Home Blog Page 8494

చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని విడలేదా..?

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమ జిల్లాలకు రోజుకు 3 టి.ఎం.సీల నీటిని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు స్పందించినా తెలుగుదేశం పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు. ఏ విషయంపై ప్రభుత్వం జి.ఓ ఇచ్చి తొమ్మిది రోజులయ్యింది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే నాని, ఇందుకు ప్రభుత్వం ఏ రకమైన పోరాటంమైనా చేసినా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సీపీఐ, సిపిఎం పార్టీలు రాయలసీమకు నీటిని తరలించాలని, ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. టీడీపీ, జనసేన మాత్రం ఎప్పటి వరకూ తమ వైఖరిని వెల్లడించలేదు.

పోతిరెడ్డిపాడు విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరును రాయలసీమ వాసుల సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఈ పార్టీలు అమరావతి కోసం ఆందోళనలు చేశాయి, అది కేవలం19 గ్రామాలకు ప్రయోజనం. కానీ రాయలసీమలోని 1.7 కోట్ల మంది జీవితకాలపు సమస్యను తీర్చే నిర్ణయానికి మద్దతు ఇవ్వడంలేదు. విశాఖ ఎల్.జి దుర్ఘటనపై స్పందించాయి, ఇది కేవలం ఐదారు గ్రామాలకు పరిమితమైన సమస్యే అని పేర్కొంటున్నారు.

మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నేతలు పోతిరెడ్డిపాడు విషయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను ప్రతి రోజు విరుచుకుపడ్డారు. కేసీఆర్ తో కుమ్మక్కై రాయలసీమలో సాగినీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. పోలవరానికి జగన్ కేసీఆర్ తో కలిసి అడ్డుపడున్నారని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కొద్ది రోజు వేచి చూసే ధోరణి అవలంబించాలని బాబు భావిసుండటంతో ఈ విషయంలో టీడీపీ మౌనం వహిస్తుందని
తెలుస్తోంది.

వైసీపీ నాయకులు ఇప్పటికే టీడీపీ తన వైఖరి ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు ఎవరు స్పందించలేదు. నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశంపై చర్చించ జరగక పోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. కనీసం సోషల్ మీడియాలో సైతం ఎవ్వరూ స్పదించలేదు. ఇది ఇద్దరి సీఎంల నాటకమని తెలంగాణా టీడీపీ నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపై రెండు ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా రెండు రాష్ట్రాల మేలు చేసేలా, అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఇప్పటికీ రెండుకళ్ళ సిద్దాంతాన్ని అనుసరిస్తున్న విషయం స్పష్టం అవుతోంది.

18 నుంచి బస్సులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల పద్దెనిమిది నుంచి ఆర్టిసి బస్ లను నడపడానికి రంగం సిద్దం అవుతోంది. రైళ్లలో తీసుకున్నట్లుగానే బస్ లలో కూడా జాగ్రత్తలు తీసుకుని నడపాలని అధికారులు తలపెట్టారు. బస్సులు నడిపేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రవ్యాప్తంగా రీజనల్‌ మేనేజర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు.

దీంతో మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉంది. ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల స్లీపర్‌, నైట్‌ రైడర్‌, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర హైఎండ్‌ సర్వీసుల్లో 50 శాతం మందినే అనుమతిస్తారు.

మత సామరస్యం-ప్రమాదపుటంచుల్లో హిందూ మతం (భాగం6)

గత భాగం లో హిందూ మత పుట్టు పూర్వోత్తరాలు , తత్వ శాస్త్ర అభివృద్ధి తదితర అంశాలు చర్చించుకున్నాం. ఈ భాగం లో హిందూ మతం ఇన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేస్తూ నిరంతరం మనుగడ సాగించిన నేపధ్యంలో మిగతా మతాల్లాగా దాని వునికి ప్రమాదం లో పడిన సంఘటనలు ఉన్నాయా , వుంటే వాటిని ఎలా అధిగమించిందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసి ఎన్నో మతాలు వునికి కోల్పోయిన దృష్టాంతాలు మన కళ్ళముందే వున్నాయి. జొరాష్ట్రియన్ మతం ప్రస్తుత ఇరాన్ ప్రాంతంలో హిందూ మతం లాగానే విస్తృత ప్రజాదరణ కలిగిన మతం . కానీ అతితక్కువ సమయం లో మొత్తం ప్రజలు ఇస్లాం లోకి మారారు. మిగిలిపోయిన మతస్తులు వివిధప్రాంతాలకు పారిపోయారు. అలా మనదేశం వచ్చిన వాళ్ళే పార్శీలు. ఇప్పటికీ ముంబై దాదర్ లో వాళ్ళ ఆరాధ్యదైవమైన అగ్ని దేవాలయాలు వున్నాయి. వున్న కొద్ది మంది  ముంబై, గుజరాత్ లోనే వున్నారు. ఆ విధంగా ఆ మతం కనుమరుగయింది. ఈజిప్ట్ లో కూడా పురాతన మతం వుండేది. క్రైస్తవం, ఆ తర్వాత ఇస్లాం విస్తరణతో ఆ మతం ఉనికిని కోల్పోయింది. గ్రీక్ లో అతి పురాతన మతం వుండేది. అదీ తన ఉనికిని కోల్పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం లోని అనేక ప్రాంతాల్లో అప్పుడున్న మతాలూ, విశ్వాసాలు తర్వాత వచ్చిన మతాల ధాటికి తట్టుకోలేక ఉనికిని కోల్పోయినాయి. అటువంటిదే యూదు మతం కూడా. తర్వాత వచ్చిన మతాల ధాటికి తట్టుకోలేక చెల్లాచెదరయిన యూదులు వెయ్యి సంవత్సరాలకు పైగా తమ అస్తిత్వాన్ని నిలుపుకొని ప్రస్తుతం తిరిగి తమ స్వంత ప్రదేశానికి చేరటం ఒక్కటే వీటన్నింటిలో మినహాయింపు. మరి ఇటువంటి పరిస్థితి హిందూ మతానికి వచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది.

