Home Blog Page 33

అంత ఘోరం జరుగుతున్నా మీ ఖలిస్తాన్ ఉద్యమం పాకిస్తాన్ లో ఉండదా?

Khalistan Movement
Khalistan Movement

Khalistan Movement: పాకిస్తాన్‌ ఒకవైపు ఖలిస్తాన్‌ ఉద్యమం పేరిట సిక్కు సమాజాన్ని భారతదేశం నుంచి వేరు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తానీలకు ఆశ్రయం ఇస్తోంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందిస్తోంది. ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఇక మరోవైపు తమ భూభాగంలోని సిక్కుల చారిత్రక ఆనవాళ్లను క్రమబద్ధంగా ధ్వంసం చేస్తోంది. ఇలా ద్వంద్వ వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. ఈ విరుద్ధ చర్యలు సిక్కు సమాజం వారసత్వం, రాజకీయ ఉద్యమాల మధ్య వైరుధ్యాలు చర్చనీయాంశమయ్యాయి.

చారిత్రక గురుద్వారాలు ధ్వంసం..
పాకిస్తాన్‌లోని చారిత్రక గురుద్వారాలను ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 125 సంవత్సరాల పురాతనమైన శ్రీ గురు సింగ్‌ సభా సాహెబ్‌ గురుద్వారాను కూల్చివేసింది. ఇది చారిత్రక, సాంస్కృతిక విలువ కలిగిన స్థలం. 1960లలో భారతదేశం నుండి వచ్చిన ముస్లింలకు ఈ స్థలాన్ని నివాసం కోసం అప్పగించినప్పుడు, దాని గురుద్వారా స్వరూపాన్ని మార్చకుండా ఉండాలని స్పష్టమైన షరతు విధించారు. అయినప్పటికీ, ఆ షరతును ఉల్లంఘించి పూర్తి ధ్వంసం చేయడం చారిత్రక వారసత్వం పట్ల అనాదరణను చూపిస్తోంది.

పాకిస్తాన్‌ ద్వంద్వ విధానం..
ఖలిస్తాన్‌ ఉద్యమం పేరిట సిక్కులను భారతదేశం నుంచి వేరు చేసి, పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సిక్కు సమాజంలో అస్థిరత కలిగించేందుకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌ తన దేశంలో సిక్కుల చారిత్రక గుర్తులను అంతం చేస్తుండటం ఈ ఉద్యమం వెనుక దాగిన ఉద్దేశాలపై సందేహాలు కలిగిస్తోంది. ఒకవైపు సిక్కులను ‘‘స్వతంత్ర రాష్ట్రం’’ పేరిట ఆకర్షించి, మరోవైపు తమ దేశంలోని సిక్కు సంస్కృతిని నాశనం చేయడం వ్యూహాత్మక వ్యతిరేకతను సూచిస్తోంది.

ఖలిస్తానీల మౌనం..
భారతదేశంలోని ఖలిస్తాన్‌ మద్దతుదారులు ఈ ధ్వంసం గురించి పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒక్కరు కూడా ఈ విషయంలో మాట్లాడడం లేదు. నిజమైన సిక్కు వారసత్వం, హక్కుల కోసం ఉద్యమిస్తున్నట్లయితే, పాకిస్తాన్‌ చేస్తున్న ఈ చర్యలపై వారు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది ప్రశ్నార్థకం. పాకిస్తాన్‌పై పోరాటం చేయడం మానేసి, భారతదేశంపైనే దృష్టి సారించడం వారి ఉద్యమం యొక్క నిజమైన ప్రాధాన్యతను సందేహాస్పదం చేస్తోంది. ఇది ఉద్యమం సిక్కు సమాజం యొక్క వాస్తవ ప్రయోజనాల కోసం కాకుండా, ఇతర రాజకీయ లక్ష్యాల కోసం నడుస్తుందని సూచిస్తోంది.

ఢిల్లీలోని సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఈ సమస్య నేరుగా పాకిస్తాన్‌తో ముడిపడి ఉంది కాబట్టి, పాకిస్తాన్‌ను నేరుగా సంప్రదించి, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తీసుకురావడం మరింత సమర్థవంతంగా ఉండవచ్చు. భారత ప్రభుత్వం దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను లేవనెత్తడం అవసరం. సిక్కు సమాజం ఏకమై, తమ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ విరుద్ధ చర్యలను ఖండించడానికి చర్యలు తీసుకోవాలి.

బంగారంతో లో దుస్తులు .. ఈ మహిళా ఎంపీ చేసిన పని తెలిస్తే అవాక్కే

Iraq Corruption
Iraq Corruption

Iraq Corruption: మనదేశంలో బంగారంతో మహా అయితే ఆడవాళ్లు ఆభరణాలు చేయించుకుంటారు. బాగా డబ్బున్న వాళ్ళైతే కాళ్ల పట్టీలు.. మెట్టెలు.. వడ్డాణం వంటివి చేయించుకుంటారు. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళైతే కంచాలు.. మంచాలు.. సోఫా సెట్లు బంగారంతో చేయించుకుంటారు. కానీ బంగారంతో.. ఈమె చేయకూడని పని చేసింది. చివరికి ఇలా దొరికిపోయింది..

మనదేశంలోనే కాదు అవినీతి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. గతంలో ఇతర దేశాలలో అవినీతి వ్యవహారాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతి విషయం తెలిసిపోతున్న నేపథ్యంలో.. ఇతర దేశాలలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. అటువంటిదే ఇది కూడా. కాకపోతే ఇక్కడ అవినీతికి పాల్పడింది ఇద్దరు మహిళలు. వారిద్దరు కూడా ప్రజాప్రతినిధులు. వారు అవినీతికి పాల్పడిన తీరు వేరే లెవెల్. అసలు ఇలా కూడా చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇరాక్ దేశంలో కొంతకాలంగా అవినీతి భారీగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ప్రభుత్వం తనిఖీలు మొదలుపెట్టింది. దాడులను విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళ ఎంపీల ఇళ్లల్లో లెక్కకు మిక్కిలిగా అక్రమంగా పోగు చేసిన ఆస్తులు బయటపడ్డాయి. ఇలా అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారిలో హింద్ ఆల్ అబ్బాసి, అలియా నసీఫ్ అనే ఎంపీలు ఉన్నారు. వీరి దగ్గర నుంచి అధికారులు వందల కోట్లు నగదు.. కిలోల పరిమాణంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అబ్బాసీ ఇంట్లో..

అవినీతి వ్యతిరేక అధికారులు ఇరాక్ దేశంలోని భాగ్యాధి ప్రాంతంలో గ్రీన్ జోన్ ఏరియాలో దాడులు జరిపారు. ఇందులో అబ్బాసి అనే ఎంపీ ఇంట్లో ఏకంగా 490 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 27 కిలోల అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని జట్టు చేశారు.. అబ్బాసి బంగారంతో లో దుస్తులు తయారు చేయించుకుంది. వాటిని ఆమె రాత్రిపూట ధరించేది. కొన్ని సందర్భాలలో తన ప్రైవేటు వ్యవహారాలలో పాల్గొన్నప్పుడు కూడా ధరించేది. బంగారంతో లో దుస్తులు రూపొందించుకున్న నేపథ్యంలో అబ్బాసి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

నసీఫ్ ఇంట్లో

నసీఫ్ అనే ఎంపీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. చివరికి ఆమె అవినీతి పరురాలిగా మారిపోయారు. పార్లమెంట్ ఇంటిగ్రేటెడ్ కమిటీకి ఆమె వైస్ చైర్మన్ గా పని చేశారు. తనకున్న గుర్తింపును అవినీతికి అనుకూలంగా మార్చుకున్నారు. ఆమె ఇంట్లో ఏకంగా 130 కోట్ల నగదు లభించింది.. భారీగా బంగారం దొరికింది.. ఎక్కువగా చమురు మంత్రిత్వ శాఖలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో.. అధికారులు విచారణ జరిపారు. ఇందులో 67 మందికి పైగా అధికారులు.. ఎంపీలను ఇరాక్ అధికారులు అరెస్ట్ చేయడం విశేషం.

ఎనిమిది రోజులుగా నీరు, ఆహారం లేదు. ఐనా బతికాడు..

Venezuela Earthquake
Venezuela Earthquake

Venezuela Earthquake: భూమ్మీద నూకలు ఉంటే.. యముడి పాశం నుంచి కూడా తప్పించుకోవచ్చు అంటారు. ఇతడు కూడా అలాంటి వాడే. చావు చివరి అంచుదాకా వెళ్లి వచ్చాడు. చివరికి అందరూ ఆశ్చర్యపోయే విధంగా కనిపించాడు. ఈ అద్భుతం వెనిజులా ప్రాంతంలో చోటుచేసుకుంది.

సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం వెనిజులా ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఆ భవనాల శిధిలాల కింద చాలామంది పడి చనిపోయారు. ఈ శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ శిధిలాల కింద చాలావరకు మృతదేహాలను వెలికితీస్తున్నారు.

శిధిలాల కింద నుంచి మృత దేహాలను బయటకు తీస్తుండగా ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడు. వాస్తవానికి ఎనిమిది రోజులు ఆహారం.. తాగునీరు లేకపోయినప్పటికీ అతడు బ్రహ్మాండంగా వున్నాడు. పైగా అతడి శరీరం మీద టన్నులకొద్ది శిధిలాలు ఉన్నప్పటికీ అతడు జీవించ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ స్థాయిలో శిధిలాల కింద పడిపోయినప్పటికీ అతడు జీవించి ఉండడం అక్కడి అధికారులకు మిరాకిల్ మాదిరిగా ఉంది. ఆ వ్యక్తి ఒక షాపింగ్ మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసేవాడు. భూకంపం వల్ల శిధిలాలలో కూరుకుపోయాడు. దాదాపు 100 గంటల పాటు 140 టన్నుల శిథిలాలను తొలగించిన తర్వాత అతడిని బయటికి తీశారు.

శిధిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు వెనిజులా ప్రాంతంలో చోటు చేసుకున్న భూకంపం లో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 2595 కి చేరుకుంది. ఇంకా శిధిలాల తొలగింపు జరుగుతూనే ఉంది. మృతదేహాల వెలికితీత సాగుతూనే ఉంది.. భూకంపం వల్ల వెనుజులా ప్రాంతంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రపంచ దేశాలు ఆహారం.. ఔషధాలు.. దుస్తులు.. ఇతర సామాగ్రిని పంపిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పటికీ భారత్ కూడా విడతలవారీగా వెనిజులా దేశానికి ఔషధాలు పంపించి తన సేవా తత్పరతను చాటుకుంది.

మహేష్ బాబు చెప్పినట్టుగా రావు బహదూర్ లో మార్పులు చేసి ఉంటే ఇంకా బాగుండేదా.?

Rao Bahadur
Rao Bahadur

Rao Bahadur Movie: సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి నుంచే ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్న మేకర్స్ ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంతో ఈ సినిమా యావరేజ్ టాక్ ను అయితే సంపాదించుకుంది. మొత్తానికైతే వెంకటేష్ మహా ఇంతకుముందు చేసిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఈ సినిమాని పోలిస్తున్నారు. నిజానికి ఆ మూవీకి ఈసినిమాకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే అది కంప్లీట్ ఎమోషన్స్ తో తెరకెక్కిన మూవీ, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా కాబట్టి రెండింటికి పోల్చడం సరైనది కాదు.

అయినప్పటికీ ఈ జానర్ లో పర్ఫెక్ట్ గా సినిమాను ప్రజెంట్ చేశాడా అంటే లేదనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. కథ చెప్పినప్పుడే మహేష్ బాబు ఇందులో చాలా వరకు మార్పులు చేర్పులు చేయని చెప్పారట. కానీ దర్శకుడు వాటిని మార్చకుండా వాళ్ళని కన్విన్స్ చేశాడు.

దర్శకుడి కాన్ఫిడెంట్ చూసిన మహేష్ బాబు సైతం అందులో వేలు పెట్టలేదు. కానీ ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత కొన్ని మార్పులు చేస్తే బాగుండేదేమో అంటూ సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. నిజానికి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయిన కూడా ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ కలిగించే సన్నివేశాలైతే ఉండాలి. అవి ఉన్నప్పుడే సినిమా కూడా ముందుకు సాగుతుంది.

ఆ థ్రిల్లింగ్ సన్నివేశాలను కొంచెం యాడ్ చేయమని మహేష్ బాబు సలహా ఇచ్చాడట. కానీ వెంకటేష్ మహా మాత్రం దానిని పట్టించుకోలేదు. ఎట్టకేలకు సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయాన్ని సాధించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మొదటి షో తోనే యావరేజ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ను రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.

'పెద్ది' చిత్రానికి రామ్ చరణ్ అందుకున్న రెమ్యూనరేషన్ ఇంతేనా..? చాలా తక్కువ కదా..

