Homeఅంతర్జాతీయంIran War Dolphins: యుద్ధ రంగంలోకి డాల్ఫిన్లు.. ఇరాన్ పెద్ద ప్లానే చేసిందిగా..

Iran War Dolphins: యుద్ధ రంగంలోకి డాల్ఫిన్లు.. ఇరాన్ పెద్ద ప్లానే చేసిందిగా..

వెనుకటి కాలం యుద్ధరంగంలో గుర్రాలను ఉపయోగించేవారు. గుర్రాల మీద సైనికులు ప్రయాణం సాగించేవారు. గాడిదల మీద యుద్ధ సామాగ్రిని రవాణా చేయించేవారు. శత్రువుల అనుపానులు తెలుసుకోవడానికి పక్షులను ఉపయోగించేవారు. గద్దలు, ఇతర పక్షులను వాడేవారు. వాటి ద్వారా శత్రువుల స్థావరాలను కూడా తెలుసుకునేవారు. ఆధునిక కాలంలో కుక్కలు.. పావురాలతో కూడా యుద్ధాలు చేస్తున్నారు. కాకపోతే వీటి ద్వారా యుద్ధ తంత్రాలను .. శత్రువుల స్థావరాలను గుర్తిస్తున్నారు. తొలిసారిగా యుద్ధంలోకి డాల్ఫిన్లను వాడుతున్నారు. సముద్రంలో నివసించే ఈ జంతువులు […]

వెనుకటి కాలం యుద్ధరంగంలో గుర్రాలను ఉపయోగించేవారు. గుర్రాల మీద సైనికులు ప్రయాణం సాగించేవారు. గాడిదల మీద యుద్ధ సామాగ్రిని రవాణా చేయించేవారు. శత్రువుల అనుపానులు తెలుసుకోవడానికి పక్షులను ఉపయోగించేవారు. గద్దలు, ఇతర పక్షులను వాడేవారు. వాటి ద్వారా శత్రువుల స్థావరాలను కూడా తెలుసుకునేవారు.

ఆధునిక కాలంలో కుక్కలు.. పావురాలతో కూడా యుద్ధాలు చేస్తున్నారు. కాకపోతే వీటి ద్వారా యుద్ధ తంత్రాలను
.. శత్రువుల స్థావరాలను గుర్తిస్తున్నారు. తొలిసారిగా యుద్ధంలోకి డాల్ఫిన్లను వాడుతున్నారు. సముద్రంలో నివసించే ఈ జంతువులు యుద్ధం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయా.. శత్రువుల నౌకలను అమాంతం పేల్చేస్తాయా.. బాంబులను మూసుకుపోయే సామర్థ్యం వీటికి ఉంటుందా.. అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

డాల్ఫిన్లను గతంలో ఆత్మహుతిదాడుల కోసం వాడినట్టు తెలుస్తోంది. తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం అమెరికా ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా డాల్ఫిన్ లను వాడుతో ఉందని తెలుస్తోంది.. సరిగ్గా 2000 సంవత్సరంలో రష్యా నుంచి 27 రకాల జలచరాలను ఇరాన్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన జంతువులలో తెల్ల తిమింగలం.. సీల్స్.. సీ లయన్స్.. డాల్ఫిన్లు వంటివి ఉన్నాయి. ఇవి శత్రు నౌకలను సులభంగా గుర్తిస్తాయి. అవసరమైతే బాంబులను మోసుకెళ్లి దాడులు కూడా చేస్తాయి. వాటికి రష్యా సైనికంగా శిక్షణ ఇచ్చింది. అప్పట్లో జరిగిన యుద్ధంలో సైన్యం తన అవసరాల కోసం ఈ శిక్షణ అందించింది. రష్యాలో బోరిస్ అనే వ్యక్తి వీటికి ఈ విద్య నేర్పించాడు. నేవేస్తపోల్ నౌక స్థావరంలో వీటికి శిక్షణ ఇచ్చేవారు. ఇది క్రిమియా ద్వీపకల్పంలో ఉండేది.

డాల్ఫిన్లు నౌకల శబ్దాలను సులభంగా గుర్తిస్తాయి. శబ్దం ఆధారంగా అవి ఏ దేశానికి చెందినవో వెంటనే అంచనా వేస్తాయి. శత్రు దేశాలకు సంబంధించిన నౌకలను శబ్దాల ద్వారా గుర్తించే డాల్ఫిన్లు.. వెంటనే అది అక్కడికి వెళ్తాయి. వాటిని ఢీ కొట్టి పేల్చివేస్తాయి. అంతేకాదు సముద్రం అడుగు భాగంలో కూడా ఉండే మైన్లను ఇవి వెంటనే గుర్తిస్తాయి.

26 సంవత్సరాల క్రితం నిధులు లేకపోవడం వల్ల శిక్షణ ఇచ్చిన డాల్ఫిన్లను.. ఇతర జలచరాలను ఇరాన్ కు రష్యా విక్రయించింది. బోరిస్ ఇరాన్ వెళ్లిపోయాడు. అక్కడ వాటికి శిక్షణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అవి బతికే అవకాశం లేదని తెలుస్తోంది. నాటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఇరాన్ పునరుద్ధరిస్తుందని అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ కథనాలను అమెరికా రక్షణ శాఖ మంత్రి పూర్తిగా కొట్టి పడేశారు. ఇదంతా కాల్పానిక సాహిత్యం లాగా ఉందని అన్నారు.. ఆ తరహా డాల్ఫిన్లు అమెరికా వద్ద ఉంటే ఉండవచ్చునని.. ఇరాన్ దేశానికి అంతస్థాయి లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper