Home Blog Page 294

Fish Market Viral Video: చేపలంటే మీకు ఇష్టమా.. ఈ వీడియో చూస్తే జన్మలో కొనరు

Fish Market Viral Video: మనలో చాలామందికి చేపలు ఉంటే విపరీతమైన ఇష్టం. చేపల్లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. అవి తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. పైగా వాటిల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. చేపలు కంటి చూపును పెంపొందిస్తాయి. అందువల్లే వాటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.

చేపలు సముద్ర ప్రాంతంలో విస్తారంగా లభిస్తాయి. నదుల ప్రాంతంలో కూడా లభిస్తాయి.. చెరువులు, ఇతర నీటి వనరుల ప్రాంతంలో కూడా చేపలు సమృద్ధిగా ఉంటాయి. నీటి ఆధారంగా చేపల రుచి మారుతూ ఉంటుంది. చేపలను కొంతమంది వేపుడు చేసుకొని తింటారు. మరి కొంతమంది పులుసుగా తింటారు. ఇంకొంతమంది నిలువ పచ్చడి పెట్టుకొని తింటారు. ఎలా తిన్నా సరే చేపలు రుచికరంగానే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చేపలను అధికంగా తింటూ ఉంటారు.

ఒకప్పుడు చేపలకు ఇంతగా డిమాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో ప్రత్యేకంగా చెరువులు తవ్వించి.. చేపలను పెంచుతున్నారు. అందులో కొర్రమీను నుంచి మొదలుపెడితే బొచ్చే వరకు అన్ని రకాల చేపలు ఉంటాయి.

ఇక వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందు గోదావరి నదీ ప్రవాహానికి ఎదురు ఈదే పులస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోదావరి నీరు ఎరుపు రంగు అలముకున్న తర్వాత పులస జాలర్ల వలలకు చిక్కుతుంది. ఆ సమయంలో ఆ చేపల రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు చేపల గురించి మీరు చదివారు కదా. ఇప్పుడు చేపలు అమ్మే వాళ్ల గురించి.. వాళ్ళు వచ్చేసే మోసం గురించి చదవండి.

సాధారణంగా చేపలు నీళ్లలో పెరుగుతాయి. వలలకు చిక్కిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఆ సమయంలో అవి చాలావరకు బరువు తగ్గిపోతాయి. అయితే కొంతమంది వ్యాపారులు చనిపోయిన చేపల నోట్లో నీళ్లు పోస్తున్నారు. ఇలా నీళ్లు పోయడం ద్వారా చేపలు బరువు అధికంగా ఉంటాయి. తద్వారా కొనుగోలు చేసిన వారు మోసపోక తప్పదు. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. అయితే ఈ సంఘటన మన దగ్గర కాదు.. బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడ వ్యాపారులు చేపలను అమ్ముతుండగా.. కొందరు వాటి నీటిలో నీళ్లు పోస్తూ కనిపించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by telugubyts (@telugubyts)

People charging phones from transformer: ఏకంగా ట్రాన్స్ ఫార్మర్ తోనే ఆ పని ..మీ గుండెలు బతకాలి రా

People charging phones from transformer: విద్యుత్ ను తయారు చేసింది విలియం గిల్బర్ట్.. అతడు ఒకవేళ బతికి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కిందపడి గిలగిలా కొట్టుకునేవాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అటువంటిది కాబట్టి. కరెంటుతో ఎవరైనా సరే విద్యుత్ దీపాలు వెలిగించుకుంటారు. అనేక రకాల పనులు చేసుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం ప్రపంచం మొత్తం నోరు వెళ్ళబెట్టే విధంగా.. ఆశ్చర్యంతో చూసే విధంగా.. ఓరయ్య మీకో దండం.. ఆపండ్రా బాబు అన్నట్టుగా పనిచేశారు.

అది బీహార్ రాష్ట్రం. ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలోకి కరెంటు సరఫరా సరిగా అవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కరెంటు వచ్చినప్పటికీ .. కొద్దిసేపు మాత్రమే ఉంటోంది. అక్కడ సరఫరాలో నిరంతరం సమస్యలు ఉండడంతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది పెరిగిపోయింది. కరెంటు ఉన్నతసేపు ఫోన్ లను చార్జింగ్ పెడుతున్నారు అక్కడి యువకులు. కరెంటు పోతే వారి కష్టాలు మామూలుగా ఉండడం లేదు. అందువల్లే ఒక పని చేశారు.

వారి గ్రామానికి కొంత దూరంలో ఉన్న మరో ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లారు. అక్కడ చిన్నపాటి రెండు తీగలను ఏర్పాటు చేశారు. వాటిని సాకెట్ మాదిరిగా అమర్చారు. అలా అనేక కనెక్షన్లు రూపొందించారు. అక్కడ తమ ఫోన్ లను చార్జింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 50 నుంచి 100 వరకు ఫోన్లు అక్కడ నిత్యం చార్జ్ అవుతూనే ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లడమే ప్రమాదకరం అనుకుంటే.. బీహార్ యువకులు ఏకంగా చార్జింగ్ కోసం సాకెట్ ఏర్పాటు చేసి.. దానిని రకరకాలుగా మార్చేశారు.

