Home Blog Page 8502

కేటీఆర్ నోట జగన్ మాట!

కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.” కొంతకాలం పాటు కరోనాతో కలిసి జీవనం సాగించాల్సి ఉంటుందని” ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అవే మాటలను ఊటంకించారు. కరోనాకి వ్యాక్సిన్ లేదా ఔషధాన్ని కనుగొనేవరకు ప్రజలు వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోవాలని కేటీఆర్ అన్నారు.

కరోనా కట్టడిలో దేశం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ తర్వాత భారత్ కు అధిక పెట్టుబడులు వచ్చేలా కృషి జరగాలని ఆయన అబిప్రాయపడ్డారు. ఔషధ ఉత్పత్తి ప్రాధాన్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి మౌలిక వసతుల కోసం రూ. నాలుగు వేల కోట్లను కేంద్రం సమకూర్చాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుత పరిణామాలు జీవితాలకు, జీవనోపాధికి మధ్య బొమ్మా బొరుసు వంటివి కాకూడదని ఆయన అన్నారు.

అయితే జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ,సిపిఐ నేత రామకృష్ణ, మరికొందరు టిడిపి నతలు ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి కెటిఆర్ కూడా అదే విషయం చెప్పారు.

రాశిఖన్నా కి తమిళ్ లో రెండు పెద్ద ఆఫర్లు


ఊహలు గుసగుస లాడే `చిత్రం తో తెరంగేట్రం చేసిన రాసి ఖన్నా అందం, అభినయం రెండూ ఉన్న కథానాయిక అనే చెప్పాలి. తొలి సినిమాలోనే ఆమె ఈ రెండు విషయాల్లో ప్రూవ్ చేసుకొంది. కానీ చేసింది చిన్న సినిమా కావడంతో పెద్ద సినిమాల్లో ఇంకా ఛాన్స్ రాలేదు. దాంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. ఆ మధ్య ‘జై లవకుశ’ చిత్రం లో ఎన్ టి ఆర్ సరసన నటించినా కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

ఇక 2018 లో వచ్చిన ‘తొలి ప్రేమ’ మరియు 2019 లో వచ్చిన ” ప్రతిరోజూ పండగే” సినిమా లతో టాలెంటెడ్ అని ప్రూవ్ అయినా కానీ రాశి ఖన్నా కోరుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దరిమిలా తమిళంలోకి వెళ్లి చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది రాశి ఖన్నా. ఆ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య సరసన ” ఆరువా ” అనే చిత్రం లో నటించబోతోంది. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో రూపొందే ఈ ” ఆరువా ” చిత్రం లాక్ డౌన్ ఎత్తగానే ప్రారంభం అవుతుంది.. దీంతో పాటు ఖుష్బూభర్త సి . సుందర్ దర్శకత్వంలో ‘ఆరణ్మయి-3’ అనీ సినిమా కూడా \ఆమె చేస్తున్నట్టు చెప్పింది.. ఈ వివరాలన్నీ తాజాగా ట్విట్టర్ చిట్ చాట్‌లో వెల్లడించింది. ఐతే తెలుగులో మాత్రం రాశి ఖన్నా తన కొత్త సినిమాల వివరాలు తెలియ చేయలేదు.

మోదీ గుజరాత్ కే ప్రధానా.. నిప్పులు చెరిగిన శరద్ పవర్


పుష్కర కాలం పాటు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన, గుజరాత్ లో తాను చేసిన `నమూనా అభివృద్ధి’ని చూసి ఓట్లు వేస్తే దేశం అంతా అట్లాగే చేస్తానని అంటూ ఓట్లు అడిగి ప్రధానిగా పదవి చేపట్టిన నరేంద్ర మోదీ ఢిల్లీకి వచ్చి ఆరేళ్లయినా గుజరాత్ వాసనలను విడనాడలేక పోతున్నారు.

`గుజరాత్ నమూనా’తో దేశం అంతా అభివృద్ధి చేసే ప్రయత్నం అంటూ ఏమీ చేయలేక పోయారు గాని, గుజరాత్ పారిశ్రామిక వేత్తలకు పెద్ద పీఠం వేయడం, గుజరాత్ కు విశేషమైన ప్రయోజనాలు కేంద్రం నుండి లభించేటట్లు చూడడంతో పాటు గతంలో గుజరాత్ లో తన వద్ద పనిచేసిన అధికారులకు కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు మాత్రం చేబడుతున్నారు. నేడు ఢిల్లీని పాలిస్తున్నది `గుజరాత్ లాబీ’ అనే ప్రచారం ఉంది.

వలస కూలీలకు కాంగ్రెస్ చేయూత!

మోదీ ప్రభుత్వంలో రెండో స్థానం కూడా గుజరాత్ కు చెందిన అమిత్ షా కి ఇచ్చారు. మొన్నటి వరకు బిజెపి అధ్యక్షుడిగా, ఇప్పుడు హోమ్ మంత్రిగా ప్రభుత్వంలోనే కాకుండా, బీజేపీ వ్యవహారాలలో సహితం అమిత్ షా ఆధిపత్యం కొనసాగుతున్నది. తాజాగా అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాన్ని (ఐఎఫ్ఎస్‌సీ) గుజరాత్‌లో ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం మరో వివాదానికి దారితీస్తున్నది.

భారత దేశపు ఆర్ధిక రాజధానిగా పేరొందిన ముంబై ప్రాధాన్యతను తగ్గించి, గుజరాత్ ప్రాధాన్యతను పెంచడం కోసం మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు చాలాకాలంగా విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల అధినేతలు వస్తే తప్పనిసరిగ్గా గుజరాత్ పర్యటన ఉండవలసిందే. గతంలో వలే ముంబైకి రావడం లేదు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

అయితే ముంబైలో కాకుండా ఐఎఫ్ఎస్‌సీని గాంధీ నగర్ లో ఏర్పాటు చేసే ప్రతిపాదన పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవర్ నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా ఆపొరపాటు నిర్ణయమని, అనుచితమని అంటూ ప్రధాని మోదీకి వ్రాసిన లేఖలో తీవ్రమైన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముంబైకి గల ప్రాధాన్యతను పవర్ గుర్తు చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలను శరద్ పవార్ ప్రస్తావిస్తూ, ప్రభుత్వ సెక్యూరిటీల పరంగా మహారాష్ట్ర కంటిబ్ర్యూషన్ అసాధారణమని, గుజరాత్‌లో ఐఎఫ్‌ఎస్‌సీ ఏర్పాటు చేయాలనే ఆలోచన పూర్తిగా తప్పుడు సంకేతాలిచ్చే అనుచిత నిర్ణయమని పవర్ హెచ్చరించారు. ఇది మహారాష్ట్ర నుంచి ఆర్థిక సంస్థలు, వ్యాపార సముదాయాలను తరలించేందుకు ఉద్దేశించిన చర్యగా కనిపిస్తోందని విమర్శించారు. ఇందువల్ల అనవసరమైన రాజకీయ అశాంతి తలెత్తుతుందని పవార్ వారించారు.

‘కేంద్రం నిర్ణయంతో దేశానికి ఆర్థికపరమైన నష్టం కలగడమే కాదు, ముంబైకి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతిని కూడా దిగజారుతుంది. ఇండియా జీడీపీలో 6.16, 25 శాతం పారిశ్రామిక ఉత్పత్తి ఇక్కడ్నించే వస్తోంది. దేశ ఆర్థిక లావాదేవీల్లో 70 శాతం మూలధన లావాదేవీలు ముంబై నుంచి జరుగుతున్నాయి’ అని పవార్ ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు.

ఏప్రిల్ 23న ఆర్బీఐ ప్రచురించిన గణాంకాలను పవార్ ప్రస్తావిస్తూ, భారత బ్యాంకింగ్ రంగంలో రూ.145,00,000 కోట్లు డిపాజిట్లు ఉంటే, ఒక్క మహారాష్ట్ర వాటానే 22.8 సాతం ఉందని, ఆ తర్వాత 10 శాతంతో ఢిల్లీ, 7.8 శాతంతో ఉత్తరప్రదేశ్, 7.2 శాతంతో కర్ణాటక, 5.4 శాతంతో గుజరాత్ ఉందని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, ముంబైకి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను తగ్గించేలా కేంద్రం చర్య ఉందని పవార్ మండిపడ్డారు.

గణాంకాలు, మెరిట్ ఆధారంగా గుజరాత్‌కు బదులు ముంబైలోనే ఐఎఫ్ఎస్‌సీ ఏర్పాటు పవర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని హేతుబద్ధంగా వ్యవహరించి, న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్టు పవార్ ఆ లేఖలో పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యతా అంశంగా దీన్ని తక్షణమే మోదీ పరిశీలించాలని స్పష్టం చేశారు.

