Home Blog Page 8332

జగన్ ‘ఇంగ్లీష్ మీడియం’.. సుప్రీంలో చుక్కెదురు

ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలన్న జగన్ సంకల్పం నెరవేరడం లేదు. ప్రతిపక్షాలు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మంచి సదుద్దేశంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై పేద విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాల వల్ల ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమానికి అడ్డు తగులుతోంది. తాజాగా మరోసారి ఏపీ సర్కార్ కు ఇంగ్లీష్ మీడియం రాష్ట్రంలో అమలు  విషయంలో సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

ఏపీలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే ఏపీ ప్రభుత్వం ఇటీవలే 81,85 జీవోలు తీసుకొచ్చింది. అయితే ఏపీలో 6వ తరగతి వరకు ఇంగ్లీష్ ను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. హైకోర్టు ఈ జీవోను కొట్టివేసింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన సుప్రీం కోర్టులో ప్రతివాదులు.. ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం సరికాదని.. మాతృభాషలోనే బోధించాలని వాదించారు.

అయితే సుప్రీం మాత్రం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని ఆదేశించింది. వారి స్పందన చూశాక నిర్ణయిస్తామని తెలిపింది. విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.

ఏపీలో సీఎం జగన్ ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష చంద్రబాబు అండ్ మీడియా జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసింది. హైకోర్టుకు వివాదం చేరగా.. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ఇంగ్లీష్ మీడియంపై ముందుకెళ్లాలని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది.

దీంతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరారు. 3శాతం మంది మాత్రమే తెలుగు మీడియంకు ఓటేశారు. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్న చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని తీర్మానం చేసి పంపించారు.

అయితే హైకోర్టులో కొందరు దీనికి వ్యతిరేకంగా పిటీషన్ వేయగా జీవోలను కోట్టివేసింది. సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్ వెళ్లగా అక్కడా చుక్కెదురైంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందనేది వేచిచూడాలి.

తెలంగాణలో కరోనా రికవరీ రికార్డ్

ఎప్పుడో మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చిన కరోనా వైరస్‌.. నెమ్మనెమ్మదిగా రాష్ట్రమంతటికి వ్యాపించింది. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన వైరస్‌.. ఇప్పుడు గ్రామాల్లోనూ విజృంభిస్తోంది. రోజూ వస్తున్న కేసులను చూస్తూనే అర్థమవుతోంది. అయితే.. సంతోషపడాల్సిన విషయం ఏంటంటే కరోనా కేసులు ఎన్ని పెరుగుతున్నా అదే స్థాయిలో రికవరీ రేటు ఉంది. డిశ్చార్జీల సంఖ్య లక్షకు మార్క్‌ ను చేరుకుంది.

కరోనా వల్ల చనిపోతున్న వారి సంఖ్య కూడా అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రోజూ 10కి పైనే మృతుల సంఖ్య నమోదవుతుండేది. కోలుకుంటున్న వారితోపాటు మృతుల సంఖ్య కూడా తగ్గుతోంది. గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో 2817 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. పది మంది చనిపోయారు. ఇప్పటివరకు 856 మంది చనిపోగా.. 1,00,013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,33,406 కరోనా కేసులు నమోదు కాగా.. 32,537 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 25,293 మంది హోం ఐసోలేషన్‌లలో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కరోనా తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతోంది. 24 గంటల్లోనే కొత్త కేసులు 200లకు పైగా నమోదయ్యాయి. కరీంనగర్-164, ఖమ్మం-157, కొమరంభీమ్ ఆసిఫాబాద్-19, మహబూబ్ నగర్-42, మహబూబాబాద్-62, మంచిర్యాల-71, మెదక్-35, మేడ్చల్ మల్కాజ్‌గిరి-129, ములుగు-18, నాగర్ కర్నూలు-41, నల్లగొండ-157, నారాయణపేట్-21, నిర్మల్-16, నిజామాబాద్-97, పెద్దపల్లి-75, రాజన్న సిరిసిల్ల-53, ఆదిలాబాద్-36, భద్రాద్రి కొత్తగూడెం-89, జగిత్యాల-88, జనగామ-41, జయశంకర్ భూపాలపల్లి-26, జోగుళాంబ గద్వాల-33, కామారెడ్డి-62, రంగారెడ్డి-216, సంగారెడ్డి-76, సిద్ధిపేట్-120, సూర్యాపేట్-116, వికారాబాద్-27, వనపర్తి-45, వరంగల్ రూరల్-46, వరంగల్ అర్బన్-114, యాదాద్రి భువనగిరి-73 కేసులు వచ్చాయి.

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 59,711 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో రిలీజ్‌ చేశారు. ఇప్పటిదాకా టెస్టులు చేసిన శాంపిళ్ల సంఖ్య 15,42,978కి చేరింది. ప్రతి 10 లక్షల జనాభాకు సగటును 41,560 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్‌‌, సీబీనాట్‌, ట్రూనాట్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పద్ధతిలో టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు.

టీటీడీలో టీడీపీ హ్యాండ్.? బీజేపీ టార్గెట్ చేసిందా?

 

 

ఎట్టకేలకు బీజేపీతో ‘మాట’ కలిసిన బాబు..!

