శ్రీశైలం పవర్ ప్లాంట్ లో మళ్లీ పేలుడు.. ఏమైంది?

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మొన్నటికి మొన్న భారీ పేలుడు, అగ్ని ప్రమాదం సంభవించి 9మంది వరకు ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసింది.దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో శ్రీశైలం పేలుళ్లను సిఐడికి అప్పగిస్తూ సమగ్ర దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ఆ ప్రమాదాన్ని మరిచిపోకముందే తాజాగా బుధవారం సాయంత్రం మళ్లీ అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను పక్కనే ఉన్న విద్యుత్ కేబుళ్ల పైనుంచి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి దాదాపు 10 మీటర్ల చొప్పున మంటలు ఎగిసిపడ్డాయని తెలిసింది.
ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో అక్కడి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈక్రమంలోనే మరోసారి అగ్ని ప్రమాదం ఘటనపై జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు.
ఇది ప్రమాదం కాదని.. పునరుద్ధరణ పనులు జరుగుతున్న వేళ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు స్పష్టం చేశారు. అయితే సిబ్బంది కూడా తెలియకుండా మాక్ డ్రిల్ నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే రహస్యంగా మాక్ డ్రిల్ చేశామని.. సిబ్బందిని అప్రమత్తతను పరీక్షించామని సీఎండీ ప్రభాకర్ రావు తెలుపడం నమ్మశక్యంగా లేదని పలువురు అనుమానం పడుతున్నారు. ప్రమాదం జరిగినా దాస్తున్నారా అని అనుమానపడుతున్నారు.
ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్.. తెలుగు రాష్ట్రాల ఎక్కడ?

దేశంలో రోజురోజుకు ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన రెకెత్తిస్తోంది. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. వాటిని పరిష్కరించుకోకుండా కొందరు పిరికివారిలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరైతే ఏ కారణం లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జాతీయ నేర గణాంక విభాగం(ఎన్సీఆర్బీ) దేశంలోని ఆత్మహత్య సంఘటలపై షాకింగ్ విషయాలను వెల్లడించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆత్మహత్యల్లో తొలిస్థానంలో ఉండటం శోచనీయంగా మారింది.
2018తో పోల్చుకుంటే 2019లో బలవర్మణాల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్సీఆర్బీ వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 381మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొంది. 2018లో 1,34,516 మంది బలవర్మణానికి పాల్పడగా 2019నాటికి 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించింది. వీరిలో 70.2శాతం మంది పురుషులుగా ఉండగా మహిళలు 29.8శాతం ఉన్నట్లు తేలింది. బలవర్మణానికి పాల్పడేవారిలో పురుషులే అత్యధికంగా ఉండటం షాకింగ్ కు గురిచేస్తోంది.
ఆత్మహత్య పాల్పడిన వారిలో 53.6శాతం మంది ఉరి వేసుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. విషం తాగి 25.8శాతం మంది, నిప్పంటించుకొని 3.8శాతం మంది, నీళ్లలో దూకి 5.2శాతం మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో కుటుంబ సమస్యలతో 32.4శాతం మంది, వివాహ సంబంధ సమస్యలతో 5.4 శాతం మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది.
ఆత్మహత్యల్లో ఆర్థిక రాజధాని మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. 18వేలకు పైగా మంది కిందటేడాది ఆత్మహత్యకు చేసుకున్నట్లు తేలింది. 13వేల కేసులతో తమిళనాడు రెండోస్థానంలో, 12వేల కేసులతో పశ్చిమబెంగాల్ మూడోస్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యల సంఖ్య భారీగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది.
తెలంగాణలో గతేడాది 7,675మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 2,858మంది కూలీలు ఉండగా 499మంది రైతులు ఉన్నట్లు పేర్కొంది. ఇక ఏపీలో 6,465 ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో వివాహం తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వారేరే ఎక్కువగా ఉన్నట్లు తేలడం గమనార్హం. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, ఒడిశా, చండీఘఢ్, మణిపూర్, ఢిల్లీలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఎన్సీఆర్బీ పేర్కొంది.
ఏదిఏమైనా ఆత్మహత్య పిరికిపంద చర్య అని మానసిక నిపుణులు, సైకాలిజిస్టులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తే వెంటనే సైకాలిస్టును సంప్రదించి చికిత్స చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించగలరని.. ఆత్మహత్యలతో సాధించేది ఏమి ఉండదని అంటున్నారు.
కరోనా ప్రళయంలో కూడా మెగాస్టార్ తపన !

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారకముందు కొరటాల శివ ఎదురుకున్న ప్రధాన సమస్య కొరటాల కథలు దోపిడీ గురి కావడం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.. వేరే వారి కథలను కొరటాల దోపిడీ చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఆరోపణలకు విమర్శలకు కొరటాల ఒక చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులువుకున్నాడు. కానీ, ఈ వ్యవహారం కోర్టు దాకా పోయేలా కనిపిస్తోంది. సరే ఈ కాపీ వ్యవహారాలను పక్కన పెడితే… ప్రస్తుతం కొరటాల ఆచార్య షూటింగ్ సన్నాహాలు చేస్తున్నాడు. అక్టోబర్ 5 నుండి ఆచార్య షూట్ స్టార్ట్ కానుంది. ఫిల్మ్ సర్కిల్స్ లోని లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ఓ పాత భవనం సెట్ వేశారు. ఈ సెట్ లోనే షూటింగ్ చేయనున్నారు. అతి తక్కువమంది సిబ్బందితో షూట్ చేస్తారట.
Also Read: నరకాన్ని చూశానంటున్న క్రేజీ హీరోయిన్ !
కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటూనే.. మెగాస్టార్ రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ముఖ్యంగా సెట్ లోని వ్యక్తులను కూడా మెగాస్టార్ కి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటారట. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బాగానే కష్టపడుతున్నారు. ఈ వయసులో ఎంతో కష్టం అయినా, బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. పైగా యంగ్ గా కనిపించడానికి మేకప్ కోసం గంటలు తరబడి ఒకే చోటు కూర్చుని చాలా మేక్ ఓవర్ అయి మరీ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కరోనా రోజురోజుకు పెరుగుతున్నా.. అరవై దాటిన వారి పై కరోనా పంజా విసురుతుందని తెలిసినా.. చిరు మాత్రం షూటింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. చిరు ఆదేశాల మేరకే కొరటాల వచ్చే నెల షూట్ ప్లాన్ చేస్తున్నాడట.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
ఏమైనా.. సినిమా కోసం మెగాస్టార్ ఏమి చేయడానికైనా వెనుకాడరు అని మరోసారి రుజువు అయింది. అసలు మెగాస్టార్ తలుచుకుంటే.. డూప్ ను పెట్టి కూడా చాలా సీన్స్ తీసేయొచ్చు. కానీ, డూప్ అయితే తన సహజమైన బాడీ లాంగ్వేజ్ రాదు అని.. స్వయంగా మెగాస్టారే షూట్ లో పాల్గొంటా అని స్పష్టం చేశారట. కరోనా ప్రళయంలో కూడా చిరు తపనను ముచ్చటేస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఆల్ టైం బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా.. యంగ్ హీరోయిన్ రెజీనా ఐటమ్ సాంగ్ తో మెగాస్టార్ పక్కన ఈ సినిమాలో కనిపించబోతుంది. పెద్ద ఛాన్స్ లు లేక కెరీర్ ముగిసిందనుకున్న దశలో రెజీనాకి దొరికిన సువర్ణావకాశం ఇది. కాకపోతే ఆమెది ఐటమ్ సాంగ్. మరీ ఈ ఐటమ్ తోనైనా రెజీనాకి అవకాశాల వెల్లువ మొదలవుతుందేమో చూడాలి. రామ్ చరణ్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఒకే ఒక్క దెబ్బతో బాబు కుల రాజకీయం బట్టబయలు…?
![]()
అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారన్నది దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తూ ఉన్న మాట. ఇక కుల రాజకీయాలు చేసే వారిని, టిడిపి పార్టీ సభ్యులను విడివిడిగా చూడలేం అన్నది కూడా ఎప్పటినుండో ఉన్న ఆ విమర్శ. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు వేసిన ఒకే ఒక్క తప్పటడుగు అతని ఆలోచన తీరును, అవసరాన్ని, కుల రాజకీయతత్వాన్ని బయటపడేలా చేసింది.
Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ
వివరాల్లోకి వెళితే చాలా రోజుల బ్రేక్ తర్వాత హైదరాబాద్ నుండి తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ లోని తన ఇంటి నుండి బయలుదేరి సాయంత్రం ఉండవల్లి లోని తన ఇంటికి చేరుకుంటారని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఇక గురువారం నాడు బాబు…. బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర బాబు లని కలిసి పరామర్శించనున్నారని చెబుతున్నారు. పార్టీ అధినేతగా కష్టాల్లో ఉన్న నేతలను పరామర్శించి ధైర్యం చెప్పడం సబబు. అది ఇతర నాయకులకు కూడా భరోసా ఇచ్చినట్లు ఉంటుంది. అయితే ఇదే సమయంలో వారితో పాటుగా రెండు సార్లు జైలుకి వెళ్ళిన జేసీ ప్రభాకర్ రెడ్డిని మాత్రం బాబు అతను ఎందుకు కలవట్లేదు అని ఇప్పుడు సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
అటు జేసీ అభిమానులు ఏమో…. తమ నాయకుడు రెండు సార్లు జైలు పాలయ్యారని…. మొదటిసారి అరెస్టయినప్పుడు లోకేష్ వచ్చి పరామర్శించారు అని గుర్తు చేస్తున్నారు. అంటే మిగతా ఇద్దరు మాజీ మంత్రుల స్థాయి చంద్రబాబు వచ్చి పరామర్శించేంత అయితే జేసీకి లోకేష్ బాబు పరామర్శలతో సరి పెట్టేశారా అన్నది వారి ప్రశ్న. లాజికల్ గా చూసుకుంటే జెసి బ్రదర్స్ పైన బాబుకి నిజంగా ప్రేమ ఉంటే…. రెండుసార్లు అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు నేరుగా తాడిపత్రి పోయి ఉండాల్సింది.
అయితే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర బీసీలు కావడంతో వారిని పరామర్శించి కుల రాజకీయాలు చేయడానికి ఇదే సరైన సమయమని చంద్రబాబు ఆంధ్రకి వస్తున్నారనన్న విమర్శలు కూడా లేకపోలేదు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించడం వల్ల తనకు ఒరిగేది ఏమీ లేదని చంద్రబాబు భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఇది విన్న తర్వాత అయినా బాబు జేసి ని పరామర్శించేందుకు వెళ్తారా…? అనుమానమే..
Also Read : పవర్ ఉన్న వాళ్ళని జగన్ పట్టించుకోరా..?
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు

కరోనా మహమ్మరి దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలని కేంద్రం నడుం బిగించింది. భారత దేశ చరిత్రలోనే అథమంగా జీడీపీ -23.9 కు దిగజారడం.. దేశవ్యాప్తంగా ఐదునెలల్లోనే కోటిన్నర మంది ఉద్యోగాలు కోల్పోవడం.. పేదలకు పనిలేని పరిస్థితుల్లో తాజాగా సమావేశమైన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
జాతీయ ఉపాధి హామీ పథకం ఇన్నాళ్లు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతోంది. ఇప్పుడు పట్టణాలకు విస్తరించాలని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన పథకంగా మార్చాలని యోచిస్తోంది. లాక్ డౌన్ తో చితికిపోయిన పట్టణ పేదలను ఆదుకోవాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక దేశమంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే పరీక్ష నిర్వహించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి ‘కర్మయోగి యోజన’ అనే పేరు పెట్టారు.
ఇక జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లును కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అధికార భాషలుగా ఉర్దూ, కశ్మీర్, డోగ్రీ, హిందీ, ఇంగ్లీస్ భాలున్నాయి.
ఈ సమావేశంలో సివిల్ సర్వీసెస్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాని పర్యవేక్షణలోనే సివిల్ సర్వీసెస్ పనిచేయనుంది.
చైనాకు భారత్ షాక్.. పబ్జి సహా 118 యాప్ లపై నిషేధం

సరిహద్దుల్లో చీటికి మాటికి కవ్విస్తున్న చైనాకు మరోసారి భారత్ గట్టి హెచ్చరిక పంపింది.ఇప్పటికే చైనాకు చెందిన 59 చైనా యాప్స్ ను దేశంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి డ్రాగన్ దేశానికి షాక్ ఇచ్చింది.
తాజాగా మరో 118 చైనీస్ మొబైల్ యాప్ లపై కేంద్రం నిషేధం విధించి సంచలనం సృష్టించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్ జీ, క్యామ్ కార్డ్, బైడ్ , కట్ కట్ సహా మొత్తం 118 యాప్ లు ఉన్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ తెలిపింది.
గతంలో గాల్వన్ లోయలో 20 మంది భారత సైనికులను చంపిన చైనాపై నాడు ప్రధాని మోడీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. చైనాకు తొలి హెచ్చరిక పంపారు మోడీజీ. .నాడు 59 యాప్ లను నిషేధించారు. దేశవ్యాప్తంగా మోడీ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే నిషేధానికి గురైన చైనా యాప్స్ జాబితాలో జూమ్, పబ్ జీ లేకపోవడంపై చర్చ మొదలైంది. జూమ్ యాప్ ను ‘ఎరిక్’ అనే అమెరికా పౌరుడు ప్రారంభించాడు. అయితే ఈ యాప్ యూజర్ల సమాచారాన్ని చైనాకు చేరవేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఎరిక్ ఖండించాడు కూడా…
ఇక పబ్ జీ గేమ్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ తయారు చేసింది. అయితే డిస్ట్రిబ్యూషన్ హక్కులు మాత్రం ఓ చైనా కంపెనీకి ఉన్నాయి.
ఇలా చైనాకు దగ్గరగా ఉన్న ఈ రెండు యాప్ లపై మోడీజీ నిషేధం విధించలేదు. పబ్ జీ చైనాదేనని అందరూ చెబుతుంటారు. మరీ మోడీజీ ఎందుకు ఈ యాప్ పై నిషేధం విధించలేదు. పబ్ జీ చైనాది కాదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు తాజాగా మళ్లీ ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని చైనా యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో పబ్ జీ సీక్లీనర్ లాంటి చైనీస్ యాప్స్ ఉన్నాయి.
బిగ్ బాస్ పై సునీత రియాక్షన్ !

సింగర్ సునీత.. ఆమె గాత్రం ఎంత కమ్మగా ఉంటుందో.. ఆమె చీర కట్టు ఆమెలోని తెలుగుతనం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పటి హీరోయిన్స్ కంటే.. ఎంతో అందంగా కనిపించే సునీతకు అభిమానులు కూడా విశేషంగానే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా సునీత గురించి వస్తోన్న ప్రధాన న్యూస్. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతుంది అని. ఈ న్యూస్ లో ఎంత వాస్తవం ఉందో తెలియకుండానే డైరెక్ట్ గా సునీత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది అంటూ వెబ్ మీడియాలో తెగ రాసేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే బిగ్ బాస్ సందడి మొదలైంది. రెండు వారాల క్రితమే షూటింగ్ కూడా మొదలైందనేది లేటెస్ట్ సమాచారం. ఇక ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ సీజన్ 4 నాగార్జున హోస్ట్ గా అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
అందుకే నెటిజన్లు కూడా బిగ్ బాస్ లోకి సునీత వెళ్తుందని వస్తోన్న వార్తలను ఈజీగా నమ్మేశారు. అయితే తన పై వచ్చే రూమర్స్ కు ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చే అలవాటు ఉన్న సునీత, తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వారి లిస్ట్ లో తన పేరు కూడా బాగా వినిపించడంతో.. ఇక ఆమెనే నేరుగా ఈ వార్త పై స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అని వస్తోన్న వార్తలను ఆమె ఖండిస్తూ.. ‘డియర్ ఫ్రెండ్స్, బయట వస్తోన్న వార్తలను బట్టి నేను బిగ్ బాస్ హౌస్ నాలుగో సీజన్ లో పాల్గొనబోవడం లేదు. నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అందుకే నేను పాల్గొనబోను కూడా.. అంటూ దండం పెట్టి.. నా పై వస్తోన్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మీకు తెలియడానికే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను’ అని మొత్తానికి సునీత స్పష్టంగా తెలిపింది.
Also Read: పవర్ స్టార్ బర్త్ డే రెండో గిప్ట్.. #PSPK27 ప్రీ లుక్ రిలీజ్
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఆ పదిహేను, పదహారు మంది కంటెస్టెంట్లు ఎవరై ఉంటారా అని నెటిజన్లు వారి పేర్లు తెలుసుకోవడానికి తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు వంద రోజుల పాటు సాగే ఈ నాలుగో సీజన్ లో కాస్త మసాలా గేమ్స్ ఉంటాయని.. అలాగే ఎక్కువగా అమ్మాయిలను షోలోకి తీసుకువచ్చి వారితో ఉండే అబ్బాయిలకు మధ్య కాస్త కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా షోను ప్లాన్ చేశారని.. గత సీజన్స్ కంటే.. ఈ సారి సీజన్ బాగా బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక హౌస్ లోకి వెళ్లే.. కంటెస్టెంట్ల లిస్ట్ ను ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా, సింగర్ నోయెల్, దేత్తడి హారిక, దివి, లాస్య, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, సోహెల్, ముక్కు అవినాష్, దిల్ సే మెహబూబా, రఘు మాస్టర్, యాంకర్ సుజాత, మోనాల్, అభిజీత్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చాలామంది పేర్లు మెజార్టీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కూడా లేదు. మరీ వీళ్ళు హౌస్ లో ఉన్నంత మాత్రాన ఏమి ఇంట్రస్ట్ వస్తోందనేది చూడాలి.
హైదరాబాద్ కు బై అంటున్న సురేఖా వాణి !

టాలీవుడ్ లో అక్కలు అమ్మల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో సురేఖా వాణి కూడా ఒకరు. మంచి అయినా, కాస్త ఆవేశం అయినా సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ఆమెను ఫాలో అయ్యేవారికే అర్ధం అవుతుంది. అయితే ఇన్నేళ్లు సురేఖా ఒక్కత్తే కుర్రాళ్లను సినిమా అభిమానులను అలరిస్తూ వస్తుంటే.. వెలితిగా ఉందనుకుందే ఏమో.. తన రూట్ లోకే తన కుమార్తెను కూడా తీసుకువచ్చి ఆమెను కూడా నటిగా మార్చడానికి సురేఖా వాణి బాగానే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ముందుకు పోతొంది.