ప్రమాదపుటంచుల్లో హిందూ మత వునికి 

బౌద్ధంతో ఘర్షణ 

హిందూ మతం చరిత్రలో రెండుసార్లు వునికి కోల్పోయే ప్రమాదమొచ్చింది. ఒకటి అంతరంగికంగా, రెండోసారి బయటనుంచి. ఈ రెండూ సంఘటనలు హిందూ మతం అంతరించి పోతుందేమో నన్నంత తీవ్ర ఘటనలే. మొదటిది గౌతమ బుద్ధుని తిరుగుబాటు. ఇది మొత్తం ప్రజల్ని హిందూ మతం నుంచి బౌద్ధానికి మార్చింది. అప్పటికే అనేక దురాచారాలు, అవలక్షణాలు, అసమాన మానవ సంబంధాలతో కునారిల్లుతున్న హిందూ సమాజానికి బుద్ధుని బోధనలు స్వాంతన నిచ్చాయి. ఆ ప్రభావం తో ప్రజలు హిందూ మతాన్ని వదిలి బౌద్ధమతం లో చేరారు. ఇది ఓ సామాజిక, ఆధ్యాత్మిక విప్లవం. ఇందులో వర్ణ బేధం , వర్గ బేధం, ప్రాంతీయ బేధం లేదు. అందరూ సమానులే. ఆధ్యాత్మికంగా , హేతుబద్దంగా కూడా తాత్విక చర్చల్లో పాల్గొని మేధావులను, పామరులను సమానంగా ఆకర్షించగలిగింది. ఇది యుద్ధాల ద్వారానో , దౌర్జన్యాల ద్వారానో , భయ పెట్టో కాకుండా ప్రజల హృదయాలను, మనసులను, మేధస్సులను గెలిచి  తమ అక్కున చేర్చుకుంది. బుద్ధుని కాలంపై కూడా అనేక వివాదాలున్నాయి. కొంతమంది హిందూ చరిత్రకారులు బుద్ధుడు క్రీస్తు పూర్వం 19 వ శతాబ్దానికి చెందినవాడుగా పుట్టిన తేదీ , నక్షత్రం బట్టి లెక్క వేసి మరీ చెబుతున్నారు. అంటే  ప్రస్తుత అధికారిక లెక్కలకి ఇంకో 1200 సంవత్సరాలు    వెనక్కన్న మాట . ఆ లెక్కల ప్రకారం బౌద్ధం వ్యాప్తి చెంది ప్రాచుర్యంలో వున్న కాలం దాదాపు రెండు వేల సంవత్సరాల పై మాటే. ఆ సమయం లోనే కళలు, సాహిత్యం పూర్తిగా విలసిల్లినవి. తక్షశిల , నలంద లాంటి విశ్వవిద్యాలయాలు అధ్యయన కేంద్రాలుగా ఉండేవి. అక్కడున్న వేల  గ్రంధాలు తగలబెట్టకుండా వుండివుంటే బౌద్ధ చరిత్రతో పాటు హిందూ చరిత్ర కూడా మరింత తెలిసి వుండేది. బౌద్ధం బలవంతపు మార్పిడులు చేయలేదు కాబట్టి హిందూ మతస్తులు కూడా పక్క పక్కనే సహజీవనం చేశారు. తర్వాత దశలో బౌద్ధారామాలు , బౌద్దాచార్యులు పూర్తిగా పాత పద్ధతుల్ని విడిచి అన్య మార్గాల్లో నడవటం తో ప్రజల మన్ననలు కోల్పోయారు. దానితో పాటు శంకరుడు లాంటి హిందూ తత్వ శాస్త్రాలు హిందూ మతాన్ని పునరుజ్జీవనం చేయటం లో కృత క్రుత్యులయ్యారు. కొంతమంది రాజులు ముఖ్యంగా పుష్యమిత్రుడు హయాం లో బౌద్ధ బిక్షువుల్ని భౌతికంగా నిర్మూలన చేసినట్లు ఆధారాలున్నాయి. అయినా తర్వాత కూడా చాలా ఏళ్ళు రెండు మతాలూ సహజీవనం చేసినట్లు చారిత్రక ఆధారులున్నాయి. వాస్తవానికి రెండూ భారత మూలాలున్నవి  కావటంతో ప్రజలు వేరు వేరుగా చూడలేదు. మొత్తం మీద బౌద్దం స్థానం లో హిందూ మతం తిరిగి ప్రజల్లో మన్ననలు పొందగలిగింది. ఇందుకు ఎంతోమంది సాధువులు కృషి చేశారు.  అంటే దాదాపు కనుమరుగైన తర్వాత కొన్ని వందల ఏళ్ళకు తిరిగి పునరుజ్జీవనం పొందింది. ఇది మొదటి పునరుజ్జీవనం.

ఇస్లాం దాడి 

బౌద్ధం మనసులు, హృదయాలు గెలుచుకోవటానికి ప్రయత్నిస్తే  ఇస్లాం బలవంతంగా మత మార్పిడులు చేసింది. ఇది దాదాపు వెయ్యి ఏళ్ళు కొనసాగింది. మొదటి ఖలీఫా ఉస్మాన్ ఖాన్ దగ్గర్నుంచి మొదలయ్యి ఔరంగజేబు వరకు ఈ ఒరవడి కొనసాగింది. మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత వచ్చిన ఖలీఫాల కాలం లో మొత్తం పశ్చిమ ఆసియా , మధ్య ఆసియా , ఉత్తర ఆఫ్రికా , ఐబీరియా ద్వీపకల్పం అతి కొద్ది కాలం లోనే ఇస్లాం కిందకు వచ్చినా భారత ఉపఖండం ఆ విస్తరణను అడ్డుకుంది. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, రాజస్తాన్, లాంటి పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రతిఘటనలో పాల్గొనటం తో భారత్ కి విస్తరణ ఆలస్యమయ్యింది. మహమ్మద్ బీన్ ఖాసిం తో మొదలయ్యి ఆ తర్వాత చానాళ్లకు మహమ్మద్ ఘోరితో విస్తరణ ప్రారంభమయ్యింది. అయినా మిగతా ప్రాంతాల లాగా భారత్ ప్రజలను మత మార్పిడి చేయలేకపోయారు. వెయ్యి ఏళ్ళు పరిపాలించినా మార్చగలిగింది కొద్ది శాతం మందినే. అదీ తర్వాత వచ్చిన సూఫీ మత ప్రవక్తల ద్వారానే. దీనికి అనేక కారణాలున్నా యి. ఒకటి  ఎప్పుడూ హిందూ రాజులతో యుద్ధాలు కొనసాగటం, బౌద్ధం లాగా మనసుల్ని గెలవటానికి ప్రయత్నం చేయక పోవటం , ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుండటం తో హిందూ సమాజం సమీకరించబడటం, హిందూ సమాజం రక్షణాత్మక చర్యలు చేపట్టటం లాంటి అనేక పరిణామాలు ఇస్లాం మత మార్పిడిని నిరోధించగలిగాయి. ఉదాహరణకు కుల స్థిరీకరణ ఈ కాలం లోనే జరిగింది. ఇది ఇస్లాం నుంచి రక్షణ కవచంగా ఉపయోగపడింది. అదే తర్వాత ఆధునిక సమాజం లో హిందూ మతానికి గుదిబండలా తయారయ్యింది. దీనిపై వేరే భాగం లో సవివరంగా చర్చించుకుందాం.

