Home Blog Page 293

OnePlus Nord CE6 features: మిడ్ రేంజ్ పీపుల్స్ కోనే ఫోన్.. ఫీచర్లు మాత్రం ప్రీమియం..

0

OnePlus Nord CE6 features: దాదాపు అన్ని వర్గాల వారికి OnePlus కంపెనీకి చెందిన మొబైల్స నచ్చుతాయన్న భావన ఉంది. ఇందులో భాగంగా కంపెనీ నుంచి Nord CE6 ఇటీవల లాంచ్ అయింది. మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ లో మెరుగైన బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లు ఉండడంతో గేమింగ్ లవర్లకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. ఇది Nord 6 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండడం విశేషం. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

OnePlus Nord CE6లో 6.78 అంగుళాల AMOLED డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 3600 nits పీక్ బ్రైట్‌నెస్‌తో సూపర్ స్మూత్ స్క్రాలింగ్ ఉండడంతో గేమింగ్ కోరుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. IP66, 68 రేటింగ్ ఉండడంతో దుమ్ము, నీటి బిందువుల నుంచి రక్షణగా ఉంటుంది.

ఈ మొబైఖ్ లో Snapdragon 7s Gen 4 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండనుంది. ఇది Adreno 810 GPUతో పనిచేస్తుంది. 8GB RAM, 128 లేదా 256GB UFS 3.1 స్టోరేజ్‌ ఉండడంలో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 6 గంటలు స్థిరంగా గేమింగ్ కోసం వాడుకోవచ్చు. ఈ కొత్త మొబైల్ లో 50MP మెయిన్ కెమెరా ఉండనుంది. 2MP డెప్త్ రియర్ కెమెరా కూడా ఉండనుంది. 4K రిజల్యూషన్ తో వీడియో, AI ఫీచర్లతో షార్ప్ ఫోటోలు తీసుకోవచ్చు. వీటితో పాటు 32MP ఫ్రంట్ కెమెరా గ్రూప్ సెల్ఫీలకు బాగా ఉపయోగపడుతుంది.

OnePlus Nord CE6లో 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండనుంది. ఇది 2.5 రోజులు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ బ్యాటరీకి 80Wవైర్డ్, 27W రివర్స్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ సపోర్ట్‌తో హెవీ యూజర్లకు ఫుల్ సపోర్టుగా ఉంటుంది. 8GB+128GB ఉండే ఈ మొబైల్ ధర రూ. 29,999 ఉంది. 8GB+256GB రూ. 32,999 తో విక్రయిస్తున్నారు. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ లో డ్యూయల్ స్టెరియో స్పీకర్స్, IR బ్లాస్టర్, Wi-Fi 6తో కంప్లీట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

Diesel vs Petrol Cars: ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ కార్లు కొనాలా.. వద్దా.. ఎవరికి ఉపయోగం..

0

Diesel vs Petrol Cars: ఆటోమోబైల్ రంగంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల హడావుడి పెరుగుతోంది. అయినప్పటికీ SUV విభాగంలో డీజిల్ ఇంజిన్ల హవా ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం SUV అమ్మకాల్లో డీజిల్ వాటా 18 శాతంగా ఉంది. దీంతో కొన్ని వర్గాల వారు ఇంకా SUV వేరియంట్ లో డీజిల్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దూరప్రయాణాలు చేసేవారు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించేవారు, గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఇప్పటికీ డీజిల్ ఇంజిన్‌లనే నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా BS7 అమల్లోకి వస్తే డీజిల్ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో డీజిల్ కార్లు కొనాలా? వద్దా? అన్న సందేహం కలుగుతోంది.

BS7 నిబంధనలు
రాబోయే రోజుల్లో అమలు కానున్న BS 7 (Bharat Stage 7) ఉద్గార నిబంధనలు కార్ల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌లను మార్చడం వల్ల తయారీ ఖర్చు భారీగా పెరుగుతుంది. ఇప్పటికే BS6 నిబంధనల వల్ల డీజిల్ కార్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు BS7 అమల్లోకి వస్తే ముఖ్యంగా రూ.20 లక్షల లోపు ఉండే మధ్యతరహా SUVల ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఇది సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

డీజిల్ కార్లు కొనాలా? వద్దా?
ప్రస్తుత తరుణంలో డీజిల్ కారు కొనాలనుకునే వారు తమ ప్రయాణ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీ నెలవారీ ప్రయాణం 1,500 నుండి 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండి.. తరచుగా హైవేలపై లాంగ్ ట్రిప్స్ చేసేవారైతే డీజిల్ కారు ఇప్పటికీ లాభదాయకమే. డీజిల్ ఇంజిన్ ఇచ్చే మైలేజ్, పవర్ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎక్కువే. అయితే, కేవలం నగర పరిధిలోనే తిరిగేవారు లేదా తక్కువ ప్రయాణం చేసేవారు పెట్రోల్ లేదా హైబ్రిడ్ ఆప్షన్లను పరిశీలించడం మంచిది.

భవిష్యత్తు సవాళ్లు మరియు రీసేల్ వాల్యూ
ధరల పెరుగుదలతో పాటు, భవిష్యత్తులో డీజిల్ వాహనాలపై వచ్చే ఆంక్షలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని మెట్రో నగరాల్లో పదేళ్ల కంటే పాత డీజిల్ వాహనాలపై నిషేధం ఉండటం, రాబోయే కాలంలో పర్యావరణ నిబంధనలు మరింత కఠినతరం కావడం వల్ల వీటి రీసేల్ వాల్యూ (మళ్లీ అమ్మేటప్పుడు వచ్చే ధర) తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని కొనుగోలు చేయడం మంచిది. ఒకవేళ భారీ పవర్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కోరుకుంటేనే ఇప్పుడు డీజిల్ SUVని ఎంచుకోవడం సమంజసం.

CM Vijay meets Stalin: స్టాలిన్ వద్దకు సీఎం విజయ్.. ప్రభుత్వాన్ని కాపాడడానికి పెద్ద ప్లాన్

CM Vijay meets Stalin: ఇల్లు అలకగానే పండగ కాదు అంటారు. ఈ సామెతను పెద్దవాళ్లు ఎందుకు వాడారో తెలియదు గాని.. తమిళ రాజకీయాలను చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా అట్టహాసంగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. అనేక పార్టీల కలబోతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల బాగానే ఉంది గాని.. బల పరీక్షలో నిలబడటమే ఇప్పుడు విజయ్ ముందున్న అసలు సవాల్. ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర అనేక సందర్భాల్లో విజయ్ కి చుక్కలు చూపించారు. రెండుసార్లు మద్దతు లేఖలు లేవని వెనక్కి పంపించారు. చివరిగా మూడోసారి అతి కష్టం మీద విజయ్ మద్దతు లేఖలు సంపాదించి గవర్నర్ ఎదుట ప్రదర్శిస్తే.. దానికి ఒప్పుకున్నారు.

చివరికి ఆదివారంనాడు చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఇతర అతిరథ మహారధులు హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం విజయ్ ముందు ఉంది. మంగళవారం జరిగే అసెంబ్లీలో తన బలాన్ని గవర్నర్ ముందు చూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే తన చేతిలో ఉన్న ఎమ్మెల్యేల బలంతో విజయ్ తన బలాన్ని చూపించుకోవచ్చు.. కానీ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వీసీకే తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కమ్యూనిస్టులు కూడా తోక జాడించే ప్రయత్నం చేశారు. ఐయూఎంఎల్ కూడా ఏవేవో మాటలు మాట్లాడింది. ఇవన్నీ కూడా విజయ్ ని ఇబ్బంది పెట్టాయని వార్తలు వస్తున్నాయి. అందువల్లే విజయ్ మరో మార్గాన్ని ఎంచుకున్నారు.

తనకు రాజకీయ అనుభవం లేదని.. రాజకీయంగా లౌక్యం తెలియదని అంటున్న విశ్లేషకులకు ఒక్కసారిగా సమాధానం చెప్పారు. తను ఏకంగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి కూడా ఉన్నారు. ఉదయ నిధికి, విజయ్ కి బలమైన బంధం ఉంది. రాజకీయంగా కూడా విజయ్ డీఎంకే మీద ఇంతవరకు ఎటువంటి ఆరోపణ చేయలేదు. పైగా ఇటీవల స్టాలిన్ కూడా ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇస్తామని.. ఆడవాళ్లకు ప్రతినెల 2500 ఇవ్వకపోయినా పర్వాలేదు.. తమలగా 1000 రూపాయలు ఇచ్చినా చాలని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తే సంతోషిస్తామని వ్యాఖ్యానించారు..

ఒకవేళ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్, వీసీకే మద్దతు ఇవ్వలేని పక్షంలో.. డీఎంకే సపోర్ట్ కోసమే విజయ్ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఒకవేళ గనుక డీఎంకే విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే అప్పుడు తమిళనాడులో ప్రతిపక్షంగా అన్నా డీఎంకే ఉంటుంది. అన్న డీఎంకే లో కూడా ఇటీవల చీలిక వర్గం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ వర్గం కూడా విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే .. తమిళనాడులో రాజకీయాలు మరోవైపు టర్న్ తీసుకుంటాయి.

Shani Jayanti zodiac predictions: ఈ శని జయంతితో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా..

Shani Jayanti zodiac predictions: శని అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. కానీ శనిని న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. మనుషులు చేసిన కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చే దేవుడిగా హిందూ పురాణాలు చెబుతాయి. శని జన్మించిన రోజునే ‘శని జయంతి’గా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య రోజున ఈ పర్వదినం వస్తుంది. 2026లో మే 16న శని జయంతి రాబోతుంది. ఈ రోజు శని అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, దానాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం..

శని జయంతి రోజున ఉదయం స్నానం చేసి నల్లటి లేదా గాఢ నీలం రంగు దుస్తులు ధరించడం శుభంగా భావిస్తారు. శని ఆలయాలకు వెళ్లి తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం, నల్ల నువ్వులు సమర్పించడం వంటి ఆచారాలు ఎక్కువగా పాటిస్తారు. ఈ సందర్భంగా ‘ఓం శం శనైశ్చరాయ నమః’ మంత్రాన్ని జపించడం వల్ల శని దోషాలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కాకులకు ఆహారం పెట్టడం, పేదలకు దానం చేయడం కూడా ఈ రోజు ముఖ్యమైన పుణ్యకార్యాలుగా భావిస్తారు.

శని జయంతి సందర్భంగా హనుమాన్ స్వామిని కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శని ప్రభావం తగ్గించేందుకు హనుమాన్ చాలీసా చదవడం మంచిదని పండితులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సడే సాతి, అష్టమ శని, ఎలినాటి శని ప్రభావం ఎదుర్కొంటున్నవారు ఈ రోజున ఉపవాసం చేసి శని దేవుడిని ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వసిస్తారు.

2026 మే 16న వచ్చే శని జయంతి కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మకర, కుంభ, తుల రాశుల వారికి శని అనుగ్రహం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, కోర్టు వ్యవహారాల్లో ఊరట వంటి ఫలితాలు కలగొచ్చని అంటున్నారు. కష్టపడి పనిచేసేవారికి శని అనుకూల ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్యం పేర్కొంటోంది.

అలాగే వృషభ, మిథున రాశుల వారికి కూడా ఈ శని జయంతి తర్వాత కొత్త అవకాశాలు రావచ్చని చెబుతున్నారు. వ్యాపార విస్తరణ, కుటుంబ సమస్యల పరిష్కారం, ఆరోగ్య పరంగా మెరుగుదల కనిపించవచ్చని అంచనా. అయితే మేష, కర్కాటక, సింహ రాశుల వారు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం, కోపాన్ని నియంత్రించడం మంచిదని సూచనలు ఉన్నాయి.