బీహార్ యువకులు ఫోన్లను చార్జింగ్ పెడుతున్న తీరును కొంతమంది వీడియో తీశారు. దానిని కాస్త సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది దెబ్బకు చర్చకు దారి తీయడం మొదలుపెట్టింది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని కొంతమంది అంటుంటే.. విద్యుత్ సృష్టించిన వ్యక్తి కూడా ఈ స్థాయిలో ఆలోచించడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఇలాంటి విధానాలు సరికావని.. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉందని నెటిజన్లు వాపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Spotlight orbit (@spotlight.orbitt)

Indians spending too much on gold: మోడీ చెప్పింది కరెక్టే.. బంగారం పిచ్చితో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో తెలుసా..

Indians spending too much on gold: ‘బంగారం ఏడాది పాటు కొనడం మానేయండి. బంగారం కొనుగోలు చేయడం వల్ల దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయకుండా భారతీయులు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది..’ హైదరాబాదులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన సూచన ఇది.

వాస్తవానికి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో ధర తగ్గినప్పటికీ.. కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. బంగారం ధర పెరగడం వల్ల దిగుమతులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. దీనివల్ల బంగారం కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోంది. అందువల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో పరోక్షంగా ప్రస్తావించారు.

బంగారం మాత్రమే కాదు, వెండి కూడా విపరీతంగా పెరుగుతుంది.. బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల దిగుమతులు కూడా అభ్యస్థాయిలో ఉంటున్నాయి. ఈ సంవత్సరంలో దేశీయంగా బంగారం దిగుమతులు స్థాయిని దాటిపోయాయి. దిగుమతుల విలువ ఏకంగా 24 శాతం పెరిగింది. మొత్తంగా 71.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మన దేశీయ నగదు విలువ తొలగిస్తే అది అక్షరాల 6,04,632 కోట్లకు చేరుకుంది. 2025లో ఈ విలువ 58 బిలియన్ డాలర్లుగా ఉండేది. దీనిని బట్టి బంగారం దిగుమతులు మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఒత్తిడి కలిగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పరిమాణపరంగా కూడా బంగారం దిగుమతులు 4.76 తగ్గినప్పటికీ.. మనదేశ నిలువలలో బంగారం 721.03 టన్నులకు చేరుకుంది. వెండి దిగుమతులు మాత్రం ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఏకంగా 150 శాతం పెరిగిపోయి.. వెండి నిల్వలు 12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటివల్ల దేశీయంగా వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. మన దేశానికి బంగారం స్విజర్లాండ్ నుంచి అత్యధికంగా 40 శాతం, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం బంగారం దిగుమతి అవుతోంది.

Mahesh Babu career mistakes: ఆ టైమ్ లో మహేష్ బాబు ను రాంగ్ రూట్ లోకి తీసుకెళ్ళిందేవరు..

Mahesh Babu career mistakes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మహేష్ బాబు లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడ. ఇకు ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దాంతో తన పంథా ను మార్చుకొని డిఫరెంట్ స్టైల్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఎక్స్పరిమెంటల్ సినిమాలను కూడా చేశాడు అవి కూడా ఆయనకు సక్సెస్ లను కట్టబెట్టలేదు. దాంతో ఎలాగైనా సరే భారీ విజయాలను దక్కించుకోవాలని మాస్ అవతారమైతే ఎత్తాడు. ఇక మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ స్టోరీలను ఎంచుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు తన సన్నిహితులు కొంతమంది అలాంటి కథలు తనకి సెట్ అవ్వవని చెప్పారట.

కృష్ణ గారు సైతం మహేష్ బాబుకి ఎలాంటి కథలైతే బాగుంటాయి అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను చేయించాడు. అయితే అవి అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధించలేదు. అతడు సినిమా నుంచి మహేష్ బాబు స్టోరీల సెలక్షన్లో తను కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాడు.

అప్పటినుంచి ఆయనకు వరుసగా మంచి విజయాలు వస్తున్నాయి. కృష్ణ సలహాలు, సూచనలు తీసుకున్న కూడా మహేష్ బాబు డెసిజన్ ను ఫైనల్ గా పెట్టుకొని ముందుకు సాగుతూ వచ్చాడు. తద్వారా ఆయన ఇండస్ట్రీలో ఉన్న భారీ రికార్డులను కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…మహేష్ బాబుకి అలాంటి సినిమాలు సెట్ అవ్వవని తన సన్నిహితులు చెప్పడం వల్లే మహేష్ బాబు చాలా మంచి సినిమాలైతే వదులుకున్నాడు.