Also Read: పవర్ స్టార్ బర్త్ డే రెండో గిప్ట్.. #PSPK27 ప్రీ లుక్ రిలీజ్
ముఖ్యంగా టిక్ టాక్ ఉన్నంత కాలం సుప్రిత ఓ రేంజ్ లో హంగామా చేసింది. పైగా సురేఖా వాణి చేత కూడా టిక్ టాక్ వీడియోలు చేయించి నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. మెయిన్ గా ఈ లాక్ డౌన్ లో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి డ్యాన్సులు చేసి తామూ హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నారు. అన్నిటికి కంటే ముఖ్యంగా బెడ్రూంలో కాలా చష్మా అంటూ పొట్టి బట్టలు వేసుకుని ఇద్దరూ చేసిన డ్యాన్సులకు కుర్రకారు ఫిదా అయిపోయింది. ఇక ఈ మధ్య సురేఖా తన కూతురు బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేయడంతో పాటు స్పెషల్‌గా ఈవెంట్ మేనేజర్ లతో మాట్లాడి ఇళ్లంతా ప్రత్యేకంగా అలకరించి మరీ తన కూతురికి పెద్ద సర్ ప్రైజ్ గిఫ్ట్ నే ఇచ్చింది. తానూ తన కూతురుకి బెస్ట్ ఫ్రెండ్ అంటూ.. మొత్తానికి కూతురు కంటే కూడా.. సురేఖా వాణినే ఎక్కువ అల్లరి చేస్తోంది.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
అయితే ఇక నుండి కొన్ని రోజులు పాటు సురేఖా వాణి, ఆమె గారాల కూతురు హైదరాబాద్ కు బాయ్ చెప్పేస్తున్నారు. తాజాగా తామూ హైద్రాబాద్ ను విడిచివెళ్లినట్టు.. కొన్ని రోజులు పాటు తన గ్యాంగ్‌ను మిస్ అవ్వక తప్పదు అని సురేఖా వాణి తెలిపింది. అలాగే తన ఫ్లైట్ టికెట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హైద్రాబాద్‌కు బై అని కామెంట్ పెట్టింది. ఇంతకీ ఈ తల్లీకూతుళ్లు ఎక్కడకి వెళ్లారు అని, వాళ్ళ ఫాలోవర్స్ తో పాటు, నెటిజన్లు కూడా తెగ ఆరా తీస్తున్నారు. సురేఖా వాణి పోస్ట్ చేసిన టికెట్‌లో మాత్రం జైపూర్ అని ఉంది. అంటే సురేఖా వాణి తన కూతురుతో కలిసి జైపూర్ వెళ్లి ఉంటుంది. మరి జైపూర్ ఎందుకు వెళ్లారో ఇంకా తెలియదు. అయితే ఈ కరోనా కాలంలో జైపూర్ కి వెళ్ళారు అంటే.. బహుశా అక్కడ వారికి దగ్గర బంధువులు ఉండి ఉంటారని.. వారి కోసమే వెళ్ళి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
వైయస్సార్ ను అడ్డం పెట్టుకొని జగన్ కు మంట పెట్టిన ఎంపీ రాజు..?
![]()
ఏపీ రాష్ట్ర అధికార పార్టీ వివాదాస్పద పార్లమెంటు సభ్యుడు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరొకసారి వార్తల్లోకెక్కారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన…. సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన రాజుగారికి లోపల ఎంత ఉందో తెలియదు గాని… ఆయన మాత్రం వైఎస్ఆర్ పరమభక్తుడనని రాజు చెప్పుకుంటాడు. ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి అయిన నేపథ్యంలో ఆయన ఫోటో పై పూలు కురిపించి నివాళులు అర్పించిన ఎంపీ రాజు ఈ సంధర్భంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలను రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పడం గమనార్హం.
ఎంపీ రాజు మాట్లాడుతూ…. ఒక సారి ఏదో న్యూస్ పేపర్ లో చంద్రబాబు నాయుడు ఫోటో ని కార్టూన్ లాగా గీసిన బొమ్మ ను తాను రాజశేఖర్ రెడ్డికి చూపించానని…. అయితే వెంటనే అతను అది చూసి సీరియస్ అయిపోయి న్యూస్ పేపర్ ని పక్కకి విసిరి కొట్టారు అని ఆయన అన్నారు. ఇది ఏమీ బాగోలేదు అని…. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తిని ఇలా కించపరచడం తగదని వైఎస్ అన్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఇలా చేయడం అవమానించినట్లే అని…. చంద్రబాబు నాయుడు పట్ల మనం ఎప్పుడడూ గౌరవాన్ని చూపించాల్సిందే అని వైఎస్ చెప్పినట్లుగా రాజు గుర్తుచేసుకున్నారు.
“ఆయన సంస్కారానికి ఆ రోజున మనసులోనే నమస్కారం పెట్టాను” అంటూ ఆ సందర్భంలో రాజు గారు తన ఫీలింగ్ గురించి వెల్లడించారు. ఇతరులను గౌరవించడం వల్లే అతను లెజెండ్ లా ఎదిగారని రాజు గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ వార్తలన్నీ అటు టిడిపి సపోర్టర్లు జగన్ ను ఉద్దేశించి చేసినట్లుగా అంటున్నారు. జగన్ చంద్రబాబు పైన అసెంబ్లీలో విరుచుకుపడుతున్న తీరు…. ఎప్పటికప్పుడు వైసిపి నేతలు బాబుని ఎన్ని రకాలుగా కావాలంటేఅన్ని రకాలుగా అవమానించిన వైనాన్ని రాజు ఇప్పుడు ఎత్తిచూపుతున్నారని అంటున్నారు.
