Home Blog Page 8673

పవన్ కళ్యాణ్ పారితోషికం తగ్గించుకున్నాడు.. ఎందుకో తెలుసా..!

 

పవన్ నటిస్తున్న పింక్ సినిమాకు మొదట భారీ పారితోషికం ఇవ్వాలని నిర్మాత దిల్ రాజు భావించాడు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తప్ప నాన్ థియేట్రికల్ రైట్స్ కి పెద్దగా డిమాండ్ లేదట. ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. కారణం ఈ సినిమా మిగతా భాషలలో కూడా రిలీజ్ అయి.. అక్కడ టీవీలలో కూడా ప్రచారం అయ్యిందట. కావున ఈ సినిమాను కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించారని వినికిడి.

 

బైక్ నడుపుతూ స్నానం చేసిన యువకులు… వీడియో వైరల్

 

ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

 

ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

వెంకటేష్ ‘నారప్ప’ లీక్డ్ వీడియోస్.. సోషల్ మీడియాలో వైరల్

 

తమిళ హిట్ మూవీ అసురన్ ను తెలుగులో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్ బాబు మరియు వి క్రియేషన్స్ అధినేత కళై పులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ధనుష్ చేసిన అసురన్ పాత్ర సీనియర్ హీరో అయిన వెంకటేష్ ఎలా చేయగలడు. అసలు నారప్ప పాత్రకు వెంకటేష్ ఎలా సెట్ అవుతాడు అంటూ చాలా మంది అనుకున్నారు. ఇదో వృదా ప్రయత్నంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.

 

ఎప్పుడైతే నారప్ప ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పుడే సినిమాపై జనాల్లో ఉన్న అభిప్రాయం మారిపోయింది. అసురన్ తెలుగు రీమేక్ కు వెంకటేష్ న్యాయం చేస్తాడనే నమ్మకం వ్యక్తం అయ్యింది. ఫస్ట్ లుక్ తో నమ్మకం కలుగగా ఇప్పుడు ఒక లీక్డ్ వీడియోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా కళ్యాణదుర్గంలోని ప్రముఖ దేవాలయంలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ సందర్బంగా కొందరు వీడియోలు చిత్రీకరించడం జరిగింది.

 

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారప్ప లుక్ లో వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ మరియు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే ఖచ్చితంగా నారప్పగా వెంకీ ఆకట్టుకుంటాడనే నమ్మకం మరింత ఎక్కువ అవుతుంది. వెంకీ కెరీర్ లో ఇది మరో ఛాలెంజింగ్ రోల్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమా నిలుస్తుందని వెంకటేష్ అభిమానులు అప్పుడే నమ్మకం పెట్టుకున్నారు.

 

అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

 

రీసెంట్ గా సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టి వెకేషన్ ని అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారుమహేష్. అయితే ఆయనకు త్వరలో సర్జరీ జరగబోతోందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మోకాలు నెప్పితో బాధపడుతున్నారు. దాంతో ఈ నెలాఖరున సర్జరీ చేయించుకోబోతోన్నట్లు తెలుస్తోంది. సర్జరీ అనంతరం ఐదు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట.

 

Read More: టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..

 

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు’ సినిమా టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో మోకాలు దెబ్బ తగిలింది. 2017లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే డాక్టర్స్ చెప్పినట్లు రెస్ట్ తీసుకోకపోవటంతో మళ్లీ మొదటికి వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో మరోసారి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకోబోతున్నారు. తన తదుపరి సినిమాకు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఏప్రియల్, మే నెలలో ఆయన హైదరాబాద్ రానున్నారు.

 

రవితేజ రేర్ ఫోటోలు: అసిస్టెంట్ స్థాయి నుండి హీరో

 

రేంజ్..!

ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. తనకు మహర్షి వంటి మరుపరాని హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు వినికిడి. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం జేమ్స్ బాండ్ తరహా క్యారక్టరైజేషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం సగంలో ప్రారంభించి వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని రిలీజ్ చేస్తారు.

 

తండ్రితో కాపురం చెయ్యమని బలవంతం చేసిన శాడిస్ట్ భర్త..!

రవితేజ రేర్ ఫోటోలు: అసిస్టెంట్ స్థాయి నుండి హీరో రేంజ్..!

