Homeజాతీయ వార్తలుTVK MLAs Resignation: అదే గనక జరిగితే.. టీవీకే ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా

TVK MLAs Resignation: అదే గనక జరిగితే.. టీవీకే ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా

TVK MLAs Resignation: తమిళనాడు రాజకీయాలు ఊహకందని విధంగా సాగిపోతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు అంచనాలకు అందని విధంగా ఓట్లు వేస్తే.. ప్రజలకు మించిన స్థాయిలో రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. మధ్యలో గవర్నర్ రంగ ప్రవేశం చేయడంతో అక్కడి రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. ఇప్పటికే గవర్నర్ ను టీవీకే నేతలు రెండుసార్లు కలిశారు. రెండుసార్లు కూడా గవర్నర్ నుంచి టీవీకే నేతలు అంచనా వేసినట్టుగా సమాధానం రాలేదు. దీంతో టీవీ కి నేతలు నిరాశలో మునిగిపోయారు. […]

TVK MLAs Resignation: తమిళనాడు రాజకీయాలు ఊహకందని విధంగా సాగిపోతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు అంచనాలకు అందని విధంగా ఓట్లు వేస్తే.. ప్రజలకు మించిన స్థాయిలో రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. మధ్యలో గవర్నర్ రంగ ప్రవేశం చేయడంతో అక్కడి రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. ఇప్పటికే గవర్నర్ ను టీవీకే నేతలు రెండుసార్లు కలిశారు. రెండుసార్లు కూడా గవర్నర్ నుంచి టీవీకే నేతలు అంచనా వేసినట్టుగా సమాధానం రాలేదు. దీంతో టీవీ కి నేతలు నిరాశలో మునిగిపోయారు.

గురువారం ప్రమాణ స్వీకారానికి విజయ్ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయినప్పటికీ గవర్నర్ ఒప్పుకోకపోవడంతో ప్రమాణ స్వీకారం రద్దయిపోయింది. అంతేకాదు విజయ్ కి సీఎం స్థాయిలో బందోబస్తు కల్పించిన అధికారులు
.. ఆ తర్వాత కాన్వాయ్ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. మధ్యలోనే ఏఐడీఎంకే, డీఎంకే నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై టీవీకే నేతలు కూడా స్పందిస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీని కాకుండా.. డీఎంకే, అన్నా డీఎంకే నేతలు కలిసి కూటమిగా ఏర్పడి.. వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనుక ఇస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని టీవీకే నేతలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే టీవీకేనేతలు మీడియా ముందు కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఒకవేళ అన్న డిఎంకె, డీఎంకే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనుక గవర్నర్ ఇస్తే మూకుమ్మడిగా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని విజయ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయ్ పార్టీలో మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూకుమ్మడిగా ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమిళనాడు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

ఇటీవల డీఎంకే, అన్నా డీఎంకే నేతలు సమావేశం అయ్యారని.. రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి భావిస్తున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ద్రవిడ సిద్ధాంతాన్ని ఏమాత్రం ప్రచారం చేయకుండానే విజయ్ అధికారంలోకి వచ్చారు. ద్రావిడ సిద్ధాంతం లేకుండా విజయ్ గెలవడం డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు నచ్చడం లేదు. అందువల్లే అవి రెండు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావాలని భావిస్తున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందువల్లే మూకుమ్మడిగా టీవీకే విజయ్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper