
దేశంలో రోజురోజుకు ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన రెకెత్తిస్తోంది. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. వాటిని పరిష్కరించుకోకుండా కొందరు పిరికివారిలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరైతే ఏ కారణం లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జాతీయ నేర గణాంక విభాగం(ఎన్సీఆర్బీ) దేశంలోని ఆత్మహత్య సంఘటలపై షాకింగ్ విషయాలను వెల్లడించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆత్మహత్యల్లో తొలిస్థానంలో ఉండటం శోచనీయంగా మారింది.
2018తో పోల్చుకుంటే 2019లో బలవర్మణాల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్సీఆర్బీ వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 381మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొంది. 2018లో 1,34,516 మంది బలవర్మణానికి పాల్పడగా 2019నాటికి 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించింది. వీరిలో 70.2శాతం మంది పురుషులుగా ఉండగా మహిళలు 29.8శాతం ఉన్నట్లు తేలింది. బలవర్మణానికి పాల్పడేవారిలో పురుషులే అత్యధికంగా ఉండటం షాకింగ్ కు గురిచేస్తోంది.
ఆత్మహత్య పాల్పడిన వారిలో 53.6శాతం మంది ఉరి వేసుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. విషం తాగి 25.8శాతం మంది, నిప్పంటించుకొని 3.8శాతం మంది, నీళ్లలో దూకి 5.2శాతం మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో కుటుంబ సమస్యలతో 32.4శాతం మంది, వివాహ సంబంధ సమస్యలతో 5.4 శాతం మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది.
ఆత్మహత్యల్లో ఆర్థిక రాజధాని మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. 18వేలకు పైగా మంది కిందటేడాది ఆత్మహత్యకు చేసుకున్నట్లు తేలింది. 13వేల కేసులతో తమిళనాడు రెండోస్థానంలో, 12వేల కేసులతో పశ్చిమబెంగాల్ మూడోస్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యల సంఖ్య భారీగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది.
తెలంగాణలో గతేడాది 7,675మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 2,858మంది కూలీలు ఉండగా 499మంది రైతులు ఉన్నట్లు పేర్కొంది. ఇక ఏపీలో 6,465 ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో వివాహం తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వారేరే ఎక్కువగా ఉన్నట్లు తేలడం గమనార్హం. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, ఒడిశా, చండీఘఢ్, మణిపూర్, ఢిల్లీలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఎన్సీఆర్బీ పేర్కొంది.
ఏదిఏమైనా ఆత్మహత్య పిరికిపంద చర్య అని మానసిక నిపుణులు, సైకాలిజిస్టులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తే వెంటనే సైకాలిస్టును సంప్రదించి చికిత్స చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించగలరని.. ఆత్మహత్యలతో సాధించేది ఏమి ఉండదని అంటున్నారు.