Home Blog Page 8500

భోపాల్ గ్యాస్ దుర్ఘటనను గుర్తుకు తెస్తున్న విశాఖ గ్యాస్ లీక్!


చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక ప్రమాదంగా పేరొందిన భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనను విశాఖపట్నంలో నేటి గ్యాస్ లీక్ పలువురికి గుర్తుకు తెస్తున్నది. అయితే దీని తీవ్రత ఏమేరకు ఉంటుందో మరో రోజు ఆగితే గాని తెలిసే అవకాశం లేదు.

26 ఏళ్ళ క్రితం జరిగిన భోపాల్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ప్రభుత్వ లెక్కల ప్రకారం 4,000 లోపుగానే ఉన్నప్పటికీ, అంతకు నాలుగు రేట్లు ఎక్కువగా చనిపోయి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో అంగవైకల్యం వంటి పలు రుగ్మతల ప్రభావం ఇంకా కనిపిస్తున్నది.

విశాఖలో భారీ ప్రమాదం…!

విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా చుట్టుపక్కల 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

లాక్ డౌన్ నుండి పారిశ్రామిక కార్యకలాపాలకు సడలింపు ఇవ్వడంతో తెరుచుకున్న ఈ ఫ్యాక్టరీ లో మరుసటి రోజుకే ఇటువంటి ప్రమాదం జరగడం దిగ్బ్రాంతి కలిగిస్తున్నది. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పీవీసీ (పాలీవినైల్‌ క్లోరైడ్‌) గ్యాస్‌ లీక్‌ అయినట్లు అక్కడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పీవీసీ గ్యాస్‌ను అన్ని ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో వినియోగిస్తారు. పీవీసీ లేకుండా ఏ ప్లాస్టిక్‌ను కూడా తయారు చేయలేరు. ప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో పాలీవినైల్‌ క్లోరైడ్‌లోని క్లోరిన్‌ వాయువు లీకైతే అత్యంత ప్రమాదం. ఇప్పుడు ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో అదే జరిగింది.

విశాఖ గ్యాస్‌ లీక్‌ పై జగన్ కు ప్రధాని ఫోన్

లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమను తెరిచే క్రమంలో అత్యంత ప్రమాదకరమైన క్లోరిన్‌ వాయువు లీకైంది. ఈ క్లోరిన్‌ అధిక గాఢత కలిగి ఉండటం వల్ల ఆ వాయువును పీల్చిన వెంటనే ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

ఈ వాయువు వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలిసి డయాక్సిన్స్‌ను ఏర్పాటు చేసి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. తక్షణమే మనషులతో పాటు మూగ జీవాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, చనిపోవడం జరుగుతుంది. చెట్లు కూడా మాడిపోతాయి. మనం ధరించే దుస్తులు కూడా పసుపు రంగులోకి మారుతాయి. పాలీవినైల్‌ క్లోరైడ్‌లోని క్లోరిన్‌ క్యాన్సర్‌ కారకం కూడా.

ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టెర్లిన్‌ గ్యాస్‌ బాగా ఘాటుగా ఉండటంతో.. కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోవడంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోయింది.

హిందుస్తాన్‌ పాలిమర్స్‌ పేరుతో 1961లో ఈ కంపెనీ ప్రారంభించారు. 1978లో దీనిని యూబీ గ్రూప్‌ తీసుకుంది. 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ గ్రూప్‌(ఎల్‌జీ కెమికల్స్‌) తీసుకుని ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది. థర్మాకోల్‌ లాంటివి ఇందులో తయారు చేస్తారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌ పై జగన్ కు ప్రధాని ఫోన్


విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల సహాయ సహకారాలను, మద్దతు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు.

అంతక్రితం విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని మోదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. విశాఖవాసుల క్షేమం కోరుతూ ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

విశాఖలో భారీ ప్రమాదం…!

విశాఖలో పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో ఈ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు.

