాజ్యాంగాన్ని మోసం అని వేదుల వెంకట రమణ న్యాయవాది వాదించారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చినా అది రమేష్ కుమార్ పదవీకాలం తరువాత ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్చాయుతంగా, నిస్పాక్షికంగా నిర్వహించేందుకు హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్ సహాయపడుతుందనేది ప్రభుత్వం స్పష్టం చేయలేకపోయిందని ఆయన వాదించారు. కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఆయన ఉదహరించారు. తరువాత సుప్రీంకోర్టుకు చెందిన మరో సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రేపు మరికొంతమంది పిటిషనర్ల వాదనలు విననున్న హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.