 

అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసే సమయంలో దర్శకుడు కృష్ణవంశీ సలహా మేరకు హీరోగా మారాడు రవిశంకర్ రాజు భూపతిరాజు అలియాస్ రవితేజ. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నాడు.అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసే సమయంలో దర్శకుడు కృష్ణవంశీ సలహా మేరకు హీరోగా మారాడు రవిశంకర్ రాజు భూపతిరాజు అలియాస్ రవితేజ. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసు యాభై పైబడినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అంతే ఎనర్జిటిక్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. సినిమాల్లో తప్ప ఈ హీరో బయట పెద్దగా కనిపించడు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు .

 

Read More: టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..

 

Read More: 2020 సమ్మర్… రీమేక్ స్పెషల్

Read More: బంగార్రాజు మూవీ అప్ డేట్.. ఎప్పుడు విడుదల కాబోతుంది అంటే…!

Read More: 2020 సమ్మర్… రీమేక్ స్పెషల్

Read More: బంగార్రాజు మూవీ అప్ డేట్.. ఎప్పుడు విడుదల కాబోతుంది అంటే…!

Read More: రవితేజ రేర్ ఫోటోలు: అసిస్టెంట్ స్థాయి నుండి హీరో రేంజ్..!

పవన్‌ కల్యాణ్‌-క్రిష్ సినిమాకి హీరోయిన్‌ ఫిక్స్‌!

 

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వేగం పెంచాడు. రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన పవన్‌.. తాజాగా వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘పింక్‌’రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్‌ సాధించిన పింక్‌ రిమేక్‌ను పవన్‌ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి, నివేదా థామస్‌, అనన్య పాండేలు నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నారట.

 

కాగా, ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని కూడా సెట్స్‌ పైకి తీసుకెళ్లె పనిలో పవన్‌ ఉన్నట్లు సమాచారం. ఎప్పటినుంచో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్‌ సరసన ‘కంచె’ ఫేమ్‌ ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు అనధికారిక సమాచారం.

 

చారిత్రక నేపథ్యంతో పాటు ఓ ఎమోషనల్‌ విప్లవాత్మకమైన పాయింట్‌ను కూడా టచ్‌ చేస్తున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. అంతేకాకుండా ఈ చిత్రంలో మంచి కోసం పరితపించే ఓ దొంగ పాత్రలో పవన్‌ నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్‌ చిత్రం కూడా లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల్లోకి పవన్‌ రీఎంట్రీతో అయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

 

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు మరో 13 మందిని హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఓ లేఖను విడుదల చేశారు. కన్నడంలో ఉన్న ఆ లేఖ.. ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్న వారిని హతమార్చేందుకు ఈ నెల 29న ముహూర్తంగా నిర్ణయించామని.. అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు నిజగుణానంద స్వామి మఠానికి ఈ లేఖ వచ్చింది. అయితే ఆశ్రమ నిర్వాహకులు ఆ లేఖను జిల్లా ఎస్పీకి అందించారు.

 

పవన్ కళ్యాణ్ పారితోషికం తగ్గించుకున్నాడు.. ఎందుకో తెలుసా..!

మహేష్ బాబు వాడే లగ్జరీ కార్లు ఇవే..!

 

క్లాస్, మాస్, యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాల్లో స్మార్ట్ లుకింగ్ స్టైల్‌తో నటనను పండించగలడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుకు మేల్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో… ఫీమేల్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు. ఆరంబడ సన్నివేశాలకు దూరంగా ఉండే మహేష్ యువతను మాత్రమే కాకుండా పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాడు.

 

టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్ హీరో ఎలాంటి కార్లు వాడతాడో తెలుసా..?

 

Read More: RRR: ఎన్టీఆర్ పులితో ఫైటింగ్.. వీడియో లీక్

 

వానిటీ వ్యాన్ – రూ. 6.2 కోట్లు…

టయోటా ల్యాండ్ క్రూజర్ – రూ.92 లక్షలు…

ఆడి ఏ8 – రూ.1.12 కోట్లు…

రేంజ్ రోవర్ వోగ్ – రూ.2.1 కోట్లు…

Read More: పవన్‌ కల్యాణ్‌-క్రిష్ సినిమాకి హీరోయిన్‌ ఫిక్స్‌!

జూబ్లిహిల్స్ లో ఇల్లు – రూ.14 కోట్లు…

ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ ట్రిప్ లో ఉన్నారు. రాగానే దర్శకుడు వంశి పైడిపల్లి.