ఫలితంగా సక్సెస్ఫుల్ సినిమాలను వదులుకొని ఫెయిల్యూర్ సినిమాలను చేయాల్సి వచ్చిందని ఆయన ఒక సందర్భంలో తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తను ఓన్ డిసీజనే ఫైనల్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ హీరోగా నిలబడ్డాడు…

Balakrishna latest movie target: బాలయ్య టార్గెట్ అదేనా..సీనియర్ హీరోలను వెనక్కి నెట్టబోతున్నాడా..

Balakrishna latest movie target: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఉన్న క్రేజీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… కొరటాల శివ ఈ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. బాలయ్య బాబు కెరియర్లో సైతం ఆ రేంజ్ కలెక్షన్స్ ను ఇప్పటివరకు రాలేదు. కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి బాలయ్య బాబు కెరియర్లో సూపర్ సక్సెస్ గా నిలిస్తే మాత్రం అతను సీనియర్ హీరోలకు సైతం పోటీని ఇచ్చిన వాడవుతాడు.

ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ ముందు వరుసలో ఉన్నారు. గత సంవత్సరం వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక ఈ సంవత్సరం చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు తన రేంజ్ ను పెంచుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది.

ఎందుకంటే తన తోటి హీరోలను బీట్ చేసి వెళుతున్నప్పుడు తను కూడా తన పంథాను మార్చుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టే సినిమాలను చేయాలి. అందుకే కొరటాల శివతో జతకడుతున్నట్టుగా తెలుస్తుంది… ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. బాలయ్య గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి.

కాబట్టి ఈ సినిమాలతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి టాప్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా నందమూరి అభిమానులను అలరించింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు…

Balakrishna Koratala Siva movie: బాలయ్య – కొరటాల మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న స్టార్ హీరో..

Balakrishna Koratala Siva movie: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన ప్రతి సినిమాలో తనను తాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉండబోతుందట. బాలయ్య బాబు ఈ సినిమాతో ఒక సోషల్ మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు. కాబట్టి ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ అటు బాలయ్య బాబు అభిమానులు ఇటు కొరటాల శివ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…

ఇప్పటివరకు కొరటాల శివ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఒక ఆచార్య సినిమాను మినహాయిస్తే ఆయనకు 100% సక్సెస్ రేటు ఉందనే చెప్పాలి… ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరోని కూడా బాగా చేయబోతున్నారట. మొత్తానికైతే వాళ్ళు ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు.

కాబట్టి ఈ సినిమాకి మరొక యంగ్ హీరోని కూడా యాడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడట. 15 నిమిషాల పాటు తన క్యారెక్టర్ ఉంటుందంట. ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దర్శకుడు ఆ పాత్రను ఎలా తీర్చిదిద్దాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక బాలయ్య బాబుకు సిద్దు జొన్నలగడ్డ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధమైతే ఉంది…

కాబట్టి ఆయన కొరటాల సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొరటాల శివ ఇంతకుముందు చేసిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనుకున్నప్పటికి అది ఒక మోస్తారు సక్సెస్ గానే మారింది. కాబట్టి ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

Mahesh Babu directors controversy: ఆ ఇద్దరు దర్శకులను వాడుకొని హ్యాండ్ ఇచ్చిన మహేష్ బాబు..

Mahesh Babu directors controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన వీలైనంత తొందరగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెడితే ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా అతన్ని ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మార్చే ప్రయత్నం చేస్తుంది… మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో చాలామంది దర్శకులు అతనికి సూపర్ సక్సెస్ లను అందించారు. అందులో కొంతమందికి ఆయన రిపీటెడ్ గా చాన్స్లైతే ఇచ్చాడు. వాళ్ళలో కొంతమంది ప్రూవ్ చేసుకుంటే మరి కొంత మంది మాత్రం అతనికి భారీ ప్లాప్ లను కట్టబెట్టారు. ఇక ఈ క్రమంలోనే పోకిరి సినిమాతో మహేష్ బాబు కి ఇండస్ట్రీ హిట్ ని అందించిన పూరి జగన్నాథ్ తో బిజినెస్ మాన్ అనే సినిమా చేసి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

వీళ్ళిద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. మహేష్ బాబు అభిమానులు సైతం పూరి జగన్నాథ్ తో సినిమా అంటే సంబరపడిపోతారు. అలాంటిది మహేష్ బాబు పూరి జగన్నాథ్ మీద కోపంతో అతనికి సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు.

ఇక కొరటాల శివ తో సైతం మహేష్ బాబుకి చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు శ్రీమంతుడు, భరత్ అనే నేను రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సాధించాయి. అయితే కొరటాల శివ సినిమాల్లో ఆచార్య, దేవర లాంటి సినిమాలతో కొంతవరకు తడబడటంతో మహేష్ బాబు అతనికి ఛాన్స్ ఇస్తాడని అనుకున్నాడు.