వీటితో పాటు చివరివరకు చాలా భూభాగాలు ఇస్లాం విస్తరణను అడ్డుకోవటం కూడా ఒక కారణం. ఉదాహరణకు ఈశాన్య భారతం లోకి విస్తరించాలని చేసిన ప్రయత్నం వందల సంవత్సరాలు అహోం ( ప్రస్తుత అస్సాం ) రాజులు ప్రతిఘటించి ఎన్నో యుద్ధాలు, ఎన్నో వేలమంది మరణించినా ప్రతిఘటించ గలగటం తో అటువైపు విస్తరణ ఆగిపోయింది. అలాగే దక్షిణాదిన మొదట్లో కాకతీయులు,  యాదవరాజులు ప్రతిఘటించినా అది ఎక్కువకాలం నిలవలేదు. ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాలం లో దక్షిణాది లోపలి భాగాలకు    విస్తరించినా తర్వాతికాలం లో వచ్చిన 200 సంవత్సరాల విజయనగర రాజుల ప్రతిఘటన దక్షిణాదికి విస్తరించకుండా ఆపింది. అలాగే పశ్చిమం లో శివాజీ వీరోచిత ప్రతిఘటన అందరికీ తెలిసిందే. రాజస్తాన్ లోని మేవాడ్ రాజులు  దాదాపు వెయ్యేళ్ళు పోరాటాలు చేస్తూనే వచ్చారు. చివరకు మొఘలులు కూడా వాళ్ళను జయించలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం లో ఎప్పుడూ ఎక్కడోచోట ప్రతిఘటన జరుగుతూనే వుంది. వీటితోపాటు హిందూ రాజులు చాలా సార్లు ధర్మ యుద్ధం పేరుతో తీవ్ర నష్ట పోయారు. అలా కాకుండా గెరిల్లా పోరాటం చేసి విజయాలు నమోదు చేసుకుంది మహారాణా ప్రతాప్, శివాజీ లు. అలాగే కొంతమంది సనాతన వాదుల మూలంగా కూడా పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు కాశ్మీర్ లో 14 వ శతాబ్దం లో రించన సేనాపతి  అప్పటి రాజుని సంహరించి రాజ్యంతో పాటు తన కూతురు కోటా దేవి ని కూడా పెళ్ళాడాడు. ఆమె తనని హిందూ మతం స్వీకరించమని ఒత్తిడి చేస్తే అందుకు అతను సమ్మతించాడు. కానీ కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు తనని చేర్చుకోవటానికి మతం ఒప్పుకోదని నిరాకరించారు. దానితో అవమానంగా భావించి ఇస్లాం స్వీకరించి హిందూ దేవాలయాల్ని కూలగొట్టి , హిందువులను నానారకాల హింసలకు గురిచేశాడు. అలాగే 19 వ శతాబ్దం మొదట్లో పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ కాశ్మీర్ ని జయించిన తర్వాత బలవంతంగా మతం మారిన ఇస్లాం ప్రజల్ని తిరిగి హిందూ మతం లోకి ఆహ్వానించాడు. అప్పుడుకూడా కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు, హిందూ ధర్మాచార్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా జరిగివుండకపోతే  కాశ్మీర్ చరిత్ర వేరేలాగా వుండేది. సనాతన వాదులు వాళ్ళ మూఢ ఆచారాల వలన ఇలా ఎన్నో సార్లు హిందూ మతానికి నష్టం చేకూర్చారు. అయినా హిందూ మతం రెండో సారి తన ఉనికిని కాపాడుకోగల్గింది . ఇది ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన. దీనికి పోలిక ఎక్కడా లేదు. హిందూ మతం లో పేరుకు పోయిన దురాచారాలు, మూఢ ఆచారాలపై మాత్రమే దృష్టి పెట్టే ఉదారవాదులు దీనిపై కూడా సమ దృష్టితో పరిశీలించి వుంటే బావుండేది.

మూడో ప్రమాదం 

యూరోప్ దేశస్తులు మనదేశంలోకి వ్యాపార నిమిత్తంతో పాటు క్రైస్తవ మత వ్యాప్తి కోసం కూడా ప్రవేశించారు. ముఖ్యంగా ముందుగా వచ్చిన పోర్చుగీసు వారికి మత వ్యాప్తి కూడా ప్రధానమే. తర్వాత వచ్చిన డచ్ , ఫ్రెంచ్ వాళ్ళు కూడా తమవంతు ప్రయత్నం చేసారు. తర్వాత పరిపాలనా పగ్గాలు చేపట్టిన బ్రిటిష్ వారు ముందు వాళ్ళంత కాకపోయినా క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేసారు. వీళ్ళు ప్రధానంగా హిందూ మతం లోని కుల వివక్ష పై దృష్టి పెట్టారు. ఈ దురాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ‘నిమ్న కులాల’ వారిని ఆకర్షించటానికి ప్రయత్నించారు. దక్షిణాది లో వీరి ప్రయత్నం కొంతమేర సఫలీకృత మయ్యింది. ఇది బౌద్ధం లాగా తాత్విక చర్చలతో మనసులు గెలుచుకోవటమో, లేక ఇస్లాం లాగ బలవంతంగానో కాకుండా ఆర్ధిక సహాయం తో, విద్య, వైద్య సౌకర్యాల తో, ప్రభుత్వ తోడ్పాటుతో , హిందూ సమాజం లోని అసమానతలను ఎత్తిచూపటం తో ప్రజల్ని గెలవాలని చూసారు. అయితే పరిమితంగానే విజయవంతమయ్యారు. ముఖ్యంగా ఆదివాసుల్లో , దళితుల్లో కొంతమేర స్థానం సంపాదించుకో గలిగారు. ఇది మొదటి రెండు ప్రమాదాల్లాగా హిందూ మత ఉనికిని దెబ్బ తీసే స్థాయికి చేరలేకపోయింది.  దీనికి కారణాలు ఇంతకుముందే వేరే భాగం లో చర్చించుకోవటం జరిగింది. ఇలా చరిత్రలో హిందూ మతం పడిలేస్తూ ప్రయాణం సాగించి ప్రస్తుతం నిలదొక్కుకొని రాటు తేలింది. అయినా ఇప్పటికీ కులవ్యవస్థ అంతరంగిక శత్రువుగా వుంటూనే వుంది. దీనిపై వచ్చే భాగం లో చర్చించుకుందాం.