తెలంగాణలో సగం మంది కరోనా బాధితులు ఇంటికి


తెలంగాణలో కరొనతో ఆసుపత్రిలలో చేరిన వారిలో దాదాపు సగం మంది కోలుకొని, ఇంటికి వెళ్లారు. అంటే సంగం మంది కోలుకున్నట్లే. ఈ విషయంలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉన్నట్లు చెప్పవచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా బాధితుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. మార్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1082 మందికి వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 545 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 508గా ఉంది.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

అదే విధంగా వైరస్ బారిన పడి 29 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనీవే కావడం గమనార్హం. దీంతో పాటు కొత్తగా జగిత్యాల జిల్లాల్లో ఒకరికి వైరస్ సోకింది.

మరోవంక ఆదివారం వైరస్ నుంచి కోలుకోని 46 మంది డిశ్చార్జ్ కాగా, దీనిలో 68 ఏళ్ల వృద్ధుడు సైతం ఉన్నారు. ఇతనికి డయాబెటిక్, న్యూమోనియా సమస్యలు ఉన్నప్పటికీ సుమారు 14 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఇలా ఉండగా, హైదరాబాద్ వనస్థలిపురంలో రోజురోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కాలనీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు కుటుంబాల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందనే ఆరోపణలు అధికంగా వస్తున్నాయి. దీంతో వనస్థలిపురంలోని హుడాసాయినగర్, ఎబిటైప్ కాలనీ, ఎస్‌కెడి నగర్, కమలానగర్, సచివాలయనగర్లలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

గత వారం రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ దాదాపు హైదరాబాద్ నుండే కావడం, ఇక్కడ కూడా మార్కెట్ల నుంచి వస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హోల్‌సేల్ దుకాణాలపై నిఘా పెంచనున్నారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాల ద్వారా ఇప్పటికే పలు రిటైల్ డీలర్లకు వైరస్ సోకింది.

కాగా, గత రెండు వారాలుగా తెలంగాణలోని 17 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవని అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్ జిల్లాల్లో కేసులు లేవు.

సూర్యుడి తో గౌతముడి సినిమా


ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ గారి అభిమాన నటుడు శివ కుమార్ గారి పెద్ద కొడుకు అయిన సూర్య, హీరో గా కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథలకే ప్రాధాన్య మిస్తున్నాడు. సూర్య కెరీర్ లో “పితామగన్ (తెలుగులో శివ పుత్రుడు ), గజిని ” వంటి చిత్రాలు అనేకం ఉన్నాయి ఇక సూర్య సినిమాలు చేసే విషయంలో సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

తన చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా సూర్య వరుస సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం తెలుగు `గురు` ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో “సూరారై పోట్రు ” ( తెలుగులో ఆకాశం నీ హద్దురా ) సినిమాను పూర్తి చేసిన సూర్య , దర్శకుడు హరి నేతృత్వంలో ‘సింగం’ సినిమా కి సీక్వెల్ చేస్తున్నాడు. ఆ తరువాత హిట్ చిత్రాల దర్శకులు శివ ( శౌర్యం , దరువు ఫేమ్ ), వెట్రిమారన్ ( అసురన్ తెలుగులో నారప్ప ).. కార్తీ ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ లను లైన్లో పెట్టేశాడు.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

ఇక ఈ సినిమాల తరవాత ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ` కాక్క కాక్క`( తెలుగులో ఘర్షణ ),` వారణం ఆయిరం `( తెలుగులో సన్ ఆఫ్ సూర్య ) వంటి రెండు భారీ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇటీవలే గౌతమ్ మీనన్ వినిపించిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని , ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది .

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!


కేంద్ర ప్రభుత్వం మార్గంలోనే తెలంగాణలో కూడా ఈ నెల 7తో ముగియనున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలపాటు పొడిగించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ కట్టడి కాకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు. దానితో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అమలును మరింత కట్టుదిట్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ ఈ విషయమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ లోగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరపడంతో పాటు, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకొంటున్నట్లు తెలుస్తున్నది.

చిరంజీవిని మెగాస్టార్ అనలేం అన్న జె డి చక్రవర్తి

కేంద్రం ఇప్పటికే మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. తెలంగాణలో కూడా మే 21 వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్‌ జోన్లలో క్వారంటైన్‌ గడువు ఈ నెల 21న ముగియబోతుంది.