”అక్కడి పరిస్థితులను తెలుసుకున్నానని, అధికారులతో చర్చించానని” ప్రధాని మోడీ అన్నారు. ”విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను” అని చెప్పారు.

ఎల్.జి పాలిమర్స్ చరిత్ర ఇదే..!

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల తరలింపులో రెడ్‌క్రాస్ వాలంటీర్‌ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్‌క్రాస్‌కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

ఎల్.జి పాలిమర్స్ చరిత్ర ఇదే..!


విశాఖపట్నంలో భారీ ప్రమాదానికి కారణమైన ఎల్.జి పాలిమర్స్ సుమారు ఆరు దశాబ్దాల కిందట ప్రారంభమైంది. ఈ సంస్థ 1961 లో “హిందుస్తాన్ పాలిమర్స్” గా పాలీస్టైరిన్, దానికి అవసరమైన కో-పాలిమర్ల తయారీకి రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో స్థాపించబడింది. 1978 లో యుబి గ్రూప్ నాకు చెందిన మెక్ డోవెల్ అండ్ కో లిమిటెడ్‌లో విలీనం చేయబడింది.

విశాఖలో భారీ ప్రమాదం…!

దక్షిణ కొరియాకు చెందిన ఎల్.జి కెమికల్ భారతదేశాన్ని ఒక ముఖ్యమైన మార్కెట్‌గా భావించింది. వృద్ధి ప్రణాళికలో 100 శాతం టేకోవర్ ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి తగిన సంస్థగా హిందుస్తాన్ పాలిమర్లను గుర్తించింది. ఎల్.జి కెమ్ టెకోవర్ చేసుకుని హిందూస్తాన్ పాలిమర్స్ ను జూలై 1997 లో ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్.జి.పి.ఐ) గా మార్చింది.

దక్షిణ కొరియాలో స్టైరెనిక్స్ వ్యాపారంలో ఎల్జీ కెమికల్ చాలా బలమైన ఉనికిని కలిగి ఉంది మరియు ప్రస్తుత ఉత్పత్తి శ్రేణి పిఎస్ మరియు ఇపిఎస్ ద్వారా భారత మార్కెట్లో సమానంగా బలమైన ఉనికిని నెలకొల్పాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఎల్‌జిపిఐ భారతదేశంలో పాలీస్టైరిన్ మరియు ఎక్స్‌పాండబుల్ పాలీస్టైరిన్ తయారీలో ప్రముఖమైనది.

స్థానిక రిజర్వేషన్లపై జగన్ కు భంగపాటు!


రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న పలు ఏకపక్ష నిర్ణయాల కారణంగా వరుసగా రాష్ట్ర హై కోర్ట్ లో ఎదురు దెబ్బలకే గురవుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి స్థానికులకు 75 శాతం రేజర్వేషన్లు కలిపిస్తూ తీసుకున్న చర్యపై కూడా భంగపాటు తప్పదా? అని అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ విషయమై దాఖలైన పిటిషన్ ను స్వీకరిస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలే అటువంటి అనుమానాలకు అవకాశం ఏర్పర్చుతున్నాయి. పరిశ్రమలు, ప్రభుత్వ – ప్రైవేట్- భాగస్వామ్య సంస్థలలో స్థైకులకు 75 శాతం రిజర్వేషన్ సదుపాయం జగన్ ప్రభుత్వం కల్పించడం తెలిసిందే.

విశాఖలో భారీ ప్రమాదం…!

ఈ నిర్ణయం ఏ మేరకు చట్టబద్దత కలిగి ఉందొ చెప్పాలని ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని అంటూ మౌఖికంగా హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విషయమే. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నెలరోజుల సమయం ఇచ్చింది.

ఆ విధంగా రేజర్వేషన్లు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం గత ఆగస్టులో ‘ఏపీ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ ఇన్‌ ద ఇండస్ట్రీస్‌/ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌’ తీసుకొచ్చింది.