చరిత్ర ని చరిత్రగా చూద్దాం 

దురదృష్టవశాత్తు భారత చరిత్ర ఎన్నో వక్రీకరణలకు గురయ్యింది. ఆధునిక స్వాతంత్ర పోరాట చరిత్ర లో ఎలాగయితే కాంగ్రెస్ తప్ప   మిగతా వారి పోరాటాల్ని విస్మరించటమో , తక్కువ చేసి చూపించటమో జరిగిందో మధ్యయుగపు చరిత్ర ముఖ్యంగా వెయ్యేళ్ళ ముస్లిం పాలన చరిత్రపై కూడా చాలా వరకు వక్రీకరణలకు గురయ్యింది. ఈ వెయ్యేళ్ళు జరిగిన పోరాటాల్ని విస్మరించటం, తక్కువచేసి చూపటం  పనిగట్టుకొని జరిగింది. చరిత్రను రాసేటప్పుడు ఇప్పుడు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని చరిత్రను కప్పిపుచ్చకూడదు. ఆ రోజు జరిగింది జరిగినట్లు చెప్పగలగాలి. అయితే ఎవరైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వారికి ఆపాదించటం చేయరాదు. అది ఘోరమైన తప్పవుతుంది. నేను అమెరికా లో నా తమ్ముడు కూతురు పాఠ్య పుస్తకాలు చూసి ఆశ్చర్య పోయాను. వాళ్ళకున్న అమెరికా చరిత్ర లో తెల్ల వాళ్ళయిన యూరపు దేశస్తులు ఏ విధంగా రెడ్ ఇండియన్లు గా పిలువబడే స్థానిక జాతిని నాశనం చేసారో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. వాళ్ళ పూర్వీకులు ఆ పని చేసారు కాబట్టి దాచుకోవటానికి ప్రయత్నించలేదు. అమెరికా స్థానిక రెడ్ ఇండియన్ లపై మ్యుజియం ల్లో పూర్తి వివరాలు వుంటాయి. అలాగే మనం చరిత్ర చదివేటప్పుడు జరిగింది జరిగినట్లు చదవాలి . అంతేగాని మసిపూసి మారేడుకాయ చేయకూడదు. అదేసమయం లో దాన్ని చరిత్రగానే చూడాలి. వర్తమాన సమాజానికి అన్వయించి వివక్ష చూపకూడదు.  మరి ఇప్పటికైనా చరిత్రను తిరగరాసి నిజాల్ని ప్రజలకి తెలియ చెప్పాల్సిన భాద్యత ప్రభుత్వం పై వుంది. మిగతాది వచ్చే భాగం లో .

( సశేషం)

రైళ్ళు వస్తున్నాయ్.. జాగ్రత్త!

కరోనా లాక్‌ డౌన్‌3.0 లో అనేక కార్యక్రమాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ క్రమంలోనే 15 ఏసీ రైళ్ళకు, కొన్ని ప్రత్యేక రైళ్ళకు రైల్వేశాఖకు అనుమతులు లభించాయి. ఈరోజు మొదటిసారిగా ప్రయాణికుల రైలు సికింద్రాబాద్‌ కు రానుంది. రాత్రి 8:30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్‌ లో బయలుదేరిన బెంగళూరు ఢిల్లీ (రాజధాని) ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు ఈ రోజు సికింద్రాబాద్ చేరుకోనుంది. అనంతరం బయలుదేరి రేపు తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుంది. కాగా, లాక్‌ డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుకుపోయిన దాదాపు 200 మంది తెలంగాణవాసులు ఈ రైలులో సికింద్రాబాద్ చేరుకోనున్నారు. అలాగే, తెలంగాణలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది ప్రయాణికులు ఢిల్లీ వైపుగా ప్రయాణించనున్నారు. మరోపక్క, ఢిల్లీలో నిన్న రాత్రి 9:15 గంటలకు బయలుదేరిన మరో రైలు నేటి సాయంత్రం సికింద్రాబాద్ చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ విధంగా వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉంటున్న కారణంగా.. వారి పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, వైరస్‌ వ్యాప్తిని కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాక్‌ డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలోకి పెద్దఎత్తున వలస కార్మికులు, ఇతరులు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. మొదట విదేశాల నుంచి వచ్చినవారివల్ల, తర్వాత మర్కజ్‌ తో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగిందని, ఇప్పుడు వలసకార్మికుల వల్ల ఆ ప్రమాదం ఉన్నదన్నారు. ఇతర ప్రాంతాలనుంచి తెలంగాణకు వస్తున్న వారందరినీ ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌ లో ఉంచుతున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు వివిధ మార్గాల్లో 41,805 మంది రాష్ర్టానికి వచ్చారన్నారు. సడలింపులతో ఎక్కువ మంది బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు.

తెలంగాణకు ఇతర రాష్ర్టాల నుంచి వలస వస్తున్నవారితో కరోనా విస్తరిస్తున్నట్టు తెలుస్తున్నది. గత ఆరు రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారిలో 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిపట్ల భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం వలసలు వస్తున్నవారిపై ప్రత్యేకదృష్టి సారించింది. ఎవరిలోనైనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే వారిని వైరస్‌ నిర్ధారణ కోసం దవాఖానకు తరలిస్తున్నారు. గత ఐదు రోజుల్లో ఆయా జిల్లాలనుంచి 66,959 మంది బయటకు వెళ్లగా, 41,805 మంది ప్రవేశించినట్టు ప్రత్యేక బృందాలు గుర్తించాయి.

