Home Blog Page 305

Cristiano Ronaldo fitness secret: రోనాల్డో ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే.. అతడు ఏం తింటాడో తెలుసా..

0

Cristiano Ronaldo fitness secret: పోర్చుగీస్ ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆధునిక ఫుట్ బాల్ క్రీడలో ఇతని మించిన ఆటగాడు మరొకరు లేరు. చూస్తుండగానే గోల్స్ చేస్తాడు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ మీద దారుణంగా దాడి చేస్తాడు. బంతిని అత్యంత చాకచక్యంగా గోల్ పోస్ట్ లోకి పంపిస్తాడు. అందువల్ల ఇతడిని గోల్ కింగ్ అని పిలుస్తుంటారు.

ఆట తీరుతో మాత్రమే కాదు.. శరీర సామర్థ్యం విషయంలో కూడా రోనాల్డో సరికొత్తగా ఉంటాడు. ఎవరైనా సరే వయసు పైబడి పోతుంటే… కచ్చితంగా దానికి సంబంధించిన మార్పులు కనిపిస్తుంటాయి.. కానీ రోనాల్డో మాత్రం అలా కాదు. తాను అత్యంత కఠినమైన డైట్ కొనసాగిస్తూ ఉంటాడు. పొరపాటున కూడా డైట్ స్కిప్ చేయడు. అతని డైట్ చూసుకోవడానికి ప్రఖ్యాతమైన పోషకాహార నిపుణులు ఉంటారు. వారు నిత్యం అతడు తింటున్న ఆహారాన్ని కనిపెట్టుకొని ఉంటారు. అందువల్లే రోనాల్డో ఆ స్థాయిలో ఉంటాడు.

రోనాల్డో ఏం తింటాడు.. ఎలా ఉంటాడు అనే విషయాలు మొన్నటి వరకు బయటకు రాలేదు. అయితే అతడికి చెఫ్ గా వ్యవహరించిన ఒక వ్యక్తి ఇటీవల ఆ విషయాలను బయటపెట్టాడు. ప్రస్తుతం అతడు రోనాల్డ్ దగ్గర పని చేయడం లేదు. అతను చెప్పిన వివరాల ఆధారంగా రోనాల్డో ఏం తింటాడో.. ఎలాంటి కసరతులు చేస్తాడో అందరికీ తెలిసిపోయింది.

ఉదయం లేవగానే రోనాల్డో జిమ్ చేస్తాడు. ఆ తర్వాత తన శరీరాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు పరుగు పెడతాడు. ఆ తర్వాత పచ్చి అవకాడో ను తింటాడు. దాంతోపాటు ఉడకబెట్టిన గుడ్లను తినేస్తాడు. కేవలం ఎగ్ వైట్ మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఈ రెండు పూర్తి అయిన తర్వాత చక్కెర కలపని.. కొవ్వ తీసిన పాలతో తయారుచేసిన కాఫీ తాగుతాడు. మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో కచ్చితంగా కూరగాయలు ఉండేలా చూసుకుంటాడు. అందులోనే గ్రిల్ చేసిన ఫిష్.. చికెన్ ఉంటాయి. అవన్నీ కూడా క్యాలరీల ప్రకారమే అతడు తింటాడు. ఒక రకంగా చెప్పాలంటే కొలత వేసినట్టు మాత్రమే తింటాడు.

అతడి డైట్ లో మైదాపిండికి అవకాశం లేదు. కనీసం బియ్యం, గోధుమపిండి కూడా ఉండదు. పాస్తా అసలు తినడు. చివరికి పిజ్జా, బర్గర్లను కూడా ఇష్టపడడు. బ్రెడ్ కూడా ముట్టుకోడు. రాత్రిపూట అతని డైట్ చాలా సింపుల్ గా ఉంటుంది. అధిక మోతాదులో కూరగాయలు.. చికెన్.. ఫిష్ తింటాడు. అవన్నీ కూడా గ్రిల్ అయితేనే తింటాడు. తాగే నీటి విషయంలో కూడా అతడు జాగ్రత్తలు తీసుకుంటాడు. మ్యాచ్ లు ఉంటే తప్ప రాత్రిపూట మెలకువతో ఉండడు. సాధ్యమైనంతవరకు మధ్యానికి దూరంగా ఉంటాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో శరీర సామర్థ్యంతో కనిపిస్తుంటాడు. ఆధునిక కాలంలో వివిధ క్రీడలు ఆడే క్రీడాకారుల్లో.. శరీర సామర్థ్యాన్ని సమర్థవంతంగా కొనసాగించే ఆటగాళ్లలో రోనాల్డో ముందు వరుసలో ఉంటాడు. ఇండియాకు చెందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇలానే శరీర సామర్థ్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.

 

Godari Gattupaina Movie Review: ‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Godari Gattupaina Movie Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తుంటే కుర్ర హీరోలు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమై వరుస సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘మేము ఫేమస్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత ‘గోదారి గట్టు పైన’ అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

రాజు (సుమంత్ ప్రభాస్) అనే ఒక కుర్రాడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు…ఇక రోజంతా ఆటో నడపడం, సాయంత్రం పూట తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం ఇదే లైఫ్ స్టైల్ లో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తన చెల్లెలి తో పాటు బిటెక్ చదువుతున్న మాయ (నిధి ప్రదీప్) అనే అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడుతాడు…ఇక మాయ వల్ల నాన్న శ్యామ్ బాబు (జగపతి బాబు) సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. ఎలాగైనా సరే తన కూతురు చదువు అయిపోయిన తరువాత ఒక మంచి జాబ్ ఉన్న వ్యక్తికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలని తను హ్యాపీ గా ఉండాలని కోరుకుంటాడు. ఇక ఇదే టైం లో తన కూతురు రాజు అనే ఆటో డ్రైవర్ ను ప్రేమించిదని తెలుసుకున్న శ్యామ్ బాబు ఏం చేశాడు? రాజు తను ప్రేమించిన మాయ ను పెళ్లి చేసుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

డైరెక్టర్ సుభాష్ చంద్ర తన మొదటి సినిమా కోసం రొటీన్ స్టోరీని ఎంచుకున్నాడనే చెప్పాలి. అయితే సినిమాలో కథాంశం ఇంతకు ముందు మనం చూసిందే అయినప్పటి ఎమోషన్స్ ను బ్యాలెన్స్డ్ గా నడిపించాడా లేదా అంటే అక్కడక్కడ తడబడ్డాడనే చెప్పాలి. ఫస్టాప్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు, పాటలు మినహాయిస్తే సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఎంచుకున్న కథనే రొటీన్ గా ఉండటం వల్ల అందులో వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి పెద్దగా కొత్తదనం కనిపించలేదు…

ఇక సినిమా చివరిలో వచ్చే ఒక 15 నిమిషాల ఎమోషనల్ ఎపిసోడ్ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. అలాగే రాజు నడుపుతున్న ఆటోకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. ఈ సన్నివేశాలతోనే సినిమా ఆడుతుందా అంటే కష్టమనే చెప్పాలి. కారణం సినిమాలో కోర్ ఎలిమెంట్ అనేది పైవిద్యంగా ఉండాలి. అలాగే కొన్ని ట్విస్ట్ లు కూడా సినిమాకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాయి… అయితే ఈ మూవీ కథ రొటీన్ అయినప్పటికి ఇంకొంచెం వైవిధ్యాన్ని చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు పర్లేదు బాగానే వెళుతుంది అన్నట్టుగా అనిపించిన కూడా సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు సినిమా బావుందా? బాలేదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ప్రేక్షకుడు ఉంటాడు. ఎందుకంటే మనసుని హత్తుకునే కొన్ని సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నప్పటికి ఓవరాల్ గా సినిమాను నిలబెట్టేది పది నిమిషాల సీక్వెన్స్ అయితే కాదు.

కాబట్టి ప్రతి సీన్ ను అద్భుతంగా తీర్చిదిద్దినప్పుడే ఒక సినిమా యూనినమాస్ హిట్ సాధిస్తుంది. అంతేతప్ప ఒకటి రెండు సీన్స్ బాగున్నప్పుడు ప్రేక్షకుడు ఆ సినిమాని రిసీవ్ చేసుకోకపోవచ్చు… ఇక సుదర్శన్ ఈ సినిమాలో తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక సినిమా ప్రమోషన్స్ కి కూడా భారీగానే చేశారు. అయినప్పటికి సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది. కానీ తను పూర్తిస్థాయిలో దానిని వాడుకోవడంలో మాత్రం సినిమా యూనిట్ కొంతవరకు తడబడ్డారనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

సుమంత్ ప్రభాస్ ఆటో డ్రైవర్స్ ఎలాగైతే ఉంటారో వాళ్ల ఆటిట్యూడ్ ను చాలా బాగా పెర్ఫ్యూమ్ చేశాడు. ఇంతకీ ముందు చేసిన మేము ఫేమస్ సినిమాలో ఎలాగైతే నటించి ప్రేక్షకులను మెప్పించాడో ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నం చేశాడు. ఆయన కనిపించిన ప్రతి సీను కూడా ఏదో ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఆటో రాజు అనే క్యారెక్టర్ కి తను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు…మాయ పాత్రలో నిధి ప్రదీప్ చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె పాత్రకి ఏదైతే కావాలో దాన్ని సెటిల్డ్ గా నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇక జగపతిబాబు పోషించిన శ్యాంబాబు పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందనే చెప్పాలి. ఆయన పాత్రలోని వేరియేషన్స్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సుమంత్ ప్రభాస్ ఒక ప్రేమికుడిగా ఆలోచిస్తే శ్యాం బాబు మాత్రం ఒక అమ్మాయి తండ్రి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు. కూతురికి ఒక మంచి అబ్బాయి ని ఇచ్చి పెళ్ళి చేయడం అనేది తండ్రి గా ఒక పెద్ద బాధ్యతలా ఫీలయ్యే పాత్రలో జీవించేశాడనే చెప్పాలి… ఇక జగపతి బాబు భార్య పాత్రలో నటించిన లైలా కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉన్నప్పటికి ఆమె ఆ పాత్రను అటు ఇటు కాకుండా ఎండ్ చేశారు. ఆమె ఏదో ఒక ఎమోషన్ ని బలంగా చెబుతుంది అని ప్రతి ప్రేక్షకుడు ఆశిస్తాడు.

కానీ అనుకోకుండా ఆ పాత్రను మధ్యలోనే కట్ చేయడం వల్ల ఆమె ఏం చేసింది అనే డౌట్ అయితే అందరికి కలుగుతుంది. కానీ ఆమె ఉన్నంత సేపు స్క్రీన్ మీద చాలా బాగా అలరించిందనే చెప్పాలి పాత్రకి కంక్లూజన్ ఇవ్వడంలో దర్శకుడు కొంతవరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి… ఇక సుదర్శన్ తన కామెడీతో సినిమాను నిలబెట్టాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నింటితో పోలిస్తే ఈ సినిమాలో మరింత మెరుగైన కామెడీ పండించాడనే చెప్పాలి… మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ కృష్ణ అందించిన సాంగ్స్ బాగున్నాయి… బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే అనిపించినప్పటికి, ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ సైతం చాలా చక్కటి విజువల్స్ ను అందించాడు. గోదారి అందాలను చాలా బాగా చూపించాడు… సినిమాకి అవసరమైన షాట్స్ మాత్రమే వాడాడు. ఎక్కడ కూడా ఆయన అనవసరపు షాట్స్ ను కంపోజ్ చేయలేదు… ఎడిటర్ ఫస్టాఫ్ ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది… ప్రొడక్షన్ వాల్యూస్ సైతం బాగున్నాయి…

ఈ సినిమాలో బాగున్నవి…

మ్యూజిక్
సుకాంత ప్రభాస్ యాక్టింగ్
క్లైమాక్స్

ఈ మూవీలో బాగోలేనివి

రొటీన్ కథ
ఫస్టాప్ కొంచెం లాగ్ అయింది…

రేటింగ్ : 2.25 /5

Ukraine attack on Putin: ఉక్రెయిన్ ఊరుకోవడం లేదు.. ఏకంగా పుతిన్ కే.. రష్యాలో కలకలం

Ukraine attack on Putin: యూరప్ ప్రాంతంలో ఉక్రెయిన్ ఒక దేశం. యూరప్ లో ఉన్న మిగతా దేశాలతో పోల్చి చూస్తే దీని ఆర్థిక సామర్థ్యం తక్కువే. అయినప్పటికీ కొంతకాలంగా రష్యాతో వెన్ను చూపించకుండా పోరాటం చేస్తోంది. అంతటి బలవంతమైన రష్యా ను సైతం ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో పుతిన్ ముందు వరుసలో ఉంటారు. ఈయనకు అత్యంత భద్రత వలయం ఉంటుంది. దానిని దాటుకోవడం అంటే అంత ఈజీ కాదు. దానిని ఉక్రెయిన్ చేసి చూపించింది. నోవ్ గోరోడ్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ నివాసంలో పుతిన్ ఉండగా హత్య చేసేందుకు ఉక్రెయిన్ పాల్పడినట్టు రష్యా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆయనను అంత చేయడానికి కుట్ర పన్నినట్టు రష్యా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో బయటికి వెల్లడించలేదు.

ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ పుతిన్ కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అందువల్లే ఆయన విదేశాలలో పర్యటించడం లేదు. దేశంలో కూడా అంతగా కనిపించడం లేదు.. కొన్ని సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పుతిన్ ఎక్కువగా రహస్యమైన ప్రాంతాలలో ఉంటున్నారు. కొన్ని సందర్భాలలో భూగర్భ బంకర్లలో తలదాచుకుంటున్నారు.

పుతిన్ ఉన్న ప్రాంతాలు మిగతా ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఇంటర్నెట్.. ఫోన్.. పంటి సౌకర్యాలపై పూర్తిగా నిషేధం విధించారు. డ్రోన్లతో దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు రష్యాలో కీలకమైన మాస్కో నది పక్కన భారీగా బలగాలను మోహరించారు. దేశంలోని అనేక మంది అధికారులకు రక్షణ మరింత పెంచారు. పుతిన్ ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అమెరికన్, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కొట్టి పారేశాయి.

YSRCP: ఒకరు వైసీపీని వీడితేనే.. మరొకరికి ఛాన్స్.. నో ఆప్షన్

YSRCP: కొన్ని జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఉంది. ఇప్పటికీ నియోజకవర్గాల్లో ఇన్చార్జులు యాక్టివ్ కాలేదు. అది ఆ పార్టీకి చాలా లోటు కూడా. ప్రకాశం జిల్లాలో కీలకమైన చీరాల నియోజకవర్గంలో వింత పరిస్థితి ఉంది. అక్కడ ఇన్చార్జిగా ఉన్న కారణం వెంకటేష్ పెద్దగా క్రియాశీలకంగా లేరు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరిగి పార్టీలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. కరణం బలరాం తో పాటు ఆయన కుమారుడు వెంకటేష్ బయటకు వెళ్ళిపోతే.. వైసీపీలో చేరేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కానీ కరణం ఫ్యామిలీ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ.. క్రియాశీలకంగా లేరు.

* ఎన్నికలకు ముందే గుడ్ బై..
మొన్నటి ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఆమంచి కృష్ణమోహన్. తనకు చీరాల టిక్కెట్ ఇవ్వాలని పట్టు పట్టారు. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. పైగా కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణ మోహన్ కు పాతికవేల వరకు ఓట్లు వచ్చాయి. వెంకటేష్ దారుణంగా ఓడిపోయాడు. అయితే తన కుమారుడు ఓడిపోవడంతో కరణం బలరాం పునరాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రకాశం కేడర్ ఒప్పుకోకపోవడంతో ఆయన చేరిక విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే చీరాల నుంచి కరణం ఫ్యామిలీ బయటకు వెళ్ళిపోతే తిరిగి వచ్చేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కానీ అందుకు అనుకూల పరిణామాలు చోటు చేసుకోవడం లేదు.

* పట్టున్న నేత..
చీరాలలో మంచి పట్టు ఉంది ఆమంచి కృష్ణమోహన్ కు. తొలిసారిగా ఆయన 2009లో ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ టికెట్ ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటారు. ఎమ్మెల్యేగా గెలవడంతో తెలుగుదేశం అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ చంద్రబాబు కరణం బలరాంకు టికెట్ ఇవ్వడంతో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమంచి కృష్ణమోహన్ పై గెలిచారు. జగన్ ప్రభంజనంలో సైతం కృష్ణమోహన్ ఓడిపోవడం అప్పట్లో సంచలనం. అయితే టిడిపి నుంచి గెలిచిన కరణం బలరాం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది మొదలు కృష్ణమోహన్ వర్సెస్ కరణం బలరాం అన్నట్టు పరిస్థితి మారింది. అయితే టిడిపి నుంచి వైసీపీలో చేరే క్రమంలో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. ఆ హామీ మేరకు కరణం వెంకటేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో విభేదించారు కృష్ణమోహన్. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు కరణం వెంకటేష్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. బలరాం తన కుమారుడితో టిడిపిలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. చంద్రబాబు సానుకూలంగా ఉన్న ప్రకాశం జిల్లా క్యాడర్ ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో బలరాం వెళ్లిపోతే వైసీపీలోకి వచ్చేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అయితే బలరాం అలానే కొనసాగుతుండడంతో కృష్ణమోహన్ సైతం కాంగ్రెస్లో ఉండిపోవాల్సి వస్తోంది. అయితే దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేం..

Atlantic Ocean Virus: కరోనాను మించి.. సముద్రంలో అంతు చక్కని వైరస్.. ప్రాణాలు పోతున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం..

Atlantic Ocean Virus: సముద్రంలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. వాటితో పాటు కంటికి కనిపించని జంతువులు కూడా ఉంటాయి. ఈ భూభాగంలో ఉన్న సముద్రాలలో శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. సముద్రంలో అంతుచిక్కని జంతువులతోపాటు.. అంతకుమించిన రహస్యాలు ఉంటాయి. మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో రకాలైన వస్తువులు సముద్రం ద్వారా లభిస్తున్నాయి. మనం నిత్యం వాడే ఇంటర్నెట్ కూడా సముద్రం అంతర్భాగంలో ఏర్పాటు చేసిన కేబుల్స్ ద్వారా వస్తూ ఉంటుంది.

కెరటాలు, ‌ అలలు.. విస్తారమైన మత్స్య సంపదకు నిలయమైన సముద్రాలలో ఇప్పుడు వైరస్ కలకలం నెలకొంది. ఈ వైరస్ కు అట్లాంటిక్ సముద్రం కేంద్రంగా మారింది. ఈ సముద్రంలో ప్రయాణం సాగిస్తున్న ఒక క్రుజ్ నౌక లో వైరస్ కలకలం సృష్టిస్తోంది. అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుంది.