0

కరోనా పుణ్యమా.. అని బాబు సాధించాడు.. కిందటి ఎన్నికల నుంచి బీజేపీ, టీడీపీ ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నాయి. టీడీపీ చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ రాబోతుందని ఊహించి బీజేపీ కూటమికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. కాంగ్రెస్ కూటమిలో చేరి ముందుండి నడిపించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి దారుణ పరాజయం పాలవడంతోపాటు రాష్ట్రంలోనూ టీడీపీ అధికారానికి దూరమైంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఎందుకైనా మంచిదని ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

నాటి నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీతో మళ్లీ స్నేహగీతం పాడేందుకు యత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఆయనను దూరం పెడుతూ వస్తోంది. బాబు అవకాశ రాజకీయాలను అర్థం చేసుకున్న బీజేపీ ఏపీలో సొంతంగానే బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అంటే గిట్టని సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ అధ్యక్ష కట్టబెట్టింది. దీంతో బీజేపీలో బాబుకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిపై వీర్రాజు సస్పెన్షన్ వేటుతో హడలెత్తించారు. దీంతో బీజేపీకి దగ్గరికి కావాలని అనుకున్న బాబు ఆశలు గల్లంతయ్యాయి.

బీజేపీ, టీడీపీ మధ్య చాలాదూరం పెరిగిపోతున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు బుధవారం అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు రాజకీయ విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది కాలంగా బాబు ప్రధాని మోదీ, అమిత్ షాలతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోరినా వారి నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే కరోనా పుణ్యమా అని బాబుకు అమిత్ షాతో మాట్లాడే అవకాశం దక్కింది. దీంతో బీజేపీతో పొత్తు ఆశలు మళ్లీ బాబులో చిగురించినట్లు తెలుస్తోంది. కరోనాను కూడా రాజకీయంగా వాడుకోవడం బాబుకే సాధ్యమని కామెంట్లు విన్పిస్తున్నాయి.

చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్‌ ‘టుటు’ అస్త్రం?

ఒకవైపు చర్చలు అంటూనే.. మరో వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమైంది. ఇప్పటికే చైనాకు షాకుల మీద షాకులు ఇస్తున్నా మన సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. అంతకుమించి మన భూభాగాన్ని ఆక్రమించింది. రెండు కొండలను కైవసం చేసుకుంది. దీనికి దీటుగా భారత్‌ కూడా చైనా భూ భాగాన్ని ఆక్రమించి సమాధానం ఇచ్చింది. అయినా.. తన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక చైనా సైన్యంతో పోరాడేందుకు భారత్‌ డిసైడ్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులోభాగంగా భారత్‌ టుటు రెజిమంట్‌ను రంగంలోకి దించుతోంది. ఇంటెలిజెన్స్‌ రెజిమెంట్‌గా గుర్తింపు పొందిన ఈ దళం.. సైన్యాధికారికి బదులు రా ద్వారా నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తుంది.

ఆగస్టు 29 రాత్రి చైనా సైన్యం మళ్లీ లడఖ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నం చేసింది. చైనా సైన్యంతో పోరాడిన ఓ యువ జవాను అమరుడయ్యాడని బుధవారం వార్తలు వచ్చాయి. టిబెటన్‌ మూలాలున్న ఈ జవాన్‌ టుటు రెజిమెంట్‌ దళాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. 2018 అక్టోబర్‌‌లో యూరోపియన్‌ దేశం ఎస్టోనియాకు చెందిన ప్రసిద్ధ గాయని యానా కాస్క్‌ మన దేశానికి వచ్చి తన మ్యూజిక్‌ వీడియో షూట్‌ చేయాలనుకుంది. ఇందుకు ఆమె ఉత్తరాఖండ్‌లోని చక్రత ప్రాంతాన్ని ఎంచుకున్నారు. చక్రత డెహ్రాడూన్‌ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదొక అందమైన కొండ ప్రాంతం. షూటింగ్‌ చేస్తుండగా.. స్థానిక ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ వెంటనే యానా, ఆమె ఫ్రెండ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు.

చక్రత నిషేధిత ప్రాంతం కాబట్టి ఇదంతా జరిగింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్మిషన్‌ లేకుండా ఇక్కడికి ఏ విదేశీయుడిని అనుమతించరు. విదేశీయులు ఇక్కడికి రావడాన్ని అడ్డుకోవడానికి ప్రధాన కారణం భారత సైన్యం యొక్క అత్యంత రహస్యమైన టుటు రెజిమెంట్‌ ఉండేది ఇక్కడే. టుటు రెజిమెంట్‌ అనేది భారత సైనిక బలం. దీని గురించి బహిరంగంగా ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ రెజిమెంట్‌ చాలా రహస్యంగా పనిచేస్తుంది. దాని ఉనికికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు.

టుటు రెజిమెంట్‌ 1962 సంవత్సరంలో స్థాపించబడింది. అదే సమయంలో భారత్‌–చైనా మధ్య యుద్ధం జరిగింది. అప్పటి నుంచి ఐబీ చీఫ్‌ బోలానాథ్‌ మాలిక్‌ సూచన మేరకు అప్పటి ప్రధాన జవహర్‌‌లాల్‌ నెహ్రూ టుటు రెజిమెంట్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. చైనా సరిహద్దులోకి ప్రవేశించి లడఖ్‌ యొక్క క్లిష్టమైన భైగోళిక పరిస్థితులలో పోరాడగల యోధులను సిద్ధం చేయడమే ఈ రెజిమెంట్‌ ప్రధాన ఉద్దేశం. టిబెట్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన యువతనే ఈ పనికి తీసుకుంటారు. వీరితైనే రాళ్లలో నడవడం.. పర్వతాలు అధిరోహించడం.. పరిగెత్తడం వీరికే సాధ్యం. అందుకే టిబెటన్‌ యువకులను నియమించడానికి టుటు రెజిమెంట్‌ను నియమించారు. రిటైర్డ్‌ మేజర్‌‌ జనరల్‌ సుజన్‌ సింగ్‌ ఈ రెజిమెంట్‌కు మొదటి ఐజీగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం టైంలో 22వ మౌంటైన్‌ రెజిమెంట్‌కు సుజన్‌ సింగ్‌ నాయకత్వం వహించారు.

ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?


మెగాస్టార్ తో సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి తరువాత సినిమా ఫలానా హీరోతో ఫలానా నిర్మాతతో అని విస్తృతగా వార్తలు రావడం.. ఆ తరువాత సురేందర్ రెడ్డి – అక్కినేని అఖిల్ సినిమా దాదాపు ఫిక్స్ అయిందని.. దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారని బాగా వినిపించింది. అందరూ ఈ కాంబినేషన్ ఖాయం అనుకున్నారు. కానీ ఎట్టకేలకు సురేందర్ రెడ్డి ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ తోనే సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు. యంగ్ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో దాదాపు మూడు వందల కోట్లుతో ఈ సినిమా తెరకెక్కబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పటికే ప్రభాస్ కోసం రైటర్ సాయి మాధవ్ బుర్రాతో కూర్చుని స్క్రిప్టును సిద్ధం చేస్తోన్నాడని.. నేషనల్ స్టార్ ప్రభాస్ ని హాలీవుడ్ సూపర్ స్టార్ రేంజ్ లో చాలా స్టైలిష్ గా చూపించాలనే కసితో సురేందర్ రెడ్డి స్క్రిప్టు మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది.

Also Read: బిగ్ బాస్ పై సునీత రియాక్షన్ !

కాగా అవసరమైతే.. మరో బాలీవుడ్ నిర్మాతను కూడా కలుపుకుని సినిమా బడ్జెట్ ను 500 కోట్లుకు పెంచాలనే ఆలోచనలో కూడా రామ్ తాళ్లూరి ఉన్నారట. అయితే సురేందర్ రెడ్డిని నమ్ముకుని 500 కోట్లు పెట్టడం పెద్ద రిస్క్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన సూపర్ స్టార్స్ నటించినా… సైరాని ప్లాప్ నుండి కాపాడలేకపోయాడు సురేందర్ రెడ్డి. అయితే సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి సైరా కోసం మంచి పనితనమే కనబర్చాడు. కాకపోతే సక్సెస్ ను బట్టే ఇక్కడ విలువ ఉంటుంది. ఆ రకంగా సైరా సినిమా భారీ సక్సెస్ కాకపోవడం, ఇప్పుడు సురేందర్ రెడ్డికి పెద్ద సమస్య అయిపొయింది.

Also Read: హైదరాబాద్ కు బై అంటున్న సురేఖా వాణి !

నిజానికి ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే.. సురేందర్ రెడ్డికి ఇది తలకు మించిన భారం అని అంటున్నారు సినీ జనాలు. ఏమైనా సురేందర్ రెడ్డి – రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అనగానే ఎక్కడా లేని నెగిటివ్ యాంగిలే ఎక్కువగా వినిపిస్తోంది. మరి ప్రభాస్ ఏమి చేస్తాడో.. ఇప్పటికే ప్రభాస్ కి సురేందర్ రెడ్డికి మధ్య కొన్ని సిట్టింగ్ లు కూడా జరిగాయి కాబట్టి.. ఆల్ రెడీ అంతా ఫిక్స్ అయింది కాబట్టి.. ఇక మరో మాట లేకుండా ప్రభాస్ ఈ సినిమా చేస్తాడేమో చూడాలి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం.. ప్లాప్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఏమిటి.. అసలు ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అచ్చెన్నాయుడు కోసం చంద్రబాబు సంచలన నిర్ణయం?

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావును మార్చేందుకు టీడీపీ అధినేత యోచిస్తున్నట్టు సమాచారం. ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన మరో బలమైన నాయకుడిని నియమించాలని ఆలోచిస్తున్నారు. కళా వెంకటరావు ఎన్నికల్లో ఓడిపోవడంతో స్వయంగా టీడీపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని కొత్త వారికి చాన్స్ ఇచ్చారు.

వైసీపీ ప్రతీకారంతో ఇప్పుడు టీడీపీలో ముగ్గురు కీలక నేతలు జైలుపాలయ్యారు. వైసీపీ భయానికి టీడీపీ నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి వీర విధేయుడైన అచ్చెన్నాయుడిని జైలుకు పంపి సర్కార్ నానా రకాల ఇబ్బందులకు గురిచింది… ఆ కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నాడని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అచ్చెన్నాయుడు కుటుంబమే టీడీపీలో బాగా ఇబ్బంది పడింది. ఎక్కువ కాలం జైల్లో అచ్చెన్న ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు ఏపీ టీడీపీని సిద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా టీడీపీనే నమ్ముకొని ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బాబు యోచిస్తున్నారట..