అంతేకాకుండా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ వైఎస్ ఏనాడూ తన పథకాలకు తన పేరు పెట్టలేదని…. రాజీబ్ గాంధీ పేరు, ఇందిరా గాంధీ పేర్లు మాత్రమే పెట్టారు అని గుర్తు చేశాడు. ఇప్పుడు జగన్ తన పథకాలకు ‘జగనన్న’ అని కొన్నిటికి ముందు తన పేరుని ట్యాగ్ లా తగిలించుకున్న విషయాన్ని రాజు తప్పు అని చెప్పడమేనా ఇది…? అని వైసిపి వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఏదైనా ఈమధ్య రాజు ఏది చేసినా సెన్సేషన్…. ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతోంది.
నరకాన్ని చూశానంటున్న క్రేజీ హీరోయిన్ !

మన దేశంలో ముంబై.. అస్సాం రాష్ర్టాలను ప్రతీ ఏడాది వర్షాలు ముంచెత్తాయి. ఈ ఏడాది కూడా అలాగే వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. మొత్తానికి అక్కడి ప్రజలకు ఈ వర్షాలు.. వరదలు వారి జీవితంలో ఓ భాగమైపోయాయి. ముఖ్యంగా అస్సాం ప్రజలు దృష్టిలో వర్షాలంటే.. ఓ భయానక వాతావరణం. ఎందుకంటే వాళ్లకు వర్షాలు వరదలతో సమానం. వరదల వల్ల వాళ్ళు ఆస్తి నష్టంతో తీవ్రంగా ఇబ్బందులు పడటం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. ఒకటి రెండు సంవత్సరాలు కాదు, దశాబ్ధాలుగా వారి జీవితాలు వరదల్లోనే మగ్గిపోతున్నాయి. పైగా వరదలు కారణంగా తమ ఆప్తుల్ని కోలుపోవడమే కాకుండా.. ఆ వరదల సమయంలో తిండి కోసం ఎదురుచూస్తూ బతకడం నరకం అంటుంటారు వారు. ఇలా వాళ్ల జీవితాలు ఆ వరదల కాలంలో నల్లమబ్బు కమ్మేసిన సూర్యుడులా బిక్కుబిక్కుమంటూ బతుకుతారు.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
అయితే ఇలాంటి అనుభవాన్ని తానూ అనుభవించానని.. నరకాన్ని చూశానని.. మన శత్రువుకి కూడా అలాంటి ఎక్స్ పీరియన్స్ రాకూడదని తెగ బాధ పడుతుంది హాట్ బ్యూటీ నభా నటేష్. ఎప్పుడూ టర్కీకోడిలా ఎనర్జిటిక్ గా ఉల్లాసంగా కనిపించే నభా జీవితంలో కన్నీళ్లు పెట్టించే కష్టాలు కూడా ఉన్నాయని తెలిసిన అమెగారి అభిమానులు తెగ కలత చెందుతున్నారు. ఇంతకీ నభా వరదల వల్ల వచ్చే కష్టాలు గురించి చెబుతూ.. ‘ఆ మధ్య మేము అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అస్సాం వెళ్ళాము. జస్ట్ ఎంజాయ్ చేద్దామని. కానీ మాకు అప్పుడు నరకమే కనిపించింది. అస్సాంలో ఉండగా వరదలు వచ్చాయి. ఓ రోజు రాత్రంతా మేము వర్షాల్లో..వరదల్లో గడపాల్సి వచ్చింది. సరిగ్గా వర్షాల సీజన్ ప్రారంభ సమయంలోనే కజిరంగా పార్క్ ని చూడటానికి మేము వెళ్లి తప్పు చేశాము. మధ్నాహ్నం వరకూ బాగుంది. కానీ సడెన్ గా భారీగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది.
Also Read: పవర్ స్టార్ బర్త్ డే రెండో గిప్ట్.. #PSPK27 ప్రీ లుక్ రిలీజ్
మేము అప్పటికే బయటకు వచ్చేసాం. దాంతో ఆ వరదల్లో చిక్కుకున్నాం. ఆ రోజే కాకుండా మరుసటి రోజు వరకూ బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. అని తన వరదల బాధా అనుభవాన్ని నభా చెప్పుకుని తెగ బాధ పడింది. ప్రస్తుతం నభా `సోలో బ్రతుకే సోబెటర్` సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. అలాగే `అల్లుడు అదుర్స్` సినిమాలో కూడా నటిస్తోంది. మొత్తానికి `ఇస్మార్ట్ శంకర్`తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ స్మాల్ బ్యూటీ బాగానే కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది.
దుబ్బాక బరిలో దూసుకుపోతున్న ‘కత్తి’..!

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతుండగా అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కత్తి కార్తీక బరిలో దిగుతోంది. ఈ మేరకు దుబ్బాకలో కత్తి కార్తీకను నియోజకవర్గ ప్రజలు గెలిపించాలంటూ పెద్దఎత్తున పోస్టర్లు వెలియడం చర్చనీయాంశంగా మారింది.
