Homeఅంతర్జాతీయంUkraine attack on Putin: ఉక్రెయిన్ ఊరుకోవడం లేదు.. ఏకంగా పుతిన్ కే.. రష్యాలో కలకలం

Ukraine attack on Putin: ఉక్రెయిన్ ఊరుకోవడం లేదు.. ఏకంగా పుతిన్ కే.. రష్యాలో కలకలం

Ukraine attack on Putin: యూరప్ ప్రాంతంలో ఉక్రెయిన్ ఒక దేశం. యూరప్ లో ఉన్న మిగతా దేశాలతో పోల్చి చూస్తే దీని ఆర్థిక సామర్థ్యం తక్కువే. అయినప్పటికీ కొంతకాలంగా రష్యాతో వెన్ను చూపించకుండా పోరాటం చేస్తోంది. అంతటి బలవంతమైన రష్యా ను సైతం ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో పుతిన్ ముందు వరుసలో ఉంటారు. ఈయనకు అత్యంత భద్రత వలయం […]

Ukraine attack on Putin: యూరప్ ప్రాంతంలో ఉక్రెయిన్ ఒక దేశం. యూరప్ లో ఉన్న మిగతా దేశాలతో పోల్చి చూస్తే దీని ఆర్థిక సామర్థ్యం తక్కువే. అయినప్పటికీ కొంతకాలంగా రష్యాతో వెన్ను చూపించకుండా పోరాటం చేస్తోంది. అంతటి బలవంతమైన రష్యా ను సైతం ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో పుతిన్ ముందు వరుసలో ఉంటారు. ఈయనకు అత్యంత భద్రత వలయం ఉంటుంది. దానిని దాటుకోవడం అంటే అంత ఈజీ కాదు. దానిని ఉక్రెయిన్ చేసి చూపించింది. నోవ్ గోరోడ్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ నివాసంలో పుతిన్ ఉండగా హత్య చేసేందుకు ఉక్రెయిన్ పాల్పడినట్టు రష్యా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆయనను అంత చేయడానికి కుట్ర పన్నినట్టు రష్యా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో బయటికి వెల్లడించలేదు.

ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ పుతిన్ కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అందువల్లే ఆయన విదేశాలలో పర్యటించడం లేదు. దేశంలో కూడా అంతగా కనిపించడం లేదు.. కొన్ని సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పుతిన్ ఎక్కువగా రహస్యమైన ప్రాంతాలలో ఉంటున్నారు. కొన్ని సందర్భాలలో భూగర్భ బంకర్లలో తలదాచుకుంటున్నారు.

పుతిన్ ఉన్న ప్రాంతాలు మిగతా ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఇంటర్నెట్.. ఫోన్.. పంటి సౌకర్యాలపై పూర్తిగా నిషేధం విధించారు. డ్రోన్లతో దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు రష్యాలో కీలకమైన మాస్కో నది పక్కన భారీగా బలగాలను మోహరించారు. దేశంలోని అనేక మంది అధికారులకు రక్షణ మరింత పెంచారు. పుతిన్ ను టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అమెరికన్, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కొట్టి పారేశాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper