Home Blog Page 306

Trisha Vijay Controversy: విజయ్ గెలిస్తే త్రిషను ఎందుకు అభినందిస్తున్నారు.. ఈ నటి అడిగిన దాంట్లో న్యాయం ఉంది..

Trisha Vijay Controversy: తమిళనాడు రాష్ట్రానికి విజయ్ సీఎం అవుతారా.. లేదా అనే విషయాలను పక్కన పెడితే.. ఇప్పటికీ అక్కడి రాజకీయాలకు త్రిషతో సంబంధం పెడుతూ చాలామంది మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిష మీద అడ్డంగా నోరు పారేసుకున్నాడు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తన మాటలను వెనక్కి తీసుకున్నారు.

ఇటీవల తమిళనాడు ఎన్నికల సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో విజయ్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది.. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి త్రిష వెళ్లారు. గంటన్నర సేపు అక్కడే ఉన్నారు. అంతకుముందు ఆమె తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి వెళ్లారు. అక్కడ స్వామివారి సేవలో పాల్గొని.. ప్రసాదాన్ని తీసుకొచ్చి విజయ్ కి అందించారు.. ఈ పరిణామం తర్వాత త్రిషకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతకంటే ముందు త్రిష తో విజయ్ కి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి.. దీనిపై విజయ్ మాట్లాడలేదు. త్రిష కూడా స్పందించలేదు. అయితే విడాకుల కేసును కోర్టులో దాఖలు చేసే ముందు విజయ్ భార్య అందులో తన భర్తకు మరో మహిళకు సంబంధం ఉందని పేర్కొంది.

ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ అనేక మీడియా సంస్థలు ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేశాయి. ఇప్పటికి చేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఇటువంటి వ్యవహారాలపై మాట్లాడే విషయంలో సెలబ్రిటీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ అటువంటి సోయి నేటి కాలంలో సెలబ్రిటీలకు లేకుండా పోయింది. విజయ్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించగానే.. చాలామంది సినీ నటులు త్రిషకు శుభాకాంక్షలు చెప్పారు. ఎవరైనా సరే జన్మదినం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాకపోతే విజయ్, త్రిష రిలేషన్ అధికారికంగా కొనసాగుతుందనే అర్థం వచ్చేలా సెలబ్రిటీలు ఆమెకు గ్రీటింగ్స్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని తమిళనటి గాయత్రి శంకర్ తప్పు పట్టారు.

తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత హీరోయిన్ త్రిషను అభినందిస్తున్న వారిపై గాయత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.” ఒకవేళ త్రిష స్థానంలో ఇంకో పురుషుడు గనుక ఉండి ఉంటే ఇలానే ఈ సమాజం అంగీకరిస్తుందా.. తన తోటి నటుడితో సంబంధం పెట్టుకొని.. కుటుంబాన్ని విడదీస్తే ఏ సమాజం మాత్రం ఒప్పుకుంటుంది.. మగాళ్లు మొత్తం తీవ్రమైన కోపంతో రగిలిపోయేవారు. గెలవడం అనే విషయాన్ని పక్కన పెట్టండి.. కనీసం ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు కూడా ఆమె భయపడేదని” గాయత్రి ఆరోపించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరో రకమైన చర్చకు దారితీస్తున్నాయి.

Pawan Kalyan: పవన్ కు పిఠాపురం శాశ్వతం

Pawan Kalyan: రాష్ట్రస్థాయి నాయకులకు శాశ్వతంగా కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో నేతలకు తిరుగు ఉండదు కూడా. ఏపీ సీఎం చంద్రబాబుకు కుప్పం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గాలు అనేవి శాశ్వతం. అక్కడ గెలుపు బాటలకు శాశ్వత పునాదులు ఏర్పాటు చేసుకుంటారు నేతలు. రాజకీయ ప్రారంభ సమయంలో చంద్రబాబు చంద్రగిరి నుంచి బరిలో దిగారు. 1989 నుంచి మాత్రం కుప్పం నియోజకవర్గానికి మారి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం పులివెందుల లో మాత్రమే పోటీ చేస్తూ వచ్చారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చేసింది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. అయితే ఇప్పుడు అటువంటి కంచుకోటగా పిఠాపురం నియోజకవర్గాన్ని మలుచుకోవాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ అభివృద్ధి తో ప్రజల మనసును గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఆ విషయంలో కొంతవరకు వర్కౌట్ అయ్యారు కూడా.

* రాజకీయ అడ్డంకి..
మరోవైపు పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో టిడిపి వర్మ ఒక అడ్డంకి. ఎందుకంటే వర్మ బలమైన నాయకుడు కూడా. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఆయనది. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఈ సీటును కోరుకున్నారు. అప్పుడు కూడా వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి తన ప్రభావాన్ని చూపుతారన్న వార్తలు వచ్చాయి కానీ చంద్రబాబు సముదాయించడంతో ఆయన మెత్తబడి పవన్ కళ్యాణ్ కు సహకరించారు. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం టిడిపి మార్కు చాటాలని చూశారు పిఠాపురంలో. అయితే దీనికి టిడిపి హై కమాండ్ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. ఇప్పుడు ఏకంగా టిడిపి ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించారు వర్మను. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ముందు చూపుతో వ్యవహరించింది అని అందరికీ తెలిసిన విషయమే. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వర్మను టిడిపి హై కమాండ్ పక్కన పెట్టింది. పిఠాపురం ను పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశం.

* శాశ్వత ఇంటి నిర్మాణం..
పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణం జరుపుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడే భూమి కొని కార్యాలయం తో పాటు సొంత ఇల్లు నిర్మించుకునే పనిలో పడ్డారు. పవన్ వచ్చిన తర్వాత పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కు కళ వచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మాత్రమే పిఠాపురం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఎక్కువ మంది భావిస్తున్నారు. కచ్చితంగా ఆ నియోజకవర్గం కంచుకోటగా మారనుంది. కానీ ఇందుకు అడ్డంకి గా ఉన్న వర్మను సైడ్ చేశారు. తప్పకుండా ఆయనకు సైతం వేరే పొలిటికల్ ఆప్షన్ ఇస్తారు. కూటమితో పాటు టిడిపి పరంగా పవన్ కళ్యాణ్ కు క్లియరెన్స్ ఇచ్చినట్టే.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సాహస నిర్ణయం

Pawan Kalyan: జనసేన బలోపేతం పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు ఇన్చార్జులు, అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని.. పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేయనున్నారు. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కార్యాలయానికి రావడం లేదు పవన్ కళ్యాణ్. కానీ 175 నియోజకవర్గాలకు ఇన్చార్జిలతో పాటు అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని చూస్తున్నారు. జాబితాలను తెప్పించుకుని నేతల సీనియారిటీ, సిన్సియారిటీని పరిశీలిస్తున్నారు.