టీవీ హెస్టుగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఇప్పటికే కత్తి కార్తీకకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. గతంలో వివిధ న్యూస్ ఛానల్లో హోస్టుగా చేసి తెలంగాణ యాసలో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా తెలుగులో అతిపెద్ద రియల్టీ షోగా ఉన్న బిగ్ బాస్ లో కొన్ని వారాలపాటు కంటెస్టుగా నిలిచి చాలామంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమెకు రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ. పద్మారావుగౌడ్ తో ఆమె కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో దుబ్బాక ఎన్నికల బరిలో నిలిచి ప్రజా నాయకురాలిగా మారేందుకు సిద్ధమవుతోంది.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో తెలంగాణలో ఉప ఎన్నిక జరగనుండటం ఖాయంగా తేలింది. ఇక్కడి నుంచి కత్తి కార్తీక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వినాయక చవితి ఉత్సవాల్లోనూ ఆమె పాల్గొని ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని.. తనను ఆశీర్వదించండి అంటూ ఓట్లర్లను వేడుకున్నారు. నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ అందరికీ కంటే ముందుగా ప్రచారంలో కత్తి కార్తీక దూసుకెళుతున్నారు.
జగన్ కు కేంద్రం బాసట.. బాబుకు షాక్..!
కేంద్రం నుంచి ఏపీకి వచ్చే నిధులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మొకాలడ్డుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి వచ్చే ఉపాధి నిధులు అడ్డుకునేందుకు మరోసారి కుటిలయత్నం చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనే ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించలేదని.. పాత బిల్లులు చెల్లించాకే అదనంగా ఉపాధి పని దినాలు కేటాయించాలంటూ కేంద్రానికి లేఖలు రాశారంటున్నారు. ఉపాధి కూలీల పొట్టకొట్టేందుకు బాబు యత్నించాడని ఆరోపిస్తున్నారు. అయితే కేంద్రం ముందు బాబు పప్పులు ఉండకలేదని తెలుస్తోంది. బాబు లేఖలను కేంద్రం పట్టించుకోకుండా తాజాగా ఏపీకి 4.25 కోట్ల పనిదినాలకు మంజూరుచేసి టీడీపి అధినేతకు షాకిచ్చింది.
ఏపీకి ఉపాధి నిధులు రాకుండా అడ్డుకోవాలని బాబు చేస్తున్న యత్నాన్ని సీఎం జగన్ ముందుగానే గ్రహించారు. దీంతో కేంద్రానికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞాపన పత్రాన్ని పంపించారు. కరోనా కాలంలో కూలీలకు లాభం చేకూర్చేలా ఏపీకి అదనపు పనిదినాలను కల్పించాలని కోరారు. జగన్ కోరిక మేరకు కేంద్రం ఇప్పుడున్న పనిదినాలకుతోడు అదనంగా 4.25కోట్ల పనిదినాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ద్వారా పెద్దఎత్తున ఉపాధి కూలీలకు లాభం జరుగనుంది. అవసరమైతే మరిన్ని పనిదినాలు కల్పిస్తామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఏడాది ఏపీకి 21కోట్ల పనిదినాలను కేంద్రం మంజూరు చేసింది. అయితే లాక్డౌన్ కాలంలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఐదునెలలుగా ప్రభుత్వం వీటిని భారీగా వాడుకుంది. పనుల్లేని పేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి నిధులే ఆసరాగా నిలిచాయి. ఇప్పటికే 20.15కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. మరో పక్షం రోజులు మిగతా పనిదినాలు పూర్తికానున్నాయి. ఈ తరుణంలోనే బాబు ఏపీకి కేంద్రం గతంలో చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా అదనపు పనిదినాలు కేటాయించొద్దని బాబు లేఖరాయడంతో కూలీల్లో ఆందోళన నెలకొంది.
ఏపీకి నిధులు రాకుండా అడ్డుకునే వ్యూహాంలో భాగంగానే చంద్రబాబు ఇలా చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు భారీగా యంత్రాలతో కాంట్రాక్టర్లతో పనులు చేసి ఉపాధి హామీ డబ్బు కాజేయాలని చూశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి పనులపై విచారణ చేపడుతోంది. అంతేకాకుండా యంత్రాలతో కాకుండా నేరుగా కూలీలకు పనులు కల్పిస్తుంది. ప్రతిపక్షంలో ఉండి పేదలకు పక్షాన పోరాడాల్సిన టీడీపీ పేదలకు ఉపాధి దూరం చేసేలా లేఖరాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెత్త లాజికులతో కేంద్రం నిధులు రాకుండా అడ్డుకోవాలని చూసిన బాబుకు కేంద్రం షాకిచ్చింది. దీంతో కేంద్రం వద్ద బాబు కంటే జగన్ కే పరపతి ఎక్కువగా ఉందని మరోసారి రుజువైంది.
