నిర్మల సీతారామన్ మొదటి దఫా ప్యాకేజి విడుదలయ్యింది. ఎంతో కాలంగా , ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో దఫా ఆర్ధిక ప్యాకేజి విడుదల దశకు నిన్నటి మోడీ ప్రకటనతో మొదలయ్యింది. 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి లో ఇంతకుముందే ప్రకటించినవి పోనూ ఇప్పుడు ఇచ్చేవి షుమారు 10.25 లక్షల కోట్లు వుండొచ్చు. అందులో 6 లక్షల కోట్లకు పైగా ఈరోజు ఆర్దికమత్రి ప్రకటించారు. ఇవి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ రంగం, విద్యుత్తు రంగం, ఎన్ బి ఎఫ్ సి రంగం, రియల్ ఎస్టేట్ రంగం , కాంట్రాక్టర్లు, పన్ను చెల్లింపు దారులు వున్నారు.
ఈ ప్యాకేజి మూల సారాశం ద్రవ్య లభ్యత పెంచటం. అన్ని రంగాల్లోనూ ద్రవ్యలభ్యత పెరిగే వెసులుబాటు కల్పించారు. ఉదాహరణకు చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్ల రుణ సదుపాయం కల్పించటమే కాకుండా ప్రభుత్వం ఆ రుణాలకు గ్యారంటీ కూడా ఇచ్చింది. ఇది బ్యాంకులకు కొంత వూరట. అలాగే ఇంకో 20 వేలకోట్లు ఇబ్బందుల్లో వున్న యూనిట్లకు , మరో 50 వేల కోట్లు కొత్త యూనిట్లకు చేయూత నివ్వటం జరిగింది. అన్నింటికన్నా ముఖ్యమైనది 200 కోట్లవరకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలవకుండా దేశీయ పరిశ్రమలకే అవకాశమివ్వటం. ఇది ఎంఎస్ ఎం ఇ లకు పెద్ద ప్రోత్సాహం. దీన్నే నిన్న మోడీ లోకల్ ని వోకల్ గా చెప్పాడు. అలాగే వాటికి రావాల్సిన ప్రభుత్వ బకాయీలు 45 రోజుల లోపు చెల్లించటం. ఇది రెండో విడత . ఇ పి ఎఫ్ ఖాతాల్లో చెల్లించ వలిసిన సొమ్మును మూడు నెలలు ప్రభుత్వమే భరిస్తూ ఇంతకూ ముందు ప్యాకేజి లో ప్రకటించటం జరిగింది. ఇప్పుడు దాన్ని ఇంకో మూడు నెలలు పొడిగించారు. అలాగే ఆ స్కీము లో కవర్ కాని వాళ్ళ కోసం ఇంకో పధకం ప్రవేశపెట్టారు. మొత్తం వీటన్నింటికి 3 లక్షల 70 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది.
ఇక మిగతా వాటిల్లో విద్యుత్తు పంపిణీ సంస్థలకు 90 వేల రుణ సదుపాయం కల్పించటం ముఖ్యమైన నిర్ణయం. ఇప్పటికే కునారిల్లుతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇది ఓ వరం. వాస్తవానికి దీని ప్రభావం మిగతా వాటిపై కూడా వుంది. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు పంపిణీ సంస్థల బకాయీలతో కుదేలయ్యాయి. ఈ పరిణామం బ్యాంకుల రుణాల మీద పడి అవి నిరర్ధక ఆస్తులు పెరగటానికి దోహదం చేస్తుంది. ఈ వెసులుబాటు వలన మూడు రంగాలకు మేలు జరుగుతుంది.
ఎన్ బి ఎఫ్ సి లకు ౩౦ వేలు రుణ సదుపాయం కల్పించటం, ఇంకో 40 వేలకు రుణ గ్యారంటీ ఇవ్వటం ఆ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందినవాళ్ళు సమయానికి కాంట్రాక్టులు పూర్తి చేసే పరిస్థితి లేనందున మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం లో బిల్దర్లదీ అదే పరిస్థితి. వీళ్ళందరికీ 6 నెలలు అదనపు గడువివ్వటం పెద్ద ఆటవిడుపు. చివరగా పన్ను చెల్లింపు దారులకు ముందస్తు పన్ను లో 25 శాతం మినయింపు పెద్ద వూరట. దీనితో అదనంగా 50 వేల కోట్లు ద్రవ్య లభ్యత మార్కెట్టు లోకి వచ్చింది. అలాగే దానికి సంబంధించిన గడువు తేదీలను పొడిగించటం కూడా పెద్ద మెంటల్ రిలీఫ్. ఇవీ ఈ రోజు బయటపెట్టిన ప్యాకేజి వివరాలు.
రేపు మరిన్ని రంగాలకు సంబంధించి తెలుస్తుంది. ఇందులో ఆర్ధిక ఉద్దీపనా ప్యాకేజి తో పాటు పలు సంస్కరణలు కూడా వుండే అవకాశాలు మెండుగా వున్నాయి. మోడీ ఇప్పటికే ఈ దిశగా సిగ్నల్స్ ఇచ్చాడు. రేపు, ఎల్లుండి ప్రకటించే వాటిలో వాటిపై ఫోకస్ పెట్టె అవకాశముంది. వేచి చూద్దాం, రేపటి కోసం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: The first instalment of modi package released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com