శని దేవుడు కేవలం కష్టాలు ఇచ్చేవాడు కాదని, నిజాయితీగా జీవించే వారికి విజయాన్ని కూడా ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శని జయంతి రోజున భక్తి, నియమం, దానం, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తే శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

OPPO flagship mobile launch: OPPO నుంచి ఫ్లాగ్ ఫిష్ మొబైల్.. భారత్ లో రిలీజ్ ఎప్పుడంటే..

0

OPPO flagship mobile launch: Oppo మొబైల్స్ అనగానే చాలా మందికి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ కెమెరా సెటప్ తో పాటు ఫ్లాగ్ ఫిష్ ఫీచర్ తో ఆకట్టుకునే ఈ కంపెనీకి చెందిన చాలా మోడల్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా దీని నుంచి Find X9S OPPO ఫ్లాగ్‌షిప్ Find X సిరీస్‌లోని కాంపాక్ట్ మోడల్ గా చెప్పబడుతోంది. ఇది 2026 ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన తరువాత దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఫోన్ 7.99mm మందంతో చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. ఇందులో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1,256×2,760 పిక్సెళ్లతో నాణ్యతగా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో , 3,600 nits పీక్ బ్రైట్‌నెస్ ఉంటూ 1.15mm సూపర్-థిన్ బెజెల్స్‌తో ఆకట్టుకుంటుంది. కాంపాక్ట్ సైజ్‌తో హ్యాండ్‌హెల్డ్ ఉపయోగానికి బాగా సరిపోతుంది.

ఈ మొబైల్ లో MediaTek Dimensity 9500 లేదా 9000 సిరీస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 12GB RAM, 256GB లేదా 512GB UFS స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో పనిచేసేవారికి ఫుల్ సపోర్టును ఇస్తుంది. Android 16 ఆధారిత ColorOSతో అధునాతన AI ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ లవెండర్ స్కై, మిడ్‌నైట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ వంటి కలర్లలో అందుబాటులో ఉన్నాయి.

వివో మొబైల్స్ కెమెరాకు ప్రత్యేకం. అందుకు అనుగుణంగానే ఇందులో ట్రిపుల్ 50MP కెమెరాలు ఉన్నాయి. 4K రిజల్యూషన్ తో వీడియో, AI ఎన్‌హాన్స్‌మెంట్స్ ఫొటోగ్రఫీ వారికి సపోర్టుగా ఉంటుంది. బ్యాటరీ పెర్ఫామెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ మొబైల్ లో 7,025mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ 80W వైర్డ్, 13.5W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఫోన్‌లోని మెరుగైన బ్యాటరీ లైఫ్ హైలైట్. వియత్నామ్‌లో 12GB+256GB వేరియంట్ 24.99M (సుమారు ₹85,000) గా ఉంది. ఇండియాలో ఇంకా అధికారిక లాంచ్ లేదు. అయితే ఇక్కడ మార్కెట్లోకి వస్తే రూ. 50,990 నుంచి రూ.70,000 వరకు ఉండే అవకాశం ఉంది.

Summer Heat Sleeping Tips: వేసవిలో ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా.. ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది..

Summer Heat Sleeping Tips: వేసవి కాలంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామందికి నిద్ర సమస్యలు ఎదురవుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా గది వేడిగా అనిపించడం, చెమటలు పట్టడం, ఉక్కపోతతో పలుమార్లు మేల్కొనడం వంటి ఇబ్బందులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రలేమి కారణంగా అలసట, చిరాకు, తలనొప్పి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది..

వేసవిలో నిద్రపోయే సమయంలో సింథటిక్ లేదా బిగుతైన దుస్తులు ధరించడం వల్ల శరీరానికి గాలి సరిగా తగలదు. దీంతో చెమట ఎక్కువై అసౌకర్యం కలుగుతుంది. కాటన్ దుస్తులు అయితే చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే రాత్రి వేళల్లో వీలైనంత లైట్ కలర్ కాటన్ నైట్‌డ్రెస్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పరుపుపై వేసే బెడ్షీట్ కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. సింథటిక్ బెడ్షీట్లు వేడిని ఎక్కువగా నిల్వ చేస్తాయి. కానీ కాటన్ బెడ్షీట్లు గాలి ప్రసరణకు సహాయపడుతూ చల్లదనాన్ని ఇస్తాయి. శుభ్రంగా ఉతికిన కాటన్ బెడ్షీట్ వాడితే శరీరానికి హాయిగా అనిపించి త్వరగా నిద్ర వస్తుంది.

నిద్రకు ముందు గోరువెచ్చగా లేదా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. రోజంతా వేడి కారణంగా వచ్చిన అలసట కూడా తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్ర త్వరగా పట్టడమే కాకుండా మధ్యలో మేల్కొనే సమస్య కూడా తగ్గుతుంది.

రాత్రి వేళల్లో ఎక్కువ మసాలా, ఆయిల్, కారం ఉన్న ఆహారం తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరిగి కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. అందువల్ల రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారం, పెరుగు, పండ్లు, దోసకాయ వంటి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. అయితే నిద్రకు ముందు ఎక్కువగా నీరు తాగితే మధ్యలో పలుమార్లు బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావచ్చు. దీంతో నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే పగటి సమయంలో ఎక్కువగా నీరు తీసుకుని, రాత్రి నిద్రకు ముందు పరిమితంగా తాగాలని వైద్యులు చెబుతున్నారు.

నిద్రపోయే గదిలో గాలి సరిగా ఆడకపోతే ఉక్కపోత మరింత ఎక్కువగా అనిపిస్తుంది. కిటికీలు కొద్దిసేపు తెరిచి ఉంచడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా వెంటిలేషన్ సౌకర్యం ఉండేలా చూడడం మంచిది. ఫ్యాన్ గాలి నేరుగా శరీరంపై కాకుండా గదిలో సర్క్యులేట్ అయ్యేలా ఉంచితే మరింత సౌకర్యంగా ఉంటుంది.

శరీరానికి సరిపడ నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో నిద్రలేమి వల్ల అలసట, నీరసం మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడంతో పాటు హాయిగా నిద్రపోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Mahesh Babu on Tamil directors: మహేష్ బాబు తమిళ దర్శకులను నమ్మకపోవడానికి అసలు కారణం ఇదే..

Mahesh Babu on Tamil directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధించిన స్టార్ హీరోలందరు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు. కారణమేదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి నటుడు సైతం కేవలం తెలుగు దర్శకులతోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసినప్పుడు చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ లను సాధించిన దాఖలలైతే లేవు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో నాని అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…

ఇక ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ సినిమా చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోగా భారీ విమర్శలను కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక మీదట తమిళ దర్శకులతో సినిమాలు చేయకూడదని అప్పుడే ఫిక్స్ అయ్యారట.

ఇప్పటికి తమిళ డైరెక్టర్లు మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అతనికి కథ వినిపించడానికి చాలా వరకు సన్నాహాలు చేసిన కూడా అవేవీ వర్కౌట్ కావడం లేదు. మొత్తానికైతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తన స్టోరీని విన్న మహేష్ బాబు ఫైనల్ కూడా చేశారట.

అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా తొందరలోనే రాబోతుంది అంటూ అతని సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి…ఇక ఇప్పటి వరకు సందీప్ మహేష్ బాబు కి నాలుగు స్టోరీలను చెప్పాడట. వాటిలో ఒక్కటి మాత్రమే ఫైనల్ చేశాడు…మరి ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబోలో ఒక పవర్ ఫుల్ సినిమా వస్తుందనేది వాస్తవం…

Ravi Teja remuneration reduced: రవితేజ రెమ్యూనరేషన్ తగ్గించడానికి కారణం ఇదే…

Ravi Teja remuneration reduced: సినిమా ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రవితేజ…చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన ఆయన మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా అవతరించి వరుస సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలకు తను ఏమాత్రం తీసిపోని ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలతో భారీ డిజాస్టర్ లను మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు… ఇక గతంలో తన రెమ్యూనరేషన్ విషయంలో చాలావరకు స్ట్రిక్ట్ గా ఉన్న రవితేజ వరుస ప్లాప్ లు రావడంతో తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకు అవకాశాలను ఇచ్చే దర్శకులు కరువైపోయారు.

స్టార్ డైరెక్టర్లందరు స్టార్ హీరోలతో లేదంటే సీనియర్ హీరోలతో సినిమాలను చేస్తున్నారు. కానీ రవితేజ ను మాత్రం స్టార్ డైరెక్టర్లు పట్టించుకోవడం లేదు. అందుకే యంగ్ డైరెక్టర్లు మాత్రమే అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తనకు భారీ విజయాలు దక్కేవరకు రెమ్యూనరేషన్ ని కొంతవరకు తగ్గిస్తే మంచిదని తనకు తాను డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఒకప్పుడు 25 కోట్లు తీసుకున్న రవితేజ ఇప్పుడు 20 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నాడట. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన మరోసారి టాప్ హీరోగా మారతాడు. అలాగే తన కెరియర్ ను సైతం బిల్డ్ చేసుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం భారీగా డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… రవితేజ ఈ మధ్యకాలంలో చాలావరకు వెనుకబడిపోయాడు.

కాబట్టి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయాల్సిన సమయమైతే ఆసన్నమైందనే చెప్పాలి… ‘ఇరుముడి’ సినిమాతో మొదటిసారి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన థ్రిల్లర్ జానర్ లో సినిమాలైతే చేయలేదు. కాబట్టి ఈ సినిమా తనని మరో మెట్టు పైకెక్కిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Kiara Advani career struggles: నా కెరీర్ మొత్తం కష్టాల్లోకి వెళ్ళిపోయింది అంటూ హీరోయిన్ కియారా అద్వానీ హాట్ కామెంట్స్

Kiara Advani career struggles: సౌత్ నుండి నార్త్ వరకు యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ. ‘ఏం ఎస్ ధోని’ బయోపిక్ తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ చిత్రం చేయగా, అది కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ లో ఈమె చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. టాలీవుడ్ ఈమెకు అంతగా కలిసి రాలేదు కానీ , బాలీవుడ్ లో మాత్రం వరుస సూపర్ హిట్స్ ని అందుకుంటూ పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయింది.

ఇకపోతే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తన మొదటి సినిమా అనుభవాన్ని చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ఫుగ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ కారణం చేత నేను కోరుకున్న గుర్తింపు రాలేదు. ఆ చిత్రం తర్వాత నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాను, కానీ నన్ను రిజెక్ట్ చేసేవారు. అలాంటి సమయం లో MS ధోని బయోపిక్ లో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. కబీర్ సింగ్ చిత్రం నా కెరీర్ ని మలుపు తిప్పింది. ఇప్పుడు టాప్ స్థాయిలో కొనసాగుతున్నాను. జీవితం లో ప్రతీ ఒక్కరికి ఇలాగే కష్టాలు వస్తుంటాయి, వాటిని సమర్థవతంగా ఎదురుకొని నిలబడినప్పుడే విజయం దక్కుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది కియారా అద్వానీ.

ఇకపోతే ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు , ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల , ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది . ఈ చిత్రం లో కియారా అద్వానీ నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ లో నటించిందని టాక్. ఆమె నటన చాలా బోల్డ్ గా ఉంటుందని , ముఖ్యంగా యాష్ తో చేసిన బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు వేరే లెవెల్ లో వచ్చాయని అంటున్నారు.

Peddi movie hype down: ‘పెద్ది’ హైప్ పడిపోయిందా.. ? వరుస వాయిదాల కారణంగా ఆడియన్స్ పట్టించుకోవడం లేదా?

Peddi movie hype down: ఎంతటి క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ ఉన్నా సరే, మేకర్స్ సరైన ప్లానింగ్ తో జనాల్లోకి వెళ్లకపోతే, అందుకోవాల్సిన టార్గెట్ ని చేరుకోలేము అనేది ట్రేడ్ విశ్లేషకులు చెప్పే మాట. గతం లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి , ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా మరో ఉదాహరణగా మారనుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ చిత్రానికి ఒకసారి కాదు , రెండు సార్లు కాదు , ఏకంగా మూడు సార్లు వాయిదా వేశారు. ఆ కారణం చేత ఈ సినిమా పై ఉన్న బజ్ బాగా తగ్గిపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు వచ్చాయి, అందులో ‘చికిరి చికిరి’ పాటకు సెన్సేషనల్ రీచ్ వచ్చింది. కేవలం ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఈ పాటకు యూట్యూబ్ లో 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా అద్భుతమైన రీచ్ వచ్చింది. ఇక మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని అద్భుతమైన కంటెంట్లు ఈ చిత్రం నుండి వచ్చాయి కాబట్టి, ఓవర్సీస్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి మూడు రోజులైంది , ఇప్పటి వరకు ఈ చిత్రానికి అక్కడ రెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఇది కచ్చితంగా మంచి ట్రెండ్ కాదు అనే చెప్పాలి. ఇదే రేంజ్ హైప్ ఉన్న ఓజీ, దేవర, కల్కి లాంటి చిత్రాలకు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. పెద్ది కి ఆ స్థాయి ఉంటుందని అనుకుంటే చాలా నార్మల్ గానే ఉన్నాయి.

ఇది అభిమానులను కాస్త కలవరపెడుతున్న విషయం. సినిమా కి హైప్ ఉంటే ఇలా ఉండదని , మూవీ టీం వరుసగా మూడు సార్లు వాయిదా వెయ్యడం వల్లే, ఈ చిత్రం పై ఉన్న హైప్ మొత్తం దెబ్బ తినిందని , ట్రెండ్ ఇలాగే కొనసాగితే 1 మిలియన్ కూడా ప్రీమియర్స్ నుండి రాబట్టడం కష్టమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. కానీ ‘రాజా సాబ్’ ని కూడా ఇలాగే తక్కువ అంచనా వేశారని, చివరి పది రోజుల్లో ఆ చిత్రానికి దిమ్మ తిరిగే గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయని , కాబట్టి చివరి పది రోజుల్లో ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదని , కచ్చితంగా 2 మిలియన్ డాలర్లకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

North America top Telugu premieres: నార్త్ అమెరికా లో టాప్ 5 ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాలు ఇవే.. ‘పెద్ది’ టార్గెట్ చాలా పెద్దది..

North America top Telugu premieres: మన టాలీవడ్ కి ఎప్పటి నుండో బలమైన మార్కెట్ గా నిలుస్తూ వచ్చింది ఏదైనా ఉందా అంటే , అది ఓవర్సీస్ మార్కెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో మెగా స్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున కారణంగా ఈ మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఈ ఓవర్సీస్ మార్కెట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. 30 లేదా 40 ప్రింట్లతో ఓవర్సీస్ లో మన సినిమాలు విడుదలయ్యే రోజుల్లోనే వీళ్లిద్దరు 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మన టాలీవుడ్ మార్కెట్ ఓవర్సీస్ లో బాగా పెరిగింది. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయి. ఆ స్థాయికి చేరిపోయింది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రీమియర్స్ నుండి అత్యధికంగా వసూళ్లను రాబట్టిన సినిమాలను ఒకసారి చూద్దాం.

కల్కి 2898 AD :
ప్రభాస్ హీరో గా నటించిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండి ఏకంగా 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఒక సంచలన రికార్డు గా భావించవచ్చు. ఇప్పటి వరకు ఎవ్వరూ దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు.

#RRR :
రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 3.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా ప్రీమియర్స్ ని అందుకోవాలంటే చాలా కష్టం , వేరే లెవెల్ హైప్ ఉండాలి.

ఓజీ :
పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం గత ఏడాది టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్, టికెట్ సేల్స్ ట్రెండ్ చూసి , కచ్చితంగా కల్కి రికార్డు ని బద్దలు కొట్టి టాప్ 1 స్థానానికి చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషం లో మేకర్స్ ప్రింట్ ని సరైన సమయానికి ఓవర్సీస్ కి పంపకపోవడంతో AMC థియేటర్స్ చైన్ బుకింగ్స్ ని మొదలు పెట్టడానికి నిరాకరించడంతో, ఆల్ టైం రికార్డు మిస్ అయ్యింది . లేదంటే ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చేదని అంటున్నారు విశ్లేషకులు.

పుష్ప 2:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం తో బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

దేవర:
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం 2024 లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి దాదాపుగా 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ ని అందరూ షాక్ కి గురయ్యారు. టాలీవుడ్ మార్కెట్ నార్త్ అమెరికా లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో పెరిగింది అని చెప్పడానికి ఈ సినిమా మొదటి సాక్ష్యంగా నిల్చింది.

పెద్ది ఈ రికార్డ్స్ ని అందుకోగలదా ?:
ప్రస్తుతం అందరి చూపు పెద్ది చిత్రం మీదనే ఉంది , రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది అనే బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. వెయ్యికి పైగా షోస్ ని షెడ్యూల్ చేయగా , ఇప్పటి వరకు కనీసం 2 లక్షల డాలర్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 1.5 మిలియన్స్ నుండి 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Urvil Patel batting performance: అతడు కొడుతుంటే విరాట్ కోహ్లీ కూడా చూస్తూ ఉండిపోయాడు.. అవకాశాలిస్తే టీమిండియాను ఏలేలా ఉన్నాడు

Urvil Patel batting performance: మామూలుగా అయితే విరాట్ కోహ్లీ తను ఆడుతుంటే.. మిగతా వాళ్ళు చూస్తుంటారు. అతను అదేపనిగా బంతిని బాదేస్తూ ఉంటే.. తోటి ప్లేయర్లు, అభిమానులు, ప్రేక్షకులు ఆనంద పడుతుంటారు. విరాట్ కోహ్లీ ఆడుతుంటే అతనిలో తమను చూసుకుంటారు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తుంటే ఎగిరి గంతులు వేస్తుంటారు. కానీ ఈసారి ఆస్థానాన్ని విరాట్ కోహ్లీ ఆక్రమించాడు. తాను ఒక గొప్ప ఆటగాడిని అనే విషయాన్ని మర్చిపోయి.. అభిమానిగా మారిపోయాడు. అతడు కొడుతుంటే ఎగిరి గంతులు వేశాడు. బిగ్గరగా కేకలు వేశాడు. విరాట్ కోహ్లీని కదిలించిన ఆ ఆటగాడు ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఐపీఎల్ లో భాగంగా చెన్నై జట్టు మరో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై 204 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలో ఫినిష్ చేసింది. తద్వారా ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది. చెన్నై జట్టు ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఉర్విల్ పటేల్.. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో అతడు చెన్నై జట్టు తరఫున మెరుపు బ్యాటింగ్ చేశాడు. 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 7 సిక్సర్లు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటే ఫోర్ ఉంది. దీంతో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 నమోదు చేసిన ఆటగాడిగా జైస్వాల్ (13 బంతులు) సరసన చేరాడు. కేఎల్ రాహుల్, కమిన్స్, షెఫర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేసి.. రికార్డులు సృష్టించారు.

లక్నో జట్టుపై ఉర్విల్ పటేల్ 23 బంతుల్లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. అతడి ఆటను కోహ్లీ వీక్షించాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ కోసం బెంగళూరు రాయ్ పూర్ వెళ్ళింది. అక్కడ ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ టీవీలో పటేల్ బ్యాటింగ్ చూసాడు.. అతడు కొడుతుంటే ఆనందం గంతులు వేశాడు. ఇది కదా బ్యాటింగ్ అంటూ తోటి ప్లేయర్లతో వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ పటేల్ బ్యాటింగ్ చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. విరాట్ కోహ్లీని కదిలించగలిగే స్థాయి ఇతడికి వచ్చిందంటే.. ఒకవేళ అవకాశాలు గనుక ఇస్తే టీమిండియాను ఏలేస్తాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Inspirational Income Success Story: చదివింది అంతంత మాత్రమే.. సంపాదన 18 లక్షలు.. ఐటీ ఉద్యోగులు కూడా ఇతని ముందు దిగదుడుపే

0

Inspirational Income Success Story: సొంత ఇల్లు ఉంది. వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది. తిరగడానికి ఖరీదైన కారు ఉంది. అలాగని ఇతడేమి ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఐటీ ఉద్యోగి అంతకంటే కాదు. ఒక సాధారణ ప్లంబర్.. ఇతడి నేపథ్యం గురించి.. ఎదిగిన తీరు గురించి తెలుసుకున్న తర్వాత చాలామందిలో ఉద్యోగాలు పోయిన బాధ ఉండదు. ఒత్తిడిని తలకెత్తుకోవలసిన కర్మ ఉండదు.

సోషల్ మీడియాలో ఇతడి గురించి విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అతడు ఒక మామూలు పేద కుటుంబంలో జన్మించాడు. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో కొంతవరకు మాత్రమే చదువుకున్నాడు. ఆ తర్వాత కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. తమకు తెలిసిన వాళ్ళు ముంబైలో ప్లంబర్ గా పనిచేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ పని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా పనిచేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న కాంట్రాక్టులు పొందాడు. ఆ తర్వాత రూపాయి రూపాయి పోగేశాడు. కొంత డబ్బు సమ కూరిన తర్వాత చిన్నపాటి స్థలం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొంత డబ్బు పోగు చేసి అందులో ఇల్లు నిర్మించుకున్నాడు.

గృహ యోగం సాధ్యమైన తర్వాత.. డబ్బు సమకూరడంతో వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒక హుందాయి కారు కొన్నాడు. ఇలా అంచలంచెలుగా తన జీవితాన్ని ఆర్థికంగా స్థిరత్వం చేసుకున్నాడు. ఇప్పుడు అతడు ప్రతి ఏడాది 18 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు.. తను ఒక చిన్నపాటి వ్యవస్థగా మారాడు. ముగ్గురు లేదా నలుగురికి పని కల్పిస్తున్నాడు.. జీవితాన్ని ఒత్తిడితో కాకుండా.. పని నేర్చుకొని సాగిస్తున్నాడు.

నేటి కాలంలో ఉద్యోగాలు కోల్పోయి.. ఆర్థిక స్థిరత్వం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇందులో పెద్దపెద్ద ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ఇతడు కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. పేదరికంలో పుట్టానని బాధపడకుండా.. తనను తాను తిట్టుకోకుండా.. ఆర్థికంగా బలమైన పునాదులు వేసుకున్నాడు. నేటి కాలంలో చాలామంది ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారు. ఉద్యోగాలు పోయాయని బాధపడుతున్నారు. కానీ ఇతడికి ఎటువంటి బాధ లేదు. ఇబ్బంది అంతకంటే లేదు. సున్నా నుంచి జీవితాన్ని మొదలుపెట్టాడు. తనే కొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. దీనినే కష్టేఫలి అంటారేమో.

ప్లంబింగ్ వృత్తి ద్వారా నెలకు లక్షలు సంపాదిస్తున్న ఆ వ్యక్తి పేరు కథనంలో రాసేందుకు ఒప్పుకోలేదు. అతడు మీరా రోడ్డు, బోరివలి, కాండీవలి వంటి ప్రాంతాలలో పనిచేస్తున్నాడు. ఒక ఇంట్లో పైపులు రిపేర్ చేస్తున్న సమయంలో.. ఈ విషయం బయటికి వచ్చింది. సదరి వ్యక్తి పైపులు రిపేరు చేస్తుండగా.. అతని గురించి ఆ ఇంటి యజమాని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈ సంభాషణ మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.. అయితే ఈ వ్యవహారం దేశంలో బ్లూ కాలర్ ఉద్యోగాల డిమాండ్ ను బయటపడుతోంది. వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తున్నప్పటికీ… బ్లూ కాలర్ ఉద్యోగాలను టెక్నాలజీ భర్తీ చేయలేదని తెలుస్తోంది.

Janasena internal conflicts: పెనంపై నుంచి పొయ్యికి.. జనసేనకు కష్టమే!

