రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత పవన్ కళ్యాణ్ ఊహించని రీతిలో వెనక్కి వచ్చి సినిమాలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ క్రమంలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ముందుగా దిల్ రాజు , ఏ .ఎం . రత్నం లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు వాటిని ఐదుకి పెంచాడు. మొదటగా ఒప్పుకొన్న ” వకీల్ సాబ్ ” , క్రిష్ డైరెక్షన్ లో ఏ. ఎం. రత్నం చిత్రం తో పాటు ఇపుడు మరో మూడు చిత్రాలకు ఒకే చెప్పాడని తెలుస్తోంది. గతం లో 25 సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇపుడు వాటిని 30 దగ్గర ఆపనున్నాడు. ఆ క్రమంలో 26 వ చిత్రం `వకీల్ సాబ్ `, 27వ చిత్రం క్రిష్ చిత్రం అవుతాయి. ఇపుడు 28 వ చిత్రం గా గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ చిత్రం ఉంటుంది. ఇక 29వ చిత్రం గా గోపాల గోపాల , కాటమ రాయుడు ఫేమ్ కిశోర్ కుమార్ పార్ధసాని ( డాలి ) తో చిత్రం చేయనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని నేల టిక్కెట్ , డిస్కో రాజా ఫేమ్ రామ్ తాళ్లూరి నిర్మించనున్నాడు. ఇక 30వ చిత్రం మరియు ఆఖరి చిత్రం గా తన మిత్రుడు దర్శక , రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నట్టు రూఢీగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలను నిర్మిస్తున్న దర్శక , నిర్మాతలకు పవన్ కళ్యాణ్ కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. ఆయన విధించిన షరతుల ప్రకారం సినిమాల్లో తన ఆలోచనా విధానం మాత్రమే ఉండాలి గాని , అనవసర రాజకీయ ప్రస్తావన వద్దు అని ఖరాఖండి గా చెప్పాడట ….సినిమా వేరు , రాజకీయం వేరు, అయినా సినిమాఎపుడూ ఆనంద పెట్టేదిగానే ఉండాలి . అని తేల్చి చెప్పాడట.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: 5 promising films lined up for pawan kalyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com