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత అచ్చెన్నాయుడిని చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే వివాదాస్పద నేత కావడంతో ఆయనను పలువురు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. పైగా ఆ కుటుంబానికి చంద్రబాబు ఇప్పటికే పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారు.

అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అచ్చెన్నాయుడు కుటుంబమే టీడీపీలో బాగా ఇబ్బంది పడింది. అసెంబ్లీలో చంద్రబాబు వెంట ఉపనేతగా అచ్చెన్న గర్జించాడు. వైసీపీని ప్రతీసారి ఇరుకునపెట్టాడు. అలా వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఈఎస్ఐ కేసులో ఇరుక్కొని ఎక్కువ కాలం జైల్లో అచ్చెన్న ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు ఏపీ టీడీపీని సిద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావ్ ను దించేసి ఆయన స్థానంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండల స్థాయిలో ఇప్పటికే టీడీపీ పూర్తి చేయగా.. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనుంది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పవర్ ఉన్న వాళ్ళని జగన్ పట్టించుకోరా..?

CM Jagan Mohan Reddy cancels Srisailam visit after fire breaks out at hydroelectric power station- The New Indian Express

తాజాగా వైసీపీ డిజిటల్ మీడియా ఒక ఇమేజ్ ను రిలీజ్ చేసింది. “అవినీతి మీద ప్రభుత్వం పోరాటం చేస్తోంది…. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తాం” అని అందులో ఉంది. సరే ఇక్కడ వరకు బాగుంది. నిజంగా జగన్ మోహన్ రెడ్డి అవినీతి లేని ఏపీ చూపించగలిగితే ఇప్పటి నుండి మరొక 30 ఏళ్ల వరకు అతనే సీఎం. అందులో సందేహమే లేదు. కానీ క్షేత్రస్థాయిలో రాష్ట్రం పరిస్థితి, అతని పార్టీ పరిస్థితి ఎలా ఉందో అతనికి కనీస అవగాహన ఉందా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చెబుతున్నది ఒకటటైతే…. జరుగుతోంది మరొకటి. మధ్యలో ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్లు కామ్ గా ఉండిపోతోంది. అందుకే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అంటున్నారు.

Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ

అవినీతి విషయంలో చిన్న చేపలను బలి చేస్తూ పెద్ద చేపలను ముట్టుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమయ్యాయి. వారరు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదా బడా పారిశ్రామిక వేత్తలు కావచ్చు…. పవర్ ఉన్నోడు చేసిన తప్పులు ప్రభుత్వానికి కనపడవు అన్నది ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. పైగా కుల రాజకీయాలు…. కక్షపూరిత వ్యవహారాలు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు తీవ్రంగా అవినీతి చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది కానీ వాటిని పగోడి ఆరోపణలని వైసిపి సర్కారు పట్టించుకోవడం లేదు. కానీ వైసిపి లో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న వారే సొంత ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడంతో ఇప్పుడు జగన్ కు ఏమీ అంతుచిక్కడం లేదు.

అయితే ఈ సందర్భంగా అవినీతి మాట వచ్చినప్పుడల్లా వాలంటీర్లను సస్పెండ్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఎమ్మెల్యేలు అవినీతి చేసినా కూడా వారినీ సస్పెండ్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేల వైసిపికి ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ప్రస్తుతానికైతే లేదు. ఇక సీఎం అవినీతిపరులపై కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఎవరైతే వారికి బలహీనులుగా కనిపిస్తారో వారిపై వేటు వేసుకుంటూ వెళితే చివరికి ఒరిగేది ఏమీ ఉండదు. 

ఉదాహరణకు రమేష్ ఆసుపత్రి ఘటనలో కూడా ఏపీ ప్రభుత్వానికి…. ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఏమి అడ్డు పడుతుందో ఇప్పటికీ ఎవరికీ అర్థంకావడం లేదు. రమేష్ హాస్పిటల్స్ యజమాని రమేష్ పై పెట్టిన శ్రద్ధ ఉన్నతాధికారులపై పెట్టి ఉంటే ఈపాటికి హైకోర్టు ఎప్పుడో వారికి అనుకూలంగా విచారణ కూడా మొదలుపెట్టేది కానీ పక్షపాత ధోరణి చూపిస్తూ పవర్ చేతిలో ఉన్నవారితో పెట్టుకోకపోవడమే మంచిదని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లుంది. 

ఇదే ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధం చేయడం.. క్యాబినెట్లో వార్నింగ్ లు ఇవ్వడమ్ లేదా ఫోన్ చేసి పర్సనల్ గా హెచ్చరించడం వంటివి మానుకొని గట్టి ఆధారాలు దొరికినప్పుడే ఒకరి పై వేటు వేసినా సస్పెండ్ చేసినా సబబుగా ఉంటుందన్నది ప్రజల వాదన. మరి జగన్ అంత ధైర్యం చేయగలరా….? ఒకరిని అలా చేస్తే అదే వరుసలో ఇంకెంత మందిని చేయాల్సి వస్తదో అని భయపడుతున్నారా…? 

Also Read : ఒకే ఒక్క దెబ్బతో బాబు కుల రాజకీయం బట్టబయలు…?

మోడీకే షాకిచ్చిన హ్యాకర్లు..