RRR: ఎన్టీఆర్ పులితో ఫైటింగ్.. వీడియో లీక్

 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మిక సినిమా ఆర్ ఆర్ ఆర్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. ప్రస్తుతం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబందించిన ఓ పిక్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. మరో ముఖ్య పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని నటిస్తున్నాడు.

 

Read More: టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..

 

అది అలా ఉంటే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు లీకేజ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇది వరకే ఈ సినిమా షూటింగ్ సంబందించి లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అవడంతో ఆ మధ్య ఎన్టీఆర్ లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ షూటింగ్ లొకేషన్ పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంది. అయినా లీక్ సమస్య తగ్గలేదు. అందులో భాగంగా తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్‌కు సంబందించిన ఓ విజువల్ బయటికొచ్చింది. ఈ ఫైట్ ఓ పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన హోరా హోరిగా జరిగేది. అంతేకాదు ఈ పోరాట సన్నివేశం సినిమాలోని కీలకమైన అంశం అట. దీంతో ఎంతో ప్రయాసతో దీన్ని తెరకెక్కించింది చిత్రబృందం. ఈ విషయం తెలుసుకున్న టీమ్, తారక్ లుక్ బయటికి లీక్ కావడంతో వెంటనే అప్రమత్తమై.. కాపీ రైట్ ఇష్యూ కింద ఆ వీడియోను ఆన్ లైన్ నుండి తొలగించారు.

 

Read More: పవన్‌ కల్యాణ్‌-క్రిష్ సినిమాకి హీరోయిన్‌ ఫిక్స్‌!

కత్రినా కైఫ్ పెళ్లి .. అమితాబ్, జయా బచ్చన్ చేతుల మీదుగా..

 

అదేంటి.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లా..? ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగింది.. ఇంతకీ ఎవరితో జరిగింది అనుకుంటున్నారా..? జరిగింది.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ఇండియన్ సినిమా నుంచి దిగ్గజాలు హాజరయ్యారు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. నాగార్జున, ప్రభు, శివరాజకుమార్ సహా అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యాడు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. వీటిని షేర్ చేసింది కూడా నాగార్జుననే. అయితే ఇదంతా నిజం పెళ్లి మాత్రం కాదు.. నగల దుకాణం ప్రమోషన్ కోసం తీసిన యాడ్‌లో కత్రిన పెళ్లి కూతురిగా నటించింది.

 

అందులో నాగార్జునతో పాటు పలువురు సూపర్ స్టార్స్ కనిపించారు. అందులో కత్రిన పెళ్లి కూతురిగా కనిపించగా.. అమితాబ్, జయా బచ్చన్ ఆమె తల్లిదండ్రులుగా నటించారు. ఇక నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్ ఆ పెళ్లికి వచ్చిన అతిథులుగా నటించారు. ఈ యాడ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

జస్టిస్ ఫర్ దిశ:దట్ ఈజ్ కెసిఆర్!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన “దిశ” ఘటన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో తెరపడినట్లయింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను గమనిందాం..

గతనెల 27 రాత్రి ‘దిశ’ సంఘటన చోటుచేసుకుంది. ఈ భయంకర ఘటనను అనేకమంది ఖండించారు. ఇటు తెలుగు న్యూస్ చానల్స్ అటు జాతీయ మీడియా “జస్టిస్ ఫర్ దిశ” అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. సినీప్రముఖులు, మహిళా సంఘాలు, మేధావులు, దేశంలోని వివిధ రాజకీయపార్టీ నేతలు ఈ ఘటనను ఖండిస్తూ వారి నిరసనలను తెలియజేసారు. పార్లమెంట్ లో కూడా ఈ సంఘటన పై చర్చ జరిగింది. ఇంత గందరగోళం జరుగుతున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బాధిత కుటుంబాన్ని చూసి వెళ్తుంటే ఇక్కడేవున్న ముఖ్యమంత్రి కనీసం కుటుంబాన్ని పలకరించి నాలుగు ఉపశమన మాటలు చెప్పకపోవటం వెనక మిస్టరీ ఏంటో ఎవరికీ తెలియలేదు. పైగా ఢిల్లీ టూర్ లో భాగంగా తెరాసపార్టీ నేత ఇంట్లో పెళ్ళికి వెళ్లారు. ఇక ఈ విషయంలో జాతీయ మీడియా కెసిఆర్ పై దుమ్మెత్తి పోశాయి. ‘దిశ’ సంఘటపై స్పందించలేదు కానీ ఢిల్లీ లో పెళ్ళికి వెళ్లారంటూ ఆయనను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత ఎప్పటికో దిశ ఘటన పై స్పందించినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఇదంతా గతం ఇప్పుడు సీన్ మారింది. ‘దిశ’ ఘటన వెనుక కెసిఆర్ మౌనం వీడింది. ఆయన ఉగ్రరూపం బయటపడ్డది. “దిశ” నిందితులు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. విమర్శించిన వారే ఇప్పుడు కెసిఆర్ గ్రేట్ అంటున్నారు. ఆయనపై ప్రశంసల పరంపర మొదలైంది. కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనా వేశామని నాలుక కరుచుకుంటున్నారు. “వేర్ ఈజ్ కెసిఆర్?” అనే పరిస్థితి నుండి “దట్ ఈజ్ కెసిఆర్” అనే లెవెల్ కి మారిపోయారు. విమర్శల జల్లు నుండి తప్పించుకొని ప్రశంసల వర్షంలో పడ్డాడు

అప్పుడు ఆ ముగ్గురు… ఇప్పుడు ఈ నలుగురు….

 

హైదరాబాద్‌లో షాద్ నగర్ సమీపంలో ‘దిశ’ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ప్రధాన నిందితులు ఆరీఫ్, శివ, నవీన్ మరియు చెన్నకేశవులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నేరస్థలం పునర్నిర్మాణం కోసం అక్కడికి తీసుకెళ్లిన నిందితులు తమ తుపాకులను తీసుకొని పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించారని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని వారు తెలిపారు.

 

అయితే, శుక్రవారం ఉదయం జరిగిన సంఘటనలు పదకొండు సంవత్సరాల క్రితం 2008 దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో వరంగల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ ఒకే తీరిగా ఉన్నాయి. ‘దిశ’ యొక్క అత్యాచారం కేసును నిర్వహిస్తున్న టాప్ పోలీసు, సైబరాబాద్ పోలీసు చీఫ్ విసి సిజ్జనార్, వరంగల్ ఎన్‌కౌంటర్ సమయంలో పోలీసు సూపరింటెండెంట్ గా ఉండటం గమనార్హం.

2008 లో ఏమి జరిగింది?

2008 డిసెంబర్‌లో ఇద్దరు మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులపై యాసిడ్ పోసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఉమ్మడి ఏపీ పోలీసులు కాల్చి చంపారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్ ప్రతిపాదనను స్వాప్నికా తిరస్కరించడంతో వరంగల్ పట్టణంలోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు స్వాప్నికా, ప్రణీతలపై దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రావు (25), అతని సహచరులు పి.హరికృష్ణ (24), బి సంజయ్ (22) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

 

ఈ రోజు (శుక్రవారం) నివేదించిన ఎన్‌కౌంటర్ మాదిరిగానే, అప్పటి ఎస్పీ ఒక పోలీసు బృందం సాక్ష్యాలను సేకరించడానికి నిందితులతో కలిసి నేరస్థలానికి వెళ్లిందని చెప్పారు. అయితే, ఆ ముగ్గురు నిందితులు ముడి బాంబులతో పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ముగ్గురు నిందితులను చంపిన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు సజ్జనార్ చెప్పారు.

 

అప్పటి వరకు తక్కువ ప్రొఫైల్ కాప్ అయిన సజ్జనార్ అప్పటికి ‘ఎన్‌కౌంటర్ కాప్’ అనే పేరును సంపాదించాడు. బాలికపై దాడి చేసిన 48 గంటల్లోనే అరెస్టులు జరిగాయి, ఎన్‌కౌంటర్ కొద్ది రోజుల్లోనే జరిగింది. ఎన్‌కౌంటర్‌ను నిందితుల కుటుంబాలు, హక్కుల కార్యకర్తలు ప్రశ్నించినప్పటికీ, సజ్జనార్ స్థానిక హీరో అయ్యాడు. ఇప్పుడు దేశ హీరో అయ్యాడు.

 

ఇద్దరు బాధితులు, ప్రణిత మరియు స్వాప్నికా మరియు వారి కుటుంబాలు కూడా ఈ ఎన్‌కౌంటర్‌ను స్వాగతించారు.

 

“శ్రీనివాస్ చంపబడ్డాడని నేను సంతోషించాను ” అని స్వప్నికా తండ్రి దేవేందర్ రెడిఫ్ తెలిపారు.