అట్లాంటి సముద్రంలోని కానరీ ఐలాండ్స్ కు ప్రయాణిస్తున్న నౌకలో అంట అనే వైరస్ కలకలం రేపుతోంది. 149 మంది ప్రయాణికులు ఈ ఓడలో ప్రయాణిస్తున్నారు. వైరస్ వల్ల ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. మరో 8 మందికి వైరస్ సోకినట్టు సమాచారం. ఈ ఓడలో ఇద్దరు భారతీయులు కూడా ప్రయాణిస్తున్నారు. వారికి సంబంధించిన సమాచారం ఇంతవరకు లేదు. ఈ ఓడలో దాదాపు 23 దేశాలకు సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు.

ఎలుకల ద్వారా ఈ వైరస్ సోకుతూ ఉంటుంది. తీవ్రమైన వ్యాధులకు గురైన ఎలుకలలో ఈ వైరస్ ఉంటుంది. ఇది అంటువ్యాధి లాగా వ్యాపిస్తుంటుంది. ఆ ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా ఈ వైరస్ దొరికింది. అలసట.. తీవ్రమైన జ్వరం.. విపరీతమైన కండరాల నొప్పి.. భరించలేని దగ్గు.. ఊపిరి తిత్తులలో నీరు చేరడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకితే బతకడం కష్టమని వైద్యులు అంటున్నారు. అయితే ఈ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.

Iran War Dolphins: యుద్ధ రంగంలోకి డాల్ఫిన్లు.. ఇరాన్ పెద్ద ప్లానే చేసిందిగా..

వెనుకటి కాలం యుద్ధరంగంలో గుర్రాలను ఉపయోగించేవారు. గుర్రాల మీద సైనికులు ప్రయాణం సాగించేవారు. గాడిదల మీద యుద్ధ సామాగ్రిని రవాణా చేయించేవారు. శత్రువుల అనుపానులు తెలుసుకోవడానికి పక్షులను ఉపయోగించేవారు. గద్దలు, ఇతర పక్షులను వాడేవారు. వాటి ద్వారా శత్రువుల స్థావరాలను కూడా తెలుసుకునేవారు.

ఆధునిక కాలంలో కుక్కలు.. పావురాలతో కూడా యుద్ధాలు చేస్తున్నారు. కాకపోతే వీటి ద్వారా యుద్ధ తంత్రాలను
.. శత్రువుల స్థావరాలను గుర్తిస్తున్నారు. తొలిసారిగా యుద్ధంలోకి డాల్ఫిన్లను వాడుతున్నారు. సముద్రంలో నివసించే ఈ జంతువులు యుద్ధం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయా.. శత్రువుల నౌకలను అమాంతం పేల్చేస్తాయా.. బాంబులను మూసుకుపోయే సామర్థ్యం వీటికి ఉంటుందా.. అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

డాల్ఫిన్లను గతంలో ఆత్మహుతిదాడుల కోసం వాడినట్టు తెలుస్తోంది. తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం అమెరికా ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా డాల్ఫిన్ లను వాడుతో ఉందని తెలుస్తోంది.. సరిగ్గా 2000 సంవత్సరంలో రష్యా నుంచి 27 రకాల జలచరాలను ఇరాన్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన జంతువులలో తెల్ల తిమింగలం.. సీల్స్.. సీ లయన్స్.. డాల్ఫిన్లు వంటివి ఉన్నాయి. ఇవి శత్రు నౌకలను సులభంగా గుర్తిస్తాయి. అవసరమైతే బాంబులను మోసుకెళ్లి దాడులు కూడా చేస్తాయి. వాటికి రష్యా సైనికంగా శిక్షణ ఇచ్చింది. అప్పట్లో జరిగిన యుద్ధంలో సైన్యం తన అవసరాల కోసం ఈ శిక్షణ అందించింది. రష్యాలో బోరిస్ అనే వ్యక్తి వీటికి ఈ విద్య నేర్పించాడు. నేవేస్తపోల్ నౌక స్థావరంలో వీటికి శిక్షణ ఇచ్చేవారు. ఇది క్రిమియా ద్వీపకల్పంలో ఉండేది.

డాల్ఫిన్లు నౌకల శబ్దాలను సులభంగా గుర్తిస్తాయి. శబ్దం ఆధారంగా అవి ఏ దేశానికి చెందినవో వెంటనే అంచనా వేస్తాయి. శత్రు దేశాలకు సంబంధించిన నౌకలను శబ్దాల ద్వారా గుర్తించే డాల్ఫిన్లు.. వెంటనే అది అక్కడికి వెళ్తాయి. వాటిని ఢీ కొట్టి పేల్చివేస్తాయి. అంతేకాదు సముద్రం అడుగు భాగంలో కూడా ఉండే మైన్లను ఇవి వెంటనే గుర్తిస్తాయి.

26 సంవత్సరాల క్రితం నిధులు లేకపోవడం వల్ల శిక్షణ ఇచ్చిన డాల్ఫిన్లను.. ఇతర జలచరాలను ఇరాన్ కు రష్యా విక్రయించింది. బోరిస్ ఇరాన్ వెళ్లిపోయాడు. అక్కడ వాటికి శిక్షణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అవి బతికే అవకాశం లేదని తెలుస్తోంది. నాటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఇరాన్ పునరుద్ధరిస్తుందని అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ కథనాలను అమెరికా రక్షణ శాఖ మంత్రి పూర్తిగా కొట్టి పడేశారు. ఇదంతా కాల్పానిక సాహిత్యం లాగా ఉందని అన్నారు.. ఆ తరహా డాల్ఫిన్లు అమెరికా వద్ద ఉంటే ఉండవచ్చునని.. ఇరాన్ దేశానికి అంతస్థాయి లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు.

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ మంచి నిర్ణయం

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ( APSRTC) ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీనిపై అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందె. దాదాపు ఏడాది సమీపిస్తుంది ఈ ఉచిత పథకానికి. గత సంవత్సరం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అయింది. లక్షలాది మంది మహిళలు ప్రతిరోజు ఆర్టిసి ఉచిత ప్రయాణ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. బస్సులు సైతం మహిళలతో రద్దీగా మారుతున్నాయి. అయితే ప్రయాణికుల రద్దీతో పాటు వేసవి దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా ప్రాంగణంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనలు అందుకుంటుంది. ఈ విషయంలో సంబంధిత మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఎక్కువమంది అభినందిస్తున్నారు. మంచి ఆలోచనగా చెబుతున్నారు.

* వేసవి ప్రయాణాలు..
సాధారణంగా వేసవిలో ప్రయాణాలు అంటేనే ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రయాణాలు అంటే ఇబ్బంది కరం. భారీ ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలుల మధ్య ప్రయాణాలు సాగించడం అంత సులువు కాదు. ఒక్క నీడ మాత్రమే కాదు తాగునీటి సమస్య కూడా ఉంటుంది ఈ కాలంలో. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం సాహస నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణాల్లో భారీ టెంట్ల ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం కూడా.

* ఇబ్బందులు లేకుండా..
చాలా ఆర్టీసీ కాంప్లెక్స్ లలో తాగునీటి వసతి లేదు. ఆపై ప్రయాణికుల రద్దీతో అక్కడ కూర్చునేందుకు కూడా ఖాళీలు కనిపించవు. దీనిని ముందుగానే గుర్తించింది ఏపీ ప్రభుత్వం. అందుకే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణాల్లో భారీ టెంట్లు వేసి.. ప్రత్యేకంగా కొన్ని బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే తాగునీరు కూడా కల్పిస్తున్నారు. ముందుగా పెద్ద నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ లలో ఈ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ చర్యలపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. మంచి ఆలోచన అన్నట్టు ఎక్కువమంది అభినందిస్తున్నారు.

Watermelon Poisoning: పుచ్చకాయ, బిర్యానీ వల్ల కాదట.. ఆ కుటుంబం చనిపోవడం వెనుక జరిగింది ఇదీ

Watermelon Poisoning: బిర్యానీ తిన్న తర్వాత.. పుచ్చకాయను ఆరగించిన తర్వాత ఒక కుటుంబం కన్ను మూసింది. ముంబై నగరంలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయను ఆరగిస్తే ఇంతటి ప్రమాదమా అని అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది ఇటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యానించారు. ఏకంగా నలుగురు చనిపోవడం ఆందోళన కలిగించిందని చాలామంది పోషకాహార నిపుణులు పేర్కొన్నారు.

ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పుచ్చకాయ ధరలు పడిపోయాయి. అనేక పరీక్షల తర్వాత ఆ నలుగురి మరణానికి పుచ్చకాయ కారణం కాదని పరీక్షలలో తెలింది. ఫోరెన్సిక్ టెస్టులలో ఆందోళన కలిగించే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ నలుగురిపై విష ప్రయోగం జరిగిందని.. అందువల్లే వారు చనిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.. ముంబై నగరంలో మొబైల్ దుకాణం నడిపే అబ్దుల్లా.. అతని భార్య.. ఇద్దరు అమ్మాయిలు శనివారం రాత్రి బంధువులతో కలిసి మటన్ బిర్యానీ ఆరగించారు. వారి ఇంటి నుంచి బంధువులు వెళ్లిపోయిన తర్వాత ఆ కుటుంబం అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ తిన్నది. ఆ తర్వాత ఉదయానికి వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. విరోచనాలు కూడా అయ్యాయి. కొద్దిసేపటికి వారంతా ఒకరి తర్వాత ఒకరి చనిపోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

బిర్యాని తిన్న తర్వాత.. పుచ్చకాయ ఆరగించడం ఆరోగ్యానికి మంచిది కాదని అనేకమంది విశ్లేషణలు చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ప్రచారం కూడా జరిగింది. ఆ నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ పరీక్షలో ఎవరూ ఊహించని విధంగా ఆ నలుగురు అత్యంత ప్రాణాంతకమైన ఎలుకల మందు వల్ల చనిపోయారని తెలిసింది. అయితే వారు తిన్న పుచ్చకాయలు ఎలుకలను చంపడానికి ఉపయోగించే రసాయనం ఉన్నట్టు పరీక్షలలో తేలింది. చనిపోయిన వారి మెదడు.. గుండె.. ఇతర అవయవాలు ఆకుపచ్చగా మారిపోయాయి. వారి శరీరాలలో జింక్ పాస్ఫెట్ ఉందని.. అందువల్లే స్వల్ప కాలంలోనే వాడు చనిపోయారని వైద్యులు వెల్లడించారు. పుచ్చకాయలో ఈ రసాయనం ఎలా ఉంది.. దీనిని ఎవరు చేశారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AP DWCRA Women Loans: ఏపీలో డ్వాక్రా సంఘాల సభ్యులకు గుడ్ న్యూస్

AP DWCRA Women Loans: ఏపీలో( Andhra Pradesh) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇంట్లో పిల్లల వివాహానికి గాను బ్యాంకు రుణం అందించనుంది. అది కూడా సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించుకునే వెసుల బాటు కల్పించింది. ఈ మేరకు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనుంది. పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించే ఏర్పాట్లు చేయనుంది. సాధారణంగా పేద ఇళ్లలో వివాహం జరిగితే తప్పకుండా అప్పు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తే వారు డబ్బు కోసం చాలా రకాల వత్తులు చేస్తుంటారు. ఆపై అధిక వడ్డీ వసూలు చేస్తుంటారు. అందుకే ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది.
* దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా రుణం అందనుంది. అన్ని రకాల వివరాలతో కూడిన దరఖాస్తు చేసుకుంటే.. రెండు రోజుల్లో రుణం మంజూరయ్యేలా ఈ పథకాన్ని రూపొందించారు.
* 48 వాయిదాల రూపంలో తిరిగి రుణం చెల్లించాల్సి ఉంటుంది.
* పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణ పరిమితి ఉంది. అవసరం మేరకు రుణం పొందవచ్చు.
* డ్వాక్రా సంఘాల్లో సభ్యురాలిగా అయి ఉండి.. ఇంట్లో ఆడపిల్లలకు వివాహాలు చేసేవారు మాత్రమే అర్హులు.
* కుమార్తెకు వివాహం జరుపుతామనుకుంటే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు, వివాహ ఆహ్వాన పత్రికను జత చేయాల్సి ఉంటుంది.
* అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పిల్లల చదువుల నిమిత్తం కూడా డ్వాక్రా సంఘాల సభ్యులకు సులభ వాయిదా పద్ధతులపై రుణం మంజూరు చేసే అవకాశం ఉంది.
* కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది.

Andhra Pradesh Local Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. ముందుగా వాటికే..

Andhra Pradesh Local Elections: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, నగరపాలక సంస్థలకు సంబంధించిన పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఆరు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలన్నది ఒక నిబంధన. ఇప్పుడు సీఎం చంద్రబాబు తాజా ప్రకటనతో ప్రభుత్వం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నట్లు అర్థం అవుతోంది. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు వస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం వాటి ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది.

* రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాటికి సంబంధించి సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగిసింది. దీంతో సర్పంచులు మాజీలు అయ్యారు. వారి స్థానంలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే 16వ ఆర్థిక సంఘం సమయం ప్రారంభం అయింది. దాదాపు 15 వేల కోట్ల రూపాయల వరకు ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పంచాయితీలకు పాలకవర్గాలు ఉంటేనే ఈ నిధులు మంజూరయ్యేవి. అందుకే వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసి 16వ ఆర్థిక సంఘం నిధులతో.. పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

* రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్ల తో పాటు 123 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి పదవీకాలం మార్చి 17 తో ముగిసింది. ప్రస్తుతం ఆర్డీవో స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో పట్టణాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. వార్డుల విభజనకు సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతోంది.
* ఇక మండల పరిషత్ తో పాటు జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన గడువు జూన్ వరకు ఉంది. మండల పరిషత్ అధ్యక్షులతోపాటు జిల్లా పరిషత్ అధ్యక్షుల పదవీకాలం జూన్ తో ముగియనుంది. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన బాధ్యత జిల్లా పరిషత్ లది. అందుకే వీటి ఎన్నిక సైతం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది
* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనేక రకాల పిటిషన్లు కోర్టుల్లో దాఖలు అయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నాయి. అయితే బీసీ గణన తర్వాత రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం వేసవి తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

TVK MLAs Resignation: అదే గనక జరిగితే.. టీవీకే ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా

TVK MLAs Resignation: తమిళనాడు రాజకీయాలు ఊహకందని విధంగా సాగిపోతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు అంచనాలకు అందని విధంగా ఓట్లు వేస్తే.. ప్రజలకు మించిన స్థాయిలో రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. మధ్యలో గవర్నర్ రంగ ప్రవేశం చేయడంతో అక్కడి రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. ఇప్పటికే గవర్నర్ ను టీవీకే నేతలు రెండుసార్లు కలిశారు. రెండుసార్లు కూడా గవర్నర్ నుంచి టీవీకే నేతలు అంచనా వేసినట్టుగా సమాధానం రాలేదు. దీంతో టీవీ కి నేతలు నిరాశలో మునిగిపోయారు.

గురువారం ప్రమాణ స్వీకారానికి విజయ్ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయినప్పటికీ గవర్నర్ ఒప్పుకోకపోవడంతో ప్రమాణ స్వీకారం రద్దయిపోయింది. అంతేకాదు విజయ్ కి సీఎం స్థాయిలో బందోబస్తు కల్పించిన అధికారులు
.. ఆ తర్వాత కాన్వాయ్ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. మధ్యలోనే ఏఐడీఎంకే, డీఎంకే నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై టీవీకే నేతలు కూడా స్పందిస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీని కాకుండా.. డీఎంకే, అన్నా డీఎంకే నేతలు కలిసి కూటమిగా ఏర్పడి.. వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనుక ఇస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని టీవీకే నేతలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే టీవీకేనేతలు మీడియా ముందు కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఒకవేళ అన్న డిఎంకె, డీఎంకే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనుక గవర్నర్ ఇస్తే మూకుమ్మడిగా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని విజయ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయ్ పార్టీలో మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూకుమ్మడిగా ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమిళనాడు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

ఇటీవల డీఎంకే, అన్నా డీఎంకే నేతలు సమావేశం అయ్యారని.. రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి భావిస్తున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ద్రవిడ సిద్ధాంతాన్ని ఏమాత్రం ప్రచారం చేయకుండానే విజయ్ అధికారంలోకి వచ్చారు. ద్రావిడ సిద్ధాంతం లేకుండా విజయ్ గెలవడం డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు నచ్చడం లేదు. అందువల్లే అవి రెండు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావాలని భావిస్తున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందువల్లే మూకుమ్మడిగా టీవీకే విజయ్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారని తెలుస్తోంది.

Trisha Vijay Controversy: విజయ్ గెలిస్తే త్రిషను ఎందుకు అభినందిస్తున్నారు.. ఈ నటి అడిగిన దాంట్లో న్యాయం ఉంది..

Trisha Vijay Controversy: తమిళనాడు రాష్ట్రానికి విజయ్ సీఎం అవుతారా.. లేదా అనే విషయాలను పక్కన పెడితే.. ఇప్పటికీ అక్కడి రాజకీయాలకు త్రిషతో సంబంధం పెడుతూ చాలామంది మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిష మీద అడ్డంగా నోరు పారేసుకున్నాడు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తన మాటలను వెనక్కి తీసుకున్నారు.

ఇటీవల తమిళనాడు ఎన్నికల సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో విజయ్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది.. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి త్రిష వెళ్లారు. గంటన్నర సేపు అక్కడే ఉన్నారు. అంతకుముందు ఆమె తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి వెళ్లారు. అక్కడ స్వామివారి సేవలో పాల్గొని.. ప్రసాదాన్ని తీసుకొచ్చి విజయ్ కి అందించారు.. ఈ పరిణామం తర్వాత త్రిషకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతకంటే ముందు త్రిష తో విజయ్ కి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి.. దీనిపై విజయ్ మాట్లాడలేదు. త్రిష కూడా స్పందించలేదు. అయితే విడాకుల కేసును కోర్టులో దాఖలు చేసే ముందు విజయ్ భార్య అందులో తన భర్తకు మరో మహిళకు సంబంధం ఉందని పేర్కొంది.

ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ అనేక మీడియా సంస్థలు ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేశాయి. ఇప్పటికి చేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఇటువంటి వ్యవహారాలపై మాట్లాడే విషయంలో సెలబ్రిటీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ అటువంటి సోయి నేటి కాలంలో సెలబ్రిటీలకు లేకుండా పోయింది. విజయ్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించగానే.. చాలామంది సినీ నటులు త్రిషకు శుభాకాంక్షలు చెప్పారు. ఎవరైనా సరే జన్మదినం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాకపోతే విజయ్, త్రిష రిలేషన్ అధికారికంగా కొనసాగుతుందనే అర్థం వచ్చేలా సెలబ్రిటీలు ఆమెకు గ్రీటింగ్స్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని తమిళనటి గాయత్రి శంకర్ తప్పు పట్టారు.

తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత హీరోయిన్ త్రిషను అభినందిస్తున్న వారిపై గాయత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.” ఒకవేళ త్రిష స్థానంలో ఇంకో పురుషుడు గనుక ఉండి ఉంటే ఇలానే ఈ సమాజం అంగీకరిస్తుందా.. తన తోటి నటుడితో సంబంధం పెట్టుకొని.. కుటుంబాన్ని విడదీస్తే ఏ సమాజం మాత్రం ఒప్పుకుంటుంది.. మగాళ్లు మొత్తం తీవ్రమైన కోపంతో రగిలిపోయేవారు. గెలవడం అనే విషయాన్ని పక్కన పెట్టండి.. కనీసం ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు కూడా ఆమె భయపడేదని” గాయత్రి ఆరోపించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరో రకమైన చర్చకు దారితీస్తున్నాయి.

Pawan Kalyan: పవన్ కు పిఠాపురం శాశ్వతం

Pawan Kalyan: రాష్ట్రస్థాయి నాయకులకు శాశ్వతంగా కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో నేతలకు తిరుగు ఉండదు కూడా. ఏపీ సీఎం చంద్రబాబుకు కుప్పం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గాలు అనేవి శాశ్వతం. అక్కడ గెలుపు బాటలకు శాశ్వత పునాదులు ఏర్పాటు చేసుకుంటారు నేతలు. రాజకీయ ప్రారంభ సమయంలో చంద్రబాబు చంద్రగిరి నుంచి బరిలో దిగారు. 1989 నుంచి మాత్రం కుప్పం నియోజకవర్గానికి మారి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం పులివెందుల లో మాత్రమే పోటీ చేస్తూ వచ్చారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చేసింది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. అయితే ఇప్పుడు అటువంటి కంచుకోటగా పిఠాపురం నియోజకవర్గాన్ని మలుచుకోవాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ అభివృద్ధి తో ప్రజల మనసును గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఆ విషయంలో కొంతవరకు వర్కౌట్ అయ్యారు కూడా.

* రాజకీయ అడ్డంకి..
మరోవైపు పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో టిడిపి వర్మ ఒక అడ్డంకి. ఎందుకంటే వర్మ బలమైన నాయకుడు కూడా. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఆయనది. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఈ సీటును కోరుకున్నారు. అప్పుడు కూడా వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి తన ప్రభావాన్ని చూపుతారన్న వార్తలు వచ్చాయి కానీ చంద్రబాబు సముదాయించడంతో ఆయన మెత్తబడి పవన్ కళ్యాణ్ కు సహకరించారు. ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం టిడిపి మార్కు చాటాలని చూశారు పిఠాపురంలో. అయితే దీనికి టిడిపి హై కమాండ్ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. ఇప్పుడు ఏకంగా టిడిపి ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించారు వర్మను. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ముందు చూపుతో వ్యవహరించింది అని అందరికీ తెలిసిన విషయమే. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వర్మను టిడిపి హై కమాండ్ పక్కన పెట్టింది. పిఠాపురం ను పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశం.

* శాశ్వత ఇంటి నిర్మాణం..
పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణం జరుపుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడే భూమి కొని కార్యాలయం తో పాటు సొంత ఇల్లు నిర్మించుకునే పనిలో పడ్డారు. పవన్ వచ్చిన తర్వాత పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కు కళ వచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మాత్రమే పిఠాపురం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఎక్కువ మంది భావిస్తున్నారు. కచ్చితంగా ఆ నియోజకవర్గం కంచుకోటగా మారనుంది. కానీ ఇందుకు అడ్డంకి గా ఉన్న వర్మను సైడ్ చేశారు. తప్పకుండా ఆయనకు సైతం వేరే పొలిటికల్ ఆప్షన్ ఇస్తారు. కూటమితో పాటు టిడిపి పరంగా పవన్ కళ్యాణ్ కు క్లియరెన్స్ ఇచ్చినట్టే.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సాహస నిర్ణయం

Pawan Kalyan: జనసేన బలోపేతం పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు ఇన్చార్జులు, అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని.. పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేయనున్నారు. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కార్యాలయానికి రావడం లేదు పవన్ కళ్యాణ్. కానీ 175 నియోజకవర్గాలకు ఇన్చార్జిలతో పాటు అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని చూస్తున్నారు. జాబితాలను తెప్పించుకుని నేతల సీనియారిటీ, సిన్సియారిటీని పరిశీలిస్తున్నారు.

* సంస్థాగతంగా బలోపేతం..
జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మొన్నటి ఎన్నికల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచారు. మరో రెండు పార్లమెంటు సీట్లను సైతం కైవసం చేసుకున్నారు. అయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు తాత్కాలికంగా ఇన్చార్జిలు కొనసాగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బహుముఖ నాయకత్వం ఉంది. వారు ఏకతాటిపైకి రావడం లేదు. అందుకే ఇన్చార్జిలను నియమించి వారి పరిధిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది మరోవైపు జిల్లాల అధ్యక్షులు నియామకానికి సంబంధించి సామాజిక సమీకరణలను పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం బలంగా ఉంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా ఈసారి రాయలసీమపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అక్కడ 54 నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఇన్చార్జిలను నియమించడం ద్వారా.. పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.