దేశానికి ప్రధాని.. భారీ భద్రత.. ఈగ కూడా లోపలికి రాదు.. అయితే ఆన్ లైన్ లో ప్రపంచంలో అలాంటి పప్పులు ఉడకవు.. అమెరికా అధ్యక్షుడైనా.. భారత ప్రధాని అయినా నెటిజన్లు తలుచుకుంటే ఉతికి ఆరేయగలరు. అలాగే హ్యాకర్లు కూడా.. వారికి తమ పర బేధాలుండవు. ముఖ్యంగా సెలెబ్రెటీలంటే హ్యాకర్లకు బాగా మోజు. అందుకే వారి అకౌంట్లను, వెబ్ సైట్లను హ్యాక్ చేస్తూ ‘క్యాష్’ చేసుకుంటారు.

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ పర్సనల్ వెబ్ సైట్ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం పెను సంచలనమైంది. హ్యాకర్ తెలివిగా ప్రధాని పేరుతో కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఆర్థిక సాయం చేయాలని వెబ్ సైట్ తెరపై పెట్టడం విశేషం.

ప్రధాని నరేంద్రమోడీ పేరుతో విరాళాలు అడిగితే కోట్లు ఇస్తారు. అందుకే హ్యాకర్లు తెలివిగా మోడీ వెబ్ సైట్ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి అందులో సాయం చేయాలని ‘బిట్ కాయిన్’ ఫండ్ కోసం డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ పై క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ఈ ట్వీట్ వచ్చింది. కోవిడ్ 19 కోసం పీఎం మోడీ రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వాలని అందులో కోరారు. ‘జాన్ విక్’ పేరుతో మోడీ అకౌంట్ హ్యాక్ అయ్యింది.

ఈ గ్రూపుకు పేటీఎం మాల్ డేటా చోటీలో హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. కాగా ప్రధాని ట్విట్టర్ అకౌంట్ కు 25 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఎంతమంది ఎంత విరాళం ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి మోడీ ట్విట్టర్ కే సూటి పెట్టి దోచుకునే ప్లాన్ ను హ్యాకర్లు చేశారన్న మాట..

ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ


వార్ వన్ సైడ్ అయ్యిందని ఇన్నాళ్లు టీడీపీ శిబిరం సంబరపడింది. నిమ్మగడ్డను బేస్ చేసుకొని ఏపీ ప్రభుత్వం ఎంత ఇరుకునపెట్టారో అంతా పెట్టేశారు. చివరకు ఈ ఎపిసోడ్లో బలమైన సీఎం జగన్ ను ఓడించి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకంగా వైసీపీ సర్కార్ కు ఇష్టం లేకున్నా ఏపీ ఎన్నికల కమిషనర్ కుర్చీలో కూర్చున్నారు. కానీ పగబట్టిన వైసీపీ సర్కార్ అంత ఈజీగా వదులుతుందా? వదలదు కదా.. అందుకే ప్రతీకారం మొదలుపెట్టింది.  గతంలో నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై సీఐడీ ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోంది. దీంతో నిమ్మగడ్డ కూడా మళ్లీ పోరుబాట పట్టారు. హైకోర్టుకెక్కారు.

ఏపీ ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వంతో ఫైట్ చేసి మరీ నియామకమైన నిమ్మగడ్డ రమేశ్ మరోసారి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎస్ఈసీ స్వతంత్రతను అణిచివేసేలా సర్కార్ ప్రయత్నిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు. తమ సిబ్బందిపై సీఐడీ నమోదు చేసిన కేసు రాజ్యాంగ విరుద్ధమని.. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

తాజాగా ఏపీ సీఐడీ అధికారులు ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్ ను అందులోని డేటాను తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో వేసిన పిటీషన్ లో ప్రస్తావించారు. తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంపై సీఐడీ అధికారులు ఆరాతీశారని.. సాంబమూర్తిని వేధించి సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు.

ఇక బాధిత ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరారు.

దీంతో ఈ రెండు పిటీషన్లను కలిపి విచారణ జరుపుతామన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.ఈ పరిణామం నిమ్మగడ్డపై ఏపీ సర్కార్ మళ్లీ నజర్ పెట్టిందని అర్థమవుతోంది. వీరిద్దరూ ఫైట్ ఇప్పుడు ఏపీలో టామ్ అండ్ జెర్రీని తలపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆదిపురుష్: రాముడిగా ప్రభాస్.. రావణుడిగా ఎవరంటే?

‘బాహుబలి’తో ప్రభాస్ టాలీవుడ్ రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ‘బాహుబలి’ సిరీస్ లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్నిచోట్ల భారీ కలెక్షన్లు రాబట్టడంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసబెట్టి పాన్ ఇండియా మూవీలే చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన సాహో కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్ రాముడిగా నటించనున్న ‘ఆదిపురుష్’ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ మూవీ చేస్తుండగానే ప్రభాస్ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైజయంతి బ్యానర్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించబోతున్నారు. సైంటిఫిక్ కథాంశంతో ఈ మూవీ రాబోతుందని టాక్ విన్పిస్తోంది.