ఆ విషయంలో కెసిఆర్ ని పొగిడి.. పప్పులో కాలేసిన జగన్!

 

ఏపీలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘మహిళలకు రక్షణ ఎలా కల్పించాలి” అనే విషయంలో చర్చ జరగగా సీఎం జగన్ “దిశ” ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దిశ” నిందితులను ఎన్ కౌంటర్ విషయాన్ని సమర్ధిస్తూ ఈ విధంగా మాట్లాడారు.. ‘అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్’…అని. ఈ మాట ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంటే దిశా హంతకుల్ని ఎన్ కౌంటర్ చేయమని కేసీఆర్ గారు పోలీసులకు ముందే చెప్పారా? మరి అందేంటి.. తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, దాడి చేసినందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు! అది నిజంకాదా??!” అని అనేకమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 

అసలే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ కౌంటర్ విషయంలో చాలా సీరియస్ గా ఉండగా ఇప్పుడు జగన్ మాటలు కెసిఆర్ కి మరింత తల నొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు!. ఇదిలా ఉండగా మరోవైపు మహిళా సంఘాలు కూడా ఎన్ కౌంటర్ విషయంలో కాస్త గుస్సుగా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటన్న వారిని కూడా చంపేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఏపీ సీఎం మాటలు వారికి మరింత ఊతం ఇచ్చినట్లయింది. అలాగే ప్రస్తుతం ఏపీలో 2014 నుండి 2019ల మధ్య అనేక రేప్ కేసులు జరిగాయి. అందులో వైసీపీ పార్టీ నేతలుకూడా ఉన్నారు. 2014లో 82, 2015లో 100, 2016లో 116, 2017లో 105, 2018లో 93 కేసులు, 2019 జగన్ సీఎం అయ్యాక దాదాపు 40 పైగా రేప్ కేసులు పెండ్డింగ్ లో ఉన్నాయి వారందర్ని కూడా కెసిఆర్ పంథాలో జగన్ ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు, అనేక విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ఈ విమర్శలు ఇప్పుడే రాక పోవచ్చు కానీ మున్ముందు రావొచ్చు. ఇది, ఇలా ఉండగా ఈ జగన్ పొగడ్తల పై కెసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి…

 

మా ఈ కామెంట్ నిజమని చెప్పడానికి…. జగన్ విమర్శలు ఎదురుకోబోతున్నారు అనడానికి…

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెరాస కొత్త డ్రామా!

 

గత నెల(నవంబర్) 27న రాత్రి 9.30 నుండి తర్వాత రోజు ఉదయం 3.30 మధ్య కాలంలో “దిశ” ఆత్యాచారం గావించబడి, హత్యకు గురైంది. నిజానికి ఆ రోజు రాత్రే దిశ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు కానీ పోలీసుల నిర్లక్యం వల్ల ‘దిశ’ ఉదంతం విషాదంగా మారింది.ఈ మాటలకు అనేకమంది ఏకీభవించి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే సంఘటన జరిగిన తరువాత అనేకమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆ ఘటనను ఖండించారు, దిశ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. ఈ రెండు విషయాలపై మీడియాలో, ప్రజల్లో పెద్ద ఎత్తున్న అటు పోలీసుల పైన ఇటు కెసిఆర్ పైన వ్యతిరేకత వచ్చింది.

 

అదే సమయంలో దిశ నిందితులకు 14రోజుల రిమాండ్ విధించి, చర్లపల్లి జైలులో ఉంచారు. వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో పోలీసులు, హైకోర్టు కి అప్పీల్ చేసుకొని, నిందితులను బయటకు తీసుకొచ్చి చాలా తెలివిగా ఎన్‌కౌంటర్‌ చేశారు. “ఒక్క దెబ్బకు రెండు పిట్టలు” అనే సామెత తరహాలో ఇటు పోలీసుల పైన వ్యతిరేకత పోవడమే కాకుండా ప్రజల్లో హీరోలుగా ముద్ర వేయించుకున్నారు, అటు కెసిఆర్ పై విమర్శలు పోవడమే కాకుండా ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు, అందులో భాగంగా నిన్న ఏపీ సీఎం జగన్ కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే..