* సంస్థాగతంగా బలోపేతం..
జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నికల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచారు. మరో రెండు పార్లమెంటు సీట్లను సైతం కైవసం చేసుకున్నారు. అయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు తాత్కాలికంగా ఇన్చార్జిలు కొనసాగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బహుముఖ నాయకత్వం ఉంది. వారు ఏకతాటిపైకి రావడం లేదు. అందుకే ఇన్చార్జిలను నియమించి వారి పరిధిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది మరోవైపు జిల్లాల అధ్యక్షులు నియామకానికి సంబంధించి సామాజిక సమీకరణలను పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం బలంగా ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా ఈసారి రాయలసీమపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అక్కడ 54 నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఇన్చార్జిలను నియమించడం ద్వారా.. పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.

* స్థానిక సంస్థలపై గురి..
స్థానిక సంస్థల్లో సింహభాగం పొందాలన్నది కూడా ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఈసారి జిల్లాలు పెరిగాయి. జిల్లా పరిషత్ స్థానాలు పెరగనున్నాయి. ఆపై 12 కార్పొరేషన్లతో పాటు 100కు పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. తప్పకుండా అందులో చాలా వరకు జనసేన తీసుకోవాలని చూస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తుంటే నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో బాధ్యులు లేరు. పార్టీ జిల్లా అధ్యక్షులు సైతం నామమాత్రంగానే ఉన్నారు. అందుకే ఏకకాలంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలతో పాటు జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలను సైతం ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకొని క్రోడీకరిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ నియామకాలపై ప్రత్యేక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Pakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్ లో బోర్డు తిప్పేస్తున్నారు.. దాయాది ’దుకాణం‘ బంద్

Pakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్‌ అనుసరిస్తున్న విధానాలతో అక్కడి కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా చాలా సంస్థలు మూతపడ్డాయి. ఉగ్రవాదులను పెంచి పోషించడం, ఆఫ్గానిస్తాన్, భారత్‌తో గొడవలు పెట్టుకోవడం, స్థానిక రాజకీయ అస్థిరత తదితర కారణాలతో చాలా ప్రముఖ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన హ్యాంగెంగ్‌ ట్రేడ్‌ కంపెనీ గ్వాదర్‌లోని డాంకీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను మూసివేసింది. ఇరకరడ గాడిదల చర్మాలు, మాంసం చైనాకు ఎగుమతి చేస్తుంది.

కంపెనీ నేపథ్యం
హ్యాంగెంగ్‌ ట్రేడ్‌ 2023లో గ్వాదర్‌ నార్త్‌ ఫ్రీ జోన్‌లో స్థాపించబడింది. చైనా–పాక్‌ ఒప్పందం ప్రకారం ఏటా 2–3 లక్షల గాడిదల చర్మాలు, మాంసం సరఫరా చేయాలి. చైనాలో ఎజియావ్‌ (గాడిద చర్మం)కు డిమాండ్‌ ఎక్కువ.

భారీగా పెట్టుబడి..
50 మిలియన్‌ యువాన్లు (సుమారు 7 మిలియన్‌ ్ఖ ఈ) పెట్టుబడి. అధునాతన స్లాటర్‌హౌస్, 50 కంటైనర్లు/నెల ఎగుమతి లక్ష్యం. గాడిదలు చంపి చర్మాలు శుద్ధి, మాంసం ప్రీజ్‌ చేసి రసాయనాలు కలిపి ఎగుమతి.

మూసివేత కారణాలు
‘నాన్‌–కమర్షియల్‌ ఫ్యాక్టర్లు‘, ఎగుమతి ఆలస్యాలు, అధికారుల సహకారం లేకపోవడం. 3 నెలలు చర్చలు ఫలం కాలేదు. అధికారులు ఇబ్బంది పెడుతుండడంతో మే 1న కంపెనీని చైనా మూసివేసింది. బలూచిస్తాన్‌లో అల్లర్లు, బీఎల్‌ఏ దాడులు కూడా ఇందుకు ఓ కారణం. ఇది చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో కీలకం.

బతిమిలాడుతున్న పాకిస్తాన్‌..
పాక్‌ ప్రధాని షెహ్బాజ్‌ షరీఫ్‌ కార్యాలయం జోక్యం చేసుకుని కంపెనీ మూసివేయొద్దని చైనాను వేడుకుంటోంది. ఏం కావాలన్నా ఇస్తామని కంపెనీ మాత్రం మూసివేద్దని బతిమిలాడుతోంది. ‘చైనా స్నేహితుడు‘ అని ప్రశంసించింది. కంపెనీ మూత పడితే దేశం పరువు పోతుందని ఆందోళన చెందుతోంది.

కంపెనీ మూతపడడం చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు తీవ్ర దెబ్బ, చైనా పెట్టుబదులకు ఆందోళన. పాక్‌ బ్యూరోక్రసీ సమస్యలు, భద్రతా కొరతలు బయటపడ్డాయి. గాడిదల సంఖ్య తగ్గుతున్నా ఒప్పందం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చైనా పెట్టుబదులను ఆపవచ్చు.

Venkatrami Reddy Controversy: ఉద్యోగము లేదు.. జగన్ ఆదరణ లేదు.. పాపం వెంకట్రామిరెడ్డి

Venkatrami Reddy Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగులు వ్యతిరేకం అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి గా పని చేసేవారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికంటే ఎక్కువగా విధేయత చూపేవారు జగన్మోహన్ రెడ్డి పట్ల. ఐదేళ్లపాటు ఒక వెలుగు వెలిగారు ఆయన. కూటమి వచ్చిన తర్వాత కూడా అదే చేష్టలతో ముందుకు వెళ్లారు. అందుకే ఇప్పుడు కూటమి న్యాయపరంగా, సాంకేతికంగా.. పక్కాగా ఆధారాలను సేకరించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. అయితే అప్పటివరకు తనను తాను ఓ స్థాయిలో ఊహించుకున్న వెంకట్రామిరెడ్డి.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో భరోసా లేక.. న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందాలని చూస్తున్నారు. కానీ కూటమి అన్ని ఆధారాలు చూపించడంతో అక్కడ కూడా వర్కౌట్ కావడం లేదు.

* పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్..
ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న వెంకట్రామిరెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పని ఏంటి? అక్కడకు వెళ్లి తరచు మీడియాతో మాట్లాడిన పాత వీడియోలు ఇప్పుడు కోర్టు దృష్టికి వెళ్లడంతో ఆయనకు అక్కడ తగిన రీతిలో సానుకూలత రావడం లేదు. దీంతో ఉద్యోగం కోల్పోయి.. కోర్టుల్లో ఊరట దక్కక ఆయన పడుకున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు కీలకమైన పోస్ట్ దక్కుతుందని ఎంతో ఆశపడ్డారు వెంకట్రామిరెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అంత సీన్ లేదన్నట్టు వదిలేసినట్లు ప్రచారం నడుస్తోంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వారు ఆయనకు ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. అయినా సరే పక్కా ఆధారాలు ఉండడంతో కోర్టులు కూడా పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు.

* ముఖం చాటేసిన జగన్..
సాధారణంగా ఏదైనా ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘం నేతలకు ఆ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. కానీ వెంకట్రామిరెడ్డి విషయంలో భిన్నం కనిపిస్తోంది. వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లు పెట్టేందుకు ఓకే కానీ.. పెద్ద పెద్ద పదవులు అంటే మాత్రం నో ఛాన్స్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నుంచి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఉన్న ఉద్యోగము పోయి.. న్యాయస్థానాల్లో ఊరట దక్కక.. వెంకట్రామిరెడ్డి పడుతున్న బాధ.. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం చేయాలనుకున్న వారికి ఒక గుణపాఠమే…

PMJ Jewelry Robbery: పీఎంజే దోపిడీ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి..

PMJ Jewelry Robbery: కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. చోరీ జరిగి ఐదు రోజులైనా దొంగలను పట్టుకోలేదు. కానీ కీలక ఆధారాలను మాత్రం సేకరించారు. ఈ చోరీ తర్వాత పోలీసులు, అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది పోలీసులపై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఈ భారీ దోపిడీ ఒక్కసారిగా తెలంగాణ పోలీసుల అవగాహనను మార్చేసింది. కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో ఈ సంఘటన వెనుక బిహార్‌ మూలాలు కలిగిన ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ’గోల్డ్‌ థీఫ్‌’ గ్యాంగ్‌ ఉందని పోలీసులు నిర్ధారించారు.

గ్యాంగ్‌ క్రెంు చరిత్ర..
ఈ ముఠా ఉత్తరప్రదేశ్‌లో అనేక కిడ్నాపింగ్‌ కేసుల్లో చిక్కుకుంది. వారు ధనవంతులను లక్ష్యంగా చేసుకుని డబ్బు వసూళ్లు చేసి, బంగారు దోపిడీల వైపు మళ్లారు. బిహార్‌ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వీరు ధర్మపురి, పెద్దపల్లి ప్రాంతాల్లో లాడ్జీలు బుక్‌ చేసుకుని వారం రోజులు రెక్కీ నిర్వహించారు. గ్యాంగ్‌ లీడర్‌ గతంలో జైలు శిక్ష అనుభవించాడని సమాచారం. వారి నెట్‌వర్క్‌ దక్షిణ భారతదేశంలో విస్తరిస్తోంది.

సినిమా ఫక్కీలతో పోలీసులను మోసం..
దోపిడీ తర్వాత స్థానిక సినిమా ఫక్కీల్లో తమ ఆధారాలు వదిలి వెళ్లారు. ఇది పోలీసుల దృష్టిని స్థానికుల వైపు తిప్పడానికి వ్యూహాత్మక చర్య. ఫోరెన్సిక్‌ టీమ్‌ ఈ ఆధారాల నుంచి డీఎన్‌ఏ, మొబైల్‌ ట్రాకింగ్‌ ద్వారా గ్యాంగ్‌ను గుర్తించింది. ఈ టెక్నిక్‌ వారి సంక్లిష్ట ’రెడ్‌ హెర్రింగ్‌’ వ్యూహం భాగం.

దేశవ్యాప్త అలర్ట్‌..
కరీంనగర్‌ పోలీసులు, బిహార్, ఉత్తరప్రదేశ్‌ పోలీసులతో కోఆర్డినేట్‌ అవుతున్నారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు. డ్రోన్‌లు, ఏఐ టూల్స్‌తో గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు వాహనాలు సీజ్‌ చేశారు. పోలీసు అధికారి ప్రకారం, 48 గంటల్లోపు అరెస్టులు జరుగుతాయి.

గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి గ్యాంగ్‌ దోపిడీ చేసింది. దక్షిణ భారతదేశంలో బిహార్‌ ముఠాలు 30 శాతం పెరిగాయి. ఆర్థిక పురోగతితో జ్యువెలరీ లక్ష్యాలు ఎక్కువవుతున్నాయి.

Indian T20 Team Changes: IPL తర్వాత టీ20 జట్టులో పెను మార్పులు.. సూర్య కుమార్ యాదవ్ లో భయం భయం

Indian T20 Team Changes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అన్ని జట్లు హోరాహోరిగా ఆడుతున్నాయి. ఫలితాలు కూడా అంచనాలకు అందని విధంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తర్వాత భారత టి20 జట్టులో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియాలో ఈ దిశగా ప్రధానంగా వార్త కథనాలు ప్రసారమవుతున్నాయి. టి20 ఫార్మాట్ లో ప్రధానంగా అనేక మార్పులను మేనేజ్మెంట్ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. టి20 జట్టు సారధిగా అయ్యర్ ను బీసీసీఐ ఎంపిక చేస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో టి20 సిరీస్ లు ఆడనుంది. ఈ సిరీస్ బాధ్యతలు మొత్తం సర్పంచ్ సాబ్ కు అప్పగిస్తారని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ టీమిండియా కు నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతుంది. జాతీయ మీడియాలో సూర్య కుమార్ యాదవ్ ను పక్కనపెట్టి.. అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.. కేవలం ఈ టోర్నీలు మాత్రమే కాకుండా.. 2028 వరల్డ్ కప్, లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్ పోటీలను దృష్టిలో పెట్టుకొని కూడా అతడికి కెప్టెన్సీ అప్పగిస్తారని తెలుస్తోంది.