నాగ్ అశ్విన్ మూవీ ఇంకా పట్టాలెక్కకముందే ప్రభాస్ మరో మూవీ కమిట్ అయ్యాడు. బాలీవుడ్ మూవీ మేకర్స్ కలిసి ఓ మూవీ చేయనున్నట్లు ఆగస్టు 18నే ప్రకటించాడు. ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆదిపురుష్’ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ప్రభాస్ ఈ మూవీలో రాముడిగా కన్పించనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే డార్లింగ్ ప్రభాస్ నిన్న సాయంత్రం తన ఇన్ స్ట్రాగ్రామ్ ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. ‘7వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు..! అని ట్వీట్ చేశాడు. రేపు ఉదయం 7.11గంటలకు ఒక సర్ ప్రైజ్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పడంతో అభిమానులంతా అత్రుతగా ఎదురుచూశారు. ఇక ప్రభాస్ చెప్పినట్లుగానే సర్ ప్రైజ్ నేటి ఉదయమే రివీల్ చేశాడు.

ప్రభాస్ చెప్పినట్లు ఆ తెలివైన రాక్షసుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్లు తెల్సిపోయింది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కన్పించబోతుండగా సైల్ అలీఖాన్ రావణుడిగా నటించనుండటం ఆసక్తిని రేపుతోంది. దర్శకుడు ఓం రౌత్ తో తెరకెక్కించిన ‘తానాజీ’లో కూడా సైఫ్ విలన్ పాత్రలో కన్పించి మెప్పించిన సంగతి తెల్సిందే. తాజాగా మరోసారి ‘ఆదిపురుష్’లో విలన్ పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు.

తనకు ప్రత్యర్థిగా సైఫ్ నటించస్తుండటంపై ప్రభాస్ స్పందిస్తూ ‘సైఫ్ అలీఖాన్ సర్ తో కలిసి పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని’ పేర్కొన్నాడు. ఏదిఏమైనా ‘ఆదిపురుష్’ ‘సినిమా ప్రారంభానికి ముందే ఇండస్ట్రీలో సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.

కేసీఆర్ సార్.. మీరు సాధించారు పో..!

అరే..!  ప్రతిపక్షాలు వంద అంటారు భయ్..! కానీ ఫలితమొచ్చిందా లేదా? లక్షకోట్లు పోనీ భయ్..! ఒక్క రైతు ప్రాణమైనా బతికిందా లేదా..! తెలంగాణలో పైసలు పోయినా ప్రాణాలు నిలబడ్డాయని జాతీయ నేర గణాంకాల తాజా నివేదిక బయటపట్టింది. 
 
 ‘ఓ మొక్కకు అంటుకట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు..’ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ముందుకెళ్లారు. అదే ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. పంటను పండించింది. దానికి ఎంతో ఖర్చు అయ్యింది. ఆ ఖర్చు విమర్శకులు దుమ్మెత్తి పోశారు కూడా. అయితేనేమీ.. రైతు పండింది. అతడు బతుకు మెరుగైందనడంలో ఎలాంటి సందేహం లేదు.  మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం..

ఒకప్పుడు ఆకలేస్తే ఆకాశం వైపు.. దాహం వేస్తే భూమివైపు చూసేంత కఠిన మెట్టప్రాంతం అదీ. వర్షాలు పడితేనే పంటలు పండేవి.. లేకపోతే ఆ ఏడు సాగు వదలుకోవాల్సిందే.. ఒక్క ప్రాజెక్టు లేదు.. ఒక్క కాలువ లేదు. వానలు పడకపోతే కరువు ప్రాంతాన్ని తలపిస్తుంటుంది. కానీ ముగ్గురు దీక్షా పరుల వల్ల ఇప్పుడు మెట్టప్రాంతం కాస్తా జలసిరితో కళకళలాడుతోంది. ఎండమావిలో నీటిజాడను తెప్పిస్తోంది.

సిరిసిల్ల, సిద్దిపేట, హుస్నాబాద్.. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లోని నియోజకవర్గాలివీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మెట్టప్రాంతంగా ఉన్న రాయలసీమలోని అనంతపురంను ఈ నియోజకవర్గాలు ఒకప్పుడు తలపించేవి. అలాంటి చోట సిద్దిపేటకు హరీష్, సిరిసిల్లకు కేటీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కావడంతోపాటు కేసీఆర్ కాళేశ్వరం సంకల్పం తెలంగాణ  దశనే మార్చేసింది.  ఇప్పుడు కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు సంతరించుకున్నాయి.

కరువుకు కేరాఫ్ అడ్రస్ గా సిరిసిల్ల, సిద్దిపేట, హుస్నాబాద్ లు ఉండేవి. ఇక్కడ సగటున ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలాలు 27 మీటర్ల లోతునకు చేరేవి. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జల మట్టం కేవలం 7-9మీటర్ల పైకి వచ్చాయి. ఇదంతా మిడ్ మానేరు ప్రాజెక్టు చలువే..

ఇక సిద్దిపేటలో నిర్మించిన రంగనాయకసాగర్ లోకి ఇప్పుడు కాళేశ్వరం గోదావరి జలాలు చేరాయి. మిడ్ మానేరు నుంచి అనంతసాగర్ మీదుగా సిద్దిపేటకు నీళ్లొచ్చాయి. మెట్టప్రాంతమైన సిద్దిపేట వాసుల కళ్లల్లో నిజంగా క‘న్నీళ్లు’ వచ్చాయి. కరువుసీమలో కాంతిరేఖను పంచాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా హుస్నాబాద్ కు గౌరవెల్లి సహా ఇతర ప్రాజెక్టులను నింపుతు అక్కడి నియోజకవర్గానికి నీరందిస్తున్నారు.