Janasena internal conflicts: జనసేన పార్టీకి కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా 11 మందిని ఇన్చార్జులుగా నియమించారు పవన్ కళ్యాణ్. రాయలసీమతో పాటు ప్రకాశం,నెల్లూరు బాధ్యతలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు నేతలకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి వాటిపై పార్టీ క్యాడర్ అభిప్రాయాలు సేకరించాల్సిన పని ఈ కమిటీకి ఉంది. అందులో భాగంగా రాయలసీమ రీజియన్కు సంబంధించి సమావేశం నిర్వహించగా రచ్చకు దారితీసింది. పార్టీలో కీలక నాయకులుగా ఉన్న వారిని వ్యతిరేకిస్తూ.. కొందరు నాయకులు బహిరంగ విమర్శలు చేశారు. సమావేశం నిర్వహణను కూడా బహిష్కరించారు. దీంతో ఇప్పటివరకు జనసేన లో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.

ఆ నేతల్లో అసంతృప్తి..
పార్టీలో ప్రారంభం నుంచి ఉన్న నేతలకంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం లభిస్తుందన్న టాక్ జనసేనలో ఉండి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారితోనే ఇటువంటివి జరుగుతున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వాస్తవంగా చెప్పాలంటే మాజీ మంత్రి బాలినేని వ్యతిరేకిస్తూ గళం విప్పారు ఎక్కువ మంది నేతలు. బాలినేని రాకను జనసేన లోని ప్రధాన వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బాలినేని నియామకం, అదే నేత సమావేశం నిర్వహించడాన్ని ఆయన వ్యతిరేకులు తట్టుకోలేకపోయారు.

ఇంకోవైపు ఇదే కమిటీ లో ఉన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఇదే సమావేశంలో ఒకరికొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఈ పరిణామాలతో బాలినేని సహా అందరూ విస్తు పోయారు. అయితే ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన లో చేరిన నేతలతోనే ఈ పరిస్థితి అని అర్థమవుతోంది. ఎందుకంటే బాలినేని సైతం వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరారు. ఎన్నికల ముందు ఆరని శ్రీనివాసులు సైతం వైసీపీ నుంచి జనసేన లోకి వచ్చారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలకు ఎటువంటి ప్రాధాన్యం లేదు. దీంతో పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నెగ్గుకు రావడం మాత్రం కష్టం.

Manchu Lakshmi Hollywood movie: హాలీవుడ్ మూవీ లో మంచు లక్ష్మి.. సంచలనం రేపుతున్న వీడియో..

Manchu Lakshmi Hollywood movie: సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలలో అత్యధిక మీమ్స్ ని మంచు లక్ష్మి పై , మంచు కుటుంబం పై వస్తాయనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు లక్ష్మి పై వచ్చే ఫన్నీ మీమ్స్ ఎలాంటివో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆమె మాట్లాడే ప్రతీ మాటని మనం వాస్తవ దూరం అనే అనుకుంటూ ఉంటాము, కానీ వాటిల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. అవి చాలా కాలం తర్వాత మనం చూసినప్పుడు , అరెరే మంచు లక్ష్మి నిజమే చెప్పింది , మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం అని అనుకుంటాము , ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ , నేను ఒక హాలీవుడ్ చిత్రం లో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో దీనిపై వేరే లెవెల్ లో ట్రోల్స్ పడ్డాయి.

కానీ వాస్తవం ఏమిటంటే ఆమె నిజంగానే ఒక హాలీవుడ్ చిత్రం లో నటించింది. ఆ సినిమా పేరు బాస్మతి బ్లూస్. ఈ చిత్రం లోని ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అందులో మంచు లక్ష్మి అచ్చు గుద్దినట్టు హాలీవుడ్ హీరోయిన్ లాగానే అనిపించింది. ఆమె యాస కూడా ఫక్తు అమెరికన్ ఇంగ్లీష్ యాసలోనే ఉంది. దీనిని చూసిన నెటిజెన్స్ మంచు లక్ష్మి అక్క రేంజ్ ఇదా?, అనవసరంగా ఆమెని అపార్థం చేసుకున్నాము అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మంచు లక్ష్మి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎన్నో సూపర్ హిట్ అమెరికన్ షోస్ లో నటించింది. హాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్నాళ్ళు గడిపిన తర్వాతనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రతీ ఒక్కరు ప్రియాంక చోప్రా ని ఇండియా నుండి హాలీవుడ్ లోకి వెళ్లిన మొట్టమొదటి మహిళగా పిలుస్తుంటారు. కానీ మంచు లక్ష్మి హాలీవుడ్ లో స్థిరపడి ఇండియన్ ఫిలిమ్స్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళగా మనం భావించవచ్చు. ప్రస్తుతం మంచు లక్ష్మి కెరీర్ అంత గొప్పగా లేదనే విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు కూతురు కదా అని ఈమె మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు , విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ వచ్చింది. అందులో అత్యధిక శాతం విలన్ క్యారెక్టర్స్ ఉన్నాయి , నిర్మాతగా కూడా అనేక సినిమాల్లో నటించింది కానీ, పెద్దగా సక్సెస్ లను అందుకోలేదు. ఇప్పుడు కూడా ఆమె అడపాదడపా క్యారెక్టర్ రోల్స్ లో కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న మంచు లక్ష్మి మన టాలీవుడ్ మేకర్స్ సరిగా ఉపయోగించుకోలేదు అని చెప్పొచ్చు.

Tanikella Bharani on Modi: రాముడు, కృష్ణుడు, ఆదిశంకరుడు, వివేకానందుడు.. వీరంతా కలిస్తే నరేంద్ర మోడీ

Tanikella Bharani on Modi: శీర్షిక చదివారు కదా.. ఈ మాట అంటున్నది మేం కాదు. నరేంద్ర మోడీ లో రాముడు కనిపించాడట. కృష్ణుడు దర్శనమిచ్చాడట. ఆది శంకరుడు సాష్టాంగంగా కొలువై ఉన్నాడట. వివేకానందుడు ఆయన రూపంలో సాక్షాత్కరించాడట. ఈ మాట ఆయన మనసులో అనుకున్నాడు.. ఆ తర్వాత బయట పెట్టుకున్నాడు.. చివరికి సోషల్ మీడియాలో నరేంద్ర మోడీపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.