ప్లీజ్ జగన్.. టీడీపీ ఎంపీ అరుదైన రిక్వెస్ట్

ఏపీలో వైసీపీ, టీడీపీ అంటే ఉప్పునిప్పుగానే ఉంటాయి. ఇక రాజకీయంగా పగ ప్రతీకారాలు కామన్. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఇన్నాళ్లు విమర్శలు చేసిన ఓ టీడీపీ ఎంపీ.. ఆశ్చర్యకరంగా జగన్ సాయం కోరారు. ‘ప్లీజ్ ఈ పనులు చేసి పెట్టండని’ విన్నవించారు. కొద్దిరోజులుగా చంద్రబాబుకు, టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన జగన్ కు ఈ అరుదైన రిక్వెస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియా అయినా.. బహిరంగంగా అయినా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఎప్పుడూ విమర్శలు చేసే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆశ్చర్యకరంగా బుధవారం సీఎం వైఎస్ జగన్ కు ఓ ప్రత్యేక అభ్యర్థన పెట్టుకున్నాడు. ప్రతిరోజూ ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. విజయవాడలోని సివిఆర్ ఫ్లైఓవర్ మరమ్మతులు చేయించాలని ఆయన ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థనకు మద్దతుగా ఆయన మీడియా నివేదికను జత చేశారు.
“ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారు .. దయచేసి ఈ ఫ్లైఓవర్ మరమ్మతులు చేయగలరా? విజయవాడ ప్రజలు మీకు రుణపడి ఉంటారు ”అని నాని సవినయంగా ట్వీట్ చేస్తూ ముఖ్యమంత్రిని, సిఎంఓను కూడా తన ట్వీట్ కు ట్యాగ్ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
విజయవాడలోని సివిఆర్ ఫ్లైఓవర్ పెద్ద గుంతలను పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారి జాతీయ రహదారులను లోపలి రింగ్ రోడ్డుతో కలుపుతుంది కాబట్టి, చాలా బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు ఈ ఫ్లైఓవర్ గుండా వెళతాయి. దీనిని రాష్ట్ర రహదారులు మరియు భవనాల విభాగం మరియు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్మించాయి, కాని దీనిని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ మూడు సంస్థలలో సమన్వయం లేకపోవడం వల్ల మరమ్మతులు జరగడం లేదని నాని వివరించారు.
మరి పగోడు.. ప్రత్యర్థి చేసిన ఈ విన్నపాన్ని సీఎం జగన్ ఆలకిస్తాడా? నెరవేరుస్తాడా అన్నది వేచిచూడాలి.
టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. తెలుగు సినీ పరిశ్రమనే ఉక్కిరిబిక్కిరి చేసింది. మీడియాలో పతాక శీర్షిక అయ్యింది. మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ డ్రగ్స్ కేసు ఉవ్వెత్తిన ఎగిసి.. ఇప్పుడు ఊసురుమంది. టాలీవుడ్ ను అతలాకుతలం చేసిన ఈ కేసు చివరకు ఏమీ తేలకుండా చప్పున చల్లారింది. టాలీవుడ్ హీరోలు, దర్శకులు, ప్రముఖులంతా కేసు నుంచి తాజాగా సురక్షితంగా బయటపడ్డట్టు తెలిసింది.
అంతా సమసిపోయిందనుకుంటున్న సమయంలో.. ఎరక్కపోయి కామెంట్స్ చేసిన హీరోయిన్ ధాటికి ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. టాలీవుడ్ హీరోయిన్ నుంచి బీజేపీలోకి చేరిన హీరోయిన్ ఇప్పుడు అనవసరంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఇటీవల టాలీవుడ్ లో డ్రగ్స్ దందా గురించి వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు పార్టీల్లో డ్రగ్స్ వాడటం కామన్ అంటూ మాధవీలత పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. దీనిపై ఎన్.సీబీ అధికారులు, ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆమె పోస్టులో కోరారు.
మాధవీలత తాను ఐదేళ్ల క్రితం ఓ పార్టీకి వెళ్లినప్పుడు పలువురు సెలెబ్రెటీలు డ్రగ్స్ తీసుకోవడం చూశానని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.. అప్పట్లో సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా రావడం.. అవకాశాలు రావేమోనన్న భయంతో ఈ విషయాలను బయటపెట్టలేకపోయానని అందామె.. ఎందుకంటే దీనివెనుక పెద్ద మాఫియాలు ఉంటాయని ఆమె అనుమానించింది. ఇప్పటికీ భయం ఉన్నా.. బాధ్యతల సిటిజన్ గా.. బీజేపీలో కార్యకర్తగా ఉన్నందున ఈ విషయాన్ని చెప్పానని తెలిపింది.
కాగా నటి మాధవీలత చేసిన డ్రగ్స్ ఆరోపణలపై తెలంగాణ పోలీసులు సీరియస్ అయ్యారు.డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేకమందిని అరెస్ట్ చేశామని.. టాలీవుడ్ సెలెబ్రెటీలను విచారించామని.. కొందరిని నిఘాలో పెట్టామని.. ఆధారాలుంటే టాలీవుడ్ సెలెబ్రెటీలను వదలమని ఎక్సైజ్ పోలీసులు మాధవీలతకు స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది.
టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని టీ పోలీసులు కోరారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని నటి మాధవీలతకు సూచించారు..

















