
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారకముందు కొరటాల శివ ఎదురుకున్న ప్రధాన సమస్య కొరటాల కథలు దోపిడీ గురి కావడం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.. వేరే వారి కథలను కొరటాల దోపిడీ చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఆరోపణలకు విమర్శలకు కొరటాల ఒక చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులువుకున్నాడు. కానీ, ఈ వ్యవహారం కోర్టు దాకా పోయేలా కనిపిస్తోంది. సరే ఈ కాపీ వ్యవహారాలను పక్కన పెడితే… ప్రస్తుతం కొరటాల ఆచార్య షూటింగ్ సన్నాహాలు చేస్తున్నాడు. అక్టోబర్ 5 నుండి ఆచార్య షూట్ స్టార్ట్ కానుంది. ఫిల్మ్ సర్కిల్స్ లోని లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ఓ పాత భవనం సెట్ వేశారు. ఈ సెట్ లోనే షూటింగ్ చేయనున్నారు. అతి తక్కువమంది సిబ్బందితో షూట్ చేస్తారట.
Also Read: నరకాన్ని చూశానంటున్న క్రేజీ హీరోయిన్ !
కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటూనే.. మెగాస్టార్ రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ముఖ్యంగా సెట్ లోని వ్యక్తులను కూడా మెగాస్టార్ కి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటారట. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బాగానే కష్టపడుతున్నారు. ఈ వయసులో ఎంతో కష్టం అయినా, బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. పైగా యంగ్ గా కనిపించడానికి మేకప్ కోసం గంటలు తరబడి ఒకే చోటు కూర్చుని చాలా మేక్ ఓవర్ అయి మరీ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కరోనా రోజురోజుకు పెరుగుతున్నా.. అరవై దాటిన వారి పై కరోనా పంజా విసురుతుందని తెలిసినా.. చిరు మాత్రం షూటింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. చిరు ఆదేశాల మేరకే కొరటాల వచ్చే నెల షూట్ ప్లాన్ చేస్తున్నాడట.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
ఏమైనా.. సినిమా కోసం మెగాస్టార్ ఏమి చేయడానికైనా వెనుకాడరు అని మరోసారి రుజువు అయింది. అసలు మెగాస్టార్ తలుచుకుంటే.. డూప్ ను పెట్టి కూడా చాలా సీన్స్ తీసేయొచ్చు. కానీ, డూప్ అయితే తన సహజమైన బాడీ లాంగ్వేజ్ రాదు అని.. స్వయంగా మెగాస్టారే షూట్ లో పాల్గొంటా అని స్పష్టం చేశారట. కరోనా ప్రళయంలో కూడా చిరు తపనను ముచ్చటేస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఆల్ టైం బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా.. యంగ్ హీరోయిన్ రెజీనా ఐటమ్ సాంగ్ తో మెగాస్టార్ పక్కన ఈ సినిమాలో కనిపించబోతుంది. పెద్ద ఛాన్స్ లు లేక కెరీర్ ముగిసిందనుకున్న దశలో రెజీనాకి దొరికిన సువర్ణావకాశం ఇది. కాకపోతే ఆమెది ఐటమ్ సాంగ్. మరీ ఈ ఐటమ్ తోనైనా రెజీనాకి అవకాశాల వెల్లువ మొదలవుతుందేమో చూడాలి. రామ్ చరణ్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.