నరేంద్ర మోడీపై ఈ స్థాయిలో ప్రేమను కనబరిచిన ఆ వ్యక్తి పేరు తనికెళ్ల భరణి. తెలంగాణ పర్యటనకు ఆదివారం వచ్చిన నరేంద్ర మోడీని తనికెళ్ల భరణి హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ చేతులను ముద్దాడారు. ఆ అనుభూతిని తనికెళ్ల భరణి గొప్పగా చెప్పుకున్నారు. ,”రాముడిని చూసే అవకాశం లేదు. కృష్ణుడిని చూసే అవకాశం రాలేదు. ఆది శంకరులను కూడా చూడలేదు. వివేకానందుడిని కనులారా చూసే భాగ్యం లభించలేదు. పైగా వారిని చూసే అవకాశం కూడా లేదు. కానీ వాళ్ళందరి అంశలతో ఉన్న నరేంద్ర మోడీ గారిని చూశాను. ముట్టుకున్నాను. చేతిని ముద్దు పెట్టుకున్నాను. నా జన్మ ధన్యమైపోయిందని” తనికెళ్ల భరణి రాసుకువచ్చారు. తనికెళ్ల భరణికి జాతీయవాదం అంటే చాలా ఇష్టం. అయితే ఆయన దానిని ఆయన ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. పైగా ఆయన మాటలు రాసిన సినిమాలు.. కథ అందించిన సినిమాలు.. ఒక కోవలో ఉంటాయి. తనికెళ్ల భరణి వేషధారణకు.. భావధారణకు..ఆ సినిమాలకు సంబంధం ఉండదు . ఉన్నట్టుండి తనికెళ్ల భరణి ఇలా మాట్లాడటం.. ఇలా తన భావాలను వ్యక్తం చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

తనికెళ్ల భరణి మొదట్లో రాంగోపాల్ వర్మ సినిమాలలో కనిపించేవారు. ఆయన కోసమే రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా పాత్రలను సృష్టించేవారు. వాస్తవానికి రాంగోపాల్ వర్మ ది డిఫరెంట్ స్టైల్. ఆయనతో పని చేసిన వారిది అదే స్టైల్. కానీ తనికెళ్ల భరణి అలాంటి స్టైల్ కు దూరంగా ఉన్నారని.. ఆయన పూర్తి డిఫరెంట్ అని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.. తనికెళ్ల భరణి ఇలా మాట్లాడతారని.. నరేంద్ర మోడీపై ఈ స్థాయిలో ప్రేమను కనబరుస్తారని తాను కలలో కూడా ఊహించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Missing Tiger Mystery: గంభీరమైన పులి.. కంటికి కనిపించడం లేదు.. ఏం జరిగి ఉంటుంది

Missing Tiger Mystery: క్రూరమైన చూపు. బలమైన అడుగులు.. విశాలమైన దేహం. పటిష్టమైన పంజా దెబ్బ.. ఒక్క ఉదుటున మాటు వేస్తే ఎంతటి జంతువైనా సరే చావాల్సిందే. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పులి గురించి వర్ణన ఒక పట్టాన ముగిసిపోదు.

అటువంటి భయంకరమైన పులి ఇప్పుడు కనిపించడం లేదు. మహారాష్ట్రలోని తాడోబ అడవి నుంచి వందల కిలోమీటర్ల దూరం అది ప్రయాణించింది. తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టింది. ఇక్కడ అనేక ప్రాంతాలు తిరుగుతూ చివరికి యాదగిరిగుట్ట వరకు వచ్చింది. అటువంటి భయంకరమైన పులి ఇప్పుడు కనిపించడం లేదు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో అది కొద్ది రోజులు కనిపించింది. ఆ తర్వాత కనిపించడం మానివేసింది. దీంతో అటవీశాఖ అధికారులలో ఆందోళన నెలకొంది.

యాదగిరిగుట్ట నుంచి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిన పులి.. ఆ తర్వాత జగిత్యాల మీదుగా నిజామాబాద్ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఇక అక్కడి నుంచి ఆ పులి కనిపించడం లేదు. ఎక్కడెక్కడ వెతికినా సరే దాని జాడ తెలియడం లేదు. ట్రాకింగ్ చేయడంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారా.. పులి వేటగాళ్ల ఉచ్చులకు చిక్కి చనిపోయిందా.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. సాధారణంగా వేసవి కాలంలో పులులు ఆహార అన్వేషణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణకు రావడం సర్వ సాధారణం. వర్షాలు కురిసిన తర్వాత మళ్లీ ఆ పులులు మహారాష్ట్ర వెళ్ళిపోతుంటాయి. ఇది నిత్యం జరిగే ప్రక్రియనే. కానీ ఆ పులి అక్కడి నుంచి వచ్చి.. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందనేది అర్థం కావడం లేదు.

మహారాష్ట్రలో ఇటీవల ఒక పులి ఆడ తోడు కోసం తెలంగాణ దాకా వచ్చింది. ఇక్కడ సరైన జోడు లభించకపోవడంతో.. వెర్రి లేచినట్టు తిరిగింది. ఇష్టానుసారంగా ఇతర జంతువులను చంపి తినేసింది. ఒక రకంగా మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో భయాన్ని కలగజేసింది. చివరికి ఆ పులి ఆడ తోడు దొరకడంతో శాంతించింది. అయితే తడోబా ఫారెస్ట్ నుంచి వచ్చిన ఈ పులి మాత్రం అలాంటి దారుణాల కైతే పాల్పడలేదు. అలాగని ఇతర జంతువులను చంపి తినకుండా ఉండలేదు. అయితే ఉన్నట్టుండి ఈ పులి ఎక్కడికి వెళ్లిందనేది ఇప్పుడు అంతు పట్టడం లేదు.