ముఖ్యంగా కేంద్రం సూచించిన మేరకు గ్రీన్ జోన్ లలో ఏ మేరకు ఆంక్షలను సడలించాలి అనే విషయమై ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఈ విషయమై మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

ఎంత దూరమైన ఇంతే టికెట్ ధర!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలుపరిచే క్రమంలో వలస కార్మికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తాజాగా వారిని, వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల కోసం టికెట్ ధర కేవలం రూ.50లే నిర్ణయించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. తాజాగా మరో 300రైళ్ళను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.12వేల కోట్లు అందించామని మంత్రి వెల్లడించారు.

స్వంత రాష్ట్రాలకు వెళ్లాలనే వలసకార్మికుల కోసం గతవారం ఆరు రైళ్లు నడిపామని, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులను తరలింపులో కేంద్రం, ఆయా రాష్ట్రాలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులే గుర్తిస్తారన్నారు. వలస కార్మికులు ఉన్న చోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయి, ఎవరూ రైల్వే స్టేషన్‌ లోకి రావొద్దు అని కోరారు. వారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని, రాష్ట్రాలు ఎన్ని రైళ్లు కోరితే అన్ని రైళ్లు కేటాయిస్తాం, అని మంత్రి స్పష్టం చేశారు. దూరంతో సంబంధం లేకుండా రూ.50 టిక్కెట్ ధర నిర్ణయించామని, టిక్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీ చెల్లించాలన్నారు.

బుర్రా సాయి మాధవ్ పెద్ద మనసు


కరోనా విలయం కారణంగా మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రంగస్థల కళాకారుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ప్రదర్శనలు లేక వేలాదిమంది కళాకారులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీరచయిత సాయిమాధవ్ బుర్రా తన స్వస్థలమైన తెనాలిలో ఆదివారం దాదాపు 300 మంది పేద కళాకారులకు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందించి తన పెద్దమనసును చాటుకున్నారు

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

తనను రచయితగా చేసిన రంగస్థలం రుణం కొంతైనా తీర్చుకోవాలనే సత్ సంకల్పంతో ఆయన కొంత కాలం క్రితం తెనాలిలో ‘కళలకాణాచి’ అనే సంస్థను స్థాపించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పేదకళాకారులను ఆదుకోవడమే ఈ సంస్థ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

అలాంటి సంస్థ ద్వారా మూడు లక్షల పైగా ఖర్చు చేసి పేద కళాకారుల ఆకలి తీర్చడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని సాయిమాధవ్ బుర్రా నిర్వహించడం జరిగింది. కాగా ఈయన చేసిన మంచి పనికి తెనాలి కళాకారులు మాత్రమే కాదు మిగతా ప్రాంతాల కళాకారులు కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది .

చిరంజీవిని మెగాస్టార్ అనలేం అన్న జె డి చక్రవర్తి


కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. శివ సినిమాతో తెరంగేట్రం చేసి `గులాబీ’ సినిమాతో హీరోగా మారిన నటుడు జె .డి చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో “మిమ్మల్ని మెగాస్టార్ అనలేం సార్.. అంతకుమించి “అని ఆయన పేర్కొనడం జరిగింది .. కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో సినీ కార్మికుల కోసం `కరోనా క్రైసిస్ కమిటీ ` ఏర్పాటు చేయడం, వారికి నిత్యావసర సరుకులు అందించడం విష‌యంపై, మెగాస్టార్ చిరంజీవి గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ లేఖ వ్రాయడం జరిగింది కాగా .ఈ లేఖను ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది.

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

జె డి చక్రవర్తి వ్రాసిన లేఖలో ” సినీ కార్మికులు నాకు ఫోన్ చేసిన‌ప్పుడు తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశార‌ని తెలిపారు. మీరు ఇండ‌స్ట్రీ రుణం తీర్చుకుంటున్నాన‌ని అంటున్నారు కానీ కార్మికుల ప‌ట్ల అది మీకున్న గౌర‌వంగా నేను భావిస్తున్నాను. సాయం ఎలా చేయాలో మీ దగ్గర నేర్చుకోవాలి ” అని జేడీ చక్రవర్తి తన లెటర్‌లో పేర్కొనడం జరిగింది .