ఇందులోని 3, 8 సెక్షన్లను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌ వరలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

కనీసం 12 ఏళ్ల స్థానికత ఉన్న వారికే ఉద్యోగాలంటూ ముల్కీ నిబంధనల పేరుతో 1969లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం భారత రాజ్యాంగంలోని అధికరణ 16(2), (3)లకు విరుద్ధంగా ఉందని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివరించారు.

ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ఏమైనా అభ్యంతరాలుంటే పరిశ్రమల యాజమాన్యాలు కోర్టుకు రావచ్చని, పరిశ్రమలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.

ఇందుకు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బదులిస్తూ చట్టాన్ని ఎవరైనా సవాల్‌ చేయవచ్చని, వ్యక్తిగతంగా బాధితులైన వారే సవాల్‌ చేయాలన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పై ఆదేశాలిచ్చింది.

విశాఖలో భారీ ప్రమాదం…!


భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇప్పటి దేశం మర్చిపోనేలేదు, ఇంతలో విశాఖపట్నంలో ఒక రసాయన పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యి గాలిలో కలవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు ఊపిరి ఆడక ఏడుగురు మరణించగా, మిగిలిన వారు అందరూ మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారని సమాచారం. సంఘటన జరిగిందని దృవీకరించిన అధికారులు ఎంత మంది మృతి చెందారనే వివరాలు వెల్లడించలేదు.15 మంది అస్వస్థతకు గురయ్యారు. విరిని కేజీహెచ్ కు తరలించారని తెలిసింది. రసాయన వాసన ప్రభావంతో కళ్ళు మండటం, కడుపు వికారం వంటి లక్షణాలు భాదితులలో కనిపిస్తున్నాయి. ప్రమాదకర గ్యాస్ లీక్ అయి గాలిలో కలిసిన విషయం తెలియని ఆ ప్రాంత వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిశారు.

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

ఎల్జీ పాలిమర్స్ ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో నివాసముంటున్న స్థానికులు ఆ ప్రాంతాన్ని వదిలి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీస్తున్నారు. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచి ఎల్జి పాలిమర్స్ నుంచి రసాయనాలు లీక్ అయిన సంఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ లో అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తో పాటు చర్మంమీద బొబ్బులు, మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

దీని ఎల్జీ పాలిమర్ పరిశ్రమలో వ్యాపించింది. అక్కడివారిని అంబులెన్స్ తో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా అస్వస్థకు గురైన వారిని హాస్పిటల్ కి తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ రసాయనం వల్ల ప్రాణానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. శ్వాసకోశ సంబంధ ఉన్న రోగులకు మరింత ప్రమాదకరంగా తయారైందని, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది.
పరిశ్రమల నుంచి గ్యాస్ లీక్ ను 90 అదుపు తెచ్చినట్లు, పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి మరో రెండు గంటలు సమయం పడుతుందని ప్రరిశ్రమ వర్గాలు వెల్లడించారు

అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్

దాదాపు 2000 మంది పైగా అస్వస్థకు గురైన వారిని స్థానికులు, అధికారులు అంబులెన్స్ తో పాటు ఆటోలు, కారులోనూ తమసమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు దీనివల్ల ప్రాణాపాయం ఉండదని మంచి వైద్యం తీసుకుంటే త్వరగా కోలుకో వచ్చునని వైద్యులు చెబుతున్నారు లాక్ డౌన్లోడ్ కారణంగా మూతబడిన ఎల్జి పాలిమర్స్ కంపెనీ తిరిగి ప్రారంభించే ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. చిన్నారులు, మహిళలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యారు, కడుపులో మంట తో పాటు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ప్రాణ భయంతో వేపగుంట, మేఘాద్రి గడ్డ, నరవ ప్రాంతాలకు పరుగులు తీశారు, వీరిలో కూడా చాలామంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు గణబాబు, అదీప్ రాజ్, వై ఎస్ ఆర్ సి పి సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ఇతర ప్రజాప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు

ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరు అత్యుత్సాహంతో ఈ ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడ జనం గుమికుడితే అస్వస్థతకు గురైన వారికి ఆక్సిజన్ అదే అవకాశం ఉండదని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