కానీ మహేష్ బాబు మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కొరటాల శివతో సినిమా చేసే అవకాశం లేదని చెప్పారట. దాంతో ఆయన ప్రస్తుతం బాలయ్య బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇలా మహేష్ బాబు తనకు భారీ సక్సెస్ లను అందించిన దర్శకులకు హ్యాండ్ ఇచ్చాడు అంటు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

Yanamala Ramakrishnudu : యనమలపై గొప్ప బాధ్యతలు పెట్టిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు.. అయితే మొన్నటి ఎన్నికల్లో చాలా తక్కువ మంది మాత్రమే పోటీ చేశారు. తమ వారసులను బరిలోకి దించి పక్కకు తప్పుకున్నారు. అటువంటి వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. మంత్రిగా, స్పీకర్ గా, పిఎసి చైర్మన్ గా ఇలా సుదీర్ఘ పదవులను చేపట్టారు యనమల రామకృష్ణుడు. చివరిగా ఆయనకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉంది. రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యనమల రామకృష్ణుడుకు ప్రాధాన్యత తగ్గించారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఇటువంటి సమయంలోనే చంద్రబాబు యనమలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

* మహానాడు తీర్మానాలు బాధ్యత..
ఈనెల చివరిలో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. మూడు రోజులపాటు పండుగ వాతావరణం లో మహానాడు వేడుకలు జరుగుతాయి. జాతీయ అంశాలతో పాటు రాష్ట్రస్థాయి అంశాలను ఈ మహానాడులో చర్చిస్తారు. ప్రతి విషయం మీద తీర్మానాలు పెడతారు. రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల మీద ఈ తీర్మానాలు ఉంటాయి. అయితే ఈ తీర్మానాలను తయారు చేసే బాధ్యతను యనమల రామకృష్ణుడు పై పెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు. మహానాడు కన్వీనర్ గా ఆయనకు చాన్స్ ఇచ్చారు. దీంతో త్వరలో యనమలకు పెద్ద పదవి రానుందని స్పష్టమవుతోంది. మహానాడు బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

* సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వచ్చారు యనమల రామకృష్ణుడు. 1983 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1994లో మాత్రం ఆయన శాసనసభ స్పీకర్ అయ్యారు. ఆ సమయంలోనే టిడిపి సంక్షోభం ఎదురయింది. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం వెనుక యనమల రామకృష్ణుడు కృషి ఉంది. అందుకే యనమలకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు చంద్రబాబు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2019 నుంచి ఆయన పోటీ చేయడం లేదు. 2024 ఎన్నికల్లో తన వారసురాలిగా కుమార్తెను రంగంలోకి దించి గెలిపించుకున్నారు. రాజ్యసభ పదవి కోసం ఆశావహుడిగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే కీలకమైన మహానాడు బాధ్యతలు ఆయనకు ఇవ్వడం చూస్తుంటే.. ఆయన అనుకున్న పదవి సాధించడం ఖాయమని స్పష్టం అవుతుంది

Duvvada Srinivas : విజయ్ తో పోల్చుకుంటున్న దువ్వాడ

Duvvada Srinivas : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పట్ల ఆరాధనాభావంతోనే ఉన్నారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతానని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మిగతా సీనియర్ల అభ్యంతరాలతో జగన్మోహన్ రెడ్డి దువ్వాడను దూరం పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు. తనను పార్టీలోకి తీసుకోవాలని.. లేకున్నా తాను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి ఉంటానని చెప్పారు. కుటుంబ వ్యక్తిగత వ్యవహార శైలి తోనే దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలుపుతో ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నానని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్.

* వ్యక్తిగత వ్యవహారంతోనే సస్పెన్షన్…
దువ్వాడ శ్రీనివాస్ కు భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కానీ ఆయన దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబ వివాదంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు విజయ్ గెలుపును ఉదహరిస్తున్నారు దువ్వాడ. విజయ్ వ్యక్తిగత కుటుంబ వివాదం సైతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నటి త్రిష తో విజయ్ కు ఉన్న సంబంధం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అయినా సరే అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ ను గెలిపించారు. ఇప్పుడు విజయ్ మాదిరిగా తనను కూడా ప్రజలు గెలిపిస్తారని చెబుతున్నారు దువ్వాడ.

* ప్రజలు ఆదరిస్తారని..
వ్యక్తిగత జీవితంతో రాజకీయాలకు ముడిపెట్టకూడదు అనేది దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయం. విజయ్ ను తమిళ్ నాడు ప్రజలు గెలిపించారని… తనను కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలు గెలిపిస్తారని నమ్మకం గా చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పటికే విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సైతం విజయ్ ను గుర్తుచేస్తూ.. తనను ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అభిప్రాయం మాత్రం వేరేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీలోకి తీసుకుంటే.. శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలు బయటకు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది.