Ram Charan Remuneration
Ram Charan Remuneration

Ram Charan Remuneration: ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ రేట్స్ కి కొనడం వల్ల, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ నెంబర్ ని అందుకోలేకపోయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. రాయలసీమ , నెల్లూరు జిల్లాల్లో స్వల్ప నష్టాలు వచ్చిన విషయం వాస్తవమే కానీ , రిటర్న్ జీఎస్టీ నిర్మాతలు బయ్యర్స్ కి కడితే ఆ రెండు ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకు రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన రేంజ్ కి ఇది చాలా తక్కువ అని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

‘గేమ్ చేంజర్ ‘ చిత్రం భారీ ఫ్లాప్ అవ్వడం తో , ‘పెద్ది’ చిత్రానికి రామ్ చరణ్ విడుదలకు ముందు ఎలాంటి అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చాక నిర్మాతలు ఆయనకు 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని బట్టి రామ్ చరణ్ రేంజ్ కి తగ్గట్టు తీసుకోవాల్సి వస్తే 100 కోట్ల రూపాయిలు తీసుకోవచ్చు. కానీ గత చిత్రం ఫ్లాప్ అవ్వడం వల్ల, ఆయన కేవలం 60 కోట్లకు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. ఈ విషయాన్నీ తెలుసుకున్న ఫ్యాన్స్ , నిర్మాతల బాగోగులు గురించి ఆలోచించే హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు, ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో కళ్ళకు కనిపించింది , అయినప్పటికీ కూడా ఆయన రేంజ్ కి తగ్గ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ దసరా నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రం తర్వాత ఆయన మరోసారి బుచ్చి బాబు తోనే ఒక సినిమా చేయబోతున్నారు అట. రీసెంట్ గానే ఒక ప్రముఖ నిర్మాత చేత బుచ్చి బాబు కి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్టు సమాచారం. హైదరాబాద్ లో తన రైటింగ్ టీం తో ఆఫీస్ ని ఏర్పాటు చేసి కథ కూడా సిద్ధం చేసే పనిలో పడ్డారట.

అలా పిలిస్తే నేను ఇంటర్వ్యూ నుండి దొబ్బేస్తా అంటూ గెటప్ శ్రీను కి అఖిల్ వార్నింగ్.. వీడియో వైరల్..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ ఈ నెల 10 న ‘లెనిన్’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇప్పుడు యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్స్ లో బాగా వైరల్ అయ్యాయి. ప్రతీ ఇంటర్వ్యూ లోనూ అఖిల్ మాట్లాడే మాటలను చూస్తుంటే , ఈ సినిమా పై ఆయన ఎంత నమ్మకం తో ఉన్నాడో తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం లో గెటప్ శ్రీను ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఒక ఇంటర్వ్యూ కి హోస్ట్ గా మారి, అఖిల్ , భాగ్యశ్రీ లతో పాటుగా , ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించిన శివాజీ, బ్రహ్మాజీ లను ఇంటర్వ్యూ చేశారు.

అయితే ఈ ఇంటర్వ్యూ లో గెటప్ శ్రీను అఖిల్ ని మాటకు ముందు , మాట తర్వాత ‘సార్’, ‘సార్’ అంటూ సంబోధించడం అఖిల్ కి అసలు నచ్చలేదు. అందుకు ఆయన గెటప్ శ్రీను కి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ‘ఇంకోసారి నువ్వు సార్ అంటూ పిలిచావంటే నేను ఈ ఇంటర్వ్యూ నుండి దొబ్బేస్తా. నా కంటే ఇండస్ట్రీ లో సీనియర్ వి నువ్వు, కావాలంటే అరేయ్ , ఒరేయ్ అని పిలువు , ఊరికే సార్ ఏంటి?’ అంటూ మందలించారు. దీన్ని చూసిన అభిమానులు , వీళ్లిద్దరి మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా?, అని ఆశ్చర్యపోతూ పోస్టులు వేస్తున్నారు. ఒక కమెడియన్ కి అఖిల్ ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతం లో అఖిల్ హీరో గా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో గెటప్ శ్రీను పంతులు పాత్ర పోషించారు.

అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం విశేషం. ఇక ‘లెనిన్’ విషయానికి వస్తే, ఈ చిత్రం తో అఖిల్ కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారని ఆయన అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా నాగార్జున కూడా ఔట్పుట్ పై పూర్తి స్థాయిలో సంతృప్తి గా ఉండడం అభిమానుల్లో ఈ చిత్రం పై మరింత నమ్మకాన్ని కలిగించింది. ఎందుకంటే నాగార్జున అంత సామాన్యంగా ఒక సినిమాని నచ్చడు, ఆయన స్టాంప్ పడిందంటే మాత్రం కచ్చితంగా హిట్ కొడుతాము అనే నమ్మకం అక్కినేని ఫ్యాన్స్ లోనే కాదు , ట్రేడ్ లో కూడా ఉంది. మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి.

'ప్రశ్న రావణ్' ని చితకబాదేందుకు పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. వీడియో వైరల్..

Prashna Ravan Case
Prashna Ravan Case

Prashna Ravan Arrest: నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందో గతంలో పోసాని కృష్ణ మురళి విషయం లో మనమంతా చూశాము , ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో మరోసారి చూస్తున్నాము. యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన మాటలతో దూషించడం, పిఠాపురం లోకి వెళ్లి ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే దానికి కూడా కులాల రంగు పులిమి గొడవలు పెట్టడాలు వంటివి చేయడం, టెర్రరిస్టులకు సపోర్టు చేస్తూ స్పెషల్ వీడియోలు చేయడం, ఇలా ఒక్కటా రెండా , ఇతని ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఇతను ఈ స్థాయిలో రెచ్చిపోతున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వాలు ఇతనిపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తమ అసహనాన్ని వ్యక్తం చేసేవారు.

ఇక రీసెంట్ గా దళిత క్రైస్తవులు సభలో ఇతను చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో అర్థరాత్రి ఇతన్ని అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ జడ శ్రవణ్ కుమార్ వాదనలతో బెయిల్ వచ్చినప్పటికీ , సర్పవరం లో కొత్త కేసు నమోదు అవ్వడంతో అక్కడికి తరలించారు. అక్కడ కూడా ఇతనికి రిమాండ్ విధించకుండా బెయిల్ ఇవ్వడం తో , టెర్రరిస్టులకు సపోర్టుగా వీడియోలు చేసినందుకు మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ లో ఇతని పై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఇప్పుడు ఇతను అక్కడే ఉన్నారు. అయితే ఇతన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతీ చోటా వెంబడిస్తున్నారు. అతనికి కఠినంగా శిక్షలు పడాలి , లేదంటే మాకు అప్పగించండి మేము చూసుకుంటాం అంటూ మండిపడుతున్నారు. పిఠాపురం , సర్పవరం పోలీస్ స్టేషన్స్ వద్దకు తీసుకెళ్లినప్పుడు రావణ్ పై గుడ్లతో దాడి చేశారు పవన్ ఫ్యాన్స్.

అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక నేడు మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ లో పవన్ ఫ్యాన్స్ తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పారు. రావణ్ ని చితకబాదేందుకు పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చారు. వాళ్ళని అడ్డుకునేందుకు బారికేడ్లను పెట్టగా , వాటిని కూడా బద్దలు కొట్టుకొని ముందుకెళ్లారు. చివరికి పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయ్యి, అక్కడి పరిస్థితులను చక్కబెట్టడం తో వాతావరణం చల్లపడింది. పవన్ ఫ్యాన్స్ ఆవేశం చూస్తుంటే , ప్రశ్న రావణ్ జైలు లో ఉండడమే మంచిది అనిపిస్తోంది. ఒకవేళ అతను బయటకు వస్తే పటిష్టమైన సెక్యూరిటీ ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉన్నది. కేవలం పవన్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా, హిందూ దేవుళ్లపై ఇతగాడు చేసిన వ్యాఖ్యలను ఎవ్వరూ క్షమించే పరిస్థితి లో ఇక లేరు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబొట్టునుండి అనేది.

భారత్‌ వైపు ఆరు దేశాలు.. అమెరికా, చైనా షాక్‌

India Defence Export
India Defence Export

India Defence Export: ప్రపంచంలో అగ్రదేశాలు అమెరికా, చైనా. ఈ దేశాలు సంపన్న దేశాలే కాదు.. టెక్నాలజీ, ఆయుధాల తయారీలో కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాత ఫ్రాన్స్, రష్యా కూడా ఉన్నాయి. అయితే అమెరికా, చైనా ఆయుధాలు తయారు చేసి వ్యాపారం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య గొడవలు పెట్టి వాటికి ఆయుధాలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే గతేడాది భారత్‌ పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో చేసిన దాడితో మన సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. మన దగ్గర ఉన్న ఆయుధాల సామర్థ్యం కూడా అగ్రరాజ్యాలతోపాటు అనేక దేశాలకు అర్థమైంది. దీంతో అప్పటి నుంచి మన ఆయుధాల కొనుగోలుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో అగ్రదేశాల ఆయుధాలకు డిమాండ్‌ తగ్గింది. స్వదేశీ రక్షణ వ్యవస్థలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఇది భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింత బలపరుస్తోంది.

బ్రహ్మోస్‌ కోసం ఆరు దేశాల ఆసక్తి..
బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిసైల్‌ కొనుగోలుకు ప్రస్తుతం ఆరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఫిలిప్పైన్స్‌ దేశం ఇప్పటికే ఈ మిసైల్‌లను కొనుగోలు చేసి తన సైన్యానికి అప్పగించింది. వియత్నాం,ఇండోనేషియా దేశాలు ఆర్డర్లు ఇచ్చి, అవసరమైన చెల్లింపులు కూడా పూర్తి చేశాయి. ఇది భారతదేశం అధునాతన ఆయుధ సాంకేతికతపై విశ్వాసాన్ని సూచిస్తోంది. కొత్తగా సౌదీ అరేబియా, దుబాయ్, ఈజిప్ట్, థాయ్‌లాండ్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలు కూడా భారత ఆయుధాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌ భారతదేశం అభివృద్ధి చేసిన అకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను కావాలని కోరుతోంది. అంతేకాకుండా బ్రహ్మోస్‌ మిసైల్‌పై కూడా వారి ఆసక్తి ఉంది.

లాటిన్‌ అమెరికా దేశాల ఆసక్తి..
లాటిన్‌ అమెరికాలోని వివిధ దేశాలు కూడా బ్రహ్మోస్‌ మిసైల్‌ కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. ఇది భారతదేశం రక్షణ ఉత్పత్తులు ఆసియా, ఇతర ఖండాల్లోనూ ప్రాచుర్యం పొందుతున్నాయని చూపిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ వంటి విజయవంతమైన సైనిక చర్యలు భారత సామర్థ్యాలను ప్రపంచానికి నిరూపించాయి. ఫలితంగా, దేశాలు ఇప్పుడు సంప్రదాయిక సరఫరాదారులపై ఆధారపడకుండా భారతదేశాన్ని ఎంచుకుంటున్నాయి. అమెరికా, చైనా వంటి ప్రపంచ శక్తులకు ఇది ఒక షాక్‌గా మారింది. భారతదేశం ఇప్పుడు వారి ప్రభావ రంగాల్లో కూడా ఆయుధాల సరఫరాదారుగా ఎదుగుతోంది. ఇది భారతదేశ విదేశాంగ విధానం, రక్షణ ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ఆత్మనిర్భర భారత్‌ కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని ఇది నిరూపిస్తోంది.

భవిష్యత్తులో భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు మరింత పెరగవచ్చు. ఇది ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది. ఈ ఆసక్తి భారతదేశాన్ని ప్రపంచ రక్షణ మార్కెట్‌లో ఒక ముఖ్యమైన ఆటగాడిగా మార్చే అవకాశం ఉంది.

రాజధాని కోసం విజయసాయిరెడ్డి పెద్ద స్కెచ్చే

Vijaya Sai Reddy
Vijaya Sai Reddy

Vijayasai Reddy: రాజకీయాల్లో కొంతమంది వింత ప్రవర్తనతో ముందుకు వెళుతుంటారు. వారి అంతిమ లక్ష్యం ఒకటి ఉంటుంది. వారి మనసులో ఒకటి ఉంటుంది. బయటకు మాత్రం మరో మాట చెబుతుంటారు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూనే ఆయన అభిప్రాయంతో ఏకీభవించినంత పని చేస్తున్నారు. ఆయన కోరిన విధంగానే సరికొత్త డిమాండ్ తో ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాజాగా మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టు అని తేల్చేశారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించారు విజయసాయిరెడ్డి. మావిగన్ పై చిన్న పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే.. అమరావతి పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు.

* అమరావతి పై అదే విషం
అమరావతి పై మరోసారి విషం కక్కారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర విభజన జరిగి 15 ఏళ్లు అవుతున్న ఇంకా రాజధానిపై రగడ ఎందుకు అంటూ పెద్దన్న మాటలు అన్నారు. అంతటితో ఆగకుండా మావిగన్ జగన్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ.. విజయవాడ- గుంటూరు- తెనాలి- మంగళగిరి అనే వి జి టి యం కాన్సెప్ట్ విభజన చట్టంలోనే ఉందని.. శివరామకృష్ణ కమిషన్ ఇదే చెప్పిందని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం – విజయవాడ- గుంటూరును కలుపుతూ మావిగన్ అని చెబితే.. వాటికి అదనంగా మంగళగిరిని చేర్చి గొప్ప సలహా ఇచ్చేసారు విజయసాయిరెడ్డి.

* అప్పుడు మాట్లాడకుండా..
విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. అమరావతి ఏకాభిప్రాయంతో నిర్ణయించినప్పుడు కూడా అదే వైసీపీలో.. అదే స్థానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నారు. కానీ ఎన్నడు రాజధానుల విషయంలో సలహా ఇవ్వలేదు. తప్పు పట్టే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మాత్రం తన మేధావితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దానిపై కోర్టుకు ఆశ్రయిస్తానని కూడా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెబితే.. దానికి మంగళగిరి చేర్చి.. నగరాలను విస్తరించాలని సూచిస్తున్నారు. అదే ఆటోమేటిక్గా రాజధాని అయిపోతుందని విలువైన సలహా ఇచ్చేస్తున్నారు ఈ మేధావి విజయసాయిరెడ్డి.

వైసీపీలో ఆ ఫ్యామిలీ ఫుల్ సైలెన్స్!

Peddireddy Family
Peddireddy Family

Peddireddy Family: గత కొంతకాలంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్ గా సైలెంట్ గా ఉంది. అయితే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలవలేదు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. కానీ తరువాత అటువంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంట్లో గట్టిగానే మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై. కానీ ఇటీవల క్షేత్రస్థాయిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ, వైసీపీలో యాక్టివ్గా కనిపించడం లేదు. తాడేపల్లి కార్యాలయంలో సైతం పెద్దగా జాడలేదు. ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. ఒకానొక దశలో ఆ ఫ్యామిలీ బిజెపిలో చేరుతుందన్న ప్రచారం కూడా నడిచింది. కానీ అందులో వాస్తవం లేకపోవచ్చు కానీ.. ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న మాట మాత్రం వాస్తవం. జగన్ వెంట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేకపోవడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

* పలకరించని జగన్..
మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. చాలా రోజులపాటు ఆయన జైల్లోనే ఉండిపోయారు. అయితే విజయవాడతో పాటు వివిధ నగరాల్లో జైల్లో ఉండే వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించేవారు. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం దూరంగా ఉండిపోయారు. మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజమండ్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో సంఘీభావం కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి రాకపోవడం ఆ ఫ్యామిలీలో అసంతృప్తికి కారణంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం తాము ఎంతగానో కృషి చేస్తే.. తాము కష్టంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అండగా నిలవకపోవడంపై వారు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారు బెయిల్ పై బయటకు వచ్చాక నేరుగా జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కానీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మాత్రం అలా కలవలేదు. దీంతో అప్పట్లోనే తెగ ప్రచారం నడిచింది ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉందని.

* చుట్టూ కేసులు..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ కూడా అనేక కేసులు తిరుగుతున్నాయి. వివాదాలు నడుస్తున్నాయి. పైగా కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి పై దూకుడు మీద ఉంది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. సీనియర్ మంత్రిగా ఉండేవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమ రాజకీయాలు ఆయన కనుసన్నల్లో నడిచేవి. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు చంద్రబాబును సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా పెద్దిరెడ్డి పెద్ద ప్రయత్నాలు చేశారు. హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు చాలా రకాల విన్యాసాలు చేశారు. అప్పట్లో రాయలసీమ నుంచి పిఠాపురం నియోజకవర్గానికి మనుషులను తెప్పించారని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇంతలా అప్పట్లో రాజకీయాలను ప్రభావితం చేశారు ఆ తండ్రి కొడుకులు. అందుకే ఇప్పుడు కూటమికి టార్గెట్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం అంతగా ఆదరణ దక్కకపోవడంతో వారు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పరు కానీ.. వారు మాత్రం అసంతృప్తితో ఉన్నారన్నది మాత్రం వైసిపి వర్గాల్లో వినిపిస్తున్న మాట.

మూవీ లవర్స్ కి 'మా ఇంటి బంగారం' మేకర్స్ బంపర్ ఆఫర్.. టికెట్ రేట్స్ ఇంతకీ తగ్గించారో తెలుసా..

Maa Inti Bangaram
Maa Inti Bangaram

Maa Inti Bangaram: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు చాలా స్టడీ గా ఉన్నాయి. ఈ రేంజ్ లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు మాత్రమే కాదు , మూవీ టీం కూడా ఊహించలేదు. వీకెండ్స్ లో మంచి వసూళ్లు నమోదు అవ్వడం సహజమే. కానీ ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ లాంగ్ రన్ ని చూసి ఎన్నేళ్లు అయ్యిందో. 2 వారాల్లో 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఈరోజు ఏకంగా 3 కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ఒకవేళ అవి క్లిక్ అయితే ‘మా ఇంటి బంగారం’ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందేమో అని ముందు జాగ్రత్తతో ఈ సినిమా టికెట్ రేట్స్ ని బాగా తగ్గించేశారు. సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 100 రూపాయలకు ఈ చిత్రాన్ని చూడొచ్చు , అదే విధంగా మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ ధర కేవలం 180 రూపాయిలు మాత్రమేనట. ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్న ఈ చిత్రానికి, వాళ్ళని మరింత ఆకర్షించేందుకు ఇలా టికెట్ రేట్స్ తగ్గించడం అనేది చాలా మంచి స్ట్రాటజీ. ఇక ఈరోజు విడుదలైన మూడు సినిమాలకు ఆడియన్స్ నుండి , క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ రాలేదు కాబట్టి, మూవీ లవర్స్ కి ఈ వారం కూడా ‘మా ఇంటి బంగారం’ చిత్రమే ఏకైక ఛాయస్. అందుకే ఈ చిత్రం కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరోపక్క ఈ సినిమా కలెక్షన్స్ కి మరింత బూస్ట్ ఇచ్చేలా మూవీ టీం స్పెషల్ ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉంటోంది. రీసెంట్ గా ఈ మూవీ టీం ఇచ్చినటువంటి సక్సెస్ మీట్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. జులై 10 న విడుదలయ్యే లెనిన్ వరకు ఎలాంటి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి , ‘మా ఇంటి బంగారం’ మూవీ లాంగ్ రన్ ఈ పది రోజులు చాలా గట్టిగ ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే న్యూస్..ఇకపై ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉండబోతుందంటే..