బాపు బొమ్మకు బాలీవుడ్ ఆఫర్లు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ లో బాపు బొమ్మగా పరిచయమైన ప్రణీత…ఆ పేరుని ఇపుడు సార్ధకం చేసుకొంటోంది. అందమైన కళ్ళే కాదు, అందమైన హృదయం కూడా ఉందని నిరూపించు కొంటోంది . తానే సొంత ఖర్చు లతో , స్వయంగా వంట చేసి మరీ అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. ఆ క్రమంలో లాక్ డౌన్ మొదలైన తరవాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసి తన గొప్ప మనసు చాటుకొంది .

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

ఇక ప్రణీత ” కరోనా క్రైసెస్ ఛారిటీ “(C C C) కి అందరు హీరోయిన్స్ కంటే ముందుగా లక్ష రూపాయలను ఇవ్వడం చేసింది .. దీంతో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల కన్నా..ప్రణీత బెటర్ అనిపించు కొంది . . డాక్టర్లైన ఆమె తల్లిదండ్రుల కారణంగా ప్రణీతకు సమాజ సేవపై ఆసక్తి మెండు అని తెలుస్తోంది ..

గతంలో కొన్ని తెలుగు చిత్రాలలో నటించిన ఈ కన్నడ హుడిగి కి ఆశించిన సక్సెస్ రాలేదు . ఇక ఇప్పుడు హిందీలో రెండు సినిమాలు చేస్తోందట ….అందులో ఒకటి అజయ్ దేవగణ్ తో ” భుజ్ ” చిత్రం కాగా రెండోది ప్రియదర్శన్ దర్శకత్వంలో ” హంగామా 2 ” అని .తెలుస్తోంది.

సంగీత దర్శకుడు చక్రి ఫ్యామిలీ కి కరోనా కష్టాలు


2000 సంవత్సరం లో `బాచి` చిత్రం తో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసిన చక్రి చాలా షార్ట్ పిరియడ్ లో స్టార్ మ్యూజిక్ దర్శకుడు అయ్యాడు. పూరి జగన్నాధ్ చిత్రాలైన ” ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి , శివమణి , దేశముదురు ” వంటి చిత్రాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన చక్రి , తాను సంగీతం అందించిన బయటి చిత్రాల్లో ` చక్రం ` చిత్రంలోని `జగమంత కుటుంబం నాది ` పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే .సంగీత దర్శకుడు చక్రి టాలెంట్ గురించి ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అలాంటి దర్శకుడు 2014.తన 40 ఏళ్ళ చిరు ప్రాయంలో హఠాన్మరణం చెందాడు.

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

ఆ క్రమంలోమణికొండలో నివాసముంటున్న చక్రి అమ్మ , తమ్ముడు లాక్ డౌన్ వేళ పలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు అయిన నిర్మాత , డాక్టర్ అనూహ్యారెడ్డి వారిఇంటికి స్వయంగా వెళ్లి రెండు నెలలకు సరిపడా మందులు.. నిత్యావసర వస్తువులు అందజేశారు. అదే సమయంలో తనకు పని ఇప్పించాలన్న చక్రి తమ్ముడు మోహిత్ కోరగా ఆమె కరోనాపై ఓ ట్యూన్ చేయాలని కోరారట…. ఇప్పటికే నాలుగు సినిమాలకు సంగీతం సమకూర్చిన మోహిత్ కి , ఒక సోదరిగా అనూహ్యరెడ్డి ఇచ్చిన భరోసా గొప్ప ఊరట నిచ్చినట్టు తెలుస్తోంది .

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

కరోనా పరిచయం కాక ముందు ఆన్ లైన్ షాపింగ్స్ చూశాం.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్ లైన్ లో మద్యం కొనుగోలు చూస్తున్నాం.. కాలం మారిందంటే ఇదేనేమో..
వివరాల్లోకి వెళ్తే… దుకాణాల వద్ద వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ఏడో తేదీ నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ శాఖ తెలిపింది. లిక్కర్‌ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది.