Nani Paradise movie : నాని రేంజ్ మారిపోయిందా…కలెక్షన్స్ విషయమేంటి…

Nani Paradise movie : న్యాచురల్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు నాని… అష్ట చమ్మ సినిమాతో హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత వరుస సక్సెస్ లను సాధించాడు. అయితే ఒకానొక సమయంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుడిని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ ను అందుకునే దిశలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

వీళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందే ‘దసర’ సినిమా వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. అయితే ఈ సినిమాతో హిట్ కాంబో గా నిలిచిన వీళ్లు ఇప్పుడు చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తారనేది తెలియాల్సి ఉంది.

నాని వరుస సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి ఆయన సినిమాకి వచ్చే కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. నిన్న మొన్న వచ్చిన తేజ సజ్జా లాంటి వారు సైతం ఈజీగా వందల కోట్ల కలెక్షన్స్ ని రాపడుతుంటే నాని మాత్రం చాలా వరకు వెనకబడిపోతున్నాడు. ఆయన సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ని సంపాదించుకున్న 100 కోట్లు కలెక్ట్ చేయడం గగనంగా మారిపోయింది.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్యారడైజ్ సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడతాననే నమ్మకంతో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ప్యారడైజ్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం నాని టైర్ వన్ హీరోగా మారిపోతాడు. లేకపోతే మాత్రం మరోసారి తను చాలా వరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ మూవీ తర్వాత ఆయన సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండటం విశేషం…

Hardik Pandya Mumbai Indians : హార్థిక్ పాండ్యా ను సాగనంపినట్టే.. వచ్చే సీజన్లో MI కి కొత్త కెప్టెన్

Hardik Pandya Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఈ జట్టు భవితవ్యం హార్దిక్ పాండ్యా నాయకత్వంలో కూడా మారలేదు. హార్దిక్ పాండ్యా 2024లో జట్టుకు సారథిగా వచ్చాడు. నాటి సీజన్లో ముంబై జట్టు అధమ స్థాయిలో ఉన్న నేపథ్యంలో విపరీతంగా విమర్శలు వచ్చాయి… ఈ నేపథ్యంలో ముంబై జట్టు ఆట తీరు చాలా వరకు మార్చుకుంది.. ఫలితంగా 2025లో నాలుగో స్థానానికి వచ్చింది.

2025లో గొప్పగా ఆడిన ముంబై జట్టు.. 2026లో మాత్రం ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. జట్టులో ఆటగాళ్ల ప్రదర్శన ఏ మాత్రం బాగోలేదు. రికెల్టన్ నుంచి మొదలు పెడితే నమన్ వరకు ఉన్నప్పటికీ ఎవరు కూడా సరిగ్గా ప్రదర్శన చేయడం లేదు. బ్యాటింగ్లో విఫలమవుతున్నారు. బౌలింగ్ లోనూ విఫలమవుతున్నారు..

ఇటీవల మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. దీంతో మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చి సూర్య కుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగించారు. అతని ఆధ్వర్యంలో ఒక విజయం సాధించిన ముంబై జట్టు.. కీలకమైన మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ఇలా కీలకమైన దశలో ఓడిపోవడంతో ముంబై జట్టు ఇంటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో ముంబై జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా మీద తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. జట్టులో విభేదాల వల్ల హార్దిక్ పాండ్యా కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అందువల్లే అతడు ఇంస్టాగ్రామ్ లో ముంబై ఇండియన్స్ పేజీని అన్ ఫాలో చేశాడు. మళ్లీ ఫాలో అయ్యాడు. ఇది సాంకేతిక సమస్యా.. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. లక్నో జట్టుతో.. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లకు హార్దిక్ పాండ్యా ఇప్పటికే దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తొలగించి.. సూర్య కుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ముంబై ఇండియన్స్..మేనేజ్మెంట్ ప్రకటన చేయలేదు.

సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను అందుకోవడానికి సానుకూలంగా ఉన్నాడా.. అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగతంగా ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. అతడి వ్యక్తిగత ఫామ్ కూడా అంత గొప్పగా లేదు. అందువల్ల అతడిని ముంబై మేనేజ్మెంట్ సారధిగా కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావాలంటే ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

Narendra Modi gold appeal : ఏడాదిపాటు ఆ ఒక్కటి కొనొద్దు.. మోదీ పిలుపు!

Narendra Modi gold appeal : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో జరిగిన సభలో ఒక అసాధారణమైన, కానీ అత్యవసరమైన పిలిచింపు ఇచ్చారు.. ఏడాది పాటు బంగారం కొనొద్దని దేశ ప్రజలను కోరారు. ఈ పిలుపు ఎప్పుడూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో బంగారం కొనుగోలు భారీగా పడిపోయాయి. ఇతరుణంలో మోదీ బంగారం కొనవద్దని సూచించడం వెనుక కారణం ఏమిటని ఆరా తీస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సలహా కాదు, ఇది దేశభక్తికి ఒక పరీక్ష.