సూర్య కుమార్ యాదవ్ సారధిగా ఓకే అయినప్పటికీ.. ఆటగాడిగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కీలకమైన సమయాలలో సరిగా ఆడలేక పోతున్నాడు. ఆటగాడిగా అతడు విఫలమవుతున్న తీరు జట్టు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా ఇంతవరకు ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. చివరికి 2026 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. సారధిగా అతడు జట్టును అద్భుతమైన స్థాయిలో ముందు వరుసలో నిలుపుతున్నాడు. కానీ, ఆటగాడిగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

అయ్యర్ ప్రస్తుతం తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడుతున్నాడు. అందువల్లే అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు మేనేజ్మెంట్ సిద్ధంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ విషయాల మీద క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఒకవేళ సారథిగా పక్కన పెడితే.. సాధారణ ఆటగాడిగానే సూర్య కుమార్ యాదవ్ ఉండి పోవాల్సి ఉంటుందని తెలుస్తోంది

Posani Krishna Murali: అది రియలైజేషన్ అంటే.. పోసాని లో ఎంత మార్పు

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి లో చాలా మార్పు కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల బాటపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలు రచయితగా అడుగుపెట్టారు పోసాని. తరువాత దర్శకుడుగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి విభిన్న పాత్రలతో మెప్పించారు. అయితే మధ్యలో రాజకీయాల్లో ప్రవేశించి.. లేనిపోని వివాదాలు తెచ్చుకున్నారు. ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు మరోసారి సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టారు.

* మళ్లీ సినిమాలు.
తాజాగా తన సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అందులో రాజకీయ ప్రస్తావన వచ్చింది. మీడియా ప్రతినిధులకు దండం పెడుతూ.. నన్ను బతకనీయండి అంటూ విజ్ఞప్తి చేశారు. తానేదో సినిమాలు చేసుకుంటున్నానని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరలేదని.. మంచి చేసిన పార్టీకి మాత్రమే అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో సేవా మాత్రమే కాదు చిక్కులు ఉంటాయని పరోక్షంగా తన జైలు జీవితం గురించి మాట్లాడారు. తాను పదవి చేపట్టినా.. రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఇకనుంచి తన సినీ ప్రయాణం కొనసాగుతుందని తేల్చి చెప్పారు .

* ప్రజారాజ్యంతో ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పోసాని కృష్ణ మురళి. 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో బాహాటంగా మద్దతు తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అయితే నిత్యం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబు విషయంలో కూడా చాలా చులకనగా మాట్లాడేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళికి కష్టాలు మొదలయ్యాయి. కేసుల మీద కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘకాలం జైలులో ఉండి పోవాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన పోసాని కృష్ణ మురళి ఒకానొక దశలో కన్నీరు మున్నీరు అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాలపై దృష్టి పెట్టారు.

Mamata Banerjee: మమతక్క.. గిట్ల తయారైనవేంది.. ఇంకా ఎందుకు ఇజ్జత్‌ తీసుకుంటవ్‌..!

Mamata Banerjee: అంతర్జాతీయ సంబంధాలలో కొన్ని నాయకులు, దేశాలు ఓటమిని అంగీకరించకుండా, దాన్ని విజయంగా ప్రచారం చేసే వ్యూహాన్ని అనుసరిస్తుంటారు. ఇటీవలి ఘటనలు ఈ మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టాయి. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాజయం పాలైన మమతా బెనర్జీ ప్రతిస్పందన, 2025 మేలో భారత–పాకిస్తాన్‌ సంఘర్షణ తర్వాత పాకిస్తాన్‌ వైఖరి మధ్య ఆసక్తికరమైన సారూప్యత కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ బలహీనత కాదు, వాస్తవాలను తిరస్కరించే మనస్తత్వం.

ఓటమి అంగీకరించలేక..
2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఘోర పరాజయం చెందింది. బీజేపీకి 207 సీట్లు సాధించగా, టీఎంసీ80కి పరిమితమైంది. మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సువెందు అధికారికి సుమారు 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంత భారీ ఓటమి ఉన్నా, ఆమె ‘నేను ఓడిపోలేదు‘ అంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో మానిప్యులేషన్‌ జరిగిందని, ఓట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యేలతో సమావేశం..
తాజాగా మమతాబెనర్జీ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. న్యాయ నిపుణులతో కూడా భేటీ అయి, పదవిలో ఎలా కొనసాగాలనే అంశంపై చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీలో అసంతృప్తి, సాధ్యమైన ఫ్లోర్‌ క్రాసింగ్‌లకు సంకేతాలు ఇస్తోంది. ఇది పార్టీలో ముసలం పుట్టినట్లు సూచిస్తోంది. ఈ వైఖరి రాజకీయ జీవనం ఒక ముఖ్యమైన అంశాన్ని బయటపెడుతుంది. అధికారం కోసం వాస్తవాలను తిరస్కరించడం. ఓటర్ల తీర్పును అంగీకరించకుండా, బాహ్య కారణాలు చెప్పి తనను తాను న్యాయవంతురాలిని చేసుకోవడం సాధారణం కావచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి ఇది హానికరం.

ఆపరేషన్‌ సిందూర్‌లో..
2025 మే 7న భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. లష్కర్‌–ఎ–తోయిబా, జైష్‌–ఎ–మహమ్మద్‌ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి, వందలాది ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్‌ ప్రతిదాడి చేయగా, భారత్‌ దాన్ని తిప్పికొట్టి, కొద్ది రోజుల్లోనే డీస్‌ఎల్‌ఎంఓ స్థాయి చర్చలతో సంఘర్షణ ముగిసింది. అయినప్పటికీ, పాకిస్తాన్‌ తన దేశంలో విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ‘మార్కా–ఎ–హక్‌‘ అని పేరు పెట్టి, ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన సంస్థలే సంబురాలు చేస్తున్నాయి. ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి ఈ ‘విజయం‘ను జరుపుకుంటోంది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ కూడా ఇందులో పాల్గొంటోంది.ఇది కొత్త కాదు. 1965 యుద్ధం తర్వాత కూడా పాకిస్తాన్‌ ఓటమిని విజయంగా చిత్రీకరించి, డిఫెన్స్‌ డే జరుపుకుంటుంది. వాస్తవాలు ఏమైనా, దేశీయ ప్రచారం ద్వారా ప్రజలను మభ్యపెట్టడం ఇక్కడి వ్యూహం.