3లక్షల కరోనా మరణాలు!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉండటం గమనార్హం. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 లక్షల 71 వేల 992. వ్యాధి నుంచి కోలుకొని 16 లక్షల 57 వేల 831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 98 వేల 77 మంది చనిపోయారు.

కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి. అమెరికా-85,197, స్పెయిన్‌-27,104, రష్యా-2,212, యూకే-33,106, బ్రెజిల్‌-13,158, ఫ్రాన్స్‌-27,074, జర్మనీ-7,861, టర్కీ-3,952, ఇరాన్‌-6,783, చైనా-4,633, పెరూ-2,169, కెనడా-5,302, బెల్జియం-8,843, నెదర్లాండ్స్‌-5,562, మెక్సికో-4,220, ఈక్విడార్‌-2,334, స్విట్జర్లాండ్‌-1,870, పోర్చుగల్‌-1,175, స్విడన్‌-3,460, ఐర్లాండ్‌-1,497, రోమేనియా-1,036, ఇండోనేషియాలో 1,028 వ్యాధి కారణంగా చనిపోయారు.

భారత్‌ లో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ సోకి 134 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం​ కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరుకోగా.. మృతుల సంఖ్య 2,549కి చేరింది.

మోడీ ఆర్ధిక ప్యాకేజి మొదటి విడత విడుదలయ్యింది

నిర్మల సీతారామన్ మొదటి దఫా ప్యాకేజి విడుదలయ్యింది. ఎంతో కాలంగా , ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో దఫా ఆర్ధిక ప్యాకేజి విడుదల దశకు నిన్నటి మోడీ ప్రకటనతో మొదలయ్యింది. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి లో ఇంతకుముందే  ప్రకటించినవి పోనూ ఇప్పుడు ఇచ్చేవి షుమారు 10.25 లక్షల కోట్లు వుండొచ్చు. అందులో 6 లక్షల కోట్లకు పైగా ఈరోజు ఆర్దికమత్రి ప్రకటించారు. ఇవి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ రంగం, విద్యుత్తు రంగం, ఎన్ బి ఎఫ్ సి రంగం, రియల్ ఎస్టేట్ రంగం , కాంట్రాక్టర్లు, పన్ను చెల్లింపు దారులు వున్నారు.

ఈ ప్యాకేజి మూల సారాశం ద్రవ్య లభ్యత పెంచటం. అన్ని రంగాల్లోనూ ద్రవ్యలభ్యత పెరిగే వెసులుబాటు కల్పించారు. ఉదాహరణకు చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్ల రుణ సదుపాయం కల్పించటమే కాకుండా ప్రభుత్వం ఆ రుణాలకు గ్యారంటీ కూడా ఇచ్చింది. ఇది బ్యాంకులకు కొంత వూరట. అలాగే ఇంకో 20 వేలకోట్లు ఇబ్బందుల్లో వున్న యూనిట్లకు , మరో 50 వేల కోట్లు కొత్త యూనిట్లకు చేయూత నివ్వటం జరిగింది. అన్నింటికన్నా ముఖ్యమైనది 200 కోట్లవరకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలవకుండా దేశీయ పరిశ్రమలకే అవకాశమివ్వటం. ఇది ఎంఎస్ ఎం ఇ లకు పెద్ద ప్రోత్సాహం. దీన్నే నిన్న మోడీ లోకల్ ని వోకల్ గా చెప్పాడు. అలాగే వాటికి రావాల్సిన ప్రభుత్వ బకాయీలు 45 రోజుల లోపు చెల్లించటం. ఇది రెండో విడత . ఇ పి ఎఫ్  ఖాతాల్లో చెల్లించ వలిసిన సొమ్మును మూడు నెలలు ప్రభుత్వమే భరిస్తూ ఇంతకూ ముందు ప్యాకేజి లో ప్రకటించటం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇంకో మూడు నెలలు పొడిగించారు. అలాగే ఆ స్కీము లో కవర్ కాని వాళ్ళ కోసం ఇంకో పధకం ప్రవేశపెట్టారు. మొత్తం వీటన్నింటికి 3 లక్షల 70 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది.

ఇక మిగతా వాటిల్లో విద్యుత్తు పంపిణీ సంస్థలకు 90 వేల రుణ సదుపాయం కల్పించటం ముఖ్యమైన నిర్ణయం. ఇప్పటికే కునారిల్లుతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇది ఓ వరం. వాస్తవానికి దీని ప్రభావం మిగతా వాటిపై కూడా వుంది. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు పంపిణీ సంస్థల బకాయీలతో కుదేలయ్యాయి. ఈ పరిణామం బ్యాంకుల రుణాల మీద పడి అవి నిరర్ధక ఆస్తులు పెరగటానికి దోహదం చేస్తుంది. ఈ వెసులుబాటు వలన మూడు రంగాలకు మేలు జరుగుతుంది.

ఎన్ బి ఎఫ్ సి లకు ౩౦ వేలు రుణ సదుపాయం కల్పించటం, ఇంకో 40 వేలకు రుణ గ్యారంటీ ఇవ్వటం ఆ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందినవాళ్ళు సమయానికి కాంట్రాక్టులు పూర్తి చేసే పరిస్థితి లేనందున మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం లో బిల్దర్లదీ అదే పరిస్థితి. వీళ్ళందరికీ 6 నెలలు అదనపు గడువివ్వటం పెద్ద ఆటవిడుపు. చివరగా పన్ను చెల్లింపు దారులకు ముందస్తు పన్ను లో 25 శాతం మినయింపు పెద్ద వూరట. దీనితో అదనంగా 50 వేల కోట్లు ద్రవ్య లభ్యత మార్కెట్టు లోకి వచ్చింది. అలాగే దానికి సంబంధించిన గడువు తేదీలను పొడిగించటం కూడా పెద్ద మెంటల్ రిలీఫ్. ఇవీ ఈ రోజు బయటపెట్టిన ప్యాకేజి వివరాలు.

రేపు మరిన్ని రంగాలకు సంబంధించి తెలుస్తుంది. ఇందులో ఆర్ధిక ఉద్దీపనా ప్యాకేజి తో పాటు పలు సంస్కరణలు కూడా వుండే అవకాశాలు మెండుగా వున్నాయి. మోడీ ఇప్పటికే ఈ దిశగా సిగ్నల్స్ ఇచ్చాడు. రేపు, ఎల్లుండి ప్రకటించే వాటిలో వాటిపై ఫోకస్ పెట్టె అవకాశముంది. వేచి చూద్దాం, రేపటి కోసం.