మొత్తంగా కరువుతో అల్లాడిన కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రాంతాలు ఇప్పుడు గోదారమ్మ చల్లని ఒడితో తనివితీర నీటి కరువు తీర్చుకుంటున్నాయి. ఆ జలాలు హైదరాబాద్ వరకు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మరలుతున్నాయి.  ఎక్కడి గోదారి ఎక్కడికి వచ్చిందని ప్రజల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. గోదారమ్మకు కేసీఆర్ లాగే చీరసారే పంచుతున్నారు. కరువునేలపై అంతటి నీటి జాడ చూసి జనం పులకించిపోతున్నారు.

 
ఎంతమంది విమర్శించినా.. ఎన్ని రాళ్లేసినా మానవ మనుగడ అన్నది నదులు, నీటి జాడల వద్దే మొదలైంది. ఆ నీటికోసమే యుద్ధాలు జరిగాయి. కాళేశ్వరం కోసం కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చుచేసినా ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. తెలంగాణలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రైతుబంధుతో అందరూ వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో భూమి బంగారమైంది. అందుకే దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే తెలంగాణలో 45శాతం తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక బయటపెట్టింది. ఇంతకంటే ప్రజలకు ఏం కావాలి.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న కేసీఆర్ సంకల్పమూ నెరవేరింది. గత ఖరీఫ్ లో దేశంలోని మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ నుంచే 45శాతం వచ్చిందని మార్క్ ఫెడ్ తెలిపింది. తెలంగాణలో వరిసాగు మునుపెన్నుడూ లేనంతగా విపరీతంగా సాగయ్యింది. ఇది తెలంగాణ రైతుల ఘనతే కదా..  కేసీఆర్ ఖర్చు చేసినా.. ఫలితం మాత్రం వచ్చిందనడానికి ఇదే తార్కాణం..
 
-నరేష్ ఎన్నం

కేసీఆర్ అన్నట్టే.. కొండంత అవినీతి?

revenue departmentప్రభుత్వం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది రెవెన్యూ, పోలీసు శాఖలు. రెవెన్యూ అంటేనే ఆదాయం.. ఆ ఆదాయం ప్రభుత్వానికి చేర్చేలాగా ఆ శాఖ పనిచేయాలి. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో అంతా రివర్స్‌. ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే తమకేమస్తుందని అనుకుంటున్నారో ఏమో ముందు తమ బ్యాంకు ఖాతాలను నింపుకోవాలని చూస్తున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఆ శాఖ వారు లంచాలకు మరిగారు. నిత్యం ఎక్కడో ఓ చోట.. ఏదో ఒక స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నాడు. అయినా.. శాఖ తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

ఓ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లో ఒక్క కీసర ఎమ్మార్వో రూ.రెండు కోట్ల లంచం డిమాండ్‌ చేశాడు. ఆగస్టు 14న రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా ఆయన లాకర్‌‌ తెరిస్తే అందులో రూ.57 లక్షల నగదే బయటపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే రాష్ట్రంలోని ఒక్క మండలానికి చెందిన ఎమ్మార్వోనే ఇంతలా సంపాదిస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అవినీతి జరుగుతున్నట్లు..? ఈ లెక్కల్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఎంత అవినీతిమయం అయిందో. పేదలను ఏ స్థాయిలో పీడించుకుతింటున్నారో తెలిసిపోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా ఇటీవల పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వడం.. సాదాబైనామాలకు పట్టాలు..  భూమి రికార్డుల సంస్కరణ.. ధ్రువీకరణ పత్రాలు.. తదితర బాధ్యతలు రెవెన్యూ శాఖకు అప్పజెప్పారు. వీటి జారీ చేసే టైంలోనూ అవినీతి రాజ్యమేలింది. కొందరు అధికారులు మధ్య దళారి వ్యవస్థను ఏర్పరచుకొని లంచగొండులుగా మారడం, లిటిగేషన్లతో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేయడం లాంటి పనుల మూలంగా రెవెన్యూ వ్యవస్థ పనితీరు మసకబారింది. ముఖ్యంగా సాదాబైనామాల విషయంలో సైతం ఈ శాఖలో కొందరు ఉద్యోగులు, అధికారులు రేట్లు పెట్టి రైతుల నుండి పైసలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

రాష్ట్రంలో అసలు భూమి శిస్తులే రద్దు చేసిన తర్వాత ఈశాఖ అవసరం ఎంతవరకు ఉంది..? పన్నుల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ, భూముల రిజిస్ట్రేషన్లకు రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఇన్ని రకాల పన్ను వసూలు వ్యవస్థలు జనం సొమ్ముతో ఏర్పరిచి ప్రజలకు చుక్కలు చూపించడం ఎంతవరకు సబబు..? సీఎం కేసీఆర్‌‌ సైతం రెవెన్యూ వ్యవస్థలో మౌలిక మార్పులకు శ్రీకారం చుడుతామని గతంలోనే బహిరంగ ప్రకటన చేశారు. దీంతో రెవెన్యూ సంఘాలు విస్మయానికి గురయ్యాయి. ఒకానొక సందర్భంలో రెవెన్యూ శాఖనే కేసీఆర్ రద్దు చేయబోతున్నారనే ప్రకటనలు వచ్చాయి. ఫ్యూడల్, వలసవాద అవశేషంగా ఉన్న ఈ శాఖను రద్దుచేసి ప్రత్యామ్నాయం చూపగలిగితే, పరిపాలనా సంస్కరణల్లో కేసీఆర్ తనదైన చరిత్రను లిఖించుకున్నట్లే..?  కానీ అలా చేస్తారా.. అంత సాహసం చేస్తారా.. అనేది అందరికీ తెలిసిందే.