డెలివరీకి ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యమే అందుబాటులో ఉంటుంది. 21 వయసు దాటిన వారికి మద్యం డెలివరీ చేసేలా రూపొందించిన వెబ్‌సైట్‌ ను పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రారంభించింది. మద్యం షాపుల వద్ద తాకిడిని తగ్గించేందుకే సైట్‌ ప్రారంభించింది.

పుష్పరాజ్ చాలా కష్టపడుతున్నాడు


తాను నటించే కొత్త సినిమా ` పుష్ప ` కోసం అల్లు అర్జున్ జుట్టు, గడ్డం బాగా పెంచాడు. సహజత్వం కోసం కటింగ్ చేయించుకోకుండా చింపిరి జుట్టు, చింపిరి గడ్డం ఉంచేద్దాం అనుకున్నాడు. అయితే షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా వచ్చి పడింది. రెండు నెలలుగా షూటింగ్ లు బంద్ అయ్యాయి. ఈ అరవై రోజుల్లో అల్లు అర్జున్ జుట్టు, గడ్డం ఇంకా పెరిగింది. దీంతో కటింగ్ చేయించుకోక తప్పడం లేదని తెలుస్తోంది .

అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్

అంతేకాదు దొరికిన ఈ విరామ సమయంలో స్క్రిప్ట్ ని ఇంకా మెరుగులు దిద్దుతున్నారట … ఎలాగో షూటింగ్ మొదలు కావడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టేలా ఉంది కనుక అల్లు అర్జున్ తన గెటప్ చేంజెస్ చేస్తున్నాడట … షూటింగ్ మొదలయ్యే నాటికీ సినిమాకి తగ్గ గెటప్ మళ్ళీ తెచ్చుకొంటాడట …. ఇదిలా వుంటే `పుష్ప` చిత్రం యొక్క కాస్ట్యూమ్స్ కోసం అల్లు అర్జున్ వేసుకునే బట్టలని ` టీ `నీళ్లలో నానబెట్టి ఒక రెండు రోజుల తర్వాత ఉతుకుతున్నారట. అలా బన్నీ వేసుకునే బట్టల్లో కూడా సహజమైన లుక్ వచ్చేలా సుకుమార్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట…తాను తీసే సినిమాలో ప్రతీది సూక్ష్మం గా పరిశీలిస్తాడు గనుకే సుకుమార్ చిత్రాలు మిగతావారికి భిన్నంగా ఉంటాయి .

చిరంజీవి తో జెంటిల్ మాన్ శంకర్ మూవీ


మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న జెంటిల్ మాన్ శంకర్ తో మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఐతే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసేందుకు కొందరు బడా నిర్మాతలు సిద్ధం అవుతున్నారట. ఓ భారీ పాన్ ఇండియా మూవీ వీరి కాంబినేషన్ లో తెరకెక్కించాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తోంది .. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో `ఆచార్య `మూవీలో నటిస్తున్నారు. .ఐతే చిరంజీవికి శంకర్ సినిమాల మీదుండే మమకారం కొద్దీ మొదటి చిత్రం జెంటిల్ మెన్ హిందీ రీమేక్ లో చిరంజీవి నటించారు. అల్లు అరవింద్ నిర్మాతగా 1993లో వచ్చిన ఆ మూవీకి బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు.

నరసరావుపేటలో ‘మిషన్ 15’

భారతీయ సినిమాకు భారీతనాన్ని నేర్పిన ఘనత శంకర్ ది ….. కేవలం తమిళ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే శంకర్ తెలుగులో ఏ ఒక్క స్టార్ హీరోతో ఇంతవరకు సినిమా చేయలేదు.కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లతో సినిమా చేయాలని శంకర్ ప్రయత్నించినా కుదర్లేదు . కాగా ఇపుడా అవకాశం చిరంజీవి దక్కించుకొనేలా ఉన్నాడు.