అత్యవసర సమయంలో బాధ్యత..
అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందని మోదీ స్పష్టం చేశారు. ఇది కేవలం ధరల పెరుగుదల గురించి మాట్లాడటం కాదు. ఇది దేశ ఆర్థిక భద్రత గురించి. ఏ ఫంక్షన్‌ ఉన్నా బంగారం కొనొద్దు.. ప్రజలు ఈ మేరకు శపథం చేయాలని ఆయన కోరారు.

విదేశీ మారకద్రవ్యం కోసమే..
బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది. పెరిగిన ధరలతో బంగారం దిగుమతికి కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కలిసిరావడం లేదు. డాలర్‌ విలువ పెరుగుతోంది, అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ఈ సమయంలో బంగారం దిగుమతులు తగ్గించడం దేశ ఆర్థిక భద్రతకు కీలకం. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది.. రాగి కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇది పరిశ్రమలకు, నిర్మాణ రంగానికి, భవిష్యత్తు వికాసానికి ఇబ్బందిగా మారింది. మనం ఇప్పుడు చర్య తీసుకోకపోతే, భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యలు ఎదురవుతాయి.

మధ్య తరగతే దేశానికి ఆర్థిక శక్తి..
మోదీ మధ్యతరగతి వారిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది క్లిష్టమైన సమయంలో మధ్యతరగతి బాధ్యత. మధ్యతరగతి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన శక్తి, మరియు ఈ సమయంలో దేశానికి సహాయపడటం వారి బాధ్యత. అదే సమయంలో వంట నూనె వాడకం తగ్గించుకుంటే మంచిదని సూచించారు. ఇది కేవలం ఆరోగ్య సలహా కాదు. వంట నూనె దిగుమతి కూడా భారత దిగుమతి బిల్లులో భాగం. తగ్గించడం ద్వారా కుటుంబ బడ్జెట్‌ను బలపరచవచ్చు, దిగుమతులను తగ్గించవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.

సేంద్రీయ వ్యవసాయం చేయాలని..
రైతులు సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ సూచించారు. ఇది భవిష్యత్తు తరాల కోసం ఉన్న బాధ్యత. సేంద్రీయ వ్యవసాయం పర్యావరణాన్ని రక్షిస్తుంది. రసాయనాలపై ఆధారపడటం తగ్గిస్తుంది. రైతుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఎందుకు ఈ అత్యవసరత?
మోదీ సడెన్‌గా ఇప్పుడే ఎందుకు ఇన్ని విషయాలు సూచించాడన్న సందేహం చాలా మంది మదిలో మెదులుతోంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. దేశం విదేశీ మారకద్రవ్యం రక్షించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

మోదీ పిలుపు.. కేవలం ఆర్థిక సలహా కాదు. ఇది దేశభక్తికి ఒక పరీక్ష. మనం ఇప్పుడు ఆత్మనియంత్రణతో ఉంటే, భవిష్యత్తులో మనం బలంగా నిలబడగలము. మోదీ పిలుపును పాటిస్తే దేశ ఆర్థిక భద్రత రక్షిస్తాము. భవిష్యత్తు తరాల కోసం బాధ్యత తీసుకుంటాం. దేశభక్తిని ప్రకటిస్తాం. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం సులభం కాదు. కానీ ఇది అవసరం. ఏడాది పాటు బంగారం కొనకపోవడం ద్వారా, మనం దేశానికి చేసే సేవ అంతకంటే ఎక్కువ ఉండదు.

Nashik love jihad case : నాసిక్‌లో లవ్‌ జిహాద్‌ కుట్ర భగ్నం.. ఎంఐఎం కార్పొరేటర్‌ ఇంట్లో పట్టుబడిన కీలక నిందితురాలు!

Nashik love jihad case : నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) బీపీవో ఆఫీస్‌లో హిందూ ఉద్యోగులను లవ్‌ జిహాద్‌ వైపు మళ్లించి, వారిని మతం మార్చుకోవడానికి ఒత్తిడి చేసిన కుట్రను గత నెలలో పోలీసులు భగ్నం చేశారు . ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మహిళా హెచ్‌ఆర్‌ అధికారి నిడా ఖాన్‌ నెల రోజులుగా పోలీసులకు చిక్కలేదు. అజ్ఞాతంలో ఉంటూ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించారు. అవి విఫలమయ్యాయి. చివరకు అజ్ఞాతం వీడారు.

ఎంఐఎం కార్పొరేటర్‌ ఆశ్రయం..
నిడా ఖాన్‌ ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఒక ఇంట్లో దాక్కుని ఉండగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు . ఆమెకు ఆశ్రయం ఇచ్చింది ఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్‌ పతేల్‌. ఈ ఘటన కీలకమైనది, ఎందుకంటే మతిన్‌ పతేల్‌ ఇల్లు ప్రభుత్వ స్థలంలో నిర్మించబడిందని తేలింది . నిడా ఖాన్‌ ఉన్న విషయం తెలియముందే ఆ ఇంటికి నోటీసులు ఇచ్చారు. తాజాగా నిడాఖాన్‌ పట్టుబడడంతో నాసిక్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ ఆ ఇంటిని కూల్చివేయాలని నిర్ణయించింది.