 

ఇప్పుడు మళ్ళీ సీన్ మారింది. ఒక వైపు జాతీయ మానవ హక్కుల కమిటి, మరో వైపు మహిళా సంఘాలు, కెసిఆర్ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి. అందరికి ఒకే న్యాయం చేయాలి “ధనికులకో న్యాయం-దళితులకో న్యాయమా?” అంటూ విమర్శల పర్వం మొదలయింది. అలాగే దిశ నిందితుల కుటుంబాల పైన సానుబూతి పెరుగుతుంది, వారికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్న తరుణంలో కెసిఆర్ సర్కార్ కొత్త డ్రామాకు తెర లేపింది. దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెరాస కొంత సానుభూతిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు తార్కాణంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యువకుల తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు చాలా బాధపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సునీత తరహాలోనే నిందితుల కుటుంబీకులకు, మరికొంత మంది తెరాస నేతలు సానుభూతి తెలిపే అవకాశాలు లేకపోలేదు.

26 ఏళ్ళ దిశకో న్యాయం-9నెలల పాపకో న్యాయమా?

 

షాద్ నగర్ సమీపంలో దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయి. 26 ఏళ్ళ దిశను చంపేస్తే ఎన్ కౌంటర్ చేశారు.. కానీ 9నెలల పాపని చంపేస్తే యావజ్జీవ శిక్ష వేస్తారా? అంటూ.. వస్తున్న విమర్శలతో వరంగల్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్‌కు శిక్ష తగ్గించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మానవ మృగానికి మరణ శిక్షే విధించేందుకు అప్పీల్‌ చేస్తామని ప్రకటించారు.

 

2019లో తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల పాపపై అత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్‌కు శిక్ష తగ్గింపుపై వరంగల్ పోలీసు కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రకటించారు.

“9నెలల ‘పాప’ అత్యాచారం-హత్య” కేసు పూర్తి వివరాలు..

2019 జూన్‌లో హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారి(శ్రీహిత)పై ప్రవీణ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. జూన్‌ 17 రాత్రి చిన్నారి కుటుంబ సభ్యులు నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత తల్లి రచనకు మెలకువ రాగా… పక్కనే కుమార్తె లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్‌ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ప్రవీణ్‌ భుజాన టవల్‌లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ప్రవీణ్‌ పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు.

 

 

అయితే, ప్రవీణ్‌ను పట్టుకున్న భరత్‌ చితకబాదాడు. అప్పటికే చిన్నారిలో ఎలాంటి కదలికా లేదు. శరీరం నుంచి అధికంగా రక్తస్రావమైంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా రోదించారు. ప్రవీణ్‌.. చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పసికందు హత్యతో హన్మకొండ అట్టుడికిపోయింది. ప్రవీణ్‌ను ఉరి తీయాలంటూ జనం ఆందోళనకు దిగారు.

 

చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రెండు నెలల లోపే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. ఈ కేసులో ముద్దాయి ప్రవీణ్‌… గత జూన్‌ 18న రాత్రి తల్లి పొత్తిళ్లలో పడుకొన్న పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చినట్లు హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి జూన్‌ 24 ప్రారంభమైన విచారణ… ఆగస్టు 2న ముగిసింది. పోలీసులు కూడా సవాల్‌గా తీసుకొని 20 రోజుల్లోనే కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని కోర్టులో హాజరుపర్చారు. ప్రవీణ్‌ను దోషిగా నిర్ధారించిన వరంగల్‌ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి.

 

చిన్నారిపై అత్యాచారం కేసులో ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో ఈ కేసును విచారించిన ధర్మాసనం… ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా సవరిస్తూ తీర్పునిచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు సమాజంలోని చాలా వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రవీణ్‌ కూడా అలాగే చంపేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

ఉల్లి కొరతపై టిక్ టాక్ వీడియోలు… నవ్వకుండా ఉండలేరు

 

ఉల్లిపాయల ధర పెరగడంతో ప్రజలు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. అక్కడ వారు వారి పరిస్థితి గురించి సోషల్ మీడియా పోస్టుల ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఆనియన్స్ క్రైసిస్ టిక్‌టాక్‌ను కూడా తాకింది.

 

 

 

 

షార్ట్ వీడియో యాప్‌లోని భారతీయ వినియోగదారులు ఉల్లిపాయలు ధరల పెరుగుదల తమను ఎలా ప్రభావితం చేసిందో చూపించడానికి ఉల్లాసమైన వీడియోలతో ముందుకు వచ్చారు. కొన్ని డబ్బుకు బదులుగా ఉల్లిపాయలు దొంగిలించడం గురించి ఫన్నీ వీడియోలు అయితే, మరికొందరు ఆభరణాలతో సురక్షితంగా ఉల్లిపాయలను లాక్ చేసిన వీడియోలను ఉంచారు. ఒక ఆటో ప్రయాణీకుడు డబ్బులకు బదులుగా ఉల్లిపాయలు చెల్లించాడు.