Telugu States Internet Speed
Telugu States Internet Speed

Telugu States Internet Speed: నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోతోంది. క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి.. దీంతో ఇంటర్నెట్ వాడకం గతంతో పోల్చి చూస్తే కొన్ని వందల రెట్లు పెరిగింది. స్మార్ట్ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు రావడం.. ఇంటర్నెట్ ఆధారంగానే మనిషి మనుగడ సాగిపోతు ఉండడం.. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడంతో.. అంతర్జాలం మీద ఆధారపడడం పెరిగిపోతోంది.

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతే సహజంగానే కేబుల్స్ మీద ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. మనకు శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ వస్తున్నప్పటికీ.. కేబుల్స్ ద్వారానే ఆయా దేశాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది.. సముద్రాలలో ఇప్పటికే అత్యంత కీలకమైన కేబుల్ అమర్చారు. వాటి ద్వారానే ప్రపంచానికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు కూడా వేగంగా ఇంటర్నెట్ వాడు ఎందుకు ఈ కేబుల్స్ తోడ్పడుతున్నాయి.

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో కేబుల్ మీద ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి అడుగులు పడుతున్నాయి.. ఇంటర్నెట్ ఆధారంగా అన్ని పనులు సాగుతున్న నేపథ్యంలో.. కేబుల్ వ్యవస్థను మరింత పటిష్టం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే మన దేశం తూర్పు తీరాన్ని ఆగ్నేయ ఆసియాతో కలిపే పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అత్తిపెద్దదైన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవస్థకు సింగపూర్ లోని లైట్ స్మార్ట్ సంస్థ.. మైక్రోసాఫ్ట్.. సింగ్ టెల్.. టాటా కమ్యూనికేషన్ వంటి సంస్థలతో ఏర్పాటైన కన్సర్షియం ఐ 2 సి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. సుమారు 3600 కిలోమీటర్ల పొడవుతో ఈ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేబుల్ మచిలీపట్నం.. దక్షిణ చెన్నై.. సింగపూర్.. మలేషియాను కలిపేస్తుంది.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న కేబుల్ వ్యవస్థ పాతది.. కొత్త కేబుల్ వ్యవస్థకు హై పెర్ఫార్మన్స్ కంప్యూటింగ్ వంటి వాటిని జత చేశారు. ఇది భవిష్యత్ అవసరాలను సులభంగా తీర్చగలుగుతుంది.. అత్యంత వేగంగా డేటా కనెక్టివిటీ అందిస్తుంది. ఇప్పుడున్న వేగంతో పోల్చి చూస్తే 15% అధికంగా స్పీడ్ ఉంటుంది.

ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం గతంలో ముంబై పశ్చిమ తీర నగరాల్లోనే ల్యాండ్ అయి ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం.. ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం సాగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు ఎంచుకున్నారు. అందువల్లే తూర్పు తీర ప్రాంతంలోని మచిలీపట్నం నుంచి హైదరాబాద్ నగరానికి.. అక్కడ నుంచి ముంబై నగరానికి నూతన భూగర్భ ఫైబర్ మార్గాలను ఏర్పాటు చేయబోతున్నారు.

'బిగ్ బాస్ 10' ఆఫర్ ని రిజెక్ట్ చేసిన క్రేజీ యంగ్ హీరోయిన్.. ఆమె ద్రుష్టి దానిపైనే అట..

Naga Durga
Naga Durga

Naga Durga: ఇండస్ట్రీ లోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న సెలబ్రిటీలకు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అనేది ఒక మంచి ప్లాట్ ఫార్మ్. ఈ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వొచ్చు , వచ్చిన ఫేమ్ తో సినిమా అవకాశాలు కూడా సంపాదించొచ్చు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి , మధ్యలో భారీ గ్యాప్ ఇచ్చి , మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే సెలబ్రిటీలకు కూడా ఇదొక మంచి ప్లాట్ ఫార్మ్. అందుకు బెస్ట్ ఉదాహరణ శివాజీ నే. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అలాంటి బిగ్ బాస్ ఆఫర్ ని ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించని ఒక యంగ్ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు , నాగ దుర్గ.

తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ గా నాగ దుర్గ కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో ఈమె పాటలకు వందల మిలియన్ల సంఖ్యలో వ్యూస్ , లైక్స్ వస్తుంటాయి. అలా వచ్చిన ఫేమ్ తో రీసెంట్ గానే ఈమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శి హీరో గా , సుకుమార్ , బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్న ‘ఇడుపుకాగితం ‘ అనే చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. అంతే కాదు టైటిల్ పెద్ద వివాదాలకు కూడా తెరలేపింది. అదే విధంగా ఈమె తమిళం లో హీరో ధనుష్ మేనల్లుడు హీరో గా నటిస్తున్న ‘లవ్ ఓ లవ్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నగదుర్గాకు రీసెంట్ గా ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనమని ఆఫర్ వచ్చిందట.

రెమ్యూనరేషన్ కూడా భారీ లెవెల్ లోనే ఆఫర్ చేశారట. కానీ ఈమె మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ రియాలిటీ షో కి సెట్ అయ్యే మనస్తత్వం కాదు నాది. నేను చాలా సైలెంట్ గా ఉండే అమ్మాయిని. మొహమాటం బాగా ఎక్కువ , అంత తేలికగా నేను మనుషులతో కలిసిపోలేను. ఏ విషయం లో అయినా ఎదుటి వ్యక్తికీ నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను. ఎదుటి వ్యక్తులను బాధపెట్టడం ఇష్టం లేక , నాకు ఏదైనా నచ్చకపోతే ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. నా తల్లిదండ్రులకు బిగ్ బాస్ ఆఫర్ గురించి చెప్పగా, ప్రతీ చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోయే నీకు , ఈ షో అసలు సూట్ అవ్వదని , అక్కడి పరిస్థితులను నువ్వు తట్టుకోలేవని చెప్పారు. కానీ నా తండ్రి మాత్రం , ఆ షోలో కనీసం రెండు మూడు వారాలైనా ఉంటే ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గర అవుతావు అన్నారు. వాళ్లిద్దరూ ఇచ్చిన సూచనలు తీసుకొని బాగా ఆలోచించిన తర్వాత , ప్రస్తుతానికి నా ఫోకస్ సినిమాల మీద మాత్రమే ఉంచాలని నిర్ణయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది నాగదుర్గ .

పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు.. సియాకు ఇంకా బుద్ధి రాలేదు

Siya
Siya

Siya: దేశవ్యాప్తంగా పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ కేసు సంబంధించి ఏదో ఒక విషయం మీడియా ద్వారా వెలుగులోకి వస్తూనే ఉంది. పోలీసులు లీకులు ఇవ్వడంతో సంచలన నిజాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను సంపాదించింది. వాంగ్మూలాలు సేకరించింది. సీన్ రిక్రియేషన్ కూడా చేసింది. ఈ హత్యలు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా.. ఆమె ప్రియుడు చేతన్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం వేరువేరుగా విచారించింది. వారి దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించింది.