వలస కూలీలకు కాంగ్రెస్ చేయూత!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో. చిక్కుపోయిన వారిని వారి సొంత ప్రాంతాలకు పంపించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే వలస కార్మికుల రైలు చార్జీలను కాంగ్రెస్‌ చెల్లిస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. ఇది వలసకార్మికులకు కాంగ్రెస్‌ అందిస్తున్న సహకారమని, వారికి సంఘీభావంగా నిబడతామని ఆమె ఒక లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిపట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న కేంద్రం వలసకార్మికుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికుల ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. ”వలసకార్మికులు దేశాభివృద్ధిలో భాగస్వాములని అన్నారు. విదేశాల్లో చిక్కుకున్న స్వదేశీయులకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందించడం తమ భాద్యతగా గుర్తించిన ప్రభుత్వం, వారికి ఆహారం, రవాణా కోసం రూ. వందకోట్లు వెచ్చించిందని విమర్శించారు. గుజరాత్‌బిలో ఒక్క ప్రజా కార్యక్రమం కోసం రైల్వే శాఖ రూ. 151 కోట్లు విరాళంగా ప్రకటించినపుడు, వలసకార్మికులను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో ఉచిత రైలు ప్రయాణం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.

పోలీస్ సోదరులకు మెగా బ్రదర్ నాగబాబు సాయం

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ .. పోలీసు సోదరులు చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు .. కరోనా లాక్‌డౌన్‌లో వారు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు ..ఆ క్రమంలో ఎంతో మంది సెలబ్రెటీస్ వారి సేవలని కొనియాడి, వారికి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆ లిస్ట్ లో చేరాడు

డాక్టర్లు.కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తుంటే , పోలీసులు మాత్రం కరోనా వ్యాపించకుండా నిరోదించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తన వంతు సాయంగా పోలీసులకు ఏదైనా చెయ్యాలనుకున్న నాగబాబు తానుండే ఏరియా రాయదుర్గం పరిదిలోని సీ.ఐ.ని కాంటాక్ట్ చేసాడట …ఆ క్రమంలో వాళ్లకున్న కొన్ని అవసరాలు తెలుసుకుని వాటిని స్వయంగా అందించడం జరిగింది.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

రాయదుర్గం పరిసరప్రాంతాల్లో డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ” విటమిన్ సీ టాబ్లెట్స్, విటమిన్ డీ టాబ్లెట్స్, సానిటైజర్స్, మాస్కులు , డ్రై ఫ్రూట్స్, వాషబుల్ హ్యాండ్ గ్లౌజ్, ఫ్రూట్స్” అన్నీ ప్యాక్ చేసి స్వయంగా నాగబాబు తన స్వహస్తాలతో అందజేయడం జరిగింది. నిజానికి నాగబాబు ఆరోగ్య రీత్యా బయటికి తిరగకూడదు. అయినా కానీ పోలీసులే అంత రిస్క్ చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి అనుకుని ముందుకు వచ్చి రక్షక భటులకు సాయం చేయడo జరిగింది .

నితిన్ భారీ చిత్రం 2 భాగాలుగా


‘భీష్మ’ సినిమా తో అనూహ్య విజయాన్ని అందుకొన్న నితిన్ తన తరవాతి ప్రాజెక్టుల విషయం లో చాలా కేర్ తీసుకొంటున్నాడు. ప్రస్తుతం నితిన్ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దె’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో `క్రాష్ ‘ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. లాక్ డౌన్ లేకపోతే ఈ రెండు సినిమాలు దాదాపు పూర్తయ్యేవి .

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక మరో రెండు చిత్రాలను కూడా నితిన్ లైన్లో పెట్టడం జరిగింది . అందులో ఒకటి హిందీ చిత్రం ‘అంధాదున్’ రీమేక్. కాగా. ఈ చిత్రాన్ని ` వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ` ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం చేయనున్నాడు.

ఇక రెండో చిత్రం నితిన్ కెరీర్లోనే భారీ చిత్రం గా రూపొందనుంది. కాగా ఈ చిత్రానికి “పవర్ పేట” అనే టైటిల్ పెట్టడం జరిగింది. గతంలో నితిన్ తో ‘చల్ మోహన్ రంగ’ సినిమా తీసిన `కృష్ణ చైతన్య` దర్శకత్వంలో రూపొందే ఈ యాక్షన్ డ్రామాని నితిన్ సొంత సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’,మరియు ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుండటం విశేషం. ` పవర్ పేట ‘ అనే ఏరియా లో చెలరేగిన రౌడీయిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. కీర్తి సురేష్ కథానాయికగా ఎన్నిక అయిన ఈ చిత్రం లో రావు రమేష్ , సత్యదేవ్ కీలక పాత్రలు చేయనున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించే ఈ ‘పవర్ పేట’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది .

ఏపీలో నూతన మద్యం ధరలు ఇవే..!