నరసరావుపేటలో ‘మిషన్ 15’


గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ‘మిషన్ 15‘ పేరుతో కార్యాచరణ అక్కడి అధికారులు ప్రారంభించారు. గుంటూరులో బుధవారం కొత్తగా మరో 12 కేసులు నమోదు అవగా వాటిలో 10 కేసులు నరసరావుపేటల నుంచే నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరు సిటీలో 162 కేసులు, నరసరావుపేట లో 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇంకా, 500 కు పైగా నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్

ఇక గుంటూరు జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదైన నరసరావుపేటలో ‘కరోనా’ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నరసరావుపేటలో ‘మిషన్ 15’ పేరుతో కార్యాచరణ ప్రారంభించారు. పదిహేను రోజుల తర్వాత కొత్త కేసులు ఉండకూడదన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

వలస కూలీలకు చేయూతనివ్వండి:జగన్

కాగా, ‘కరోనా’ హాట్ స్పాట్ గా మారిన నరసరావుపేటలో రోజుకు 10 నుంచి 15 కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాలు, నిత్యావసరాలను అధికారులు నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తున్నారు. ఒరవకట్ట, రామిరెడ్డి పేట, ప్రకాష్ నగర్, శ్రీరాంపురం, ఏనుగుల బజారు, నిమ్మతోట తదితర ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. పరిసర గ్రామాల్లోని వారిని పట్టణంలోకి రానివ్వడం లేదు.

ఎఫ్ 3 స్క్రిప్ట్ రెడీ అయ్యిందట


2019 సంక్రాంతి బాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రెడీ అవుతోంది .`ఎఫ్ 2` టైటిల్ తో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ` ఎఫ్ 3 ` మూవీ ని తీయాలని నిర్మాత దిల్ రాజు అనుకోవడం జరిగింది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసే ఛాన్స్ రావడం తో `ఎఫ్ 3 ` సినిమా పట్టాలెక్కలేదు .కానీ ఇపుడు `సీక్వెల్ ఎఫ్ 3 విషయం మరోసారి తెరపైకి వచ్చిం

అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్

విశ్వసనీయంగా తెలుస్తున్న దాన్ని బట్టి అనిల్ రావిపూడి `ఎఫ్ 3 ` సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశాడు. కరోనా ప్రభావంతో కావాల్సినంత గ్యాప్ దొరకడంతో సొంత వూరిలో కూర్చొని స్క్రిప్ట్ ని పూర్తి చేసేశాడు. కాగా ఈ చిత్రంలో మరో హీరో నటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది . గతంలో ` ఎఫ్ 3 ` చిత్రం లో మహేశ్ బాబు నటిస్తాడని, రవితేజ నటిస్తాడని వార్తలు వచ్చాయి గాని వాటిల్లో నిజం లేదని తెలుస్తోంది .

ఆ సీనియర్ నటి ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?


ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత క్యారెక్టర్ సీతార తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకప్పుడు సితార హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొంది. పలు భాషల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో నాటితరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సితార ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బీజీగా స్టార్ గా మారిపోయింది. టాలీవుడ్లో హీరోల తల్లి క్యారెక్టర్లలో సితార, ప్రగతిలు పోటాపోటీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్ రాణించిన సితార తనకు పెళ్లి కాలేదని విషయం తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

లాక్ డౌన్ బాధిత ప్రజలపై పెట్రోల్ ధరల మోత

తాను ఎందుకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని సితార వివరించింది. తనకు తండ్రి అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఏ చిన్న పని చేసినా, సినిమా, కెరీర్ వంటి విషయాలతోపాటు ప్రతీ పనిలోనూ ఆయన మాటనే వినేదానినని చెప్పింది. తన కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే తన తండ్రి మృతిచెందినట్లు వాపోయింది. ఆయన మృతితో మానసికంగా కుంగిపోయినట్లు తెలిపింది. ఈ బాధను మరిచిపోయేందుకు వరుసగా సినిమాలు చేస్తూ పోయినట్లు తెలిపింది. అలా బీజీగా మారిపోయి ఎనిమిదేళ్లు పెళ్లి గురించి ఆలోచించలేదని తెలింది.

మద్యం అమ్మకాలపై ముఖం చాటేస్తున్న ప్రధాని మోదీ!

ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. సితార తన జీవితంలో జరిగిన విషాద సంఘటన తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. తెరపై ఎప్పుడు నవ్వుతూ కన్పించే సితార జీవితంలో ఇంత విషాదం ఉందా? అంటూ అభిమానులు అవాక్కవుతున్నారు.

పక్క రాష్ట్రంతో జాగ్రత్త:కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కర్నూలు సరిహద్దులో గల గ్రామాల్లో అదేవిధంగా గుంటూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అటువారెవరూ ఇటు రాకుండా, ఇటువారెవరూ అటు పోకుండా చూడాలన్నారు. వైరస్‌ మన దగ్గర పుట్టింది కాదని, ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందన్నారు. ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్‌ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు అని సీఎం పేర్కొన్నారు.

అదే సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయన్నారు. అధికారులు హైదరాబాద్‌ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి చికిత్స చేయించడంతో పాటు అతను కలిసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌ లోని వారు బయటకు పోకుండా బయటివారు హైదరాబాద్‌ లోకి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. చురుకైన పోలీసు అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు, ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలన్నారు.

వలస కూలీలకు చేయూతనివ్వండి:జగన్

వలస కూలీల విషయంలో ప్రతి అధికారి ఉదారంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఇవ్వండి. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే.. వారికి సహకారం అందించండి. తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే… వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయండి. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదు. చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సహాయం చేయండి. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద రూ.500లు రూపాయలు ఒక్కో కూలీకి ఇవ్వండి’’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయవద్దన్నారు. అవసరమైన పక్షంలో వారికీ ప్రయాణ సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి:పవన్

కర్ణాటక తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వర్గాల కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించినట్టు ఏపీలో కూడా అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని పవన్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కోరారు.

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారని, వారికి ఆర్థికపరమైన ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ కూలీలు, హమాలీలు, కులవృత్తులు చేసుకునే బార్బర్లు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రికల్ పనులు చేసుకునేవారు, తోపుడు బండ్ల వారు, టిఫిన్ సెంటర్ల వారు ఆర్థికంగా దెబ్బతిన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వారికి ఒక్కొక్కరికి రూ.5వేల తక్కువ కాకుండా సాయం చేయాలని సూచించారు. కర్ణాటక ప్రభుత్వం రూ.1610 కోట్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఏపీలో కూడా అలాంటి నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి కోల్పోయిన వారిని ఆ ప్రత్యేక నిధి ద్వారా సాయం చేయాలన్నారు. అదే విధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ బిల్లు విషయంలో కొన్ని నెలల పాటు రాయితీలు ఇవ్వాలన్నారు. ఆస్తి, వృత్తి పన్నుల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.

కొత్త రూల్..మద్యం కొనాలంటే గొడుగు చూపించాలి!

అంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు వెళ్లి మద్యం కొనాలంటే గొడుగు రూల్ పెట్టారు. 40 రోజుల తర్వాత మద్యం షాపులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం బాబులు మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు దీరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపి అధికారులు కొత్త కండిషన్ తీసుకొచ్చారు. మద్యం కావాలంటే మాస్క్‌ తో పాటు గొడగు తప్పనిసరి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు గొడుగు పట్టుకుంటే.. కాస్త దూరం దూరంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే భౌతిక దూరం పాటిస్తారు. ఈ క్రమంలోనే గొడుగు నిబంధన తీసుకొచ్చారు అధికారులు. ఇప్పటికే గుంటూరు జిల్లా తెనాలిలో గొడుగు నిబంధన పెట్టారు. అక్కడ అది వర్కవుట్ అయ్యి.. అందరూ సామాజిక దూరం పాటించారు. ఈ నేపథ్యంలో అంతటా గొడుగును తప్పనిసరి చేశారు.