ఈ కేసు తీవ్రత అధికంగా ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో విచారణ సాగిస్తోంది. ఈ విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ కేసు కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలను దర్యాప్తు బృందం అధికారులు బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. కేతన్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న అతడికి కాబోయే భార్య సియా వ్యవహార శైలి తెరపైకి వచ్చింది.

అధికారులు విచారిస్తున్నప్పుడు సీఎం ప్రవర్తన ఏమాత్రం బాగోలేదట. పోలీసులు ఆమెను విచారణలో భాగంగా ఇంటికి తీసుకెళ్తుండగా.. మీడియా ప్రతినిధులను ఆమె చూసింది. మధ్య వేలును చూపించుకుంటూ అహంకారంతో వ్యవహరించింది. కాబోయే భర్తను పొట్టన పెట్టుకున్నప్పటికీ ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆమె వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మిడిల్ ఫింగర్ చూసిన తీరు పట్ల ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. సియా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ముందుకు వెళుతుండగా.. దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి.

సియా ఈ తప్పు చేసిందని తాము నమ్మడం లేదని మొన్నటిదాకా తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అనేక ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా లభించడంతో వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏ కోట నుంచి అయితే కేతన్ ను తోసివేసి చంపిందో.. ఒకవేళ తప్పు చేస్తే తన కూతురికి కూడా అలాంటి శిక్ష విధించాలని ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు సియా ను విచారించిన పోలీసులు ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. గంటల తరబడి విచారించిన తర్వాత కీలక విషయాలను తెలుసుకున్నారు.

సీఎం విజయ్ -త్రిషపై దారుణ కామెంట్స్ .. ఎమ్మెల్యే అరెస్ట్

MLA Anitha Radhakrishnan
MLA Anitha Radhakrishnan

MLA Anitha Radhakrishnan: ప్రజా ప్రతినిధులు బాధ్యతగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలి. అన్నిటికి మించి ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. కనీసం స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తే.. ఆ తర్వాత మర్యాద ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు.

ఆయన పేరు అనితా రాధాకృష్ణన్.. తమిళనాడులో డీఎంకేకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఆయనను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని విషయం ఆయనకు ముందుగానే తెలుసు. అందువల్లే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ వాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు తీసి పక్కనపెట్టింది. దీంతో తమిళనాడు పోలీసులకు లైన్ క్లియర్ అయింది. ఫలితంగా ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దర్జాగా శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.

రాధాకృష్ణన్ కు నోటి దూల ఎక్కువ. అందువల్లే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కనీసం ఆడవాళ్ళకు గౌరవం కూడా ఇవ్వరు. తను ఏం మాట్లాడుతున్నాడు సోయి కూడా ఉండదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, త్రిష ఉద్దేశించి ఓ సభలో దారుణంగా మాట్లాడారు. “విజయ్ రాజకీయాల్లో ఇరుక్కుపోయారు. ఆ విషయంలో ఆయన బాధపడుతూనే ఉంటారు. ఇంట్లో నటి (త్రిష) తో ఎంతో సంతోషంగా ఉండి ఉంటారు. ఇప్పుడు దానిని ఆయన నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకు వచ్చిన రాజకీయాలు అని ఆయన నిత్యం అనుకుంటూనే ఉంటారని” రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను టీవీకే నేతలు తీవ్రంగా స్పందించారు. రాజకీయాలలో వ్యక్తిగత అంశాలను ఎందుకు తీసుకొస్తారని.. వ్యక్తిగత అంశాలను ఎందుకు ప్రస్తావిస్తారని టీవీకే నేతలు ప్రశ్నించారు. మరోవైపు దీనిపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తమిళనాడు పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. నోరు హద్దులలో ఉంటే బాగుంటుంది. అదుపు తప్పితే ఇదిగో ఇలానే జైలు పాలు కావాల్సి వస్తుంది.

'మా ఇంటి బంగారం' పై ప్రశంసల వర్షం కురిపించిన అక్కినేని అఖిల్..వీడియో వైరల్..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా సమంత అతని తమ్ముడు అక్కినేని అఖిల్ తో ఇప్పటికీ మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు ఆమె అఖిల్ ప్రతీ పుట్టినరోజు కి శుభాకాంక్షలు చెప్తూ వచ్చేది. అంతే కాకుండా సమంత కి మయోసిటిస్ వ్యాధి సోకిన కొత్తల్లో , ఆమె త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకోవాలని ఆమె పోస్టుల క్రింద కామెంట్స్ అఖిల్ కామెంట్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గానే సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరబోతోంది. దాంతో సౌత్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు ని నెలకొల్పింది.

ఈ సినిమా విజయం పట్ల సమంత అభిమానులు ఎంత ఆనందంగా ఉన్నారో , మరో పక్క ఆమెతో స్నేహం చేసే సినీ సెలబ్రిటీలు కూడా అంతే ఆనందంగా ఉన్నారు. సోషల్ మీడియా సాక్షిగా వీళ్లంతా శుభాకాంక్షలు కూడా తెలిపారు. వారిలో ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా చేరిపోయారు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అఖిల్ నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రస్తావన తీసుకొని రాగా అఖిల్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘లెనిన్ మూవీ విడుదల హడావిడి లో ఉండడం వల్ల ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని చూడలేకపోయాను. కానీ నేను ట్రైలర్ చూసాను , చాలా నచ్చింది. ముఖ్యంగా ఆ చిత్రం లోని వైబ్ కి నీకు ప్రత్యేకంగా ఆకర్షితుడిని అయ్యాను. ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ముందే ఊహించాను. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ సమంత ఆ రేంజ్ యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చాలా గొప్పగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు అఖిల్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అఖిల్ ‘మా ఇంటి బంగారం’ పై ఇంత పాజిటివ్ గా స్పందించారు కాబట్టి , సమంత కూడా ‘లెనిన్’ టీం కి శుభాకాంక్షలు చెప్తూ పోస్టు వేస్తుందా లేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.

నాగబంధం తో ప్రేక్షకులకు యమపాశం!