తంతే, వెళ్ళి బూరెల బుట్టలో పడ్డ నిత్యానంద!

 

‘స్వామి నిత్యానంద’ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలో పెద్దగా పరిచేయం అవసరం లేదు. ఎందుకంటే భారత్ లో ఉన్నప్పుడు స్వామిగారు చేసిన ఘన కార్యాలు అన్నీ, ఇన్నీ కావు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా పేరు గడించిన తర్వాత తనపై ఉన్న కేసులకు భయపడి దేశం దాటిన విషయం తెలిసిందే. అయితే నిత్యానంద ఏ దేశం వెళ్లి ఉంటాడంటూ విపరీతమైన చర్చ నడిచింది. తాజాగా, ఈ విలక్షణ స్వామి వెస్టిండీస్ దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలం క్రితమే అక్కడి దీవుల్లో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసిన స్వామీజీ దానికి కైలాసదీవి అని నామకరణం కూడా చేశారు. అంతేకాదు, తన దీవికి దేశం హోదా ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశాడు. అంతటితో ఆగకుండా, తన దేశంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకంగా పాస్ పోర్టును కూడా రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిత్యానంద తన సొంత దీవిలోనే మకాం వేసినట్టు సమాచారం! తంతే వెళ్లి బూరెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో మరి!

 

సొమ్ము ప్రజలది-సోకు కేసీఆర్ ది

 

52రోజుల సమ్మె అనంతరం టీఎస్ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటాం అని సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే. వారిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఆర్టీసీ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. “సొమ్మొకడిది సోకొకడిది” అంటే సొమ్మేమో ప్రజలది సోకేమో కెసిఆర్ ది. ఎందుకంటే సమ్మెలో టీఎస్ఆర్టీసీ కార్మికులు సాధించింది ఏమి లేకపోగా అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ప్రతిపక్షాల మాటలు విని ఆర్టీసీ జేఏసి నేతలు తప్పు దారిలో వెళ్లారనేది వాస్తవం. మరోవైపు కెసిఆర్ కూడా మెట్టు దిగక పోవడంతో పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అంటే కెసిఆర్, జేఏసి నేతలు పంతాలకుపోయి టీఎస్ఆర్టీసీకి వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చారని తెలుస్తుంది. మరి ఈ నష్టం ఎవరు భరించాలి అంటే రాష్ట్ర ప్రజలు భరించాలి అని చావు కబురు చల్లగా చెప్పారు మన ముఖ్యమంత్రిగారు. “మన బిడ్డలు” “మన వాళ్ళు” “మనమెలా పోగొట్టుకుంటామంటూ” తియ్య తీయగా మాట్లాడి నష్టాన్ని మొత్తం ప్రజల మీదికి నెట్టారు. కిలోమీటర్ కి 20పైసలే పెంచుతున్నాం అని భలేగా మాట్లాడారు. దానివల్ల ఆర్టీసీ ఏడాదికి 752కోట్లు ఆదాయం చేకూరుతుందని కమ్మగా.. ప్రజలకు దెబ్బ తగలకుండా చెప్పారు.

 

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిలో దేవాలయాన్ని పునర్నిర్మించటం కోసం వందలకోట్ల ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చుపెట్టటం ఎంతవరకు సబబు? కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఒక మిస్టరీ. ఎన్ని లక్షల ఎకరాలకు నీరొస్తుందో ఇప్పటికీ తెలియదు. ఇంతగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచటమే కదా? ఇవన్నీ సరిపోవన్నట్లు మరలా కొత్తగా ప్రజల మీద అదనపు భారం పెట్టటం సబబా? ప్రియమైన ముఖ్యమంత్రిగారు…

 

ఇకపై తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది.

 

సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15 పెంచారు. డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20 పెరగనుంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ. 25 పెంచారు. ఇకపై రాజధాని, వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35 పెరగనుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ. 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ. 75 పెంచారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్ పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. ఆర్డీనరీ బస్ ధర రూ. 950, ఎక్స్‌ప్రెస్ రూ. 1070, డీలక్స్ రూ. 1185‌గా ఉండనుంది.