
కొంతమంది హీరోయిన్లకు పెద్దగా అందం లేకపోయినా, వాళ్లేమి అద్భుతంగా కూడా నటించలేకపోయినా.. అదృష్టం మాత్రం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్లు అయిపోతుంటారు. ఈ లిస్ట్ లో అలనాటి శారదా దగ్గర నుండి మొన్నటి శ్రీయా, త్రిష, నేటి రకుల్ ప్రీత్ సింగ్ దాకా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ లో చాలామంది సభ్యురాల్లే ఉంటారు. వీరికి కంటే కూడా.. అందంలోనూ నటనలోనూ గొప్పగా ఉన్నా.. కాలం కరుణించిక ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అవుట్ అయిన బ్యూటీఫుల్ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అందుకేనేమో సినిమా ఇండస్ట్రీలో లెక్కలన్నీ సక్సెస్ రేటును బట్టి మారుతూ ఉంటాయని సినీ జనం తరుచూ ప్రస్తావించుకుంటుంటారు. లేకపోతే ఛాన్స్ లు లేక ఫేడ్ అవుట్ దశలో ఉన్న ‘రకుల్ ప్రీత్ సింగ్’కి భారీ ఆఫర్ రావడం ఏమిటీ. తమిళ్ టాప్ హీరో విజయ్ – మురగదాస్ కలయికలో వస్తోన్న క్రేజీ సినిమాలో ‘రకుల్ ప్రీత్ సింగ్’కి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
Also Read: నరకాన్ని చూశానంటున్న క్రేజీ హీరోయిన్ !
కేవలం ఒకప్పుడు ఆమె స్టార్ లతో నటించింది.. పైగా సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి కూడా బాగా గిట్టుబాటు అవుతుందనే అంశాలే ఆమెకు మళ్లీ స్టార్ హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పట్టం కట్టాయి. ఏమైనా రకుల్ లో ఏదో ప్రత్యేకత ఉంది. అది లేకే ప్రియమణి, శ్రీయా, సలోని, అంజలి లాంటి విషయం ఉన్న హీరోయిన్స్ స్టార్ హీరోల నుండి ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. కానీ, ఒక్క ‘రకుల్ ప్రీత్ సింగ్’ మాత్రమే ఛాన్స్ లు తగ్గిన ప్రతిసారి ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసి.. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేస్తుంది. లేకపోతే జస్ట్ నాలుగేళ్లల్లోనే ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ లాంటి అందరీ స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా ఎలా చేయగలతుంది. పైగా గత ఏడాది వరకూ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో రకుల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించేది.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
కానీ, ఈ మధ్యలో పూజా హెగ్డే ఫామ్ లోకి రావడం.. అలాగే రష్మిక, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు కూడా స్టార్ డమ్ తెచ్చుకుని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను తెచ్చుకోవడంతో.. రకుల్ కు ఛాన్స్ లు తగ్గాయి. ఇంతకు ముందు రకుల్ ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేసేది. అయితే ఛాన్స్ లు తగ్గాక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన రెమ్యునరేషన్ ను అరవై లక్షలకు తగ్గించుకుంది. పైగా సినిమా రిలీజ్ అప్పుడు అన్ని ప్రమోషన్స్ కి ఫ్రీగా హాజరు అవుతానని మొత్తానికి నిర్మాతలను కాకపడుతూ ఛాన్స్ లు అడుగుతుందట. తనకు స్టార్ హీరోల సపోర్ట్ ఉందని నిర్మాతలు కూడా ఆమెకు నో చెప్పలేకపోతున్నారట. క్రిష్ సినిమాలో రకుల్ కు ఇలానే అవకాశం వచ్చిందట. మొత్తానికి రకుల్ హీరోలను మాయ చేస్తోందని అనుకుంటున్నారు సినీ జనం.