రాష్ట్రంలో ధరల పంపు వివరాలను ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మద్యం క్వాటర్, హాఫ్, ఫుల్ బాటిళ్ల పై ఎంత ధరలు పెంచింది ఆ శాఖ తెలియజేసింది. రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ. 20 పెరుగుదల ఉంటుంది. హాఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80 పెంపు వర్తిస్తోంది. రూ.120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్ల ధర రూ.40, హాఫ్ బాటిల్ పై రూ.80, ఫుల్ బాటిల్ పై రూ.120 పెంపు ఉంటుంది. రూ.150 కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.60 పెంపు, హాఫ్ బాటిల్ పై రూ.120, ఫుల్ బాటిల్ రూ.240 పెంపు వర్తిస్తుంది. మినీ బీర్ పై రూ.20 , ఫుల్ బీర్ రూ.30కి పెంపు ఉంటుంది

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులో సోమవారం ఉదయం నుండి తెరుస్తామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ తెలిపారు. ఉదయం 11 నుండి రాత్రి 7 వరకు మద్యం దుకాణాలు పని చేస్తాయన్నారు. మద్యం అమ్మకాల పై మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ లకు పంపినట్లు తెలిపారు. భౌతికదూరం పాటించాలన్నారు. షాపులో కి కేవలము 5 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. షాపుల ముందు సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతించమన్నారు. రద్దీ మరీ ఎక్కువ గా ఉంటే ఆ షాపులు కొంత సమయం మూసివేయక తప్పదన్నారు. బార్ లు ఎట్టిపరిస్థతుల్లోనూ ఓపెన్ చేయమన్నారు. కంటోన్మెంట్ జోన్ బయట మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఉందన్నారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించారు. మాస్క్ లేక పోతే క్యూ లైన్ లో కూడా ఉండనివ్వమని స్పష్టం చేశారు.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హైద్రాబాద్ ని హాట్ స్పాట్ ప్రాంతంగా గుర్తించారు. చార్మినార్ జోన్ పరిధిలో మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. మలక్ పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్లలో కేసుల సంఖ్య 219కి చేరింది. ఇప్పటికే 50 కంటైన్మెంట్ జోన్లు పెట్టారు. కంటైన్మెంట్ జోన్లలో కరోనా కంట్రోల్​ అవుతోందని ​అనుకుంటుండగానే, ఆ పక్కనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొదట్లో నిర్వహణ భారంగా మారిందని పరిధి తగ్గించి కొత్త జోన్లు ఏర్పాటు చేయగా, కేసులు సమీప ప్రాంతాలకు వేగంగా పాకుతున్నాయి. ఇప్పుడిదే బల్దియా వర్గాలను కలవరపెడుతోంది.

ఓవైపు పాత జోన్ తొలగిస్తుంటే, మరోవైపు ఆ దగ్గర్లోనే పాజిటివ్​ కేసులు వస్తున్నాయి. హైదరాబాద్‌‌ లో కంటెయిన్​ మెంట్​ జోన్లు169 నుంచి 96కి తగ్గాయి. మొదట్లో జోన్ల విస్తీర్ణం కిలోమీటర్ పరిధిలో ఉంది. సిబ్బంది కొరత, నిర్వహణ ఇబ్బందులతో కుదించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి 100–200మీటర్లలోపే చిన్న జోన్లు పెట్టారు. అలాంటివి169 ఏర్పాటయ్యాయి. కేసుల్లేని చోట జోన్లను తొలగిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదవుతున్న చోట కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. పాత జోన్‌‌ పక్క ప్రాంతాల్లోనే కొత్తవి నమోదవుతుండడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు.  మొదట్లో మలక్ పేట సర్కిల్ పరిధిలో కేసులు నమోదవగా సాద్ మసీద్, నల్గొండ సర్కిల్, ఫకీర్ గల్లీ, సాజీదాబాగ్ వంటి ప్రాంతాలను కలిపి కంటైన్ మెంట్ జోన్ ఏర్పాటుచేశారు. పరిధి ఎక్కువ ఉండడంతో మెయింటెనెన్స్​కష్టమని తగ్గించారు. ప్రొఫెసర్​ కాలనీ, మూసారాం బాగ్‌‌ ఏరియాలను తొలగించారు. తాజాగా కొత్త కేసులు అక్కడే వచ్చాయి. ఇప్పుడక్కడ మళ్లీ కంటైన్మెంట్లు పెట్టారు. ఈ పరిస్థితి కూకట్‌‌ పల్లి, ఖైరతాబాద్ సర్కిళ్లలోనూ ఉంది. ప్రొఫెసర్ కాలనీలో మొదట్లో ఒక్క కేసూ లేదు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి మలక్ పేట గంజ్ లో వ్యాపారి. అక్కడ పనిచేసే హమాలీ నుంచి అతనికి కరోనా సోకింది. ప్రస్తుతమిక్కడ 10 మందికి పాజిటివ్ రావడంతో కింగ్ కోఠి హాస్పిటల్ లో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్నట్లు తెలిసిందే. కొత్త జోన్ల ఏర్పాటు, నిర్వహణపైనే ప్రధానంగా ఫోకస్‌‌ చేసిన బల్దియా..ఇప్పటికే ఏర్పాటైన జోన్లలోని జనాల అవసరాలపై పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోంది.

