
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకుంటూ అతని అభిమానులంతా ఈ రోజున వేడుకలు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఆ వేడుకలు కాస్తా వారి జీవితాలకు సంకటంగా మారాయి. నిన్న రాత్రి ముగ్గురు యువకులు పవర్ స్టార్ బ్యానర్ ను కడుతూ కరెంటు తీగలు పట్టుకొని చనిపోగా…. తెల్లవారుజామున వరంగల్ రూరల్ దామెర మండలం పసరగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒక కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది.
Also Read : కుప్పంలోని బాధిత కుటుంబాలను కలవనున్న పవన్ కళ్యాణ్?
ఇక లారీ, కారు రెండు ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కూడా వరంగల్ జిల్లా పోచం మైదాన్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే చనిపోయిన ఐదుగురు పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వస్తున్నాయి. వీరందరూ పవర్ స్టార్ అభిమానులని…. అత్యుత్సాహంతో వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారు పొరపాటున లారీని ఢీ కొట్టారని చెబుతున్నారు.
మరణించినవారు మేకల రమేష్, మేడి చందు, రోహిత్, పవన్, సాబిర్ లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడున్నట్లు ఉన్నత అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన స్థలం వద్దకు హుటాహుటిన వచ్చిన ఏసిపి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి అక్కడ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కానీ అప్పటికే ఫలితం లేకుండా పోయింది.
ఇక ఈ విషయమై వారు జనసేన అభిమానులని పవన్ కళ్యాణ్ నుండి గాని, అతని పార్టీ తరఫు నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే నలుగురు యువకులు పైన చెప్పబడిన కరెంట్ షాక్ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో ప్రాణాల కోసం పోరాడుతున్న దశలో ఇలా మరో ఐదుగురు మృతి చెందడం నిజంగా బాధించే విషయం.
Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ
నిన్న చిత్తూరు జిల్లా కుప్పంలో ముగ్గురు జనసేన అభిమానులు మృతిచెందడంపై హీరో రాంచరణ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు తన ట్వీటర్లో ఎమోషనల్ ట్వీట్ పోస్టు చేశారు. ‘నిన్న కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అభిమానులు కాలం చేశారు అనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏది విలువైనది కాదు.. మీరంతా ఇది ఎప్పుడూ గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నా మవని’ అంటూ ట్వీట్ చేశారు. అభిమానుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


ఈఎస్‌ఐ మెడికల్ స్కాంని ఏసీబీ అధికారులు మరోసారి తవ్వుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తులో వేగం పెంచారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి చెందిన రూ.4 కోట్ల 47 లక్షలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాల కోసం ఆ డబ్బును ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థకు ఇచ్చినట్లుగా ఏసీబీ పక్కా సమాచారం అందింది. దీంతో దాడి చేసి ఆ డబ్బును సీజ్ చేశారు. బెయిల్ మీద బయటకొచ్చిన వెంటనే దేవికారాణి ఈ డబ్బులు అప్పజెప్పారు.

ఎక్కడో చైనా దేశంలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతటికి పాకి ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన అమెరికాను సైతం కకావికలం చేసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. దాని తర్వాత ఆ ఎఫెక్ట్ పడింది మన భారత్‌పైనే. కరోనా మహమ్మారితో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతానికి కుంచించుకుపోయింది. ఇంత భారీ స్థాయిలో జీడీపీ పతనం కావడం ఇదే మొదటిసారి. సుదీర్ఘ లాక్‌డౌన్‌తో మన దేశానికి ఈ పరిస్థితి వచ్చినట్లు నిపుణులు అంటున్నారు.





కార్మికుల సమస్యల మీద పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన యూనియన్ లీడర్లు.. వారికే వాళ్లే కొట్టుకుంటున్నారు. పదవి కోసం పొట్లాడుకుంటున్నారు. రెండు వర్గాలుగా వీడిపోయి బలాలను చాటుతున్నారు. ఏకంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ సంఘమైన టీఎంయూలోనే ఈ దుస్థితి దాపురించింది. యూనియన్‌లో నాయకత్వ మార్పుపై అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. జనరల్ సెక్రటరీ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు.
ఏపీలో మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సీఎం వైఎస్ జగన్ మందుబాబులపై పగబట్టాడు. ఏపీలో మద్యనిషేధం దిశగా మద్యం ధరలను భారీగా పెంచారు. ఈ క్రమంలోనే పక్కరాష్ట్రంలో మద్యం సగం ధరకు చీప్ గా దొరుతుండగా.. ఏపీలో మాత్రం డబుల్ రేట్లు పెట్టి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఒళ్లుగుల్ల చేసుకుంటున్నారు. ఏపీలో మద్యం ధరలపై మందుబాబుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది.
దర్శక దిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్లో ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రాబోతుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి ఈ మూవీలో కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మెగా, నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరి అంచనాలకు మించిపోయేలా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండూ కష్టంతో కూడినవే. ఇక నిరుపేదలైతే ఇల్లు కొనుక్కోవడం అంటే వారికి కలగానే చెప్పాలి. ఇప్పుడున్న మెటీరియల్ రేటు.. కూలీల కాస్ట్.. వింటేనే దిమ్మతిరిగిపోతుంటుది. ఎంత లేదనుకున్నా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే రూ.30 లక్షల వరకు కావాల్సిందే. అయితే ఇల్లు లేని నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీం కింద సొంతింటి కల సాకారం చేయనుంది. ఈ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మిడిల్ క్లాస్ పీపుల్ ఇల్లు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించింది. అంతేకాదు మొదటిసారి ఇల్లు కొన్న వారికి వడ్డీ రాయితీ కూడా కల్పించింది.




