
అల వైకుంఠపురంలో చిత్రం తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని ఎన్. టి. ఆర్ తో చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆయన లెక్క ప్రకారం “ఆర్ . ఆర్ . ఆర్ ” సినిమా షూటింగ్ పూర్తి కాగానే తారక్ ఫ్రీ అవుతాడు గనుక వెంటనే సెట్స్ పైకి వెళ్లేలా షూటింగ్ ప్లాన్ చేసుకొంటున్నాడు. అయితే ఉహించని విధంగా కరోనా ఎఫెక్ట్ పడటంతో లాక్ డౌన్ కారణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ షెడ్యూల్స్ మారిపోయాయి. ఆ ప్రభావం ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమాపై పడింది. త్రివిక్రమ్ అనుకున్న సమయానికి ఎన్టీఆర్ తో ప్రాజెక్టును ప్రారంభించే వెసులుబాటు లేదిప్పుడు.
దాంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగును పూర్తి చేసి ఎన్టీఆర్ వచ్చేలోగా మరో హీరో తో సినిమా చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో రకరకాల పేర్లు బయటికి వచ్చాయి. చివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో వెంకటేశ్ తో సినిమా చేస్తున్నాడని తేలింది. నిజానికి వెంకటేశ్ తో సినిమా చేయాలని గతంలోనే త్రివిక్రమ్ అనుకున్నాడు. కథ కూడా ఓకే అయ్యింది. కానీ అనుకోని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. చివరకు ఆ కథను ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో త్రివిక్రమ్ వున్నాడని తెలుస్తోంది.