నిడా ఖాన్‌ ఏం చేశారంటే..
టీసీఎస్‌ కేసులో నిడా ఖాన్‌ హిందూ ఉద్యోగులను మతం మార్చుకోవడానికి ఒత్తిడి చేశారు. హిందూ ఉద్యోగులను లవ్‌ జిహాద్‌ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేశారు. ఉద్యోగులను మతం మార్చుకునేలా ఒత్తిడి తెచ్చారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సీక్రెట్‌ ఆపరేషన్‌ ద్వారా దీనిని భగ్నం చేశారు.

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో జరిగిన లవ్‌ జిహాద్‌ కుట్ర భగ్నం కావడం, నిడా ఖాన్‌ అరెస్టు, ఎంఐఎం కార్పొరేటర్‌ మతిన్‌ పతేల్‌ ఇల్లు తొలగించే నిర్ణయం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుపుతుంది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించడం ద్వారా ప్రభుత్వం అక్రమాలపై సున్నా సహనం ప్రదర్శిస్తోంది.

Virat Kohli celebration : కోహ్లీ ఎగిరి గంతేశాడు.. అంబానీ ముందు చిందేశాడు..

Virat Kohli celebration : ఉత్కంఠ తారస్థాయి చేరింది. ప్రతి పరుగు అత్యంత విలువైనదిగా మారిపోయింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో చివరికి బెంగళూరు విజయం సాధించింది. ముంబై జట్టును ఇంటికి పంపించింది. తద్వారా ప్లే ఆఫ్ ఆశలను బెంగళూరు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు.. సరికొత్త చరిత్ర సృష్టించింది.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగిసింది.

167 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు మొదట్లో తడబడింది. విరాట్ కోహ్లీ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. కీలక ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ దశలో బెంగళూరు జట్టుకు కృనాల్ పాండ్యా (73) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బెతల్ (27) మెరుగైన ప్రదర్శన చేశాడు. చివర్లో జితేష్ శర్మ (18) విలువైన పరుగులు చేశాడు.

క్రికెట్ మ్యాచ్ లలో ఓటమి సహజం. గెలుపు కూడా అంతే సహజం.. ఓడిపోయినప్పుడు ఆటగాళ్లు నిరాశలో ఉంటారు. గెలిచినప్పుడు ఆనందంలో ఉంటారు. కానీ కొంతమంది ప్లేయర్లు గెలిచినప్పుడు తమ ఆగ్రహాన్ని దాచుకోరు. గెలిచినప్పుడు ఉత్తమ ఉత్సాహాన్ని ఆపుకోలేరు. ఇటువంటి ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం అతడి వయసు 37 సంవత్సరాలు. అయినప్పటికీ పాతికేళ్ల కుర్రాడి మాదిరిగానే ఉంటాడు. ఆవేశాన్ని అస్సలు ఆపుకోలేడు. ఆగ్రహాన్ని అస్సలు చల్లార్చుకోలేడు.

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అమాంతం ఎగిరి గంతులు వేశాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్ యజమాని అనంత్ అంబానీ ముందు చిందులు వేశాడు. దీంతో అనంత్ అంబానీ చిన్నబోయాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాడు రసిక్ సలాం చివరి బంతికి రెండు పరుగులు తీసి ముంబై విజయాన్ని ఖరారు చేశాడు. విరాట్ కోహ్లీ ఎగిరి గంతులు వేస్తున్న నేపథ్యంలో ముంబై ఆటగాడు రికెల్టన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బంతిని నేలకేసి కొట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సూర్య కుమార్ యాదవ్ రుచిపచిలేని చూయింగ్ గమ్ తినుకుంటూ.. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేశాడు.

Jagan Mohan Reddy : రేపు తాడేపల్లి కి జగన్.. రెండు కీలక నిర్ణయాలు

Jagan Mohan Reddy : విదేశీ పర్యటన ముగించుకుని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతితో కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. గత కొద్ది రోజులుగా అక్కడే గడిపారు. కోర్టు అనుమతి గడువు తీయడంతో ఆయన తిరిగి దేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. రేపు తాడేపల్లి కి రానున్నారు. ఈ నెల చివర్లో నెల్లూరు జిల్లాలో టిడిపి మహానాడు జరగనుంది. నెల్లూరులో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. రాజకీయంగా కూటమి పట్టు బిగించే ప్రయత్నం కచ్చితంగా చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి రేపు వైసిపి కీలక నేతలతో మంతనాలు జరపనున్నారు. కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సమాచారం అందింది. రేపు తాడేపల్లి కి జగన్ వచ్చిన వెంటనే ఈ సమావేశం మొదలవుతుంది.