కీసర ఎమ్మార్వో నాగరాజు రూ.1.1 కోట్ల లంచం తీసుకున్న కేసులో ఏసీబీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎమ్మార్వో నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్ తెరిచేందుకే అధికారులు ఇన్ని రోజులూ ఇబ్బందులు పడ్డారు. ఏసీబీ అధికారుల విచారణలో ఎమ్మార్వో నాగరాజు బ్యాంకు లాకర్ గురించి ఎటువంటి వివరాలూ వెల్లడించలేదు. లాకర్ తెరిచేందుకు ఎమ్మార్వో భార్య కూడా అధికారులను తప్పుదోవ పట్టించిందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ఎమ్మార్వో నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు.

అల్వాల్‌లోని ఓ బ్యాంకులో ఉన్న ఈ లాకర్‌‌ను తెరవగా అధికారులు అందులో రూ.57 లక్షల పైబడి విలువైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలు అందులో ఉన్నాయి. వీటన్నింటినీ ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నాగరాజు బినామీ పేరుతో లాకర్ తెరిచారు. బామ్మర్ది నరేందర్ పేరుతో సౌత్ ఇండియన్ బ్యాంకులో సీక్రెట్ లాకర్ తెరిచి ఉంది. అయితే ఈ కేసులో ఏసీబీ అధికారులు నాగరాజు భార్య కోసం గాలిస్తున్నారు. ఆమె ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కూడా పట్టుబడితే ఇంకెన్ని ఆస్తులు, నగదు వివరాలు బయటపడతాయో అంచనా వేయలేం.

మరోవైపు నిత్యం ఏసీబీకి పట్టుబడుతున్నా.. వారిపై కేసులు నమోదవుతున్నా.. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ వారు మాత్రం భయపడడం లేదు. దొరికిన వారిలో నుంచి 65 శాతం మంది కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆయా శాఖలు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిని ఆఫీసర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతేగాకుండా పైరవీలు చేయించుకుంటూ కేసులను క్లోజ్‌ చేయించుకున్న దాఖలాలూ ఉన్నాయి. ఏటా రాష్ట్రంలో పట్టుబడుతున్న ఆయా శాఖల ఆఫీసర్లలో సింహభాగం రెవెన్యూ శాఖ వారిదే. గత 2018లో 37 మంది పట్టుబడితే.. 2019లో 54 మంది మీద ఏసీబీ కేసులు నమోదయ్యాయి.

కుప్పంలోని బాధిత కుటుంబాలను కలవనున్న పవన్ కళ్యాణ్?

నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ అంతా చాలా ఘనంగా జరుపుకున్నారు. ఎన్నోచోట్ల కేకులు కట్ చేశారు, ఫ్లెక్సీలు, బ్యానర్లు అమర్చారు, రక్తదానం చేశారు, ఇంకా మరింత వినూత్నంగా…. ఎంతో ప్రశంసనీయంగా…. ఆదర్శవంతంగా దాదాపు 300 ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్ళ కు జనసైనికులు తమ జనసేనాని పుట్టినరోజు సందర్భంగా దానం చేయడం కూడా గమనించాం. 

Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ

అయితే మొన్న రాత్రి చోటు చేసుకున్న ఒక విషాదకర సంఘటన పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్రంలోని జనసైనికులందరినీ కలిచి వేసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం లోని శాంతిపురం లో సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు.. వారి అభిమాన నాయకుడి పుట్టినరోజుకి బ్యానర్ అమరుస్తూ కరెంటు తీగలు పట్టుకోగా.. కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. వీరంతా పొరపాటున ఇలా దురదృష్టకరంగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. దాదాపు 25 అడుగుల ఎత్తున్న కరెంటు స్తంభాలకి బ్యానర్ ను తగిలించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధితుల కుటుంబాలకు ఒక్కరికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. పవన్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల సహాయం ప్రకటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. వీరంతా ఫ్యాన్స్ ను ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని విన్నవించుకున్నారు. 

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుప్పంలోని బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నారని సమాచారం. ఇప్పటికే అతను జనసేన కార్యకర్తలను ఆ కుటుంబాల బాగోగులు చూసుకోమని చెప్పడం జరిగింది. ఇక వీలైనంత త్వరగా బయల్దేరి వారిని నేరుగా పరామర్శిస్తారని జనసేన పార్టీ వర్గాల నుండి వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఆ విషయాన్ని మర్చిపోవడానికి పవన్ ఎంత ప్రయత్నించినా…. ఈ పుట్టిన రోజుని జీవితంలో ఈ ముగ్గురి మరణం కారణంగా ఎప్పటికీ చెరిగిపోని ఒక చేదు గాయంలా ఉంటుందన్న విషయం మాత్రం వాస్తవం. 

Also Read : ఒకే ఒక్క దెబ్బతో బాబు కుల రాజకీయం బట్టబయలు…?