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చారు. దాదాపు 3 వేల కి.మీలు నడిచి ఒంటిచేత్తో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన జైలుకెళ్లినా.. కష్టకాలంలో ఉన్నా ఒకే ఒక్కరు అండగా నిలబడ్డాడు. ఆయనే విజయసాయిరెడ్డి. జగన్ కు తోడుగా నీడగా.. నిలబడ్డ ఆయన జగన్ జైలుకు వెళ్లినా ఆయనతోపాటు వెళ్లారు. ప్రతీ కష్టంలోనూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సుఖంలోనూ ఆయన వెన్నంటి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ తర్వాత కీలక నిర్ణయాధికారిగా ఉన్నారు. నంబర్ 2 పొజిషన్ లో జగన్ కు తోడుగా నీడగా నిలబడ్డారు.

మద్యం ప్రియులకు మరోసారి షాక్..!

*కృష్ణార్జులుగా జగన్-విజయసాయి
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇద్దరిదే నడుస్తోందని చెబుతుంటారు. వారే సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో వీరిద్దరినీ కృష్ణార్జునలు అంటుంటారు. ఇక ఢిల్లీ నుంచి మొదలు గల్లీ దాకా వీరిద్దరూ ఏపీ అభివృద్ధిలో అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో వీరి ద్వయమే ఇప్పుడు అంతా నడిపిస్తోంది. అర్జునుడిలా వైఎస్ జగన్ యుద్ధం చేస్తుంటే.. శ్రీకృష్ణుడిలా అంతా నడిపించేది విజయసాయిరెడ్డి అంటుంటారని పార్టీలో చర్చ సాగుతుంటుంది. దానికి బలాన్ని ఇచ్చే ఓ ఘటన తాజాగా చోటుచేసుకుంది.

*బలంగా జోడి.. ప్రత్యర్థుల పాలిట దుర్భేద్యం
జగన్-విజయసాయిరెడ్డి జోడి బలంగా ఏపీ పాలిటిక్స్ లో పాతుకుపోతోంది. వీరిద్దరి ద్వయం ధాటికి ప్రతిపక్షాలు సైతం అప్పుడప్పుడు అడుగులు వెనక్కి వేస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును.. టీడీపీ కుట్రలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయసాయిరెడ్డి బాగా కృషి చేస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇక ఇతర మీడియా సోషల్ మీడియా ద్వారా బాబు బండారం.. లొసుగులు బయటపెడుతూ టీడీపీ శిబిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇటీవలే ఓ సీనియర్ టీడీపీ ఎంపీ సైతం ఓమాట అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్, విజయసాయిరెడ్డిలు ఎదుర్కొన్నారని.. ఒకరి చేయి ఒకరు వదల్లేదని.. అందుకే వారికి ఈ విజయం వరించిందని.. విజయానికి వారు అర్హులని.. అలా ఉండాలి రాజకీయాల్లో అంటూ వీరిద్దరినీ కొనియాడడం సంచలమైంది.