రెండు సందర్భాల్లోనూ ఓడినా..
యుద్ధంలో స్పష్టమైన ఓటమి ఉన్నా, ‘మేము గెలిచాము‘ అనే నినాదం. మమతా ఎన్నికల మానిప్యులేషన్‌ ఆరోపణలు, పాకిస్తాన్‌ మీడియా మరియు ప్రభుత్వం ద్వారా విజయ గాథలు. మమతా వద్ద ఎమ్మెల్యేల అసంతృప్తి, పాకిస్తాన్‌లో ఆర్థిక–సామాజిక సమస్యలను కప్పిపుచ్చడం.

ఈ వైఖరి స్వల్పకాలిక రాజకీయ లాభాలు ఇచ్చినా, ప్రజాస్వామికంగా నమ్మకం కోల్పోతుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పును అంగీకరించడం, యుద్ధాల్లో వాస్తవాలను అంగీకరించి సంస్కరణలు చేపట్టడం మంచి పాలనకు మూలం.ఈ సారూప్యతలు రాజకీయ నాయకులు దేశాలు ఎంతవరకు వాస్తవాల నుంచి దూరమవుతారో చూపిస్తాయి. నిజమైన విజయం ఓటములను గుర్తించి, నుంచి నేర్చుకోవడంలోనే ఉంటుంది.

Mumbai Indians Captaincy: ముంబై పగ్గాలు మళ్ళీ రోహిత్ చేతికి.. హార్దిక్ పాండ్యా కథ సమాప్తమేనా

Mumbai Indians Captaincy: కోరి తెచ్చుకున్న మొగుడు.. సిగ తరిగాడట.. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా అలానే ఉంది. ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి.. హార్దిక్ పాండ్యాను 2024లో ముంబై మేనేజ్మెంట్ సారధిగా తెచ్చుకుంది. అంతకు ముందు గుజరాత్ జట్టుకు ఒకసారి ట్రోఫీని.. మరోసారి రన్నర్ అప్ గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. ముంబై జట్టుకు కూడా ట్రోఫీని అందిస్తాడని మేనేజ్మెంట్ నమ్మింది. కానీ మేనేజ్మెంట్ నమ్మకాన్ని అతడు వమ్ము చేసుకుంటూ వస్తున్నాడు.

2024 సీజన్లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2025లో టాప్ ఫోర్ లో నిలిచింది. ఈ సీజన్లో మాత్రం దారుణమైన ఆట తీరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాలో మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. ఇటీవల జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ తో ఆదుకున్నాడు. తద్వారా ముంబై జట్టు విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్ కు కూడా హార్దిక్ పాండ్యా దూరమవుతున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల సూర్యకుమార్ యాదవ్ కూడా దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో జట్టుపగ్గాలు రోహిత్ శర్మ చేతిలోకి వెళ్తాయని చర్చ జరుగుతుంది.

జాతీయ మీడియాలో మాత్రం మేనేజ్మెంట్ అప్రోచ్ అయినప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా లేడని తెలిసింది. దీంతో సారధి కోసం మేనేజ్మెంట్ అన్వేషణ మొదలుపెట్టిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో కెప్టెన్సీ ని రోహిత్ శర్మ తీసుకుంటే బాగుంటుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అతని నాయకత్వంలో ముంబై జట్టు విజయాల బాట పడుతుందని.. ఐపీఎల్ లో సత్తా చూపిస్తుందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గాయం వల్ల రోహిత్ శర్మ ఆమధ్య కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. వైద్యుల సిఫారసు మేరకు చికిత్స పొందాడు. అనంతరం పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించిన తర్వాత మైదానంలోకి వచ్చాడు. తొలి మ్యాచ్ లోనే మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇప్పుడు అదే ఫామ్ కనుక రోహిత్ కంటిన్యూ చేస్తే ముంబై జట్టుకు తిరుగులేని స్థాయి లభిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముంబై జట్టు భారీ విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలు ఉంటాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Judge Anger Incident: జడ్జికి కోపం వచ్చింది.. లాయర్ జైలుకు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Judge Anger Incident: కొన్నిసార్లు తెలియక చేసిన ఘటనలు తప్పులుగా మారుతాయి. అవి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తాయి. వాటి వెనుక ఏం జరిగిందో కూడా వారు ఆలోచించరు. ముక్కు మీద కోపంతో అరుస్తుంటారు. ఆ తర్వాత కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి పర్యవసనాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. అటువంటిదే ఇది కూడా..

అది హైకోర్టు.. ఓ కేసు విచారణ సాగుతోంది. ఓ యువ న్యాయవాది కేసును వాదిస్తుండగా.. ఆయన మో చేతికి నొప్పి కావడంతో.. ఫైల్స్ బరువు మోయలేక.. వాటిని టేబుల్ మీద విసిరేశాడు. అది జడ్జికి కోపం తెప్పిస్తుంది. నా ముందే నువ్వు కేసు ఫైల్స్ విసిరేస్తావా అంటూ ఆ జడ్జి ఆ లాయర్ మీద కోపం ప్రదర్శించారు. జడ్జి అంటే కనీసం గౌరవం లేని ఈయనకు ఒకరోజు పాటు జైలు శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశారు. లాయర్ జరిగిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆ జడ్జి వినిపించుకోలేదు.

సాధారణంగా మనదేశంలో న్యాయమూర్తులకు ముక్కు మీద కోపం ఉంటుంది అంటారు. ఆ అసహనాన్ని వారు అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తుంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సదరు జడ్జి కూడా అలానే వ్యవహరించారని.. లాయర్ విషయంలో కనీసం వినిపించుకునే ప్రయత్నం కూడా చేయలేదని తోటి న్యాయవాదులు వాపోతున్నారు. ఆ న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో.. లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తికి ఏ స్థాయిలో అయితే అధికారాలు ఉంటాయో.. బెంచ్ కు కూడా అదే స్థాయిలో అధికారాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని లాయర్లు సూచిస్తున్నారు. హైకోర్టులో జరిగిన ఆ వ్యవహారాన్ని ఓ లాయర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సమయంలోనే ఒక స్వీయ వీడియో తీసుకొని.. హైకోర్టులో జరిగిన పరిణామాలను వివరించారు. ఇలాంటి విధానాలు సరికావని.. న్యాయమూర్తి.. బెంచ్ జోడెడ్ల లాగా పనిచేయాలని.. ఎవరికివారు వాదించుకుంటే అప్పుడు పరిస్థితి వేరే విధంగా మారుతుందని ఆ యువ న్యాయవాది పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది.

Royal Enfield Tirupati Plant: పెదబాబు.. చినబాబు బండెక్కితే మామూలుగా ఉండదు మరీ.. వైరల్ వీడియో

Royal Enfield Tirupati Plant: ఏపీకి ( Andhra Pradesh) పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పటివరకు ఐటీ పరిశ్రమలు రాగా.. ఇప్పుడు తయారీ రంగ పరిశ్రమలు ముందుకు రావడం విశేషం.. విశాఖకు ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టేందుకు రిలయన్స్ సైతం సన్నాహాలు మొదలుపెట్టింది. మరోవైపు తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. 2700 వందల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ ముందుకు వచ్చింది. మరోవైపు రాయలసీమలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాటికి సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.

* ప్రత్యేక స్థానం..
మోటారు వాహన రంగంలో రాయల్ ఎన్ఫీల్డ్ ది( Royal Enfield) ప్రత్యేక స్థానం. 80వ దశకం లోనే ఈ బుల్లెట్ బండి ఒక ఊపు ఊపేసింది. అయితే లేటెస్ట్ వెర్షన్ తో ఇప్పుడు మార్కెట్లో బుల్లెట్ బండ్లు వస్తున్నాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఇప్పుడు ప్రత్యేకం. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఈ బుల్లెట్ వాహనం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అందుకే ఆ కంపెనీ విస్తరణ దిశగా ఆలోచనలు చేస్తోంది. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి అందించేందుకు కొత్త ప్లాంట్ల తయారీపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తిరుపతిలో కొత్త ప్లాంట్ పెట్టేందుకు నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఆదాయం పెరుగుతుందని.. పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తే రాష్ట్ర ఆదాయం పెరగడమే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.

* రాయలసీమలో తయారీ రంగం పరిశ్రమలు..
అయితే ఏపీలో ఒక ప్రత్యేక పరిస్థితి కొనసాగుతోంది. ఐటీ పరంగా విశాఖ( Visakhapatnam) హబ్ గా మారుతోంది. రాయలసీమలో మాత్రం తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలోని శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో అనుబంధ పరిశ్రమలు కూడా తరలివస్తున్నాయి. రిలయన్స్ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం శుభ పరిణామం. గతంలో టిడిపి అధికారంలోకి వచ్చిన సమయంలో అనంతపురంలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అయింది. ఇప్పుడు బుల్లెట్ బండ్లకు సంబంధించి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రానుండడంతో సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. బుల్లెట్ బండిపై చంద్రబాబు ఉన్న ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Lucknow Vs RCB: ఏకంగా కోహ్లీనే బోల్తా కొట్టించావు.. వికెట్ తీశావు.. నువ్వు మగాడ్రా బుజ్జి

Lucknow Vs RCB: అడవిలో జింకలను, లేడి పిల్లలను వేటాడే వాడి కంటే.. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన వాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే రేంజ్ లక్నో బౌలర్ ప్రిన్స్ అనుభవిస్తున్నాడు. మామూలుగా అయితే మైదానంలో ఏ బౌలర్ అయిన సరే తనదైన రోజు వికెట్లు పడగొడతాడు. కానీ ప్రిన్స్ లక్నో జట్టు గెలుపును డిసైడ్ చేసే వికెట్ పడగొట్టాడు. ఆ వికెట్ కాస్త మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఆరు ఓటమి తర్వాత లక్నో జట్టుకు గెలుపును అందించింది.

ఇప్పటికే ఐపీఎల్ లో పాయింట్లు పట్టికలో లక్నో జట్టు దిగువ స్థానంలో ఉంది. పోరాడితే పోయేదేముంది అన్నట్టుగానే ఆ జట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు తో మ్యాచ్ ఆడింది ఆ జట్టు. సహజంగానే ఈ మ్యాచ్లో బెంగళూరు గెలుస్తుందని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ లక్నో జట్టు ఆధ్వర్యంలో తలకిందులు చేసింది.. ముందుగా బ్యాటింగ్ చేసి మెరుపు వేగంతో పరుగులు చేసింది. మార్ష్ సెంచరీ తో చెలరేగాడు. ఆ తర్వాత బంతితో లక్నో బౌలర్లు అదరగొట్టారు. ఫలితంగా లక్నో జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

వర్షం వల్ల ఈ మ్యాచ్ 19 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో ముందుగా లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయి, 209 పరుగులు చేసింది.. డక్వర్త్ లూయిస్ విధానంలో బెంగళూరు లక్ష్యాన్ని 213 పరుగులకు సవరించారు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆర్ సీ బీ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆరు వికెట్లు నష్టపోయింది. 203 రన్స్ మాత్రమే చేయగలిగింది. పాటిదర్ 61, డేవిడ్ 40 రన్స్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్ సీ బీ ఓటమిని శాసించాడు. ముఖ్యంగా కోహ్లీ వికెట్ ప్రిన్స్ యాదవ్ పడగొట్టిన తీరు ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్.. ఇన్ స్వింగర్ బంతిని అంచనా వేయలేక విరాట్ కోహ్లీ బ్యాట్ ముందుగా కదిలించాడు. బంతి మాత్రం వికెట్లను పడగొట్టి.. విరాట్ కోహ్లీని వెనక్కి పంపించింది.

ఈ వికెట్ తీయడంతో ప్రిన్స్ యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పైగా చిన్న పరుగులకు విరాట్ అవుట్ అయ్యాడు. చేజింగ్ సమయంలో విరాట్ సరిగ్గా చాలా సంవత్సరాల క్రితం ఇలానే అవుట్ అయ్యాడు. నాటి మ్యాచ్లో బెంగళూరు ఐపిఎల్ కెరియర్ లోనే అతి తక్కువ స్కోరు చేసింది. విరాట్ అవుట్ అవ్వడం బెంగళూరు జట్టు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. మరో ఓపెనర్ బెతల్ (4) కూడా అవుట్ కావడంతో బెంగళూరు జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. పాటిధార్, డేవిడ్ గట్టిగా నిలబడినప్పటికీ.. వారి స్థాయి బెంగళూరుకు విజయాన్ని అందించలేకపోయింది.. ప్రిన్స్ ఒకే ఓవర్ లో పడికల్, జితేష్ శర్మను అవుట్ చేయడంతో బెంగళూరు విజయానికి దూరంగా ఉండిపోయింది..

Pithapuram Varma: పిఠాపురం వర్మకు లోకేష్ స్ట్రాంగ్ హామీ

Pithapuram Varma: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం హాట్ టాపిక్. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ హై కమాండ్ ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఆయనను తప్పిస్తూ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని టిడిపి హై కమాండ్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన వర్మ కన్నీటి పర్యాంతం అయ్యారు. అయితే ముగ్గురు నేతలతో కమిటీ నియమించమని తానే లోకేష్ కు చెప్పినట్లు వర్మ చెబుతున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో తలెత్తుతున్న విభేదాల దృష్టిలో పెట్టుకొని టిడిపి హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మొన్ననే ఒక ఘర్షణ వాతావరణం జరిగింది కూటమి పార్టీల మధ్య. దీంతో లోకేష్ వర్మను పిలిపించుకుని మాట్లాడారు. అన్ని విషయాలను సేకరించి.. ముగ్గురు నేతలతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

* నిబద్ధత కలిగిన నేత..
వర్మ తెలుగుదేశం పార్టీ పట్ల కమిట్మెంట్ తో పనిచేసే నాయకుడు. సహజంగానే నియోజకవర్గంలో పట్టున్న నేత కావడంతో.. కూటమి పార్టీల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గంలో అన్యాయం జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం హై కమాండ్ కు తెలుసు. కానీ రాష్ట్రస్థాయిలో పొత్తు కొనసాగాలంటే పవన్ కళ్యాణ్ కీలకం. ఆయనకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అందుకే లోకేష్ ఈ విషయంలో ప్రత్యేకంగా కలుగ చేసుకున్నారు. పార్టీ పరిస్థితి తో పాటు కూటమి దుస్థితిని వివరించే ప్రయత్నం చేశారు వర్మకు. అందుకే వర్మ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించారు. ముగ్గురు నేతలతో టిడిపి కమిటీ వేయాలని సూచించారు. దానికి బద్ధుడు నై పని చేస్తానని లోకేష్ కు హామీ ఇచ్చారు. అందుకే వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టిడిపి హై కమాండ్.

* తగ్గనున్న యాక్టివ్..
పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది అంతే. కానీ యాక్టివ్ గా ఉండదు. లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిస్థితి ఉండదు. వాస్తవానికి పిఠాపురంలో జనసేనకు సైతం ఐదుగురు నేతలతో కూడిన కమిటీ ఉంది. ఇప్పుడు టిడిపి మరో ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేస్తుండడంతో.. ఈ మొత్తం ఎనిమిది మంది నేతలు కూటమి సమన్వయం చూస్తారు. జనసేనతో పాటు టిడిపి శ్రేణులకు ప్రాధాన్యమిస్తూ.. ఏకతాటి పైకి సాగేందుకు దోహదపడతారు. అయితే పిఠాపురం అంటేనే వర్మ ముందుగా గుర్తుకొస్తారు. అందులోనూ టిడిపి భావజాలం ఎక్కువ ఆయనలో. ఈ క్రమంలో టిడిపి ఇన్చార్జి పదవి నుంచి తొలగించేసరికి కొంచెం మనస్తాపానికి గురయ్యారు. అయితే ఆ విషయం తనకు ముందుగానే నాయకత్వం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే లోకేష్ ఏదో బలమైన హామీ వర్మకు ఇచ్చారన్న ప్రచారం ఉంది. పిఠాపురం వదులుకుంటే రాజకీయంగా ఉన్నత పదవి ఇస్తామన్నదే ఆ హామీ సారాంశంగా తెలుస్తోంది. కానీ రాజకీయంగా వర్మ స్థిరంగా ఉంటేనే అది కూడా.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ చేసింది కరెక్టే.. గతంలో ఏం జరిగిందంటే..

Tamil Nadu Governor: ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా తమిళనాడు గవర్నర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టీవీకే నేతలు కూడా అదే స్వరాన్ని వినిపిస్తున్నారు. కమలహాసన్, ప్రకాష్ రాజు, విశాల్ కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విషయంలో టీవీకే నేతలకు ఆగ్రహం ఉండడం సర్వ సాధారణం. కానీ తమిళనాడు గవర్నర్ ఇప్పటి పరిస్థితిని కాకుండా
.. గతంలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కుప్ప కూలిపోయాయి

1996లో పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 161 సీట్లను సాధించింది. అతిపెద్ద పార్టీగా అవితరించింది. కానీ మెజారిటీ నిరూపించుకోలేకపోయింది. నాడు ఎంపీల లెక్కల పరిశీలించకుండానే రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేవలం 13 రోజుల పాటే ఆ ప్రభుత్వం కొనసాగింది. పార్లమెంట్లో బలం నిరూపించుకోలేకపోయింది. నాడు రాష్ట్రపతి సంఖ్యాబలాన్ని లెక్కలకు తీసుకోకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారు. నాడు శంకర్ దయాల్ శర్మ ఈ వ్యవహారంపై అనేక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని 1998లో పార్లమెంటు ఎన్నికల్లో హాంగ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నాటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ ఈసారి కొత్త విధానాన్ని పాటించారు. అన్నా డీఎంకే నుంచి మొదలు పెడితే మొదటి ఇస్తున్న ఇతర పార్టీల నుంచి లేఖలు తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి ఆహ్వానించారు. నాడు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో 13 నెలలు మాత్రమే కొనసాగింది.