ఎల్.జి భాదితులకు ప్రత్యేకంగా ఆసుపత్రి ఉండాలి…!

ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటనలో భాదితుల ఆరోగ్య పరిరక్షణకు ఐదు గ్రామాలకు ఒక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నెలకొల్పాలని, విషవాయు బాధితులు అందరికీ ఆ హాస్పటల్ లోనే ఎప్పటికప్పుడు అత్యున్నత చికిత్స అందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత గ్యాస్ లీకేజి మృతులకు నివాళులర్పించారు. బాధితులకు అండగా ఉండాలని తీర్మానం చేసింది. రెండు రాష్ట్రాలలో కోవిడ్ మృతులకు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని ఖండించింది. తక్షణమే ఆయా కుటుంబాల వారిని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. విశాఖ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సహా నగరంలోని జలాశయాల్లో నీళ్లు కలుషితం కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లలోకి వచ్చినవాళ్లు కూడా విషవాయువు తీవ్రతకు భయపడి మళ్లీ వెళ్లిపోవడం ఆందోళనకరని వెల్లడించారు.
అక్కడ నిద్రించినట్లు వైసిపి నాయకులు చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికి కూడా ఎల్జీ పాలిమర్స్ కంపెనీది తప్పు అని వైసిపి నాయకులు చెప్పలేక పోతున్నారని చంద్రబాబు తెలిపారు. ట్యాంకర్లలో ఉన్న స్టైరీన్ ను విదేశాలకు పంపడంపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.

గుంటూరులో వైసిపి నాయకుడు ఇచ్చిన విందు వల్ల దుష్ఫలితాలు చూశామని, వైసిపి ఎమ్మెల్యేలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారన్నారు. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ల ర్యాలీ, నగరిలో, కనిగిరిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి వైరస్ వ్యాప్తికి కారణం అయ్యారని తెలిపారు. ఏపిలో కరోనా కష్టకాలంలో కూడా, చివరికి బ్లీచింగ్ లో కూడా రూ70కోట్ల కుంభకోణానికి పాల్పడటాన్ని ఖండించారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్నారు. నాసిరకం శానిటైజర్లు, నాసిరకం మాస్క్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. మడ అడవులను విచక్షణా రహితంగా నరికేయడాన్ని పోలిట్ బ్యూరోలో టిడిపి నేతలు ఖండించారు. దీనివల్ల భవిష్యత్తులో తీరప్రాంతానికి తుఫాన్ల ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఫ్రంట్ లైన్ వారియర్ల కృషికి టిడిపి పోలిట్ బ్యూరో అభినందన తెలిపారు.

ఈ విపత్కర పరిస్థితిలో కరెంటు ఛార్జీలను పెంచడాన్ని ఖండించింది. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ గాలికి వదిలేసి 4 రెట్లు పెంచారని చెప్పారు. పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో గర్హించింది. విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో బాధితులపై, వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్షాల నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండించింది. టిడిపి మహానాడు నిర్వహణపై చర్చ జరిగింది.

వర్క్ ఫ్రం హోం చేసే ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

Google fb twitter

కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో ప్రముఖ సంస్థలన్ని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకి అనుమతించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది.

రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ఇక నుంచి ట్విట్టర్ ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించినట్టు సీఈవో జాక్ డోర్సీ తెలిపారు. సెప్టెంబర్ వరకు ట్విట్టర్ ఆఫీసులు తెరువబోమని ఆయన స్పష్టం చేశారు. లాక్‌ డౌన్ ముగిశాక కూడా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదే తరహాలో ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు కూడా ట్విట్టర్ దారినే ఎంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

భారీ ప్యాకేజీలో వలస కూలీల వాటా ఎంత?

 

కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాలను ఆదుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో వలస కూలీల వాటా ఎంతో వివరించాలని అన్నారు.

ఈ రోజు కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్యాకేజీ ప్రకటనపై చిదంబరం విమర్శలు కురిపించారు. వలస కూలీలకు సంబందించిన సాయం గురించి లేకుండా ప్యాకేజీ ప్రకటించడం ఏమిటని ఆయన మండిపడ్డారు. ఆమె ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా ఎంత? అని ఆయన అన్నారు. ఆకలితో మలమలలాడుతూ వందల కిలోమీటర్లు నడుస్తున్న పేద వలస కార్మికులను ప్రస్తావించకపోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు.ఈ ఆర్థిక ప్యాకేజీ పెద్ద ఎంఎస్‌ఎంఈల కోసమేనని చిదంబరం విమర్శించారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉందని అన్నారు. 13 కోట్ల కుటుంబాలు లాక్‌ డౌన్‌ కు తీవ్రంగా నష్టపోయాయని, ప్రభుత్వ సాయం వారిని ఈ కష్టాల నుంచి కాపాడలేకపోయిందని చిదంబరం అన్నారు.

ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే ప్రతీ రూపాయి.. పేదల ఆకలిని తీర్చేలా ఉండాలని చిదంబరం అభిప్రాయపడ్డారు. చేతిలో పని లేక వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్తోన్న పేదల ప్రయోజనాల కోసం పాటుపడాలని చిదంబరం కోరారు.

ఎంఎస్ఎంఇ లకు భారీ ఊతం -రూ 3 లక్షల కోట్ల రుణాలు

లాక్ డౌన్ కారణంగా అందరికన్నా ఎక్కువగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. వాటికి రుణాలు ఇచ్చేందుకు రూ. 3 లక్షల కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత రాత్రి ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజి వివరాలను తెలుపుతూ ఎంఎస్‌ఎంఇ కింద ఇచ్చే రుణాలకు కేంద్రం హామీ ఇస్తుందని తెలిపారు. ఎంఎస్ఎంల నిర్వచనంలో సహితం కీలక మార్పులు తీసుకు వస్తూ వాటికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు లభించేవిధంగా చూస్తున్నట్లు ఆమె చెప్పారు.

అక్టోబర్ వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. 45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా చెప్పారు.

అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు. నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.