Nagabandham Movie Review
Nagabandham Movie Review

Nagabandham Movie Review: రివ్యూ: నాగబంధం

నటీనటులు: విరాట్ కర్ణ, నభ నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, రిషభ్ తదితరులు

సంగీత దర్శకులు: అభి – జునైద్ కుమార్

ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్

ఎడిటర్: ఆర్.సి. ప్రణవ్

దర్శకత్వం: అభిషేక్ నామా

నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, NIK స్టూడియోస్

టాలీవుడ్లో ఈమధ్య కాలంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో నాగబంధం ఒకటి. స్టార్ హీరో లేకపోయినా దాదాపు వంద కోట్లకు పైగా బడ్జెట్, ఈమధ్య కాలంలో ట్రెండ్ గా మారిన హిందూ పురాణాల నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రైలర్లతోనే ఈ సినిమా గ్రాండ్ గా ఉండబోతోందని అర్థమైంది. ఈరోజే నాగబంధం ప్రేక్షకులముందుకు వచ్చింది. పెద్ద బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ తో వస్తున్న ఈ సినిమా అదే స్థాయిలో ప్రేక్షకులను థ్రిల్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారు చేస్తున్న పరిశోధనల్లో ఒక అధికారికి హిమాలయాల్లో కాలవృక్షంలో బందీగా ఉన్న బైరాగి(గరుడ రామ్) ఆనే తాంత్రికుడు తారసపడతాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బ్రహ్మ కమలం, దానితో పాటు గరుడ మంత్రాల గ్రంథం సహాయంతో నాగబంధం ద్వారా ఈ ప్రపంచాన్నే తమ చేతుల్లోకి తీసుకోవచ్చనని అలీ(రిషబ్) కు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ లోకాన్ని జయించే మార్గం ఉందని తెలిసిందో అప్పటి నుంచి వాటికోసం వేట మొదలు పెడతాడు అలీ. అందుకోసం ఎంతమందిని చంపడానికైనా, మారణహోమం సృష్టించేందుకైనా వెనుకాడడు. మరోవైపు ఆ పుస్తకం హిమాలయాల్లోనే టెస్లా ఆనే వ్యక్తికి దొరుకుతుంది. అతను ఆ పుస్తకాన్ని పురావస్తు శాఖ అధికారి ప్రభాకర్(జగపతి బాబు) కు అప్పగిస్తాడు. బ్రహ్మకమలం కోసం అలీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డు తగిలే వ్యక్తే మన హీరో రుద్ర(విరాట్ కర్ణ). బ్రహ్మ కమలం-గరుడ మంత్రాల గ్రంథాన్ని చేజిక్కించుకునే ప్రయాణంలో రుద్ర ఎందుకు భాగం అవుతాడు? అసలు రుద్రకు, నాగబంధం కాన్సెప్ట్ కు సంబంధం ఏంటి. చివరికి దుష్టశక్తుల బారిన పడకుండా నాగబంధం పక్షాన రుద్ర జరిపిన పోరాటం ఫలించిందా అనేది తెరపై చూడాలి.

సినిమా హిమాలయాల్లో ఓపెన్ చేసి ఆసక్తికరంగా ఉంటుందనే ఫీల్ కలిగించారు. ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సినిమా సెటప్ ను, థీమ్ ను ఎలివేట్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇవ్వడంతో ఏదో జరగబోతోందని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే ఆ ఆసక్తి మొదటి గంటలోనే ఆవిరైపోతుంది. విజువల్స్ అన్నీ భారీగా ఉన్నా, అఖండ తరహాలో సంగీతం మోత మోగిపోతున్నా పాత్రలతో, వాటి మధ్య ఉన్న డ్రామాతో ఎక్కడా ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. మరోవైపు మితిమీరిన హింస కూడా అవసరమా అనిపిస్తూ ఉంటుంది. విలన్ క్రూరుడు అని చెప్పడానికి ఒకటి రెండు సీక్వెన్సులు సరిపోతాయి కానీ హిందీలో వచ్చిన ‘కిల్’ సినిమా తరహాలో ప్రతి పది నిముషాలకు నరకడమే పనిగా పెట్టుకున్నారు. అది కూడా సినిమా మీద ఆసక్తి తగ్గేలా చేస్తుంది. పాత్రలు బలంగా లేకపోవడం, కథ కంటే టెక్నికల్ అంశాలు హైలైట్ అవుతూ ఉండడంతో అప్పుడప్పుడూ ప్రేక్షకుడు బుర్ర గోక్కునే బదులు ఫోన్ తీసి వాట్సాప్ చెక్ చేసుకుంటే అది వారి తప్పేమీ కాదు. మరోవైపు హీరో – హీరోయిన్ పాత్ర పార్వతి(నభ నటేష్) ట్రాక్ ఎఫెక్టివ్ గా లేదు. సినిమా వయొలెన్స్ ఇంటెన్సిటీలో హీరోయిన్ ట్రాక్ చప్పగా మారింది.

సినిమాలో పెద్ద మైనస్ ఏంటి అంటే విజువల్స్ భారీగా ఉండి కథ, కథనం బలహీనంగా ఉండడం. యాక్షన్ ఎపిసోడ్లు కొన్ని బాగున్నప్పటికీ కొన్ని మాత్రం సాగదీసినట్టు అనిపిస్తాయి. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ వారి వర్క్ కూడా తెరపై గొప్పగా కనిపిస్తుంది. మ్యూజిక్ కూడా సినిమా థీమ్ కు తగ్గట్టు సీన్స్ ను ఎలివేట్ చేసింది. సాంగ్స్ మాత్రం గొప్పగా లేవు. రైటింగ్, డైరెక్షన్ వీక్ గా ఉండడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. ఈ సినిమాకు మూడు గంటలకు పైగా నిడివి అవసరం లేదు. ఎడిటర్ మరో అరగంట తగ్గించినా పెద్ద ప్రమాదం ఏమీ ఉండేది కాదు. సినిమాలో వీఎఫ్ యక్స్ కొన్ని చోట్ల తేలిపోయింది కానీ ఎక్కువ భాగం బాగుంది. నిజానికి అవసరం లేని చోట్ల కూడా VFX ను వాడినట్టు కనిపిస్తుంది.

రుద్ర పాత్ర పోషించిన విరాట్ కర్ణ కష్టం తెరపై కనిపించింది. నాగ సాధువుగా లుక్ చాలా బాగుంది, నటన కూడా ఇంప్రెసివ్ గా ఉంది. నభ నటేష్ యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. విలన్ పాత్ర పోషించిన రిషబ్, జగపతి బాబు, మురళి శర్మ, మహేష్ మంజ్రేకర్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. గ్రాండ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ.
2. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్.
3. ఇంటర్వెల్ ఎపిసోడ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.

సినిమాలో బాగలేనివి ఇవి:

1. నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే, వీక్ డైరెక్షన్
2. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం.
3. బలహీనమైన సెకండాఫ్, ఊహించదగ్గ ట్విస్టులు.

రేటింగ్: 2/5

ఫైనల్ వర్డ్: A’ఖండ’