ఏపీలో 1600కు చేరువలో కరోనా కేసులు

*విశాఖ రాజధాని ఐడియా విజయసాయిదేనట..
రాయలసీమకు చెందిన జగన్ కు విశాఖను రాజధానిగా చేయాలని ఎలా ఐడియా వచ్చిందన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. పోనీ కర్నూలులోనే దగ్గరగా ఉండే ప్రకాశం జిల్లా దోనకొండలో పెడితే సరిపోయేది కదా అనే ఆలోచన అందరికీ వచ్చింది. అయితే విశాఖ రాజధాని ఐడియా విజయసాయిరెడ్డిదేనని చెబుతుంటారు. రాజధాని లేని ఏపీకి, నిర్మాణం కానీ అమరావతిని నిర్మించేకంటే అప్పటికే హైదరాబాద్ కు ధీటుగా ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే డబ్బు ఆదా అవ్వడంతోపాటు సకల సౌకర్యాలు కలుగుతాయని.. దేశంలోనే మంచి నగరంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భావించారట.. అందుకే అమరావతిని నిర్మించినా రాని పేరును విశాఖను రాజధానిగా చేస్తే వస్తుందని వీరిద్దరే ప్రతిపాదించారట..ఇటీవల విశాఖ రాజధాని ఐడియా ఎవరిది అని మంత్రి అవంతి శ్రీనివాస్ ను అడగగా.. ఆయన హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఐడియానే విశాఖ రాజధాని అని ఖరాఖండీగా చెప్పారు. మా ప్రాంతానికి రాజధానిని తీసుకొచ్చిన ఘనత.. ఇన్నాళ్లకు విశాఖ రాజధాని అవుతుందంటే దాని వెనుక కృషి, పట్టుదల అన్నీ విజయసాయిదేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎంతో సహృదయంతో ఆలోచించి అన్ని సదుపాయాలున్న విశాఖను రాజధాని చేయడంతో తమ కల నెరవేరిందన్నారు. ఇలా విశాఖ రాజధాని వెనుక సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ల కృషి ఉందని తెలియడంతో ఆసక్తి నెలకొంది.

*విజయసాయిరెడ్డి బలమే..
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావడానికి.. అయ్యాక కూడా ఆయన ప్రాణ స్నేహితుడు ఆత్మగా పేర్కొన్న కేవీపీ రాంచంద్రరావు కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు జగన్ కు సైతం కేవీపీలా విజయసాయిరెడ్డి కనిపిస్తున్నారు. ప్రతీ అడుగులోనూ.. నిర్ణయంలోనూ వీరిద్దరి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మేనేజ్ చేయడంలో వీరిద్దరూ కూడా కీలకంగా వ్యవహరించి విజయం కట్టబెట్టారు. అందుకే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి జగన్ కు బలం అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతీ పథకం.. ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో వీరిద్దరి పాత్ర అమోఘం అని చెప్పవచ్చు.

-నరేష్ ఎన్నం

గోస్వామి అరెస్ట్ కి రంగం సిద్ధం!


రిపబ్లిక్ టీవీ ఛానల్ ఎడిటర్, యజమాని అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.గత నెలలో ముస్లింలపై ద్వేషాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడనే ఫిర్యాదు నేపథ్యంలో ముంబైలోని పైడోనీ పోలీస్‌స్టేషన్‌ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

రిపబ్లిక్ ఛానల్ మరియు గోస్వామి, ముస్లిం సమాజంపై ద్వేషాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మరియు బాంద్రాలోని ఒక మసీదును లక్ష్యంగా చేసుకున్నారని రాజా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి మరియు దక్షిణ ముంబైలోని నల్ బజార్ నివాసి ఇర్ఫాన్ అబూబకర్ షేక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.

బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో గుమిగూడిన వలసదారులు ఏప్రిల్ 29 న హిందీ ఛానల్ రిపబ్లిక్ భారత్ బాంద్రా నిరసన యొక్క ఫుటేజీని ఉపయోగించారని షేక్ చెప్పారు. అర్నాబ్ గోస్వామి ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేశారు.

“బాంద్రా స్టేషన్ సమీపంలో మసీదుకు వలస కార్మికులకు ఎటువంటి సంబంధం లేదు కానీ మసీదు సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో వలస వచ్చినవారు గుమిగూడారు. అయితే అర్నాబ్ ఉద్దేశపూర్వకంగా నగరంలో మతపరమైన కలవరం సృష్టించడానికి మసీదును హైలైట్ చేసాడు ”అని షేక్ పోలీసులకు తన కంప్లైంట్‌ లో పేర్కొన్నాడు.

“బాంద్రాలోని జామా మసీదు వెలుపల వేలాది మంది గుమిగూడారు, బాంద్రాలోని మసీదు వెలుపల జనాన్ని ఎవరు సేకరించారు? లాక్ డౌన్ సమయంలో ప్రతి మసీదు దగ్గర జనాలు ఎందుకు గుమిగూడారు?” అని అర్నాబ్ పదే పదే మసీదు ప్రస్తావన తీసుకొచ్చి ముస్లింలపై ద్వేషాన్ని రేకెత్తించారని ఆయన పేర్కొన్నారు.