2018లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం. 80 సీట్లు వచ్చిన కాంగ్రెస్.. 37 సీట్లు వచ్చిన జిడిఎస్ కలిసి.. మొత్తం 117 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కానీ నాటి గవర్నర్ వాజుభాయ్ అతిపెద్ద పార్టీ గా నిలిచిన బిజెపిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బల నిరూపణ సాధ్యం కాకపోవడంతో.. మూడు రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది.

2019లో మహారాష్ట్రలో బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. పైగా శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ అలయన్స్ గా ఏర్పడ్డాయి. నాటి గవర్నర్ భగత్ సింగ్ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. దేవేంద్ర ఫడ్నవిస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ బల నిరూపణ సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభుత్వం కేవలం నాలుగు రోజుల్లోనే కుప్పకూలిపోయింది.

Prabhas Spirit Leaked Look: ‘స్పిరిట్’ లో గుండు లుక్ లో ప్రభాస్.. సంచలనం రేపుతున్న లీకెడ్ ఫోటో..

Prabhas Spirit Leaked Look: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటిస్తున్న ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉన్నటువంటి అంచనాలు సాధారణమైనవి కాదు, ఈ చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ లీక్ అయినా సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోతుంది. ఈ రేంజ్ క్రేజ్ ఏ పాన్ ఇండియన్ సినిమాకు కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ వంటి యాక్షన్ హీరో కటౌట్ కి , సందీప్ వంగ లాంటి కల్ట్ మాస్ డైరెక్టర్ తోడైతే , ఎలాంటి సినిమా వస్తుందో ఊహలకు కూడా అందదు అనే అంచనాలతో అందరూ ఉండడం వల్లే, ఈ చిత్రం పై ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ సమయం లో ప్రభాస్ తో సందీప్ వంగ మాట్లాడుతున్న సందర్భంలో తీసిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది.

ఈ ఫోటో లో ప్రభాస్ గుండు లుక్ లో కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. జైలు బట్టల్లో ఉన్న ప్రభాస్, గుండు లుక్ తో, చాలా రఫ్ గా కనిపించాడు. ఇప్పటికే న్యూ ఇయర్ రోజున పొడవాటి జుట్టులో ప్రభాస్ స్టైల్ గా వెనక్కి తిరిగి సిగెరెట్ కాలుస్తున్న లుక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతలోపే అదే సినిమా నుండి లీకైన ఈ గుండు లుక్ ని చూసి , సినిమాలో ప్రభాస్ ని సందీప్ వంగ ఇష్టమొచ్చినట్టు వాడేసినట్టుగా అనిపిస్తోంది , యూత్ మరియు మాస్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ పక్కా అని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

మరి అంతటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ , ఎందుకు ఇలా జైలు జీవితం గడుపుతున్నాడు అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడక తప్పదు. ఇప్పటి వరకు ప్రభాస్ కేవలం నాలుగు రోజుల షూటింగ్ లో మాత్రమే పాల్గొన్నాడు. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేయగా , మొదటి షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు . రెండవ షెడ్యూల్ లో విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ పై పలు యాక్షన్ షాట్స్ ని తెరకెక్కించారు. అయితే షూటింగ్ కి బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడం తో , ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 7 నుండి డిసెంబర్ నెలకు వాయిదా వేసినట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Mad For Each Other show: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో బూతులతో రెచ్చిపోయిన నటరాజ్ మాస్టర్..వీడియో వైరల్..

Mad For Each Other show: రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో మొదలైన లవ్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. నిన్న గాక మొన్న మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ క్రేజీ రియాలిటీ షోలో గొడవలు బిగ్ బాస్ ని మించే ఉన్నాయి. ఒక జంట మరొక జంట పై నెగెటివ్ కామెంట్స్ చేయడమే కాకుండా, కొట్టుకునే స్థాయి వరకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన తన ప్రవర్తన తో ప్రతీ వారం జడ్జీలతో తిట్టించుకుంటూనే ఉంటాడు. కానీ అతని తీరులో ఎలాంటి మార్పు ఉండదు. గేమ్ లో గెలిస్తే ఒకలా ప్రవర్తిస్తాడు , గెలవకపోతే మరోలా ప్రవర్తిస్తాడు. భారీ సినిమా డైలాగ్స్ కొడుతూ, నా కోపాన్ని తట్టుకోలేరు అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో మీరంతా చూసే ఉంటారు.

యాంకర్ శ్రీముఖి మీరు గేమ్ నుండి అవుట్ అని చెప్పగానే , తన చేతిలో ఉన్న బక్కెట్లను కిందకు విసిరి , కాళ్లతో కొట్టి , వాళ్లకు ఒక రూల్ , మాకు ఒక రూల్ అని అరుచుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అనంతరం ఆయన తన సూట్ కేసు లను కళ్ళతో కొడుతూ, నేను వెళ్ళిపోతా ఈ షో నుండి అని రచ్చ చేయడం, ఆయన సతీమణి నీతూ కంట్రోల్ చేయడం , ఇవన్నీ మీరంతా చూసే ఉంటారు. నటరాజ్ మాస్టర్ లో ఎలాంటి మార్పు లేదు , బిగ్ బాస్ రెండు సీజన్స్ లో వచ్చాడు, బీబీ జోడి లో కూడా పాల్గొన్నాడు. అప్పుడు ఎలా అయితే నోరు చించుకొని అరిచే వాడో , ఇప్పటికీ అలాగే ప్రవరిస్తున్నాడు , జడ్జీలు పదే పదే వారిస్తున్నా కూడా ఆయన కంట్రోల్ అవ్వడం లేదు.

నిన్న ఆయన భాను , జాను జోడిలతో గొడవ పడుతూ కొన్ని బూతులు కూడా మాట్లాడాడని టాక్. అది టెలికాస్ట్ లో చూపిస్తారో లేదో తెలియదు కానీ, చూపిస్తే మాత్రం నటరాజ్ మాస్టర్ పై తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మ్యాన్షన్ లో టికెట్ టు ఫినాలే గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ లో టాప్ 2 గా నిల్చిన కంటెస్టెంట్స్ మహేష్ సాంద్ర మరియు భాను – జాను జంట. నిన్న ఎలా అయితే నటరాజ్ మాస్టర్ ని ఓడించడానికి జాను – భాను స్కెచ్ వేసారో , నేడు వాళ్ళని ఓడించడానికి నటరాజ్ మాస్టర్ – నీతూ జంట స్కెచ్ వేశారు. దీంతో ఈ రెండు జంటల మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.