* స్థానిక సంస్థలపై గురి..
స్థానిక సంస్థల్లో సింహభాగం పొందాలన్నది కూడా ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఈసారి జిల్లాలు పెరిగాయి. జిల్లా పరిషత్ స్థానాలు పెరగనున్నాయి. ఆపై 12 కార్పొరేషన్లతో పాటు 100కు పైగా మున్సిపాలిటీలు ఉన్నాయి. తప్పకుండా అందులో చాలా వరకు జనసేన తీసుకోవాలని చూస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తుంటే నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో బాధ్యులు లేరు. పార్టీ జిల్లా అధ్యక్షులు సైతం నామమాత్రంగానే ఉన్నారు. అందుకే ఏకకాలంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలతో పాటు జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలను సైతం ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకొని క్రోడీకరిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ నియామకాలపై ప్రత్యేక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Pakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్ లో బోర్డు తిప్పేస్తున్నారు.. దాయాది ’దుకాణం‘ బంద్

Pakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్‌ అనుసరిస్తున్న విధానాలతో అక్కడి కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా చాలా సంస్థలు మూతపడ్డాయి. ఉగ్రవాదులను పెంచి పోషించడం, ఆఫ్గానిస్తాన్, భారత్‌తో గొడవలు పెట్టుకోవడం, స్థానిక రాజకీయ అస్థిరత తదితర కారణాలతో చాలా ప్రముఖ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన హ్యాంగెంగ్‌ ట్రేడ్‌ కంపెనీ గ్వాదర్‌లోని డాంకీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను మూసివేసింది. ఇరకరడ గాడిదల చర్మాలు, మాంసం చైనాకు ఎగుమతి చేస్తుంది.

కంపెనీ నేపథ్యం
హ్యాంగెంగ్‌ ట్రేడ్‌ 2023లో గ్వాదర్‌ నార్త్‌ ఫ్రీ జోన్‌లో స్థాపించబడింది. చైనా–పాక్‌ ఒప్పందం ప్రకారం ఏటా 2–3 లక్షల గాడిదల చర్మాలు, మాంసం సరఫరా చేయాలి. చైనాలో ఎజియావ్‌ (గాడిద చర్మం)కు డిమాండ్‌ ఎక్కువ.

భారీగా పెట్టుబడి..
50 మిలియన్‌ యువాన్లు (సుమారు 7 మిలియన్‌ ్ఖ ఈ) పెట్టుబడి. అధునాతన స్లాటర్‌హౌస్, 50 కంటైనర్లు/నెల ఎగుమతి లక్ష్యం. గాడిదలు చంపి చర్మాలు శుద్ధి, మాంసం ప్రీజ్‌ చేసి రసాయనాలు కలిపి ఎగుమతి.

మూసివేత కారణాలు
‘నాన్‌–కమర్షియల్‌ ఫ్యాక్టర్లు‘, ఎగుమతి ఆలస్యాలు, అధికారుల సహకారం లేకపోవడం. 3 నెలలు చర్చలు ఫలం కాలేదు. అధికారులు ఇబ్బంది పెడుతుండడంతో మే 1న కంపెనీని చైనా మూసివేసింది. బలూచిస్తాన్‌లో అల్లర్లు, బీఎల్‌ఏ దాడులు కూడా ఇందుకు ఓ కారణం. ఇది చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో కీలకం.

బతిమిలాడుతున్న పాకిస్తాన్‌..
పాక్‌ ప్రధాని షెహ్బాజ్‌ షరీఫ్‌ కార్యాలయం జోక్యం చేసుకుని కంపెనీ మూసివేయొద్దని చైనాను వేడుకుంటోంది. ఏం కావాలన్నా ఇస్తామని కంపెనీ మాత్రం మూసివేద్దని బతిమిలాడుతోంది. ‘చైనా స్నేహితుడు‘ అని ప్రశంసించింది. కంపెనీ మూత పడితే దేశం పరువు పోతుందని ఆందోళన చెందుతోంది.

కంపెనీ మూతపడడం చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు తీవ్ర దెబ్బ, చైనా పెట్టుబదులకు ఆందోళన. పాక్‌ బ్యూరోక్రసీ సమస్యలు, భద్రతా కొరతలు బయటపడ్డాయి. గాడిదల సంఖ్య తగ్గుతున్నా ఒప్పందం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చైనా పెట్టుబదులను ఆపవచ్చు.

Venkatrami Reddy Controversy: ఉద్యోగము లేదు.. జగన్ ఆదరణ లేదు.. పాపం వెంకట్రామిరెడ్డి

Venkatrami Reddy Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగులు వ్యతిరేకం అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి గా పని చేసేవారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికంటే ఎక్కువగా విధేయత చూపేవారు జగన్మోహన్ రెడ్డి పట్ల. ఐదేళ్లపాటు ఒక వెలుగు వెలిగారు ఆయన. కూటమి వచ్చిన తర్వాత కూడా అదే చేష్టలతో ముందుకు వెళ్లారు. అందుకే ఇప్పుడు కూటమి న్యాయపరంగా, సాంకేతికంగా.. పక్కాగా ఆధారాలను సేకరించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. అయితే అప్పటివరకు తనను తాను ఓ స్థాయిలో ఊహించుకున్న వెంకట్రామిరెడ్డి.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో భరోసా లేక.. న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందాలని చూస్తున్నారు. కానీ కూటమి అన్ని ఆధారాలు చూపించడంతో అక్కడ కూడా వర్కౌట్ కావడం లేదు.

* పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్..
ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న వెంకట్రామిరెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పని ఏంటి? అక్కడకు వెళ్లి తరచు మీడియాతో మాట్లాడిన పాత వీడియోలు ఇప్పుడు కోర్టు దృష్టికి వెళ్లడంతో ఆయనకు అక్కడ తగిన రీతిలో సానుకూలత రావడం లేదు. దీంతో ఉద్యోగం కోల్పోయి.. కోర్టుల్లో ఊరట దక్కక ఆయన పడుకున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు కీలకమైన పోస్ట్ దక్కుతుందని ఎంతో ఆశపడ్డారు వెంకట్రామిరెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అంత సీన్ లేదన్నట్టు వదిలేసినట్లు ప్రచారం నడుస్తోంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వారు ఆయనకు ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. అయినా సరే పక్కా ఆధారాలు ఉండడంతో కోర్టులు కూడా పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు.

* ముఖం చాటేసిన జగన్..
సాధారణంగా ఏదైనా ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘం నేతలకు ఆ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. కానీ వెంకట్రామిరెడ్డి విషయంలో భిన్నం కనిపిస్తోంది. వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లు పెట్టేందుకు ఓకే కానీ.. పెద్ద పెద్ద పదవులు అంటే మాత్రం నో ఛాన్స్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నుంచి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఉన్న ఉద్యోగము పోయి.. న్యాయస్థానాల్లో ఊరట దక్కక.. వెంకట్రామిరెడ్డి పడుతున్న బాధ.. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం చేయాలనుకున్న వారికి ఒక గుణపాఠమే…