కేంద్రం నుంచి ఏపీకి వచ్చే నిధులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మొకాలడ్డుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి వచ్చే ఉపాధి నిధులు అడ్డుకునేందుకు మరోసారి కుటిలయత్నం చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనే ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించలేదని.. పాత బిల్లులు చెల్లించాకే అదనంగా ఉపాధి పని దినాలు కేటాయించాలంటూ కేంద్రానికి లేఖలు రాశారంటున్నారు. ఉపాధి కూలీల పొట్టకొట్టేందుకు బాబు యత్నించాడని ఆరోపిస్తున్నారు. అయితే కేంద్రం ముందు బాబు పప్పులు ఉండకలేదని తెలుస్తోంది. బాబు లేఖలను కేంద్రం పట్టించుకోకుండా తాజాగా ఏపీకి 4.25 కోట్ల పనిదినాలకు మంజూరుచేసి టీడీపి అధినేతకు షాకిచ్చింది.
ఏపీకి ఉపాధి నిధులు రాకుండా అడ్డుకోవాలని బాబు చేస్తున్న యత్నాన్ని సీఎం జగన్ ముందుగానే గ్రహించారు. దీంతో కేంద్రానికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞాపన పత్రాన్ని పంపించారు. కరోనా కాలంలో కూలీలకు లాభం చేకూర్చేలా ఏపీకి అదనపు పనిదినాలను కల్పించాలని కోరారు. జగన్ కోరిక మేరకు కేంద్రం ఇప్పుడున్న పనిదినాలకుతోడు అదనంగా 4.25కోట్ల పనిదినాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ద్వారా పెద్దఎత్తున ఉపాధి కూలీలకు లాభం జరుగనుంది. అవసరమైతే మరిన్ని పనిదినాలు కల్పిస్తామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఏడాది ఏపీకి 21కోట్ల పనిదినాలను కేంద్రం మంజూరు చేసింది. అయితే లాక్డౌన్ కాలంలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఐదునెలలుగా ప్రభుత్వం వీటిని భారీగా వాడుకుంది. పనుల్లేని పేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి నిధులే ఆసరాగా నిలిచాయి. ఇప్పటికే 20.15కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. మరో పక్షం రోజులు మిగతా పనిదినాలు పూర్తికానున్నాయి. ఈ తరుణంలోనే బాబు ఏపీకి కేంద్రం గతంలో చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా అదనపు పనిదినాలు కేటాయించొద్దని బాబు లేఖరాయడంతో కూలీల్లో ఆందోళన నెలకొంది.
ఏపీకి నిధులు రాకుండా అడ్డుకునే వ్యూహాంలో భాగంగానే చంద్రబాబు ఇలా చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు భారీగా యంత్రాలతో కాంట్రాక్టర్లతో పనులు చేసి ఉపాధి హామీ డబ్బు కాజేయాలని చూశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి పనులపై విచారణ చేపడుతోంది. అంతేకాకుండా యంత్రాలతో కాకుండా నేరుగా కూలీలకు పనులు కల్పిస్తుంది. ప్రతిపక్షంలో ఉండి పేదలకు పక్షాన పోరాడాల్సిన టీడీపీ పేదలకు ఉపాధి దూరం చేసేలా లేఖరాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెత్త లాజికులతో కేంద్రం నిధులు రాకుండా అడ్డుకోవాలని చూసిన బాబుకు కేంద్రం షాకిచ్చింది. దీంతో కేంద్రం వద్ద బాబు కంటే జగన్ కే పరపతి ఎక్కువగా ఉందని మరోసారి రుజువైంది.