జలం గళం: తెలంగాణకు, ఆంధ్రాకు అదే తేడా

తెలంగాణకు, ఏపీకి ఉన్న తేడా అదే.. అవును.. తెలంగాణలో ఆదాయం, ఆచరణ తక్కువగానే ఉన్నా ఆప్యాయత, అనురాగాలు ఎక్కువగా ఉంటాయని అంటుంటారు.. కష్టమొస్తే అందరూ ఏకమయ్యే స్వభావమూ ఎక్కువే. కులం, మతం కార్డులు తెలంగాణలో పెద్దగా పనిచేయవు. కానీ ఆంధ్రాలో ‘కుల’పోట్లు ఎక్కువ. కమ్మ, రెడ్లు, కాపులు అంటూ ప్రతీదాంట్లోనూ కుల కుంపట్లే.. వేరుబాటే.. ఇప్పుడే ఆ వేరు రాష్ట్ర ప్రయోజనాల వరకు వచ్చేసరికి కూడా కనిపిస్తోంది. అదే ఆంధ్రాపాలిట శాపంగా మారుతుండగా.. తెలంగాణలో ఆ ఐక్యత.. రాష్ట్రం సాధించినట్టే ఇప్పుడు జలం కోసం కూడా ఒక్కటయ్యేలా చేస్తోంది.

*పోతిరెడ్డిపాడు జలంపై జగన్ ఒంటరి
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటరీ నుంచి రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించేందుకు జగన్ సర్కార్ తాజాగా జీవో జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది. ఇన్నాళ్లు అన్నాదమ్ముళ్లుగా ఉన్న కేసీఆర్-జగన్ లు రాష్ట్ర ప్రయోజనాల కోసం అడ్డంగా విడిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి తెలంగాణ పక్షపాతి.. నిధులు, నీళ్ల, నియమాకాల కోసమే ఉద్యమించారు. రాష్ట్రం సాధించారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ నీటిదోపిడీపై కేంద్రానికి, కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టులోనూ పిటీషన్ వేయడానికి రెడీ అయ్యారు. అదే ఏపీలో ట్రెయిన్ రివర్స్ అయ్యింది. జగన్ కు సపోర్టుగా టీడీపీ, జనసేన స్పందించలేదు.. చంద్రబాబు మౌనం దాల్చారు. పవన్ కనీసం ట్విట్టర్ గూట్లోనూ పలకలేదు. బీజేపీ కన్నా లక్ష్మీనారాయణకు సీమ పై ధ్యాసలేదు. దీంతో సీఎం జగన్ ఒంటరి అయిపోయారు.

*ఒక్కటైన తెలంగాణ సమాజం..
ఏపీ రాయలసీమకు నీటి తరలింపు జీవో రాగానే జెండాలు, అజెండాలు పక్కనపెట్టి తెలంగాణ సమాజం ఒక్కటైంది. కేసీఆర్ ప్రభుత్వ పరంగా స్టిక్ట్ గా ముందుకెళ్తున్నారు. జగన్ తో దోస్తీ కంటే తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు. టీజేఎస్ కోదండరాం దీనిపై పోరుబాటుకు శ్రీకారం చుట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా దీనిపై బుధవారం ధర్నాల నిర్వహణకు పిలుపునిచ్చాడు. ఇలా కేసీఆర్ మొదలు ఉత్తమ్, కోదండరాం, వామపక్షాలన్నీ ఆంధ్రా నీటి తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమించి సమాజం ఒక్కతాటిపైకి రావడం విశేషం.

*రాజకీయమే ఏపీకి శాపం..
తెలంగాణలో ఉద్యమమైనా.. అభివృద్ధి అయినా ప్రజలు, రాజకీయ పార్టీలు తెలంగాణకు మేలు జరుగుతుంది.. కీడు జరుగుతుంది అంటే ఒక్కటవుతారు. కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరువు సీమ రాయలసీమకు నీటి తరలింపుపై జగన్ జీవో జారీ చేస్తే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదు. ఆయన తీరు చూస్తుంటే తెలంగాణకే మద్దతుగా ఉన్నట్టు అనిపిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇక చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేసే పవన్ కళ్యాణ్ సైతం ఇంత భారీ స్టెప్ జగన్ తీసుకుంటే దానిపై స్పందించలేదు. రాజధాని మార్పుపై దీక్షలు, ధర్నాలు చేసినా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నోరు మెదపడం లేదు. ఇలా నిత్యావసరమైన నీటి కోసం తెలంగాణ ప్రజలంతా ఒక్కటైతే.. ఆంధ్రా రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా తమ ప్రాంత హక్కుల విషయంలో తలోదారి అన్నట్టుగా ప్రవర్తించడం.. నిజంగా అక్కడి ప్రజలు చేసుకున్న దురదృష్టం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

–నరేశ్ ఎన్నం

కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా.. నో టెన్షన్!

Electricity Bills

రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయని వెల్లువెత్తుతున్న ఆందోళనలతో విద్యుత్ సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. చార్జీల పెంపు జరగలేదని, 500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు పెరిగిందని ట్రాన్స్ కో సిఎండి ఎన్. శ్రీకాంత్ స్పష్టం చేశారు. మరోవైపు వినియోగదారులు బిల్లుల వివరాలను పంపిణీ సంస్థలు ఆన్ లైన్ లో ఉంచుతున్నాయి.

బిల్లుపై సందేశం ఉంటే 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోనే అవకాశం కల్పించాయి. ఈఆర్‌సీ ఆమోదించాకే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.బిల్లులు జారీ చేసిన 15 రోజులలో చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అపరాధ రుసుము విధిస్తారు. ప్రస్తుతం అపరాధ రుసుము లేకుండా బిల్లులు చెల్లింపుల గడువు జూన్ 30 వరకూ పెంపు సంస్థ ఆదేశాలు ఇచ్చింది.

చిత్తూరులో అధికారుల నిర్వాకం..!

చిత్తూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి సమీపంలోని వికృతమాల క్వారంటైన్ సెంటర్ లో కోవిడ్ 19 బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలను నెగిటివ్ వచ్చిదని భావించి పొరపాటున నెగిటివ్ వచ్చిన ఇతర మహిళలతో కలిపి ఇంటికి పంపించారు.

తరువాత విషయం తెలుసుకుని, పాజిటివ్ వచ్చిన నలుగురు మహిళలను వెనక్కి రప్పించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో బుధవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 11 కేసులు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. ఎప్పటి వరకూ జిల్లాలో 142 మంది వైరస్ బారిన పడ్డారు. తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో రైతులు కోయంబేడు మార్కెట్ కు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కోయంబేడు వెళ్లి వచ్చిన వారినందరిని క్వారంటైన్ కు తరలించాలని పోలీసుల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ అర్థాన్ని వివరించిన సీతారామన్!

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల నష్టపోయిన వారికి, ఉపాధి కోల్పోయిన వారికి చేయూతనందించేందుకు ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఆయన ప్రకటించారు.

అయితే ఈ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె మోడీ ప్రస్తావించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పథకం యొక్క అర్థం, విశిష్టతను ఆమె వివరించారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ అంటే స్వయం ఆధారిత భారత్‌ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పథకం గురించి నిర్మల బుధవారం మీడియాతో మాట్లాడాతూ.. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపే అద్భుతమైన పథకం అని వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు.. ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో.. పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ధాన్యం, ఉచిత సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్‌ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామని.. స్వయం ఆధారిత భారత్‌ కు కావాల్సిన పునాదులు ఇప్పటికే మోదీ సర్కారు పూర్తి చేసిందని వెల్లడించారు. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ఈరోజు ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు… ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్‌ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎంఎస్‌ఎంఈ లకు రూ.3 లక్షల కోట్లు!

కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో దేశం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఈ రోజు (బుధవారం) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)కు రూ.3లక్షల కోట్లు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఎంఎస్‌ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం చేకూరనుంది. తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20వేల కోట్లు; ఎంఎస్‌ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయించారు. 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు మంజూరు చేయనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు.

రేపు పెళ్లి పీఠలెక్కనున్న హీరో నిఖిల్..!

హీరో నిఖిల్ పెళ్లికి ముహుర్తం ఖారారైంది. రేపు(మే 14) ఉదయం 6.31గంటలకు నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. గతకొంతకాలంగా నితిన్-పల్లవి వర్మ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో గోవాలో వీరిద్దరి ఎంగెజ్మెంట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. అనంతరం దేశంలో లాక్డౌన్ కారణంగా వీరిద్దరు వివాహా వేడుకను వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తమ వివాహా వేడుకను మే 14కు వాయిదా వేసుకున్నారు. అయితే దేశంలో లాక్డౌన్ మే 17వరకు కొనసాగనుండటంతో సింపుల్ గా వివాహాన్ని చేసుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇటీవల టాలీవుడ్ బడా నిర్మాత లాక్డౌన్లో హడావుడిగా, సిక్రెట్ పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. గతకొంతకాలంగా దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలపై అనే కొట్టిపారేశారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ లాక్డౌన్లో హడావుడి పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో పెళ్లితోపాటు దిల్ రాజు కుమార్తె వివాహ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో తెలియడంతో అందరికీ తెల్సిందే. దిల్ రాజులాగే నిఖిల్ కూడా కొద్దిమంది సన్నిహితులతో తుతూమంత్రంగా వివాహాన్ని చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడు.

తొలుత కరోనా ఎఫెక్ట్ ముగిశాక చేసుకుందా అనుకున్న నిఖిల్ కొద్దిరోజుల్లో మూఢం, మంచి రోజులు లేకపోవడంతో అర్జెంట్ గా పెళ్లి పీఠలెక్కందుకు రెడీ అవుతున్నారు. నగర శివార్లలోని ఓ ఫామ్ హవుస్ లో పెళ్లి జరగనుందని సమాచారం. లాక్డౌన్లో హడావుడి పెళ్లిళ్లపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. ఏదిఏమైనా నిఖిల్ ఓ ఇంటివాడవుతుండటంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇకపై రైతుబంధు వారికేనా?

తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు బీమా, రైతుబంధు వంటి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. దురదృష్టవశాత్తు ఒకవేళ రైతు చనిపోతే రైతు బీమా అనేది అన్నదాత కుటుంబానికి అండగా నిలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ రైతుకు తెలంగాణ సర్కార్ రైతు బీమా కల్పించి ప్రభుత్వమే ప్రతీయేటా 500కోట్ల మేర చెల్లిస్తుంది. ఇక రైతుబంధు కింద రబీ, ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వమే ఎకరానికి 5వేల చొప్పున రైతుకు సాయమందిస్తోంది. తాజాగా రైతుబంధుపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రైతులు సర్కార్ సూచించిన పంటలు మాత్రమే పండించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాలను పాటించే రైతులకు మాత్రమే రైతుబంధు అందించాలని వ్యవసాయాధికారులకు ప్రభుత్వం సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.

వ్యవసాయంలో నూతన మార్పులకు కేసీఆర్ శ్రీకారం..
తెలంగాణలో అత్యధిక వరి పంటను సాగు చేస్తున్నారు. నీళ్లు సరిగాలేని ప్రాంతాల్లో పత్తి పంటను చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేశారు. కోటి ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు ఎత్తిపోతల ద్వారా కాళేశ్వరం నీటిని తరలిస్తున్నారు. దీంతో రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతోన్నాయి. నీరు పుష్కలంగా ఉండటంతో రైతన్నలంతా వరి పంట సాగుకే మొగ్గుచూపుతోంది. దీంతో ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంటలపై దిశానిర్దేశం చేసేందుకు రెడీ అవుతోన్నారు.

రైతు పండించిన ప్రతీగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతున్నాయి. కొన్నిచోట్ల తూకాల్లో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నా మెజార్టీ ప్రాంతాల్లో కొనుగోళ్లు సజావుగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే రాష్ట్రమంతటా ఒకే పంట పండిస్తే గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వర్షకాలంలో రైతులు వరితోపాటు 50లక్షల ఎకరాల్లో పత్తి, 10లక్షల ఎకరాల్లో కందులు, ఇతర పంటలు పండించేలా చర్యలు చేపడుతోంది. ఈమేరకు విత్తనాలను కూడా సిద్ధం చేసింది.

రైతులు ఇకపై ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తేనే రైతుబంధు పథకం వర్తించేలా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. ఇదిలా ఉండగా సర్కార్ చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు పంపిణీ చేయాలనే ఆదేశాలేమీ తమకు రాలేదని వ్యవసాయాధికారులు చెబుతుండటం గమనార్హం. దీనిపై ప్రభుత్వం రైతులకు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.