
రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయని వెల్లువెత్తుతున్న ఆందోళనలతో విద్యుత్ సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. చార్జీల పెంపు జరగలేదని, 500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు పెరిగిందని ట్రాన్స్ కో సిఎండి ఎన్. శ్రీకాంత్ స్పష్టం చేశారు. మరోవైపు వినియోగదారులు బిల్లుల వివరాలను పంపిణీ సంస్థలు ఆన్ లైన్ లో ఉంచుతున్నాయి.
బిల్లుపై సందేశం ఉంటే 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోనే అవకాశం కల్పించాయి. ఈఆర్‌సీ ఆమోదించాకే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.బిల్లులు జారీ చేసిన 15 రోజులలో చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అపరాధ రుసుము విధిస్తారు. ప్రస్తుతం అపరాధ రుసుము లేకుండా బిల్లులు చెల్లింపుల గడువు జూన్ 30 వరకూ పెంపు సంస్థ ఆదేశాలు ఇచ్చింది.