* ప్లీనరీ నిర్వహణపై..
తెలుగుదేశం పార్టీ మహానాడు మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది కచ్చితంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. కానీ వచ్చే ఏడాది పాదయాత్ర ముంగిట.. ప్లీనరీ నిర్వహిద్దామని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.. అయితే పాదయాత్ర ముందు సమయం ఉండదని.. అందుకే ఇప్పుడే నిర్వహించుకోవడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. రేపు జరిగే సమావేశంలో ప్లీనరీపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

* జనంలోకి వెళ్లేందుకు..
మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జగన్ పర్యటనలు ఉంటాయని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. దానిపై కూడా రేపు తాడేపల్లిలో నేతలతో చర్చిస్తారు జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు రోజులు సమయం కేటాయిస్తారని.. ఒక్కో నియోజకవర్గంలో 100 మంది వరకు నేతలతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి చాలా రోజులుగా ప్రచారం నడుస్తూ వచ్చింది. గత సంక్రాంతి తర్వాత అన్నారు. ఈ సంక్రాంతి దాటిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యకు వచ్చింది లేదు. అయితే జనంలోకి వెళ్తే కానీ ప్రజలు హర్షించారని.. కచ్చితంగా జనం మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రస్తావించాలని సీనియర్లు కోరుతున్నారు. అందుకే రేపు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రెండు అంశాలపై కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పార్టీ శ్రేణుల ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు.

YS Jagan Mohan Reddy : పక్క రాష్ట్రం విజయంలో ఓదార్పు వెతుక్కుంటున్న జగన్

YS Jagan Mohan Reddy : ప్రతిపక్షంలో ఉన్నవారు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి ఎదురైతే ఎక్కడ లోపం జరిగిందో గుర్తించాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయడం లేదు. ఎంతవరకు ప్రత్యర్థి పార్టీలపై ఏడుపు తప్ప.. పార్టీ పూర్వ వైభవం తీసుకురా ఎలా అడుగులు వేయాలి అనే దానిపై ఆ పార్టీ దృష్టి పెట్టడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా ఉంది. కానీ పక్క పార్టీ ఇబ్బందుల్లో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ. తమిళనాడులో విజయ్ గెలిస్తే.. ఏపీలో పవన్ ఓటమి అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకునే స్థితికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. విజయ్ ను చూసి పవన్ నేర్చుకోవాలని సూచిస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అదే విజయ్ ను చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. విజయ్ తన పార్టీని నడిపిస్తున్న తీరుతోనైనా జగన్ కు కనువిప్పు కలగాలి. కానీ అలా చేయకుండా విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ ఎద్దేవా చేయడం చూస్తుంటే ఎంత దిగజారుడో అర్థం అవుతోంది.

* చిన్న పార్టీలతో కలిసి..
విజయ్ మెజారిటీకి కూతవేటు దూరంలో నిలిచిపోయారు. కానీ చిన్న చిన్న పార్టీలను కలుపుకొని ఇప్పుడు అధికారం చేపట్టారు. ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏం చేసేవారు అంటే.. ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ కూడా ఆయన వెంట అడుగులు వేయదు అనేది విశ్లేషకుల వాదన. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజకీయ పార్టీని కూడా గౌరవించలేదు. ప్రజా సంఘాలను సైతం తరిమేశారు. పైగా సింహం సింగిల్ అంటూ పెద్దపెద్ద మాటలు అన్నారు. అందుకే ఆ పార్టీకి వేరే ఆప్షన్ ఉండేది కాదు. 2029 ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఒక్క పార్టీ చూసే పరిస్థితి లేదు.

* పదేళ్ల పాటు ఓపికగా పోరాడి
2024 ఎన్నికల్లో పవన్ గెలిచిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తనపై గెలిచిన పవన్ ను చూసి నేర్చుకోవాల్సిన జగన్.. పక్క రాష్ట్రంలో విజయ్ ను అడ్డం పెట్టుకొని విమర్శలు చేయడం వ్యక్తిగత ద్వేషం కిందకి వస్తుంది. పక్క పార్టీల విజయాలలో ఓదార్పు వెతుక్కుంటున్నారు జగన్. పవన్ పదేళ్లపాటు ఓపిక పడ్డారు. ప్రజలు తనను ఓడించిన వారిపై ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పదేళ్లపాటు పోరాడి జీరో నుంచి హీరో అయ్యారు ఆయన . కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారాన్ని పోగొట్టుకొని.. ఇప్పుడు అడ్రస్ వెతుక్కునే పనిలో ఉన్నారు. విజయ్ సాధించిన విజయం ఆయన టీం వర్క్. పవన్ సాధించిన విజయం ఆయన నిబద్ధత. ఆ రెండింటినీ మరిచి.. తాము ఒక ప్రతిపక్ష నాయకుడిని అని మరిచి జగన్ వ్యవహరిస్తున్నారు. అంతిమంగా అది ఆ పార్టీకి నష్టమే.